పులివెందుల రూరల్: మిసెస్ సింగపూర్–2023 పోటీల్లో ఏసియా వరల్డ్‌వైడ్ కేటగిరిలో వైఎస్సార్ జిల్లా మహిళ విజేతగా నిలిచారు. పులివెందుల మండలంలోని నల్లపురెడ్డి పల్లె గ్రామానికి చెందిన గోపాల్‌రెడ్డి, రమాదేవి కుమార్తె విజయారెడ్డి సింగపూర్‌లో ఎంబీఏ చదివే సమయంలో విజయవాడకు చెందిన సుంకర ప్రదీప్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు.
ప్రస్తుతం విజయ, ప్రదీప్‌లిద్దరూ పదిహేనేళ్లుగా సింగ పూర్‌లోనే ఉంటూ, అక్కడ సిటీ బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. ఈక్రమంలో అక్టోబర్21న సింగపూర్‌లో లూమియర్ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన అందాల పోటీల్లో విజయారెడ్డి పాల్గొని, విజయం సాధించారు. మొదటి ప్రయత్నంలోనే విజేత కావడం చాలా ఆనందంగా ఉందని విజయ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment