మైక్రోసాఫ్ట్‌లో మరో సమస్య తలెత్తింది. మైక్రోసాఫ్ట్ అజ్యూర్, మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి అంతరాయం కలిగిందని పలువురు యూజర్లు పేర్కొన్నారు. దీని వల్ల యూజర్లు అనేక సేవల్లో అంతరాయాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడిన సమస్యను గుర్తించి, పరిష్కరించడానికి ఇంజినీరింగ్ బృందాలు ప్రయత్నిస్తున్నట్లు అజ్యూర్ ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని కూడా పేర్కొంది.
మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్య మొదట యూరోప్‌లో గుర్తించారు. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్న యూజర్లు చాలామందే ఉన్నారని పలువురు సోషల్ మీడియాలో చేసిన పోస్టుల ద్వారా తెలిసింది.
We're currently investigating access issues and degraded performance with multiple Microsoft 365 services and features. More information can be found under MO842351 in the admin center.
— Microsoft 365 Status (@MSFT365Status) July 30, 2024
We are investigating an issue impacting the Azure portal. More details will be provided as they become available.
— Azure Support (@AzureSupport) July 30, 2024
Comments
Please login to add a commentAdd a comment