ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలతో సహా వేలాది మంది క్లౌడ్ కంప్యూటింగ్ యూజర్లను హెచ్చరించింది. హ్యాకర్లు మీ డేటాబేస్ వివరాలు చదవడం, మార్చడం లేదా తొలగించవచ్చు అని ఒక సైబర్ సెక్యూరిటీ పరీశోధకుల బృందం పేర్కొంది. మైక్రోసాఫ్ట్ అజ్యూరే కాస్మోస్ డీబీ డేటాబేస్ లో ఈ లోపం ఉంది. వేలాది కంపెనీలు కలిగి ఉన్న ఈ డేటాబేస్ లను యాక్సిస్ చేసే కీలను హ్యాకర్లు హ్యాక్ చేసే అవకాశం ఉంది అని భద్రతా సంస్థ విజ్ పరిశోధన బృందం కనుగొంది.
విజ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అమీ లుట్వాక్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సెక్యూరిటీలో మాజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ఆ కీలను మార్చలేదు కాబట్టి కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలని వినియోగదారులకు గురువారం ఈ-మెయిల్ చేసింది. మైక్రోసాఫ్ట్ విజ్ కు పంపిన ఈమెయిల్ ప్రకారం.. లోపాన్ని కనుగొన్నందుకు విజ్ కు $40,000 (సుమారు రూ.30 లక్షలు) చెల్లించడానికి అంగీకరించింది. "మా కస్టమర్లను సురక్షితంగా సంరక్షించడం కొరకు మేం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాం. ఈ విషయంలో మాకు సహాయం చేసినందుకు భద్రతా పరిశోధకులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం" అని మైక్రోసాఫ్ట్ రాయిటర్స్ కు తెలిపింది.(చదవండి: వన్‌ప్లస్ యూజర్లకు బంపర్ ఆఫర్!)
ఈ లోపం దోపిడీకి గురైనట్లు ఎలాంటి ఆధారాలు లేవని వినియోగదారులకు మైక్రోసాఫ్ట్ ఈమెయిల్ లో తెలిపింది. "ఇది మీరు ఊహించలేని అతి పెద్ద లోపం. ఇది దీర్ఘకాలిక రహస్యం" అని లుట్వాక్ రాయిటర్స్ కు చెప్పారు. "అజ్యూరే సెంట్రల్ డేటాబేస్, మేము కోరుకున్న కస్టమర్ డేటాబేస్ ను మేము యాక్సెస్ చేసుకోగలిగాము" అని లుట్వాక్ బృందం ఆగస్టు9న కాస్మోస్ డీబీ అని పిలువబడే సమస్యను కనుగొంది. అయితే మైక్రోసాఫ్ట్ ఆగస్టు 12న నోటిఫై చేసినట్లు లుట్వాక్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment