Azure
-
మైక్రోసాఫ్ట్‌పై గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’!
ప్రపంచంలోనే టాప్ టెక్ దిగ్గజ కంపెనీలుగా పేరున్న మైక్రోసాఫ్ట్, గూగుల్ మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. యూరప్‌లో క్లౌడ్ సర్వీసులకు సంబంధించి మైక్రోసాఫ్ట్ అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతూ గూగుల్ తీవ్ర స్థాయిలో ఆరోపించింది. దీనికి బదులుగా మైక్రోసాఫ్ట్ అదే రీతిలో స్పందించింది. గూగుల్ తమ సంస్థపై ‘షాడో క్యాంపెయిన్’ నడుపుతోందని మైక్రోసాఫ్ట్ ఘాటుగా రిప్లై ఇచ్చింది.యూరప్‌లో మైక్రోసాఫ్ట్ తన క్లౌడ్ సేవలను విస్తరించాలని భావిస్తోంది. సంస్థ సరైన రీతిలో నిబంధనలు అనుసరించడం లేదంటూ ఇటీవల యూరోపియన్ యూనియన్ రిగ్యులేటర్లకు గూగుల్ యాంటీ ట్రస్ట్ ఫిర్యాదు అందించింది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసు అజూర్ లైసెన్స్‌కు సంబంధించి నిబంధనలు అమలు చేయడం లేదని పేర్కొంది. ఇదిలాఉండగా, యూరప్‌లో యూరోపియన్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ల గ్రూప్(సీఐఎస్పీఈ)తో కలిసి గూగుల్ తమ కంపెనీపై ఆరోపణలు చేయిస్తోందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ వ్యవహారంపై సీఐఎస్పీఈతో జులైలోనే చర్చలు జరిపామని చెప్పింది. దీన్నిసైతం అడ్డుకునేందుకు గూగుల్ ప్రయత్నించిందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.ఇదీ చదవండి: బంగారం కొనేవారికి బెస్ట్ ఆఫర్ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ డిప్యూటీ జనరల్ కౌన్సెల్ రిమా అలైలీ తన బ్లాగ్‌లో కొన్ని విషయాలు పంచుకున్నారు. ‘మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసు అజూర్‌ను అణగదొక్కేందుకు గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’ను అమలు చేస్తుంది. అజూర్‌ను సర్వీసులను కించపరిచేలా కొత్త లాబీయింగ్ గ్రూప్‌ను ప్రారంభించేందుకు గూగుల్ సిద్ధమైంది. ఈ గ్రూప్ వచ్చే వారంలో ఏర్పాటు కాబోతుంది’ అని అన్నారు. -
మైక్రోసాఫ్ట్‌లో మరో సమస్య.. స్పందించిన కంపెనీ
మైక్రోసాఫ్ట్‌లో మరో సమస్య తలెత్తింది. మైక్రోసాఫ్ట్ అజ్యూర్, మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి అంతరాయం కలిగిందని పలువురు యూజర్లు పేర్కొన్నారు. దీని వల్ల యూజర్లు అనేక సేవల్లో అంతరాయాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడిన సమస్యను గుర్తించి, పరిష్కరించడానికి ఇంజినీరింగ్ బృందాలు ప్రయత్నిస్తున్నట్లు అజ్యూర్ ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని కూడా పేర్కొంది.మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్య మొదట యూరోప్‌లో గుర్తించారు. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్న యూజర్లు చాలామందే ఉన్నారని పలువురు సోషల్ మీడియాలో చేసిన పోస్టుల ద్వారా తెలిసింది.We're currently investigating access issues and degraded performance with multiple Microsoft 365 services and features. More information can be found under MO842351 in the admin center.— Microsoft 365 Status (@MSFT365Status) July 30, 2024We are investigating an issue impacting the Azure portal. More details will be provided as they become available.— Azure Support (@AzureSupport) July 30, 2024 -
మైక్రోసాఫ్ట్ ఆదాయం 13శాతం వృద్ధి
సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అంచనాలను మించి 13శాతం ఆదాయం వృద్ధి చెందినట్లు తెలిపింది. అయితే ముందుగా విశ్లేషకులు, నిపుణులు కంపెనీ ఆదాయం రూ.4.4లక్షలకోట్లు ఉంటుందని అంచనా వేశారు. కానీ అంచనాలను మించి ఆదాయం రూ.4.6లక్షలకోట్లకు చేరింది. గత త్రైమాసికంలో మూలధన వ్యయం రూ.83వేలకోట్లు నుంచి రూ.91వేలకోట్లు చేరింది. 2016 తర్వాత కంపెనీ చేసిన అత్యధిక మూలధన వ్యయంగా ఇది నిలిచింది. ఫలితాలు విడుదల చేసిన కొంతసేపటికే మైక్రోసాఫ్ట్ షేర్లు మూడు శాతం పెరిగాయి. సంస్థ ప్రతిష్టాత్మంగా ఉన్న అజూర్ సేవలు అంచనావేసిన 26.2 కంటే పెరిగి 29 శాతానికి చేరాయి. అజూర్ అనేది మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్‌లో ఫీచర్ ప్లాట్‌ఫామ్. క్లౌడ్ బిజినెస్ కోసం త్రైమాసిక అమ్మకాల పెరుగుదలలో ఏఐ సేవలు కీలకమని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఓపెన్ఏఐతో చాలా ఉత్పత్తులను ఇంకా ప్రారంభించలేదని సంస్థ తెలిపింది. త్వరలో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. -
మైక్రోసాఫ్ట్ యూజర్లకు అలర్ట్!
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలతో సహా వేలాది మంది క్లౌడ్ కంప్యూటింగ్ యూజర్లను హెచ్చరించింది. హ్యాకర్లు మీ డేటాబేస్ వివరాలు చదవడం, మార్చడం లేదా తొలగించవచ్చు అని ఒక సైబర్ సెక్యూరిటీ పరీశోధకుల బృందం పేర్కొంది. మైక్రోసాఫ్ట్ అజ్యూరే కాస్మోస్ డీబీ డేటాబేస్ లో ఈ లోపం ఉంది. వేలాది కంపెనీలు కలిగి ఉన్న ఈ డేటాబేస్ లను యాక్సిస్ చేసే కీలను హ్యాకర్లు హ్యాక్ చేసే అవకాశం ఉంది అని భద్రతా సంస్థ విజ్ పరిశోధన బృందం కనుగొంది. విజ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అమీ లుట్వాక్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సెక్యూరిటీలో మాజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ఆ కీలను మార్చలేదు కాబట్టి కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలని వినియోగదారులకు గురువారం ఈ-మెయిల్ చేసింది. మైక్రోసాఫ్ట్ విజ్ కు పంపిన ఈమెయిల్ ప్రకారం.. లోపాన్ని కనుగొన్నందుకు విజ్ కు $40,000 (సుమారు రూ.30 లక్షలు) చెల్లించడానికి అంగీకరించింది. "మా కస్టమర్లను సురక్షితంగా సంరక్షించడం కొరకు మేం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాం. ఈ విషయంలో మాకు సహాయం చేసినందుకు భద్రతా పరిశోధకులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం" అని మైక్రోసాఫ్ట్ రాయిటర్స్ కు తెలిపింది.(చదవండి: వన్‌ప్లస్ యూజర్లకు బంపర్ ఆఫర్!) ఈ లోపం దోపిడీకి గురైనట్లు ఎలాంటి ఆధారాలు లేవని వినియోగదారులకు మైక్రోసాఫ్ట్ ఈమెయిల్ లో తెలిపింది. "ఇది మీరు ఊహించలేని అతి పెద్ద లోపం. ఇది దీర్ఘకాలిక రహస్యం" అని లుట్వాక్ రాయిటర్స్ కు చెప్పారు. "అజ్యూరే సెంట్రల్ డేటాబేస్, మేము కోరుకున్న కస్టమర్ డేటాబేస్ ను మేము యాక్సెస్ చేసుకోగలిగాము" అని లుట్వాక్ బృందం ఆగస్టు9న కాస్మోస్ డీబీ అని పిలువబడే సమస్యను కనుగొంది. అయితే మైక్రోసాఫ్ట్ ఆగస్టు 12న నోటిఫై చేసినట్లు లుట్వాక్ చెప్పారు. -
బగ్‌ను కనిపెట్టి రూ. 22 లక్షలు గెలుచుకున్న 20 ఏళ్ల యువతి
ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల ఎథికల్ హ్యాకర్ అదితి సింగ్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ అజ్యూర్‌లో బగ్‌ను గుర్తించినందుకు 30,000 డాలర్ల(సుమారు రూ.22 లక్షలు) రివార్డును గెలుచుకుంది. కేవలం రెండు నెలల క్రితం ఫేస్ బుక్ లో ఇలాంటి బగ్ ను కనుగొన్న అదితి 7500 డాలర్ల(సుమారు రూ.5.5 లక్షలకు పైగా) రివార్డు గెలుచుకుంది. రెండు కంపెనీలకు చెందిన రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్(ఆర్సీఈ)లో బగ్ ఉన్నట్లు కనుగొంది. ఇటువంటి బగ్స్ ద్వారా హ్యాకర్లు సులువుగా ఇంటర్నల్ సిస్టంలోకి ప్రవేశించి అందులోని సమాచారాన్ని పొందగలరని గుర్తించింది. ఇలాంటి బగ్స్ గుర్తించడం అంత సులభం కాదని, ఎథికల్ హ్యాకర్లు కొత్త బగ్స్ గురించి వారి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తెలిపింది. కేవలం డబ్బు సంపాదించడంపై దృష్టి సారించడం కంటే, మొదట ఎథికల్ హ్యాకింగ్ గురించి జ్ఞానం సంపాదించుకోవాలని సూచిస్తుంది. సైబర్ నేరగాళ్ల భారీ నుంచి తప్పించుకోవడానికి పెద్ద పెద్ద టెక్ కంపెనీలు ఎప్పటికప్పుడు తమ సెక్యూరిటీ ప్రోగ్రాంలను అప్డేట్ చేస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో వాటిలో కొన్ని లోపాలు ఉంటుంటాయి. అలాంటి వాటిని ముందుగా కనిపెట్టి తమ దృష్టి తీసుకొచ్చిన వారికి కంపెనీలు నగదు బహుమతి అందజేస్తుంటాయి. ఈ బగ్ గురుంచి రెండు నెలల క్రితమే మైక్రోసాఫ్ట్ కు నివేదించినట్లు అదితి సింగ్ తెలిపింది. అయితే మైక్రోసాఫ్ట్ దీనిపై వెంటనే స్పందిచలేదని బగ్ ఉన్న ప్రోగ్రాంను యూజర్స్ డౌన్లోడ్ చేసుకోలేదని నిర్థారించుకున్న తర్వాత లోపాన్ని సరిచేసినట్లు తెలిపింది. బగ్ బౌంటీ కోసం ఎక్కువగా సర్టిఫైడ్ సైబర్ సెక్యూరిటీ నిపుణులు లేదా భద్రతా పరిశోధకులు పోటీ పడుతుంటారు. వారు సదరు వెబ్ ను క్రాల్ చేస్తారు. హ్యాకర్లు చొరబడి కంపెనీలకు హానిచేయగల బగ్స్ ఉన్నాయా? లేదా అని మొత్తం కోడ్ ను స్కాన్ చేస్తారు. ఒకవేళ వారు ఏమైనా లోపాన్ని కనిపెడితే వారికి నగదు బహుమతిగా ఇవ్వబడుతుంది. ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ లో గుర్తించబడిన ఆర్సీఈ బగ్ గురించి అదితి మాట్లాడుతూ.. డెవలపర్లు మొదట ఎన్పీఏ (నోడ్ ప్యాకేజ్ మేనేజర్)ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మాత్రమే కోడ్ రాయాలని సూచించింది. ఫేస్బుక్, టిక్‌టాక్, మైక్రోసాఫ్ట్, మొజిల్లా, పేటీఎం, ఎథీరియమ్, హెచ్‌పీ వంటి దిగ్గజ కంపెనీల్లో సుమారు 40 వరకు బగ్‌లను కనుగొన్నట్లు తెలిపింది. మెడికల్ ఎంట్రన్స్‌లో సీటు రాకపోవడంతో ఎథికల్ హ్యాకింగ్‌పై దృష్టి సారించినట్లు అదితి చెప్పుకొచ్చింది. ఆమె హార్వర్డ్ విశ్వవిద్యాలయం, కొలంబియా విశ్వవిద్యాలయం, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ప్రశంసా లేఖలను అందుకుంది. చదవండి: రూ.80కే.. 800 కిలోమీటర్ల ప్రయాణం -
భారత్‌లో క్లౌడ్ మార్కెట్ @ 2 లక్షల కోట్ల డాలర్లు
న్యూఢిల్లీ: భారత్‌లో క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీకి అపార అవకాశాలున్నాయని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. దేశంలో ఈ మార్కెట్ విలువ సుమారు 2 లక్షల కోట్ల డాలర్లు(రూ.120 లక్షల కోట్లు)గా ఆయన అంచనా వేశారు. ఊరిస్తున్న ఇంత భారీ మార్కెట్ అవకాశాలను చేజ్కించుకోవడం కోసం భారత్‌పై ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నట్లు చెప్పారు. 2015 కల్లా మూడు నగరాల్లో క్లౌడ్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నామని.. వాణిజ్యపరమైన క్లౌడ్ సేవలను(అజూర్, ఆఫీస్ 365 ఇతరత్రా) వీటిద్వారా అందిస్తామని సత్య వెల్లడించారు. మంగళవారమిక్కడ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వివరాలను తెలిపారు. సీఈఓగా భారత్‌కు తొలిసారి వచ్చిన సత్య... హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్లో ఉద్యోగులకు దిశానిర్దేశం చేసిన సంగతి తెలిసిందే. భవిష్యత్తు అంతా క్లౌడ్ టెక్నాలజీదేనని.. దీనికి అప్‌గ్రేడ్ కావాలని కూడా ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గతేడాది 100 శాతం వ్యాపార వృద్ధి... గతేడాది భారత్‌లో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ బిజినెస్ 100 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నట్లు చెప్పారు. ఈ విజయ ప్రస్థానంతో స్థానిక డేటా సెంటర్లనుంచే క్లౌడ్ సేవలను అందించాలని నిర్ణయించినట్లు సత్య వివరించారు. స్థానిక డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా ప్రపంచస్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నెలకొల్పడంతోపాటు ఉత్పాదకతను పెంచేందుకు... దేశీయంగా సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఉపయోగపడుతుందన్నారు. ‘25 కోట్ల మందికిపైగా భారతీయులు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న మొబైల్స్ ఇతరత్రా డివెజైస్‌ను ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ క్లౌడ్ టెక్నాలజీతో ముడిపడినవే. భవిష్యత్తులో క్లౌడ్ లేని మొబైల్స్‌ను ఊహించలేం. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలకు ఇంత భారీ డిమాండ్, అవకాశాలు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాదు దేశంలో అంతకంతకూ పెరుగుతున్న ఎంట్రప్రెన్యూర్స్ కూడా క్లౌడ్ మార్కెట్‌కు వరంగా మారుతున్నారు. ఇప్పటికే 10,000 మందికిపైగా పార్ట్నర్స్ మైక్రోసాఫ్ట్‌కు ఉన్నారు. ఈ సంఖ్యను మరింత పెంచుకుంటాం’ అని సత్య పేర్కొన్నారు. ఎంతమేర పెట్టుబడులను పెట్టనున్నారనేది నిర్దిష్టంగా వెల్లచడించలేదు. అయితే, తొలి అడుగులే అయినప్పటికీ అత్యున్నతస్థాయిలో ఉంటాయని సత్య చెప్పడం గమనార్హం. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రతిష్టాత్మక డిజిటల్ ఇండియా కార్యక్రమం విజయవంతానికి తాము నెలకొల్పబోయే స్థానిక క్లౌడ్ డేటా సెంటర్లు దోహదపడతాయని మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్ చెప్పారు. ఈ-గవర్నెన్స్, అందరికీ బ్యాంకింగ్ సేవల కల్పన(ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్), విద్య, ఆరోగ్యసంరక్షణ వంటి రంగాల్లో కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తుందన్నారు.