ప్రపంచంలోనే టాప్ టెక్ దిగ్గజ కంపెనీలుగా పేరున్న మైక్రోసాఫ్ట్, గూగుల్ మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. యూరప్‌లో క్లౌడ్ సర్వీసులకు సంబంధించి మైక్రోసాఫ్ట్ అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతూ గూగుల్ తీవ్ర స్థాయిలో ఆరోపించింది. దీనికి బదులుగా మైక్రోసాఫ్ట్ అదే రీతిలో స్పందించింది. గూగుల్ తమ సంస్థపై ‘షాడో క్యాంపెయిన్’ నడుపుతోందని మైక్రోసాఫ్ట్ ఘాటుగా రిప్లై ఇచ్చింది.
యూరప్‌లో మైక్రోసాఫ్ట్ తన క్లౌడ్ సేవలను విస్తరించాలని భావిస్తోంది. సంస్థ సరైన రీతిలో నిబంధనలు అనుసరించడం లేదంటూ ఇటీవల యూరోపియన్ యూనియన్ రిగ్యులేటర్లకు గూగుల్ యాంటీ ట్రస్ట్ ఫిర్యాదు అందించింది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసు అజూర్ లైసెన్స్‌కు సంబంధించి నిబంధనలు అమలు చేయడం లేదని పేర్కొంది. ఇదిలాఉండగా, యూరప్‌లో యూరోపియన్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ల గ్రూప్(సీఐఎస్‌పీఈ)తో కలిసి గూగుల్ తమ కంపెనీపై ఆరోపణలు చేయిస్తోందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ వ్యవహారంపై సీఐఎస్‌పీఈతో జులైలోనే చర్చలు జరిపామని చెప్పింది. దీన్నిసైతం అడ్డుకునేందుకు గూగుల్ ప్రయత్నించిందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.
ఇదీ చదవండి: బంగారం కొనేవారికి బెస్ట్ ఆఫర్
ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ డిప్యూటీ జనరల్ కౌన్సెల్ రిమా అలైలీ తన బ్లాగ్‌లో కొన్ని విషయాలు పంచుకున్నారు. ‘మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసు అజూర్‌ను అణగదొక్కేందుకు గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’ను అమలు చేస్తుంది. అజూర్‌ను సర్వీసులను కించపరిచేలా కొత్త లాబీయింగ్ గ్రూప్‌ను ప్రారంభించేందుకు గూగుల్ సిద్ధమైంది. ఈ గ్రూప్ వచ్చే వారంలో ఏర్పాటు కాబోతుంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment