Cloud service
-
మైక్రోసాఫ్ట్‌పై గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’!
ప్రపంచంలోనే టాప్ టెక్ దిగ్గజ కంపెనీలుగా పేరున్న మైక్రోసాఫ్ట్, గూగుల్ మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. యూరప్‌లో క్లౌడ్ సర్వీసులకు సంబంధించి మైక్రోసాఫ్ట్ అనుసరిస్తున్న విధానాలను తప్పుపడుతూ గూగుల్ తీవ్ర స్థాయిలో ఆరోపించింది. దీనికి బదులుగా మైక్రోసాఫ్ట్ అదే రీతిలో స్పందించింది. గూగుల్ తమ సంస్థపై ‘షాడో క్యాంపెయిన్’ నడుపుతోందని మైక్రోసాఫ్ట్ ఘాటుగా రిప్లై ఇచ్చింది.యూరప్‌లో మైక్రోసాఫ్ట్ తన క్లౌడ్ సేవలను విస్తరించాలని భావిస్తోంది. సంస్థ సరైన రీతిలో నిబంధనలు అనుసరించడం లేదంటూ ఇటీవల యూరోపియన్ యూనియన్ రిగ్యులేటర్లకు గూగుల్ యాంటీ ట్రస్ట్ ఫిర్యాదు అందించింది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసు అజూర్ లైసెన్స్‌కు సంబంధించి నిబంధనలు అమలు చేయడం లేదని పేర్కొంది. ఇదిలాఉండగా, యూరప్‌లో యూరోపియన్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ల గ్రూప్(సీఐఎస్పీఈ)తో కలిసి గూగుల్ తమ కంపెనీపై ఆరోపణలు చేయిస్తోందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ వ్యవహారంపై సీఐఎస్పీఈతో జులైలోనే చర్చలు జరిపామని చెప్పింది. దీన్నిసైతం అడ్డుకునేందుకు గూగుల్ ప్రయత్నించిందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.ఇదీ చదవండి: బంగారం కొనేవారికి బెస్ట్ ఆఫర్ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్ డిప్యూటీ జనరల్ కౌన్సెల్ రిమా అలైలీ తన బ్లాగ్‌లో కొన్ని విషయాలు పంచుకున్నారు. ‘మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసు అజూర్‌ను అణగదొక్కేందుకు గూగుల్ ‘షాడో క్యాంపెయిన్’ను అమలు చేస్తుంది. అజూర్‌ను సర్వీసులను కించపరిచేలా కొత్త లాబీయింగ్ గ్రూప్‌ను ప్రారంభించేందుకు గూగుల్ సిద్ధమైంది. ఈ గ్రూప్ వచ్చే వారంలో ఏర్పాటు కాబోతుంది’ అని అన్నారు. -
ఐటీసీ ఇన్ఫోటెక్ చేతికి బ్లేజ్‌క్లాన్
న్యూఢిల్లీ: విభిన్న రంగాల్లో ఉన్న ఐటీసీ లిమిటెడ్‌కు చెందిన ఐటీసీ ఇన్ఫోటెక్ ఇండియా క్లౌడ్ సేవల్లో ఉన్న బ్లేజ్‌క్లాన్ టెక్నాలజీస్‌ను కొనుగోలు చేసింది. డీల్ విలువ రూ.485 కోట్లు. గురువారం ఈ మేరకు ఇరు సంస్థలు వాటా కొనుగోలు ఒప్పందం చేసుకున్నాయి. 6–8 వారాల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి అవుతుందని ఐటీసీ లిమిటెడ్ వెల్లడించింది. మల్టీ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్ విభాగాల్లో తమ క్లయింట్లకు సేవలకై సంస్థ సామర్థ్యం పెంపొందించేందుకు ఈ డీల్ దోహదం చేస్తుందని తెలిపింది. -
Amazon layoffs: నంబర్ గేమ్ అంతే..రేపటితో తొమ్మిదేళ్లు..ఇంతలోనే!
సాక్షి, ముంబై: టెక్ దిగ్గజం అమెజాన్‌లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా 100మందిని తొలగించనుంది. అమెజాన్ తన వ్యాపారాలను క్రమ బద్ధీకరించుకునే ప్రయత్నంలో భాగంగా అమెజాన్ స్టూడియోస్, ప్రైమ్ వీడియో విభాగంలో ఈ ఉద్యోగాలను తొలగిస్తోంది. డివిజన్లోని 7వేల మంది ఉద్యోగులలో 1 శాతం మందిపై ప్రభావం చూపనుందని తెలుస్తోంది. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) ఆర్థిక సంక్షోభం ఆందోళనల నేపథ్యంలో టెక్ అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెజాన్ తాజా నిర్ణయం తీసుకుంది. క్లౌడ్ సర్వీసెస్ డివిజన్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) విభాగంలో అమెజాన్ తొలగింపుల తాజా రౌండ్ తొలగింపులు షురూ అయ్యాయి. అమెరికా, కోస్టారికా కెనడాలోని ఉద్యోగులకు వారి ఉద్యోగ తొలగింపులకు సంబంధించి సమాచారం అందించింది. (Vanisha Mittal Amit Bhatia Love Story: వనీషా...అమిత్ లవ్ స్టోరీ తెలుసా? ఈ లవ్ బర్డ్స్ పెళ్లి ఒక రికార్డ్ ) జాబ్-సెర్చ్ ప్లాట్‌ఫారమ్ లింక్డ్ఇన్లో ప్రభావిత ఉద్యోగి భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు.అమెజాన్లోవెబ్ సర్వీసెస్‌లో 9 ఏళ్ల వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి కేవలం ఒక్క రోజు ముందు అకస్మాత్తుగా తనకు కంపెనీ ఉద్వాసన పలికిందని ఆమె వాపోయారు. ఈ మేరకు కంపెనీకి ఒక వీడ్కోలు సందేశాన్ని పోస్ట్ చేశారు. సామూహిక తొలగింపుల మధ్య ఇదొక నంబరు గేమ్..ఇపుడు నా టైం వచ్చిందంతే..నో హార్డ్ ఫీలింగ్స్ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఇన్ని రోజులు కంపెనీలో ఎదుగుదలకు ఇచ్చిన అవకాశాలకు కృతజ్క్షతలు తెలిపారు. -
క్లౌడ్ సర్వీస్ అంటే ఏంటో తెలుసా?
టెక్నాలజీ పెరిగిన తర్వాత తెర వెనక జరుగుతోన్న అతి పెద్ద వ్యాపారాల్లో క్లౌడ్ సర్వీస్ ఒకటి. ఇల్లు పెద్దదయితే ఒకటో, రెండో పోర్షన్లను అద్దెకు ఇచ్చినట్టు.. మనకు కావాల్సిన డాటా స్టోరేజీని అద్దెకివ్వడమే క్లౌడ్ సర్వీస్. మనం ఇంటర్నెట్లో చేస్తున్న పనుల్లో మెజార్టీ భాగం క్లౌడ్ సేవల నుంచే అందుతున్నాయి. క్లౌడ్ సేవలను పూర్తిగా క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడర్లు నిర్వహిస్తారు. అవి ప్రొవైడర్ల సర్వర్ల నుండి కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయి, కాబట్టి కంపెనీకి దాని సొంత సర్వర్లను వాడాల్సిన అవసరం రాదు. ఇప్పుడు తాజాగా హైదరాబాద్‌ను అమెజాన్ సెకండ్ రీజయిన్ సెంటర్‌గా ప్రకటించింది. ♦ ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద క్లౌడ్ సర్వీస్ అమెజాన్‌దే. ♦ వేర్వేరు దేశాల్లో 84 జోన్లలో వీటికి స్టోరేజీ ఉంది. ఏడాదికి 75 బిలియన్ డాలర్ల వ్యాపారం ♦ రెండో స్థానం మైక్రోసాఫ్ట్ అజ్యూర్, అయితే ఆదాయంలో అమెజాన్‌ను దాటి పోయింది. ఏడాదికి 95 బిలియన్ డాలర్ల వ్యాపారం ♦ మూడో స్థానం గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫాం, ముఖ్యమైన దేశాల్లో సర్వర్లున్నాయి. ఏడాదికి 25 బిలియన్ డాలర్ల వ్యాపారం ♦ నాలుగో స్థానం అలీబాబా క్లౌడ్. చైనా మార్కెట్ దీని సొంతం. దాదాపు 15 బిలియన్ డాలర్ల వ్యాపారం ♦ డాటాబేస్ మేనేజ్మెంట్లో విస్తృత అనుభవం ఉన్న ఒరాకిల్ కంపెనీ.. క్లౌడ్ వ్యాపారంలో ఏడాదికి 12 బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తోంది ♦ సాఫ్ట్వేర్ దిగ్గజం ఐబీఎం కూడా క్లౌడ్ వ్యాపారం చేస్తోంది. ఏడాదికి 10 బిలియన్ డాలర్ల వ్యాపారం. ♦ టెన్సెంట్ క్లౌడ్ ప్రధానంగా తూర్పు ఆసియా కేంద్రంగా నడుస్తోంది. చైనాలోనూ దీని సేవలు విస్తృతంగా ఉన్నాయి. ♦ OVH క్లౌడ్ సేవలు ప్రధానంగా యూరప్‌లో ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, పోలండ్, యూకే దేశాల్లో దీనికి పేరుంది. ♦ డిజిటల్ ఓషియన్, లినోడ్ ఎంపిక చేసుకున్న పెద్ద నగరాల్లో క్లౌడ్ సర్వీసులు అందిస్తున్నాయి. -
దేశంలో 5జీ సేవలు.. భారీగా ఉద్యోగాలు, కావాల్సిన నైపుణ్యాలు ఇవే!
5జీ టెక్నాలజీ..టెలికం రంగంలో సరికొత్త విప్లవం! స్మార్ట్ ఫోన్ యుగంలో.. ఆధునిక 5జీ టెక్నాలజీతో.. గేమింగ్ నుంచి గృహ అవసరాల వరకు..అన్ని రకాల సేవలు అత్యంత వేగంగా పొందే వీలుంది. ఇదే ఇప్పుడు ఆయా రంగాల విస్తరణకు, లక్షల సంఖ్యలో కొత్త కొలువులకు మార్గం వేస్తుందని అంచనా! ఆయా ఉద్యోగాలు సొంతం చేసుకునేందుకు కావలసిందల్లా.. ఈ సాంకేతికతను నడిపించే ఆధునిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవడమే! ముఖ్యంగా 4.0 స్కిల్స్గా పేర్కొంటున్న ఐఓటీ, రోబోటిక్స్, ఏఐ–ఎంఎల్ వంటి నైపుణ్యాలతో ఉజ్వల కెరీర్ అవకాశాలు అందుకోవచ్చు. ఇటీవల దేశంలో 5జీ సేవలు ప్రారంభమైన నేపథ్యంలో.. ఈ టెక్నాలజీతో అందుబాటులోకి రానున్న కొత్త కొలువులు, కావల్సిన నైపుణ్యాల గురించి తెలుసుకుందాం.. 5జీ టెక్నాలజీతో మొబైల్ ఆధారిత సేవలు మరింత విస్తృతం కానున్నాయి. ఈ టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్స్ ద్వారా అత్యంత వేగంగా అనేక సేవలు ΄÷ందొచ్చు. అంతేకాదు.. ట్రాఫిక్ చిక్కులు దాటుకుంటూ ఇంటికెళ్లే సమయానికి హాయిగా ఏసీలో ఆహ్లాదం పొందాలంటే..ఇక చిటికెలో పని. కేవలం ఫోన్ ద్వారా నిర్దేశిత కమాండ్స్‌తో మనం ఇంటికెళ్లే సమయానికి ఏసీ ఆన్ అయ్యే విధంగా చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో సేవలు సరికొత్తగా అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. ఆయా సేవలు అందించేందుకు బ్యాక్ ఎండ్‌లో నిపుణుల అవసరం ఏర్పడుతోంది. ఇదే యువతకు కొత్త కొలువులకు మార్గంగా నిలవనుంది. భారీ సంఖ్యలో కొలువులు ► 5జీ టెక్నాలజీ కారణంగా రానున్న మూడేళ్లలో 2.2 కోట్ల మేర ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఇప్పటికే టెలికం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ నివేదిక పేర్కొంది. ►ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్ ్ర΄ాసెస్ ఆటోమేషన్ విభాగాల్లో ఈ కొలువులు లభించనున్నాయి. ►ఇప్పటికే 40 లక్షల మేర ఉద్యోగాలకు వేదికగా ఉన్న టెలికం రంగంలో.. 5జీ టెక్నాలజీ కారణంగా జాబ్స్ సంఖ్య మరింత విస్తృతంగా పెరగనుంది. ∙టెలికం సెక్టార్ మాత్రమే కాకుండా.. నూతన టెక్నాలజీలతో సేవలందిస్తున్న ఇతర రంగాల్లోని సంస్థలు కూడా 5జీ టెక్నాలజీస్‌కు సరితూగే నైపుణ్యాలున్న వారికి అవకాశాలు కల్పించనున్నాయి. ► రిమోట్ సర్వీసెస్‌కు వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. దీనికి అనుగుణంగా తమ సేవలను అందించే ఉద్దేశంతో 5జీ టెక్నాలజీ నైపుణ్యాలకు కంపెనీలు పెద్ద పీట వేస్తున్నాయి. అన్ని రంగాల్లోనూ 5జీ వ్యవసాయం నుంచి వైద్యం వరకూ..అన్ని రంగాల్లోనూ 5జీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కార్యకలా΄ాలు నిర్వహించే అవకాశం ఉంది. హెల్త్‌కేర్ రంగంలో.. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ ద్వారా టెలి మెడిసిన్ సేవలు అందుతున్న సంగతి తెలిసిందే. 5జీ టెక్నాలజీతో రానున్న రోజుల్లో కీలకమైన శస్త్రచికిత్సలు చేసే అవకాశం కూడా అందుబాటులోకి రానుంది. అదే విధంగా 3–డీ ఎక్స్‌రేలు, ఇతర స్కానింగ్‌లు కూడా తీసే వీలుంటుంది. ∙వ్యవసాయ రంగంలో.. 5జీ ఫోన్లో ఉండే ఐఓటీ సాంకేతికత ఆధారంగా.. వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తూ.. వాటికి సరితూగే పంటలు వేయడం లేదా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ సాగులో దిగుబడి పెంచేందుకు అవకాశం ఉంటుంది. ∙రిటైల్ రంగంలోనూ.. 5జీ ఫోన్లతో.. వర్చువల్, ఆగ్మెంటెడ్ రియాల్టీని ఆస్వాదిస్తూ ఏదైనా ఒక వస్తువు లేదా ఉత్పత్తిని కళ్లకు కట్టినట్లు చూసుకోవడానికి.. అదే విధంగా.. ఆయా ఉత్పత్తుల నాణ్యతను లోతుగా పరిశీలించడానికి వీలవుతుంది. ఐఓటీ ఆధారమే 5జీ టెక్నాలజీని వైద్యం,రిటైల్,ఫార్మా.. ఇలా అన్ని రంగాల్లోనూ విస్తృతంగా వినియోగించడానికి కారణం.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మహిమే. ఐఓటీ టూల్స్‌గా పేర్కొనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, మెషీన్ లెర్నింగ్ వంటి సాంకేతికతలను 5జీ కారణంగా సంస్థలతో΄ాటు వ్యక్తులూ వినియోగించుకునే అవకాశం ఉంది. క్లౌడ్ సర్వీసెస్ వయా 5జీ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే.. ఇంటర్నెట్ లేదా ఆన్లైన్ ద్వారా సాఫ్ట్వేర్ సర్వీస్‌లను అందించడం! ఇప్పుడు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ స్మార్ట్ ఫోన్లలోనూ కనిపిస్తోంది. ఉదాహరణకు.. పలు హైఎండ్ ఫోన్లలో అందుబాటులో ఉంటున్న ఎంఎస్ ఆఫీస్ టూల్స్, పీడీఎఫ్ వ్యూయర్స్, పీడీఎఫ్ డ్రైవ్స్‌ను అప్పటికప్పుడు స్మార్ట్ ఫోన్లోనే ΄÷ందే అవకాశం లభిస్తోంది. ఫలితంగా యూజర్లు తాము డౌన్లోడ్ చేసుకున్న విభిన్న వెర్షన్ల డాక్యుమెంట్లను ఎలాంటి ప్రీ–లోడెడ్ సాఫ్ట్వేర్ లేకుండానే వీక్షించే సదు΄ాయం కలుగుతోంది. రోబో ఆధారిత సేవలు ΄ారిశ్రామిక రంగంలో ఇటీవల కాలంలో రోబోటిక్ టెక్నాలజీ కీలకంగా మారుతోంది. రోబో ఆధారిత కార్యకలా΄ాలు, సేవలు విస్తృతంగా వినియోగంలోకి వస్తున్నాయి. ఈ సేవలను వ్యక్తుల స్థాయిలోనే ΄÷ందేందుకు 5జీ ఫోన్లు ఉపకరిస్తాయి. ఉదాహరణకు.. 5జీ స్మార్ట్‌ఫోన్స్‌లో ఉండే నిర్దిష్టమైన సెన్సార్లు, డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ సాంకేతికతల ఆధారంగా ఎక్కడో సుదూరాల్లో ఉన్న రోబోల సాయంతో సర్జరీలు చేసే అవకాశం లభించనుంది. నిపుణుల కొరత 5జీ సేవలు అందించాలనుకుంటున్న సంస్థలు నిపుణులైన మానవ వనరుల కొరత సమస్యను ఎదుర్కొంటున్నాయి. పలు కంపెనీలు రీ–స్కిల్లింగ్ పేరుతో 5జీ టెక్నాలజీస్‌పై తమ ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణనిస్తున్నాయి. టాటా సన్స్‌కు చెందిన పొనటోన్ ఫిన్వెస్ట్ లిమిటెడ్.. తేజస్ నెట్‌వర్క్‌తో ఒప్పందం చేసుకుని శిక్షణనిస్తోంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థ కూడా తమ ఇంజనీరింగ్, ఆర్ అండ్ డీ విభాగం ద్వారా 5జీ టెక్నాలజీస్‌పై ఉద్యోగులకు శిక్షణ అందిస్తోంది. నైపుణ్యం పొందే మార్గాలివే ► 5జీ టెక్నాలజీకి సంబంధించి నైపుణ్యాలు పొందేందుకు ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా 5జీ టెక్నాలజీలో కీలకంగా నిలుస్తున్న రోబోటిక్స్, ఏఐ–ఎంఎల్, క్లౌడ్ కంప్యూటింగ్, ఐఓటీ స్కిల్స్‌ను సొంతం చేసుకునేందుకు పలు ఆన్లైన్/ఆఫ్‌లైన్ శిక్షణ మార్గాలు ఉన్నాయి. ► టెలికం సెక్టార్ స్కిల్ కౌన్సిల్, సిస్కో, ఒరాకిల్ ఇండియా, ఐబీఎం, డి΄ార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో పలు ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ► ఐఐటీ–రూర్కీ, ఢిల్లీ కూడా సర్టిఫికెట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ స్థాయిలో 5జీ టెక్నాలజీ అండ్ ఐఓటీ కోర్సులను అందిస్తున్నాయి. ► కోర్స్ఎరా, ఉడెమీ తదితర సంస్థలు సైతం మూక్స్ విధానంలో 5జీ టెక్నాలజీస్, ఐఓటీ సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి. 5జీ టెక్నాలజీస్.. ముఖ్యాంశాలు ►పలు రిక్రూటింగ్, స్టాఫింగ్ సంస్థల నివేదికల ప్రకారం–ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 5జీ కొలువుల్లో 20 నుంచి 25 శాతం మేరకు పెరుగుదల. ► అంతర్జాతీయ సంస్థల అంచనా ప్రకారం–వచ్చే పదేళ్లలో 20 మిలియన్లకు పైగా ఉద్యోగాలు. ► టెలికం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ అంచనా ప్రకారం–2025 నాటికి 2.2 మిలియన్ల జాబ్స్. ► టెలికం రంగంలోనే ఈ ఏడాది దాదాపు లక్ష ఉద్యోగాలు. ► 2021లో సిస్కో ఇండియా నియామకాల్లో 30 శాతంపైగా 5జీ టెక్నాలజీ విభాగంలోనే ఉన్నాయి. -
ఈ టెక్నాలజీతో..కొత్తగా 1.4 కోట్లకు పైగా ఐటీ ఉద్యోగాలు!
న్యూఢిల్లీ: క్లౌడ్ సర్వీసుల వినియోగం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో 2026 నాటికి దీని ద్వారా 1.4 కోట్ల పైచిలుకు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉందని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ పేర్కొంది. క్లౌడ్ విభాగానికి భారత్ స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 380 బిలియన్ డాలర్ల వాటా ఉండగలదని ఒక ప్రకటనలో వెల్లడించింది. క్లౌడ్ వినియోగంతో పౌరులకు సేవలు మెరుగుపర్చవచ్చని, డిజిటల్ మాధ్యమం ద్వారా అందరికీ వైద్యం, విద్య, ఆర్థిక సేవలను అందుబాటులోకి తేవచ్చని తెలిపింది. అలాగే దేశీయంగా నవకల్పనలకు ఊతం, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాల రూపంలో తోడ్పాటు లభించగలదని నాస్కామ్ తెలిపింది. అన్ని వర్గాల నుంచి సహకారం లభిస్తే వచ్చే అయిదేళ్లలో క్లౌడ్‌పై వెచ్చించే నిధులు 25–30 శాతం పెరిగి 18.5 బిలియన్ డాలర్లకు చేరగలవని వివరించింది. తద్వారా క్లౌడ్ అవకాశాలను భారత్ పూర్తి సామర్ధ్యంతో వినియోగించుకోగలదని నాస్కామ్ పేర్కొంది. -
చిత్తూరు జిల్లాలో ఐటీ కంపెనీ
సాక్షి,చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం సమీపంలోని కొట్టార్లపల్లెలో ఐటీ హబ్ ఏర్పాటు కానుంది. బెంగళూరుకు చెందిన స్మార్ట్ డీవీ గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కంపెనీ ఏర్పాటుతో వచ్చే మూడేళ్లలో 3 వేల మందికి ఉపాధి లభించనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ కంపెనీ అధినేత దీపక్‌కుమార్ తాల శనివారం చిత్తూరులో మీడియాకు వెల్లడించారు. కొట్టార్లపల్లె వద్ద 1.60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ కంపెనీని 20 వేల కోర్లతో క్లౌడ్ సర్వీస్‌తో ఏర్పాటు చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఈనెల 14న భూమి పూజ చేస్తున్నామని, జూన్‌లో పనులు ప్రారంభించి, ఏడాదిలోపు నిర్మాణాలు పూర్తి చేస్తామని వివరించారు. ఇప్పటికే తమ కంపెనీలో తయారవుతున్న సెమీ కండక్టర్లు ప్రపంచంలోనే పేరున్న అన్ని ఎలక్ట్రానిక్స్‌లో ఉపయోగిస్తున్నారన్నారు. యాపిల్, ఐ వాచెస్, తోషిబా, శామ్సంగ్ ఉత్పత్తుల్లోను, కొన్ని దేశాల రక్షణ రంగ సంస్థల్లోను తమ ప్రొడక్టస్ ఉపయోగిస్తున్నారని చెప్పారు. తమ సంస్థకు అమెరికాలో 2, చైనాలో 1, ఇండియాలో 2 చోట్ల బ్రాంచ్‌లు ఉన్నాయని, జపాన్, సింగపూర్, రష్యాతో పాటు యూరప్ మొత్తం మార్కెటింగ్ చేస్తున్నామని వివరించారు. ఆయన వెంట ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎంసీ విజయానందరెడ్డి ఉన్నారు. (చదవండి: నవరత్నాలు.. సుస్థిర అభివృద్ధికి మార్గాలు) -
రాబోయే నాలుగేళ్లలో 10.8 బిలియన్ డాలర్ల మార్కెట్.. ఎక్కడంటే ?
న్యూఢిల్లీ: దేశీయంగా పబ్లిక్ క్లౌడ్ సర్వీసుల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 2020–2025 మధ్య కాలంలో ఈ మార్కెట్ (పీసీఎస్) ఏటా 24.1 శాతం వార్షిక వృద్ధితో 10.8 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. రీసెర్చ్ సంస్థ ఐడీసీ ఈ విషయాలు వెల్లడించింది. ఈ ఏడాది ప్రథమార్ధంలో (జనవరి–జూన్) పీసీఎస్ మార్కెట్ ఆదాయాలు 2.2 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు వెల్లడించింది. నూతన ఆవిష్కరణలు, కొత్త భాగస్వామ్యాలు, డిజిటలీకరణ మొదలైన వాటికి క్లౌడ్ కీలకంగా ఉంటోందని ఐడీసీ తెలిపింది. త్వరితగతిన, సమర్ధమంతంగా అప్లికేషన్లను అభివృద్ధి చే?సేందుకు, కొంగొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకునేందుకు రాబోయే 12 నెలల్లో క్లౌడ్ మౌలిక సదుపాయాలు, ప్లాట్‌ఫామ్‌లపై భారీగా ఇన్వెస్ట్ చేసే ప్రణాళికలు ఉన్నాయని దేశీ సంస్థలు తెలిపినట్లు ఐడీసీ ఇండియా అసోసియేట్ రీసెర్చ్ డైరెక్టర్ రిషు శర్మ తెలిపారు. ‘కొంగొత్త టెక్నాలజీల ఊతంతో కంపెనీలు తమ వ్యాపారాలను డిజిటల్‌గా మార్చుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడగలిగే సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు పబ్లిక్ క్లౌడ్ సర్వీసులు తోడ్పడతాయి. రాబోయే రోజుల్లో పబ్లిక్ క్లౌడ్‌ను వినియోగించడం మరింతగా పుంజుకుంటుంది‘ అని ఐడీసీ ఇండియా సీనియర్ మార్కెట్ అనలిస్ట్ హరీష్ కృష్ణకుమార్ పేర్కొన్నారు. రాబోయే కాలంలో మరిన్ని సంస్థలు హైబ్రిడ్ పని విధానాలకు మళ్లే అవకాశాలు ఉన్నాయని.. దీనితో రిమోట్ కంప్యూటింగ్, స్టోరేజీ, కాన్ఫరెన్సింగ్, క్లౌడ్ సెక్యూరిటీ మొదలైన వాటికి డిమాండ్ పెరుగుతుందన్నారు. ఫలితంగా పబ్లిక్ క్లౌడ్ సర్వీసులపై పెట్టుబడులు మరింతగా పెరుగుతాయన్నారు. ఇతర ప్రధాన అంశాలు - ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ (ఐఏఏఎస్), ప్లాట్‌ఫామ్ యాజ్ ఎ సర్వీస్ (పీఏఏఎస్) సొల్యూషన్స్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ (ఎస్ఏఏఎస్) మొదలైనవి పబ్లిక్ క్లౌడ్ సర్వీసుల పరిధిలోకి వస్తాయి. - ఈ ఏడాది ప్రథమార్ధంలో కోవిడ్–19 ప్రభావాలే క్లౌడ్ సేవలకు ఊతంగా నిల్చాయి. కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాల నిర్వహణ కోసం క్లౌడ్ ఇన్ఫ్రా, ప్లాట్‌ఫామ్‌లు, సాఫ్ట్వేర్ మొదలైన వాటిపై పెట్టుబడులు పెట్టడం కొనసాగించాయి. - పీసీఎస్ మార్కెట్లో అత్యధికంగా ఎస్ఏఏఎస్ను వినియోగిస్తుండగా .. ఐఏఏఎస్, పీఏఏఎస్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. - భారీ సంస్థలతో పాటు చిన్న, మధ్య తరహా వ్యాపారాలు కూడా పబ్లిక్ క్లౌడ్‌ను వినియోగించడం పెరుగుతోంది. ఎక్కువగా ఎంటర్ప్రైజ్ రిసోర్స్ మేనేజ్మెంట్ (ఈఆర్ఎం), కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం), సెక్యూరిటీ మొదలైన క్లౌడ్ ఆధారిత అప్లికేషన్లకు డిమాండ్ ఉంటోంది. -
టెలికాం కంపెనీలే లక్ష్యంగా..నోకియా బిగ్ స్కెచ్..!
Nokia Plans To Launch Cloud Based Software Subscription Service For Telecom Companies: టెలికాం కంపెనీలను లక్ష్యంగా చేసుకొని నోకియా భారీ ఆలోచనతో ముందుకురానుంది. అనలిటిక్స్, సెక్యూరిటీ , డేటా మేనేజ్మెంట్ సర్వీస్ సాఫ్ట్‌వేర్‌ను అందించడం కోసం క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్ సర్వీస్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు నోకియా బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అనేక సాంకేతిక సంస్థలు ఊహాజనిత, పునరావృత వ్యాపారాన్ని నిర్మించడానికి ముందస్తు లైసెన్సింగ్ నుంచి సబ్స్క్రిప్షన్ మోడల్ వైపుగా కదులుతున్నాయి. దీంతో నోకియా సబ్స్క్రిప్షన్ మోడల్ వైపుగా చూస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: తగ్గేదె లే అంటున్న జియో! నోకియా రూపొందించిన పలు సాఫ్ట్వేర్ పోర్ట్‌ఫోలియోలను ఈ ఏడాది నుంచి సబ్స్క్రిప్షన్ బేస్‌లో అందిస్తుండగా...వచ్చే ఏడాది ప్రారంభంలో పూర్తిగా ఆయా సాఫ్ట్వేర్ పోర్ట్‌ఫోలియోలను వాణిజ్యపరంగా అందుబాటులో ఉంచాలని నోకియా భావిస్తోంది. క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్ సర్వీసులను నోకియా 2016లోనే సృష్టించినప్పటికీ...సబ్స్క్రిప్షన్ మోడల్‌పై కంపెనీ అంతగా మొగ్గుచూపలేదని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మార్క్ బన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం సబ్స్క్రిప్షన్ మోడల్‌ను పూర్తి స్ధాయిలో అందుబాటులోకి వస్తోందని మార్క్ వెల్లడించారు. దీంతో పలు టెలికాం కంపెనీల వ్యయాలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. క్లౌడ్-ఆధారిత సాఫ్ట్వేర్ టెలికాం కంపెనీల డేటా, అనలిటిక్స్, సెక్యూరిటీ పరంగా నిర్వహణ మరింత సులభతం కానుంది. ఇప్పటికే పలు టెలికాం కంపెనీలతో క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్ వినియోగంపై నోకియా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 2021-2025 కాలానికి 3.1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 23,060 కోట్లు) ను నోకియా లక్ష్యంగా పెట్టుకుంది. చదవండి: సెకండ్‌కు సుమారు 6 లక్షల 48 వేల సంపాదన..! -
ఆస్గ్రిడ్ కోసం ఇన్ఫీ, మైక్రోసాఫ్ట్ జత
న్యూఢిల్లీ: క్లౌడ్ ట్రాన్స్ఫార్మేషన్ సేవలు అందించేందుకు తాజాగా ఐటీ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ చేతులు కలిపాయి. తద్వారా ఆ్రస్టేలియా తూర్పుతీర ప్రాంతంలోని విద్యుత్ పంపిణీ దిగ్గజం ఆస్గ్రిడ్కు కొన్నేళ్లపాటు సేవలు అందించనున్నాయి. ఇందుకు వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తాము సమకూర్చనున్న సరీ్వసుల మద్దతుతో ఆస్గ్రిడ్ కస్టమర్లకు అందుబాటులో నమ్మకమైన నిరంతర సరీ్వసులను అందించేందుకు వీలుంటుందని ఇన్ఫోసిస్ పేర్కొంది. 40 లక్షలమంది ఆస్ట్రేలియన్లకు ప్రతిరోజూ అత్యున్నత ప్రమాణాలతో అందిస్తున్న అత్యవసర సేవలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దవలసి ఉన్నట్లు ఆస్గ్రిడ్ సీఐవో నిక్ క్రోవ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో నెట్‌వర్క్‌ను మరింత నమ్మదగిన స్థాయిలో మెరుగుపరుస్తామని, తద్వారా విద్యుత్ ధరలు తగ్గేందుకు వీలుంటుందన్నారు. కొత్త సరీ్వసులను మార్కెట్లో చౌక గా, వేగవంతంగా ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. వెరసి క్లౌడ్ ప్రోగ్రామ్ ద్వారా ఆస్గ్రిడ్ వ్యయాల అదుపుతోపాటు.. ఐటీ వ్యవస్థ పనితీరు బలపడనున్నట్లు పేర్కొన్నారు. ఎంటర్ప్రైజ్ ఆధారిత క్లౌడ్ సరీ్వసుల వినియోగం పెరుగుతున్నట్లు మైక్రోసాఫ్ట్ ఆ్రస్టేలియా ప్రధాన అధికారి రాచెల్ బాండీ అన్నారు. పలు బిజినెస్‌ల వృద్ధికి కీలకంగా నిలుస్తున్నట్లు చెప్పారు. ఇన్ఫోసిస్, ఆస్గ్రిడ్లతో జట్టుకట్టడం ద్వారా మైక్రోసాఫ్ట్ అజూర్ శక్తిని వినియోగించుకోనున్నట్లు తెలిపారు. -
మార్కెట్‌కు దీటుగా ఇన్ఫోసిస్ క్లౌడ్ సేవలు
బెంగుళూరు: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన అత్యుత్తమ సేవలతో ప్రపంచ వ్యాప్తంగా బ్రాండ్ సృష్టించుకుంది. తాజాగా ఇన్పోసిస్ కోబాల్ట్‌తో సేవలు, సొల్యుషన్ష్ తదితర రంగాలలో డిజిటల్ నైపుణ్యాలను ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు పీఏఎస్, ఎస్ఎఎస్ తదితర సాఫ్టవేర్ ఉత్పత్తులలో క్లౌడ్ నేపుణ్యాలతో(డిజిటల్) సాంకేతికంగా నూతన ఒరవడి సృష్టించనుంది. క్లయింట్లకు వేగంగా ప్రాజెక్టులను అందించేందుకు ఇన్ఫోసిస్ ప్రారంభిస్తున్న సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ అధికారులు తెలిపారు. మరోవైపు కోబాల్ట్ ఎంటర్‌ప్రైజస్‌తో 200 క్లౌడ్ ఉత్పత్తులను మొదటగా ప్రారంభించనున్నానారు. దిగ్గజ సంస్థ ప్రస్తుతం తన సేవలను అంతర్జాతీయంగా అన్ని ప్రాంతాలకు విస్తరించనుంది. మార్కెట్‌కు అవసరమైన సాంకేతికత, సెక్యూరిటీల విషయంలో ఇన్ఫోసిస్ నూతన ఒరవడి సృష్టించనుంది. చదవండి: ఒక్క గంటలో 50 వేల కోట్ల రూపాయలు -
హెల్త్‌కేర్, బీఎఫ్ఎస్ఐ కంపెనీలే మా ప్రధాన క్లౌడ్ సర్వీస్ యూజర్లు: మైక్రోసాఫ్ట్
బెంగళూరు: తమ దేశీ క్లౌడ్ సర్వీస్‌లకు హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన కంపెనీలు సహా పలు స్టార్టప్స్ కూడా ప్రధాన క్లయింట్స్‌గా ఉన్నాయని ‘మైక్రోసాఫ్ట్’ పేర్కొంది. ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్, అగ్రికల్చర్ వంటి పలు రంగాల్లో సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్లౌడ్ సర్వీసులను ఉపయోగిస్తున్నాయని మైక్రోసాఫ్ట్ వివరించింది. హెల్త్‌కేర్, బీఎఫ్ఎస్ఐ కంపెనీలు వాటి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో క్లౌడ్ సర్వీసులకు ప్రాధాన్యమిస్తున్నాయని పేర్కొంది. టెక్నాలజీ స్టార్టప్స్ కొత్త సేవల ఆవిష్కరణకు క్లౌడ్ సేవలను వినియోగించుకుంటున్నాయని తెలిపింది. బీఎస్ఈలో లిస్టైన టాప్-100 కంపెనీల్లో 52 సంస్థలు తమ క్లౌడ్ సేవలను ఉపయోగించుకుంటున్నాయని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ క్లయింట్స్‌లో ఫోర్టిస్ హెల్త్‌కేర్, అపోలో హాస్పిటల్స్, బీఓబీ, హెచ్డీఎఫ్సీ, పేటీఎం, స్నాప్‌డీల్ కంపెనీలు ఉన్నాయి. -
730 మిలియన్ డాలర్లకు భారత క్లౌడ్ సర్వీసులు
న్యూఢిల్లీ: దేశీయంగా పబ్లిక్ క్లౌడ్ సర్వీసుల రంగ ఆదాయాలు ఈ ఏడాది ఆఖరు నాటికి 730 మిలియన్ డాలర్ల స్థాయికి చేరొచ్చని కన్సల్టెన్సీ సంస్థ గార్ట్నర్ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 31 శాతం వృద్ధి సాధించగలదని పేర్కొంది. భారత్‌లో క్లౌడ్ సేవలపై భారీగా వ్యయాలు పెరుగుతాయని, 2019 నాటికి ఇవి 19 బిలియన్ డాలర్లకు చేరొచ్చని గార్ట్నర్ వివరించింది. ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ (ఐఏఏఎస్), క్లౌడ్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ (ఎస్ఏఏఎస్) మొదలైన విభాగాలు గణనీయమైన వృద్ధి కనపర్చగలవని గార్ట్నర్ తెలిపింది. 2015లో ఐఏఏఎస్పై వ్యయాలు 100 మిలియన్ డాలర్లకు (25% వృద్ధి), క్లౌడ్ మేనేజ్మెంట్/సెక్యూరిటీపై 82 మిలియన్ డాలర్లకు (36.6%), ఎస్ఏఏఎస్పై 302 మిలియన్ డాలర్ల స్థాయికి (33.4% వృద్ధి) పెరగగలవని పేర్కొంది. ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులు, స్థానిక మార్కెట్లలో డిమాండ్, సరఫరా పరిస్థితులు మొదలైన వాటిపై క్లౌడ్ సర్వీసుల అంచనాలు ఆధారపడి ఉంటాయని గార్ట్నర్ రీసెర్చ్ డెరైక్టర్ సిడ్ నాగ్ తెలిపారు. భారత కంపెనీలు సొంతంగా ఇన్ఫ్రాను ఏర్పాటు చేసుకోవడం కంటే ఐఏఏఎస్, ఎస్ఏఏఎస్ వంటి వాటివైపు మొగ్గు చూపుతున్నాయనడానికి తాజా పరిణామాలు నిదర్శనమని వివరించారు.