న్యూఢిల్లీ: దేశీయంగా పబ్లిక్ క్లౌడ్ సర్వీసుల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో 2020–2025 మధ్య కాలంలో ఈ మార్కెట్ (పీసీఎస్) ఏటా 24.1 శాతం వార్షిక వృద్ధితో 10.8 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. రీసెర్చ్ సంస్థ ఐడీసీ ఈ విషయాలు వెల్లడించింది. ఈ ఏడాది ప్రథమార్ధంలో (జనవరి–జూన్) పీసీఎస్ మార్కెట్ ఆదాయాలు 2.2 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు వెల్లడించింది. నూతన ఆవిష్కరణలు, కొత్త భాగస్వామ్యాలు, డిజిటలీకరణ మొదలైన వాటికి క్లౌడ్ కీలకంగా ఉంటోందని ఐడీసీ తెలిపింది. త్వరితగతిన, సమర్ధమంతంగా అప్లికేషన్‌లను అభివృద్ధి చే?సేందుకు, కొంగొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకునేందుకు రాబోయే 12 నెలల్లో క్లౌడ్ మౌలిక సదుపాయాలు, ప్లాట్‌ఫామ్‌లపై భారీగా ఇన్వెస్ట్ చేసే ప్రణాళికలు ఉన్నాయని దేశీ సంస్థలు తెలిపినట్లు ఐడీసీ ఇండియా అసోసియేట్ రీసెర్చ్ డైరెక్టర్ రిషు శర్మ తెలిపారు. ‘కొంగొత్త టెక్నాలజీల ఊతంతో కంపెనీలు తమ వ్యాపారాలను డిజిటల్‌గా మార్చుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడగలిగే సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు పబ్లిక్ క్లౌడ్ సర్వీసులు తోడ్పడతాయి. రాబోయే రోజుల్లో పబ్లిక్ క్లౌడ్‌ను వినియోగించడం మరింతగా పుంజుకుంటుంది‘ అని ఐడీసీ ఇండియా సీనియర్ మార్కెట్ అనలిస్ట్ హరీష్ కృష్ణకుమార్ పేర్కొన్నారు. రాబోయే కాలంలో మరిన్ని సంస్థలు హైబ్రిడ్ పని విధానాలకు మళ్లే అవకాశాలు ఉన్నాయని.. దీనితో రిమోట్ కంప్యూటింగ్, స్టోరేజీ, కాన్ఫరెన్సింగ్, క్లౌడ్ సెక్యూరిటీ మొదలైన వాటికి డిమాండ్ పెరుగుతుందన్నారు. ఫలితంగా పబ్లిక్ క్లౌడ్ సర్వీసులపై పెట్టుబడులు మరింతగా పెరుగుతాయన్నారు.
ఇతర ప్రధాన అంశాలు
- ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ (ఐఏఏఎస్), ప్లాట్‌ఫామ్ యాజ్ ఎ సర్వీస్ (పీఏఏఎస్) సొల్యూషన్స్, సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్ (ఎస్‌ఏఏఎస్) మొదలైనవి పబ్లిక్ క్లౌడ్ సర్వీసుల పరిధిలోకి వస్తాయి.
- ఈ ఏడాది ప్రథమార్ధంలో కోవిడ్–19 ప్రభావాలే క్లౌడ్ సేవలకు ఊతంగా నిల్చాయి. కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాల నిర్వహణ కోసం క్లౌడ్ ఇన్‌ఫ్రా, ప్లాట్‌ఫామ్‌లు, సాఫ్ట్‌వేర్ మొదలైన వాటిపై పెట్టుబడులు పెట్టడం కొనసాగించాయి.
- పీసీఎస్ మార్కెట్లో అత్యధికంగా ఎస్‌ఏఏఎస్‌ను వినియోగిస్తుండగా .. ఐఏఏఎస్, పీఏఏఎస్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
- భారీ సంస్థలతో పాటు చిన్న, మధ్య తరహా వ్యాపారాలు కూడా పబ్లిక్ క్లౌడ్‌ను వినియోగించడం పెరుగుతోంది. ఎక్కువగా ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (ఈఆర్‌ఎం), కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ (సీఆర్‌ఎం), సెక్యూరిటీ మొదలైన క్లౌడ్ ఆధారిత అప్లికేషన్‌లకు డిమాండ్ ఉంటోంది.
రాబోయే నాలుగేళ్లలో 10.8 బిలియన్ డాలర్ల మార్కెట్.. ఎక్కడంటే ?
Published Thu, Dec 2 2021 9:09 AM | Last Updated on Thu, Dec 2 2021 9:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment