హెల్త్‌కేర్, బీఎఫ్‌ఎస్‌ఐ కంపెనీలే మా ప్రధాన క్లౌడ్ సర్వీస్ యూజర్లు: మైక్రోసాఫ్ట్ | Can Microsoft Win The Cloud Battle In India? | Sakshi
Sakshi News home page

హెల్త్‌కేర్, బీఎఫ్‌ఎస్‌ఐ కంపెనీలే మా ప్రధాన క్లౌడ్ సర్వీస్ యూజర్లు: మైక్రోసాఫ్ట్

Published Sat, Sep 24 2016 2:18 AM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM

హెల్త్‌కేర్, బీఎఫ్‌ఎస్‌ఐ కంపెనీలే మా ప్రధాన క్లౌడ్ సర్వీస్ యూజర్లు: మైక్రోసాఫ్ట్

హెల్త్‌కేర్, బీఎఫ్‌ఎస్‌ఐ కంపెనీలే మా ప్రధాన క్లౌడ్ సర్వీస్ యూజర్లు: మైక్రోసాఫ్ట్

బెంగళూరు: తమ దేశీ క్లౌడ్ సర్వీస్‌లకు హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన కంపెనీలు సహా పలు స్టార్టప్స్ కూడా ప్రధాన క్లయింట్స్‌గా ఉన్నాయని ‘మైక్రోసాఫ్ట్’ పేర్కొంది. ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్, అగ్రికల్చర్ వంటి పలు రంగాల్లో సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్లౌడ్ సర్వీసులను ఉపయోగిస్తున్నాయని మైక్రోసాఫ్ట్ వివరించింది. హెల్త్‌కేర్, బీఎఫ్‌ఎస్‌ఐ కంపెనీలు వాటి డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో క్లౌడ్ సర్వీసులకు ప్రాధాన్యమిస్తున్నాయని పేర్కొంది.

టెక్నాలజీ స్టార్టప్స్ కొత్త సేవల ఆవిష్కరణకు క్లౌడ్ సేవలను వినియోగించుకుంటున్నాయని తెలిపింది. బీఎస్‌ఈలో లిస్టైన టాప్-100 కంపెనీల్లో 52 సంస్థలు తమ క్లౌడ్ సేవలను ఉపయోగించుకుంటున్నాయని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ క్లయింట్స్‌లో ఫోర్టిస్ హెల్త్‌కేర్, అపోలో హాస్పిటల్స్, బీఓబీ, హెచ్‌డీఎఫ్‌సీ, పేటీఎం, స్నాప్‌డీల్ కంపెనీలు ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement