
ఆన్‌లైన్ గేమర్ల గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఏఐ-ఆధారిత అసిస్టెంట్ ‘కోపైలట్ ఫర్ గేమింగ్’ను మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించింది. ఇది ఆన్‌లైన్‌లో ప్లేయర్లకు సమయాన్ని ఆదా చేయడం, వారి నైపుణ్యాలను మెరుగుపరచడం, ఇతర స్నేహితులు, గేమింగ్ కమ్యూనిటీలతో కనెక్ట్ అవ్వడంలో సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ ఏఐ టూల్‌కు సంబంధించిన విషయాలు పంచుకున్నారు.
నైపుణ్యాలు పెంచేందుకు..
కోపైలట్ ఫర్ గేమింగ్ అనేది గేమింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి, రియల్-టైమ్‌లో గేమర్లకు మద్దతుగా నిలిచేందుకు, వారి గేమింగ్ నైపుణ్యాలు పెంచేందుకు ఉద్దేశించిన ఏఐ ఆధారిత టూల్. ఈ ఏఐ అసిస్టెంట్ ప్లేయర్లకు మరింత వేగంగా గేమ్స్ సెట్ చేయడానికి, వారి ప్రాధాన్యతల ఆధారంగా కొత్త టైటిల్స్‌ను సిఫారసు చేయడానికి, అవసరమైనప్పుడు గేమ్‌లో సహాయాన్ని అందించడానికి తోడ్పడుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. కోపైలట్ ఫర్ గేమింగ్ ప్రారంభంలో ఎక్స్ బాక్స్ ఇన్ సైడర్ ప్రోగ్రామ్ ద్వారా మొబైల్‌లో అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఇతర ప్లాట్‌పామ్‌లకు త్వరలో దీన్ని విస్తరిస్తామని పేర్కొన్నారు.
With Copilot for Gaming, you can jump back into games faster, get real-time coaching, and stay connected... all on your own terms. Excited for what the team has in store! pic.twitter.com/18Ll2D25i1
— Satya Nadella (@satyanadella) March 13, 2025
ఇదీ చదవండి: మల్టీప్లెక్స్ స్టాక్ పంట పండింది..?
ఈ ఏఐ అసిస్టెంట్‌ను సామర్థ్యం, అడాప్టబిలిటీ, పర్సనలైజేషన్ అనే మూడు ప్రధాన సూత్రాలకు అనుగుణంగా నిర్మించినట్లు కంపెనీ పేర్కొంది. ప్లేయర్ల అభిరుచులకు తగినట్లుగా గేమ్‌లను సెర్చ్ చేయడానికి, డౌన్‌లోడ్ చేయడానికి, వాటిని అప్‌డేట్ చేయడానికి సమయాన్ని ఆదా చేయడం, ప్లేయర్లు ఆటపైనే దృష్టి పెట్టేలా చేయడం దీని ఉద్దేశం. గేమింగ్ కోసం కోపైలట్ ప్లేయర్ నియంత్రణలో ఉంటుందని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment