online gaming
-
ఆన్లైన్ గేమింగ్‌కు మనీ లాండరింగ్ ముప్పు
న్యూఢిల్లీ: అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశీ ఆన్లైన్ గేమింగ్ రంగానికి మనీలాండరింగ్ నుంచి గణనీయంగా ముప్పు పొంచి ఉందని డిజిటల్ ఇండియా ఫౌండేషన్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో విస్తరించిన డిజిటల్ ఎకానమీని, ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమను కాపాడేందుకు సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆపరేటర్లను కట్టడి చేసేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని, చట్టబద్ధమైన ఆపరేటర్లతో వైట్‌లిస్ట్ తయారు చేయాలని, తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్డుకట్ట వేయాలని, అంతర్జాతీయంగా పరస్పరం సహరించుకోవాలని పేర్కొంది. అలాగే మోసపూరిత విధానాలు పాటించే ప్లాట్‌ఫాంల జోలికి వెళ్లకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని, పటిష్టమైన ఇన్వెస్టిగేటివ్ బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. అయిదేళ్లలో 7.5 బిలియన్ డాలర్లకు పరిశ్రమ.. నివేదిక ప్రకారం 2020– 2023 ఆర్థిక సంవత్సరాల మధ్య 28 శాతం వార్షిక వృద్ధితో భారతీయ రియల్ మనీ గేమింగ్ (ఆర్ఎంజీ) రంగం అంతర్జాతీయ మార్కెట్లో కీలక పరిశ్రమగా మారింది. వచ్చే ఐదేళ్లలో ఈ రంగం ఆదాయం 7.5 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. కోట్ల కొద్దీ గేమర్లు పరిశ్రమ వృద్ధికి దోహదపడుతున్నారు. దీనితో ఫిన్‌టెక్, క్లౌడ్ సర్వీసెస్, సైబర్–సెక్యూరిటీ వంటి అనుబంధ రంగాల్లో కూడా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → యూజర్‌కు భద్రత, సైబర్ సెక్యూరిటీపరమైన సవాళ్లు మొదలైనవి పరిశ్రమ పురోగతికి అవరోధాలుగా మారొచ్చు. దేశీయంగా చట్టవిరుద్ధమైన బెట్టింగ్ మార్కెట్లో ఏటా 100 బిలియన్ డాలర్ల డిపాజిట్లు వస్తుండటం ఈ సవాళ్ల తీవ్రతకు నిదర్శనం. → చట్టవిరుద్ధమైన ఆపరేటర్లను కట్టడి చేసేందుకు నియంత్రణ సంస్థలు ఎంతగా ప్రయతి్నస్తున్నప్పటికీ మిర్రర్ సైట్స్, అక్రమ బ్రాండింగ్, అలవిగాని హామీలతో చాలా ప్లాట్‌ఫాంలు నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పర్యవేక్షణ, చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. → దేశీయంగా 400 పైచిలుకు స్టార్టప్‌లు 10 కోట్ల మంది రోజువారీ ఆన్లైన్ గేమర్లు ఉన్నారు. వీరిలో 9 కోట్ల మంది డబ్బు చెల్లించి గేమ్స్ ఆడుతుంటారు. ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక లక్ష మందికి ఉద్యోగాలు కలి్పస్తోంది. 2025 నాటికి 2,50,000 ఉద్యోగాలను కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఇంతటి భారీ పరిశ్రమకు నిర్దిష్టంగా ఒక నియంత్రణ సంస్థ అంటూ లేకపోవడం, పర్యవేక్షణ.. ఏకరూప ప్రమాణాలు లేకపోవడం వంటి అంశాలు సమస్యలుగా ఉంటున్నాయి. -
9 బిలియన్ డాలర్లకు ‘ఆన్లైన్ గేమింగ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ వచ్చే అయిదేళ్లలో 8.92 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నట్లు ఈ–గేమింగ్ ఫెడరేషన్ (ఈజీఎఫ్) సీఈవో అనురాగ్ సక్సేనా తెలిపారు. ప్రస్తుతం ఇది 3.1 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. ఇటీవలి గ్రాంట్ థార్న్టన్ భారత్, ఈజీఎఫ్ నివేదిక ప్రకారం 2018–23 మధ్య కాలంలో ఈ రంగంలో పనిచేసేవారి సంఖ్య 20 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. ఏడాదికి దాదాపు రూ. 7వేల కోట్ల స్థాయిలో జీఎస్టీ వసూళ్లు ఉంటున్నాయన్నారు. అయితే, పరిశ్రమ ఇంత భారీగా విస్తరిస్తున్నప్పటికీ ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల స్కిల్ గేమింగ్, గ్యాంబ్లింగ్ మధ్య తేడా తెలియక గందరగోళం నెలకొంటోందని సక్సేనా చెప్పారు. ఈ నేపథ్యంలోనే పరిశ్రమకు నియంత్రణపరమైన విధి విధానాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు. దీనిపై కసరత్తు జరుగుతోందని వివరించారు. నియంత్రణ వ్యవస్థ ఉంటే గేమింగ్ రంగంలోకి భారీగా పెట్టుబడులు వస్తాయని సక్సేనా చెప్పారు. గేమింగ్‌పై అవగాహన పెంచేందుకు ప్రత్యేకంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. టెక్ రంగంలో హైదరాబాద్ వేగంగా పురోగమిస్తోందని, స్థానికంగా 4,369 టెక్ స్టార్టప్‌లు, దాదాపు 77 గేమింగ్ స్టార్టప్‌లు ఉన్నాయని వివరించారు. -
జీఎస్టీ ఎగవేతలు రూ.2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: జీఎస్టీ ఎగవేతల విలువ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.01 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించి 6,084 కేసులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) గుర్తించింది. ఆన్లైన్ గేమింగ్, బీఎఫ్ఎస్ఐ, ఇనుము, రాగి, స్క్రాప్ విభాగాల్లో అత్యధిక ఎగవేతలు నమోదయ్యాయని డైరెక్టరేట్ వెల్లడించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 4,872 కేసులు నమోదు కాగా, ఎగవేతల విలువ రూ.1.01 లక్షల కోట్లుగా ఉంది. డీజీజీఐ వార్షిక నివేదిక ప్రకారం.. పన్ను చెల్లించకపోవడానికి సంబంధించిన ఎగవేత కేసుల్లో 46 శాతం రహస్యంగా సరఫరా, తక్కువ మూల్యాంకనం, 20 శాతం నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌కు (ఐటీసీ) సంబంధించినవి కాగా 19 శాతం ఐటీసీని తప్పుగా పొందడం/రివర్సల్ చేయకపోవడం వంటివి ఉన్నాయి. 2023–24లో ఆన్లైన్ గేమింగ్ రంగంలో 78 కేసుల్లో గరిష్టంగా రూ.81,875 కోట్ల ఎగవేత జరిగింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగం 171 కేసుల్లో రూ.18,961 కోట్ల ఎగవేతలను నమోదు చేసింది. -
GST Council meet: ఎరువులపై జీఎస్టీ తగ్గించేనా?
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల తర్వాత జీఎస్టీ కౌన్సిల్ తొలిసారి భేటీ అవుతోంది. ఎరువులపై సబ్సిడీ రేటు తగ్గించాలంటూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సూచనతోపాటు, ఆన్లైన్ గేమింగ్‌పై పన్ను అంశాలు శనివారం నాటి సమావేశంలో చర్చకు రానున్నాయి. 53వ జీఎస్టీ కౌన్సిల్ భేటీకి కేంద్ర ఆరి్థక మంత్రి అధ్యక్షత వహిస్తుండగా, రాష్ట్రాల ఆరి్థక మంత్రులు సైతం పాల్గొననున్నారు. జీఎస్టీలో ప్రస్తుతమున్న వివిధ రకాల రేట్లను కుదించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉండగా, దీనిపై ఏర్పాటైన మంత్రుల బృందం ఇప్పటి వరకు సాధించిన పురోగతి సైతం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎరువులపై జీఎస్టీలో 5 శాతం రేటు అమలవుతోంది. ఎరువుల తయారీలోకి వినియోగించే సల్ఫూరిక్ యాసిడ్, అమ్మోనియాపై 18 శాతం రేటు అమల్లో ఉంది. ఎరువుల తయారీలోకి వినియోగించే ముడి సరుకులతోపాటు పంట పోషక ఉత్పత్తులపైనా రేటు తగ్గించాలని ఈ రంగానికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. ఎరువులపై రేట్ల తగ్గింపు ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ 45వ, 47వ సమావేశాల అజెండాల్లో చోటు కలి్పంచినప్పటికీ.. ఈ దిశగా మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చివరిగా జీఎస్టీ కౌన్సిల్ 52వ సమావేశం గతేడాది అక్టోబర్ 7న జరగడం గమనార్హం. ఆన్లైన్ గేమింగ్, పందేల మొత్తంపై 28 శాతం జీఎస్టీ రేటు 2023 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచి్చంది. ఆరు నెలల తర్వాత దీనిపై సమీక్ష చేపడతామని అప్పట్లోనే మండలి ప్రకటించింది. దీంతో ఇది చర్చకు వస్తుందని భావిస్తున్నారు. -
‘డెత్’లైన్ గేమ్స్!
సాక్షి, సిటీబ్యూరో: బండ్లగూడ జాగీర్ సన్‌సిటీలో నివసించే భార్యభర్తలు ఇందిర, ఆనంద్ తమ కుమారుడు విక్కీని చంపి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణానికి కారణం ఆనంద్ ఆన్లైన్ గేమ్స్‌కు బానిసగా మారి అప్పుల పాలు కావడం. పంచాయితీ రాజ్ శాఖలో మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కీసర విభాగంలో ఏఈగా పని చేస్తున్న గడ్డం రాహుల్ బాబు ఆన్లైన్ గేమ్స్‌కు బానిసై ఆ నష్టాలు పూడ్చుకోవడానికి మోసగాడిగా మారి జైలుకెళ్లాడు. దుండిగల్‌లోని ఏరోనాటికల్ కాలేజీలో బీటెక్ చదువుతున్న గుడిమల్కాపూర్‌కు చెందిన శీలం మనోజ్ ఆన్లైన్ గేమింగ్‌కు అలవాటుపడి, ఆరి్థకంగా తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త జానారెడ్డి ఆన్లైన్ గేమింగ్‌కు అలవాటుపడి డబ్బు పోగొట్టుకోవడంతో ఆరి్థక సమస్యలు చుట్టుముట్టి మన్సూరాబాద్ భవానీనగర్‌కు చెందిన వివాహిత శిరీష ఆత్మహత్య చేసుకుంది. ....గడచిన నెలన్నర రోజుల కాలంలో వెలుగులోకి వచి్చన ఈ నాలుగు ఉదంతాలు ప్రస్తుతం సమాజంపై ఆన్లైన్ గేమింగ్స్ ప్రభావాన్ని చెప్పకనే చెప్తున్నాయి. ఈ గేమ్స్‌కు అలవాటుపడుతున్న వాళ్లు గెలవడానికి బానిసలుగా మారిపోతున్నారు. దీనికోసం ఆయా కంపెనీల ట్రాప్‌లో పడి వివిధ రకాలైన పాయింట్లు కొంటున్నారు. వాటిని ఖరీదు చేయడానికి, పందెం కాయడానికి అవసరమైన డబ్బు కోసం అప్పులు చేస్తున్నారు. చివరకు ఆ ఉచ్చులో పడి మోసాలు, ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. పథకం ప్రకారం విస్తరించిన గేమ్స్... కోవిడ్ నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా ఆన్లైన్ క్లాసులే నడిచాయి. దీంతో దాదాపు ప్రతి విద్యార్థి చేతికి ఫోన్, ట్యాబ్‌లు వచ్చి చేరాయి. దీన్ని క్యాష్ చేసుకోవడానికి గేమింగ్ కంపెనీలు పథకం ప్రకారం వ్యవహరించాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు, లింకుల ద్వారా తమ గేమ్స్‌ను ప్రమోట్ చేశాయి. వీటికి ఆకర్షితులైన విద్యార్థులు, ఉద్యోగులు, యువత వాటిని ఇన్స్టాల్ చేసుకుని ఆడటం మొదలెట్టారు. ఆ తర్వాతి రోజుల్లో ఇవి ఆడటం అనేది ఓ వ్యసనంగా మారిపోయింది. ఈ గేమ్స్ అన్నీ వాటి నిర్వాహకులు రూపొందించిన ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా నడుస్తుంటాయి. దీని ప్రకారం గేమ్ ఆడటం కొత్తగా ప్రారంభించిన వారి ఐపీ అడ్రస్ తదితర వివరాలను నిర్వాహకులు సంగ్రహిస్తారు. దీని ఆధారంగా తొలినాళ్లల్లో దాదాపు ప్రతి గేమ్‌లోనూ వాళ్లే గెలిచేలా చేసి తమ ముగ్గులోకి దింపుతారు. వీళ్లకి గెలుపు అనేది ఓ కిక్‌గా మారుస్తారు. పాయింట్లు, పందేల పేరుతో.. ఇలా తమ గేమ్‌కు బానిసగా మారిన వారిని ఎంపిక చేసుకునే నిర్వాహకులు అసలు కథ మొదలెడుతున్నారు. కొన్ని రోజుల పాటు వాళ్లు ఆయా గేమ్స్‌లో ఓడిపోయేలా చేస్తారు. ఆపై గేమ్‌లో నువ్వు వీక్ అయిపోయావంటూ సందేశాలు పంపి రెచ్చగొడతారు. ఇలా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే భావన ఆడేవారిలో కలిగిస్తారు. దీనికోసం టిప్స్ ఇస్తున్నామంటూ కొన్ని యూసీ పాయింట్లను ఉచితంగా ఇస్తారు. వీటిని వినియోగిస్తే గేమ్‌లో మీ తరఫున ఆడే క్రీడాకారులు బలంగా మారి, గెలుస్తావంటూ చెబుతారు. తొలుత ఈ పాయింట్లు ఉచితమే అంటూ వాటికీ బానిసలుగా మారేలా చేస్తారు. ఆపై ఈ పాయింట్లు రావాలంటే తమకు కొంత మొత్తం చెల్లించాలంటూ వసూలు చేయడం మొదలెడతారు. అందినకాడికి దండుకుంటారు... కొన్ని రోజుల తర్వాత ఆ యూసీ పాయింట్లు ఉచితంగా ఇవ్వలేమంటూ మెలికపెడతారు. అవి కావాలంటే తమ వద్ద రిజిస్టర్ చేసుకుని, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో చెల్లింపులు చేయాలని షరతు విధిస్తారు. అప్పటికే ఈ గేమ్స్‌కు బానిసలుగా మారిన వాళ్లు తేలిగ్గా వాటి నిర్వాహకుల ట్రాప్‌లో పడిపోతున్నారు. తమవి లేదా తల్లిదండ్రుల కార్డులు తీసుకుని పేమెంట్లు చేస్తున్నారు. వీటి వివరాలను ఒకసారి నమోదు చేసి, ఆ సందర్భంలో కార్డు యజమానికి వచ్చే ఓటీపీ పొందుపరిచి, ఆటో రీచార్జ్ ఎంపిక చేసుకుంటే పదేపదే కార్డుతో అవసరం ఉండదు. దీంతో అదును చూసుకుని ఈ పని చేస్తున్న యువత అనునిత్యం భారీ మొత్తం ఖర్చు చేసేస్తోంది. ఇలా మళ్లీ గెలుపు అలవాటు చేసిన తర్వాత తమ వద్ద నిరీ్ణత మొత్తం పందెం కాసి గేమ్ ఆడితే... భారీ లాభాలు ఉంటాయని చెప్పే కంపెనీలు డబ్బు దండుకుంటున్నాయి. ఇలాంటి గేమ్స్‌లో తొలినాళ్లల్లో తక్కువ మొత్తం పెట్టినప్పుడు లా«భం వచి్చనా...పెట్టుబడి పెరిగే కొద్దీ నష్టాలే వస్తుంటాయి. వాటిలో ప్రోగ్రామింగ్ అలా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొందరు ఆన్లైన్ గేమింగ్స్ కోసం యాప్స్‌లో అప్పులు తీసుకుని, ఆ భారం పెరిగిపోయి, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. పురుషులే ఎక్కువ.. ఇటీవల కాలంలో ఇలాంటి ‘గేమింగ్ ఉదంతాలు’ ఎక్కువగా జరుగుతున్నాయి. పురుషులతో పాటు మహిళలూ ఇలాంటి గేమ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. అయితే తల్లిదండ్రుల, కుటుంబీకుల కార్డ్స్ వినియోగించి యూసీ పాయింట్లు ఖరీదు చేయడం, పందేలు కావడం వంటివి మాత్రం కేవలం పురుషులే చేస్తున్నారు. ఇప్పటి వరకు మా దృష్టికి వచి్చన ఉదంతాలు ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. యువతులు, మహిళలు గేమ్స్ ఆడుతున్నా..డబ్బు చెల్లించాల్సి వస్తే వాటికి దూరంగా ఉంటున్నారు. – జి.రాజేంద్రన్, సైబర్ నిపుణుడు -
ఈ–గేమింగ్ కట్టడిపై కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: దేశీయంగా ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని కట్టడి చేసేందుకు స్వతంత్ర నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయడంపై కేంద్ర ఎల్రక్టానిక్స్, సమాచార మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నేషనల్ లా యూనివర్సిటీ, ఈ–గేమింగ్ ఫెడరేషన్ కలిసి పరిశ్రమవర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నిర్దిష్ట ప్రతిపాదనలను సమర్పించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పరిశ్రమ మెరుగైన నిర్వహణ కోసం నియంత్రణ ఉండక తప్పదని ఎన్ఎల్యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాఘవ్ పాండే తెలిపారు. అయితే, ఇటు పరిశ్రమ వృద్ధికి దోహదపడటం, అటు నియంత్రించడం మధ్య సమతౌల్యం కూడా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమ, ఇతర నియంత్రణ సంస్థలతో సంప్రదింపులతో పాటు నియంత్రించాల్సిన అంశాలపై సమగ్ర అధ్యయనంతోనే తగిన విధానాలను రూపొందించడానికి వీలవుతుందని చెప్పారు. ఆన్లైన్ గేమింగ్‌కి సంబంధించి గేమింగ్ సంస్థలే స్వీయ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలంటూ గతంలో చేసిన ప్రతిపాదనను కేంద్రం పక్కన పెట్టిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశీయంగా డ్రీమ్11, మొబైల్ ప్రీమియర్ లీగ్, డెల్టాటెక్ గేమింగ్, నజారా, గేమ్స్24 గీ7 వంటి పలు సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 3 బిలియన్ డాలర్ల మార్కెట్.. ప్రస్తుతం భారత గేమింగ్ మార్కెట్ దాదాపు 3 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. ఇందులో 80 శాతం వాటా రియల్ మనీ ప్లాట్‌ఫాంలదే ఉంటోంది. అమెరికా, బ్రెజిల్‌ను కూడా దాటేసి భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద గేమింగ్ మార్కెట్‌గా మారినట్లు గేమింగ్ కంపెనీ విన్జో ఇటీవల ఒక నివేదికలో పేర్కొంది. భారత్‌లో 56.8 కోట్ల మంది గేమర్స్ ఉండగా, 2023లో 950 కోట్ల పైచిలుకు గేమింగ్ యాప్ డౌన్లోడ్స్ నమోదైనట్లు వివరించింది. ఇంతటి భారీ స్థాయిలో విస్తరించిన ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ.. మనీలాండరింగ్ స్కాములు, భారీ పన్నుల భారం మొదలైన సమస్యలతో సతమతమవుతోంది. తమ పరిశ్రమకు నియంత్రణ సంస్థను ఏర్పాటు చేస్తే సక్రమంగా నడుస్తున్న వాటికి ఇలాంటి సమస్యలు తగ్గగలవని గేమింగ్ కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో కంపెనీలు కలిసి స్వీయ నియంత్రణ సంస్థలను (ఎస్‌ఆర్‌బీలు) ఏర్పాటు చేసుకోవచ్చంటూ కేంద్రం ప్రతిపాదించింది. అయితే, బడా సంస్థలు సదరు ఎస్‌ఆర్‌బీలను ప్రభావితం చేయడానికి, అవి నిజంగానే స్వతంత్రంగా పని చేయడానికి అవకాశాలు తక్కువగా ఉండొచ్చని భావించి స్వతంత్ర నియంత్రణ సంస్థ ఏర్పాటుపై దృష్టి సారించింది. -
ఆన్లైన్ గేమ్‌ల కోసం ప్రభుత్వంతో ఒప్పందం.. ఎందుకంటే..
‘ఎప్పుడు చూసినా మొబైల్లో ఆటలేనా. వేరే పనేమీ లేదా?’- పిల్లలున్న దాదాపు అందరిళ్లలోనూ తల్లిదండ్రుల మందలింపు వినిపిస్తుంటుంది. ‘ఐదే నిమిషాలు..!’ అంటూ పిల్లలు బతిమాలటం. ఆ ఐదు నిమిషాలు కాస్తా అరగంట, గంట అవటం సర్వసాధారణం. ‘అసలు ఇంతకీ వాళ్లేమి ఆడుతున్నారో’నని ఒకసారి చూసిన పెద్దోళ్లు సైతం మొబైల్ గేమ్స్ మాయలో పడిపోవటం తరచూ జరిగేదే. ఆడినంత సేపూ అందులోనే మమేకమై, ప్రపంచాన్ని మరిచిపోవడం ఆన్లైన్ గేముల ప్రత్యేకత. కష్టపడకుండా ఫోన్లో ఆన్లైన్ గేమ్ ఆడితే చాలు..గెలిస్తే డబ్బు లు మీసొంతం అంటూ యూజర్లను ఆకట్టుకుంటుండటంతో చిన్నా పెద్ద తేడా లేకుండా చాలా మంది ఆన్లైన్ గేమింగ్‌కు అలవాటు పడ్డారు. ఇందులో సంపాదించేది కొందరైతే .. నమ్మి డబ్బు పెట్టి నష్టపోయేవారు ఎందరో.. అటువంటి ఈ ఆన్ లైన్ గేమ్‌లపై అప్పట్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ కూడా నిబంధనలు ప్రకటించింది. అయితే తాజాగా గేమింగ్ ఇండస్ట్రీ బాడీ ‘ఈ-గేమింగ్ ఫెడరేషన్ (ఈజీఎఫ్)’ బాధ్యతాయుతమైన గేమింగ్‌ను ప్రోత్సహించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆటగాళ్ల రక్షణకు కట్టుబడి బాధ్యతయుతమైన గేమింగ్ పద్ధతుల గురించి అవగాహన కల్పించడం, ఆటగాళ్లకు సురక్షితమైన వాతావరణం పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకుంది. ఆన్లైన్లో ఆడుతున్నప్పుడు మంచి సమాచారంతో నిర్ణయాలు తీసుకునేలా యువతకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: గూగుల్‌లో వేతనాలు మూడు రెట్లు పెంపు! ఎందుకో తెలుసా? భారత దేశంలోని మొదటి మూడు ఆన్లైన్ గేమింగ్ రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ముంబైలో రెండు ఆన్లైన్ గేమింగ్ యునికార్న్ సంస్థలు ఉన్నట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా, ఆన్లైన్ గేమింగ్‌లపై డాక్టర్లు స్పందిస్తూ బాధ్యతారహితమైన గేమింగ్ వల్ల ఏకాగ్రత తగ్గుతుందని, సులువుగా కోపం, చిరాకు పడడం, దీర్ఘకాలిక ఆందోళన , డిప్రెషన్‌కు దారి తీస్తుందని చెబుతున్నారు. -
మరోసారి గెలుచుకునేదానిపైనా జీఎస్టీ ఉంటుందా? ఆర్థిక మంత్రి క్లారిటీ..
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్‌లో ప్రారంభ పందేలపై 28% జీఎస్టీ విధింపునకు సంబంధించి విలువ ఆధారిత నిబంధనలు ప్రభావవంతంగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ‘‘ఇందుకు సంబంధించి వివరణ జారీ అయింది. 28% పన్ను రేటు అమలవుతుంది. ఇది ఎవరికి వర్తిస్తుంది, ఎవరిపై భారం పడుతుందన్నది వివరంగా పేర్కొనడం జరిగింది. విలువకు సంబంధించి నిబంధనలు విజయాలను మినహాయిస్తున్నాయి. కనుక దీనిపై ఎలాంటి గందరగోళం ఉండదని భావిస్తున్నాను’’అని మంత్రి వివరించారు. దీని ప్రకారం.. ఆన్లైన్ గేమింగ్‌లో గెలుచు కున్న నగదుతో తిరిగి బెట్టింగ్‌లు వేసినప్పుడు వా టిపై 28% జీఎస్టీ అమలు కాదు. స్పష్టంగా చెప్పాలంటే మొదటిసారి బెట్టింగ్‌కు పెట్టే మొత్తంపై 28% జీఎస్టీ చెల్లించాలి. దానిపై గెలుచుకున్న మొత్తాన్ని తిరిగి వెచ్చించినప్పుడు జీఎస్టీ పడదు. లోక్ సభలో జీఎస్టీ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సీతారామన్ మాట్లాడారు. అప్పిలేట్ ట్రిబ్యునల్ ప్రెసిడెంట్, సభ్యుల వయో పరిమితిని ఈ బిల్లులో సవరించారు. ఇందుకు సంబంధించి ఆర్థిక మంత్రి ఓ ఉదాహరణను కూడా వినిపించారు. ‘‘ఒక వ్యక్తి రూ.1,000 బెట్ చేసి, దానిపై రూ.300 గెలుచుకుని.. ఆ తర్వాత రూ.1,300తో మరోసారి గెలుచుకునే మొత్తంపై జీఎస్టీ పడదు’’అని వివరించారు. -
డబ్బుకు డబ్బు.. అవకాశాలు, గేమింగ్ ఇండస్ట్రీపై తల్లిదండ్రుల ధోరణి ఇలా
న్యూఢిల్లీ: దేశంలో ఈ స్పోర్ట్స్ పరిశ్రమ వృద్ధి బాట నడుస్తుండడం, గేమర్లకు విస్తృతమైన కెరీర్ అవకాశాలతోపాటు, ఆదాయాలను పెంచుతున్నట్టు హెచ్‌పీ ఇండియా నిర్వహించిన గేమర్స్ ల్యాండ్‌స్కేప్ స్టడీ, 2023 పేర్కొంది. దేశవ్యాప్తంగా 15 పట్టణాల నుంచి 3,000 గేమర్ల (గేమ్‌లు ఆడేవారు) అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. విశ్రాంతి కోసమే కాకుండా, ఆర్జనకు, గుర్తింపునకు గేమింగ్‌ను సాధనంగా చూస్తున్నారు. గేమింగ్ పట్ల తల్లిదండ్రుల్లోనూ సానుకూల ధోరణి నెలకొంటున్నట్టు ఈ సర్వే గుర్తించింది. సర్వేలో 500 మంది తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా తెలుసుకుంది. ►గేమ్‌లను సీరియస్‌గా ఆడేవారు ఏటా కనీసం రూ.6 లక్షలు సంపాదిస్తున్నారు. ►2022తో పోలిస్తే 2023లో గేమింగ్‌పై ఆదాయం పెరిగింది. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది సీరియస్ గేమర్లు (గేమింగ్‌ను ఉపాధిగా తీసుకున్న వారు) రూ.6–12 లక్షల మధ్య ఆదాయం సంపాదిస్తున్నామని చెప్పారు. ►67 శాతం మంది మొబైల్ ఫోన్ కంటే కంప్యూటర్లోనే గేమ్ ఆడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ►స్పాన్సర్షిప్, ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్లు గణనీయమైన ఆదాయ వనరులుగా మారాయి. గేమింగ్‌కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఇవి తెలియజేస్తున్నాయి. ►గేమింగ్‌ను ఒక అలవాటుగా 42 శాతం మంది తల్లిదండ్రులు అంగీకరిస్తున్నారు. ఈ పరిశ్రమకు ఉన్న వృద్ధి అవకాశాలతో గేమింగ్ పట్ల తమ దృక్పథంలో మార్పు వచ్చిందని 40 శాతం మంది చెప్పారు. ►అదే సమయంలో గేమింగ్ అవకాశాల పట్ల తల్లిదండ్రులకు సరైన సమాచారం కూడా లేదని తెలిసింది. దీనికి సంబంధించిన సమాచారం కోసం 49 శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యులపై ఆధారపడుతున్నారు. ►గేమింగ్ కెరీర్లో స్థిరత్వం, సామాజికంగా ఒంటరి కావడంపై ఆందోళన వ్యక్తమైంది. ‘‘భారత్ ప్రపంచంలో టాప్–3 పీసీ (కంప్యూటర్) గేమింగ్ కేంద్రాల్లో ఒకటిగా మారింది. ఎప్పటికప్పుడు ఆవిష్కరణలు, అధునాతన ఉపకరణాల ద్వారా గేమర్ల సాధికారతకు మేము కట్టుబడి ఉన్నాం. గేమింగ్ పరిశ్రమను, గేమర్ల ఆకాంక్షలను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఈ అధ్యయనం వీలు కల్పించింది’’అని హెచ్‌పీ ఇండియా మార్కెట్ ఎండీ ఇప్సితాదాస్ గుప్తా తెలిపారు. ‘‘ఈస్పోర్ట్స్ రంగం వేగంగా వృద్ధి చెందుతూ, విభిన్న ఉపాధి అవకాశాలను గేమర్లకు కల్పిస్తుండడం ప్రోత్సాహకరంగా ఉంది. భారతీయ యువత అంతర్జాతీయ ఈస్పోర్ట్స్ విభాగంలో తమ స్థానాన్ని మరింత పెంచుకోవడమే కాకుండా, పరిశ్రమలో వ్యాపార అవకాశాలను కూడా సొంతం చేసుకుంటారని భావిస్తున్నాం’’అని హెచ్‌పీ ఇండియా మార్కెట్ పర్సనల్ సిస్టమ్స్ సీనియర్ డైరెక్టర్ విక్రమ్ బేడి పేర్కొన్నారు. -
ఆన్లైన్ గేమింగ్ కంపెనీలపై పన్ను పిడుగు
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ కంపెనీలపై పన్ను పిడుగు పడింది. పన్ను ఎగవేతకు సంబంధించి రూ.లక్ష కోట్ల మేర చెల్లించాలని కోరుతూ జీఎస్టీ అధికారులు షోకాజు నోటీసులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అక్టోబర్ 1 తర్వాత భారత్‌లో నమోదు చేసుకున్న విదేశీ గేమింగ్ కంపెనీలకు సంబంధించి డేటా లేదన్నారు. విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహించే గేమింగ్ కంపెనీలు, జీఎస్టీ చట్టం కింద నమోదు చేసుకోవడాన్ని అక్టోబర్ 1 నుంచి కేంద్రం తప్పనిసరి చేసింది. ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో బెట్టింగ్ పూర్తి విలువపై 28 శాతం పన్ను వసూలు చేస్తామని జీఎస్టీ కౌన్సిల్ ఆగస్ట్‌లోనే స్పష్టం చేయడం గమనార్హం. డ్రీమ్11, డెల్టా కార్ప్ తదితర సంస్థలు భారీ మొత్తంలో పన్ను చెల్లింపులకు సంబంధించి గత నెలలో షోకాజు నోటీసులు అందుకోవడం తెలిసిందే. గేమ్స్క్రాఫ్ట్ సంస్థ రూ.21,000 కోట్ల పన్ను ఎగవేసిందంటూ గతేడాది జీఎస్టీ అధికారులు షోకాజు నోటీసులు జారీ చేశారు. దీంతో సంస్థ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి, సానుకూల ఆదేశాలు పొందింది. దీనిపై కేంద్ర సర్కారు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు డ్రీమ్11 సంస్థ రూ.40,000 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించి షోకాజు నోటీసులు అందుకుంది. డెల్టా కార్ప్, దాని అనుబంధ సంస్థలకు రూ.23,000 కోట్లకు సంబంధించి షోకాజు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులపై డెల్టాకార్ప్ బోంబే హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. న్యాయస్థానాలు ఇచ్చే తదుపరి ఆదేశాలకు అనుగుణంగా పన్ను వసూళ్లు ఆధారపడి ఉన్నాయి. -
వచ్చే ఐదేళ్లలో భారత డిజిటల్ గేమింగ్ మార్కెట్ ఎంతంటే..
‘ఎప్పుడు చూసినా మొబైల్లో ఆటలేనా. వేరే పనేమీ లేదా?’- పిల్లలున్న దాదాపు అందరిళ్లలోనూ తల్లిదండ్రుల మందలింపు వినిపిస్తుంటుంది. ‘ఐదే నిమిషాలు..!’ అంటూ పిల్లలు బతిమాలటం. ఆ ఐదు నిమిషాలు కాస్తా అరగంట, గంట అవటం సర్వసాధారణం. ‘అసలు ఇంతకీ వాళ్లేమి ఆడుతున్నారో’నని ఒకసారి చూసిన పెద్దోళ్లు సైతం మొబైల్ గేమ్స్ మాయలో పడిపోవటం తరచూ జరిగేదే. ఆడినంత సేపూ అందులోనే మమేకమై, ప్రపంచాన్ని మరిచిపోవడం ఆన్లైన్ గేముల ప్రత్యేకత. డిజిటల్ టెక్నాలజీ విస్తరిస్తున్న కొద్దీ చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ ఆన్లైన్ ఆటల్లో మునిగితేలుతున్నారు. తమకు నచ్చిన క్యారక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేసి కేరింతలు కొడుతున్నారు. అందరినీ ఇంతగా ప్రభావితం చేస్తోన్న ఆ ఆటల రూపకల్పన వెనుక ఎందరో నిపుణుల సృజనాత్మకత దాగి ఉంది. దాంతోపాటు ఆన్లైన్ గేమ్‌ల ద్వారా దేశీయంగా కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న సంస్థలు రోజూ పుట్టుకొస్తున్నాయి. భారత్‌లోని డిజిటల్ గేమింగ్ మార్కెట్ రానున్న ఐదేళ్లలో 750 కోట్ల డాలర్ల (దాదాపు రూ.62,250 కోట్ల) స్థాయికి చేరుకోనుంది. ప్రధానంగా యాప్‌ల కొనుగోళ్లు, ప్రకటనల రాబడులు, వినియోగదారుల సంఖ్య పెరగడం ఇందుకు కారణమని గేమింగ్ వెంచర్ క్యాపిటల్ సంస్థ లుమికై తన నివేదికలో వెల్లడించింది. గురువారం హైదరాబాద్‌లో 15వ ఇండియా గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (ఐజీడీసీ) ప్రారంభమైంది. దాదాపు 100కు పైగా సంస్థలు తమ గేమింగ్ ఉత్పత్తులను ఈ కార్యాక్రమంలో ప్రదర్శిస్తున్నాయి. నవంబర్ 4 వరకు జరిగే ఈ కార్యక్రమంలో డిజిటల్ గేమింగ్ రంగంలోని నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ సందర్భంగా లుమికై, గూగుల్ సంయుక్త భాగస్వామ్యంలో ‘లుమికై స్టేట్ ఆఫ్ ఇండియా గేమింగ్ రిపోర్ట్ 2023’ నివేదికను విడుదల చేసింది. ఇదీ చదవండి: కొన్నే ఉద్యోగాలు.. వందల్లో ఉద్యోగార్థులు.. వీడియో వైరల్ నివేదిక తెలిపిన వివరల ప్రకారం..దేశంలో 56.8 కోట్ల మంది గేమర్లు ఉన్నారు. ఇందులో 25 శాతం మంది చెల్లింపులు చేస్తున్నారు. భారత్‌లో మొత్తం డిజిటల్ గేమ్‌లు ఆడేవారిలో మహిళలు 41శాతం, పురుషులు 59 శాతం ఉన్నారు. 18-30 ఏళ్లవారు 50శాతం మంది, 31-45 ఏళ్లలోపు 29శాతం మంది, 45 ఏళ్లు దాటిన గేమర్లు 21శాతం ఉన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ గేమింగ్ పరిశ్రమ 310 కోట్ల డాలర్ల (రూ.26,000 కోట్ల) ఆదాయం సంపాదించింది. రానున్న ఐదేళ్లలో ఇది రెట్టింపు అవుతుందని అంచనా. రియల్ మనీ గేమింగ్ ఆదాయం వృద్ధిరేటు ఏటా పెరుగుతుంది. ఇంటర్నెట్ వినియోగదారుల్లో 50 శాతానికి పైగా వివిధ డిజిటల్ గేమ్‌లు ఆడుతున్నారు. గత ఏడాది భారత్‌లో గేమర్ల సంఖ్య 12 శాతం పెరిగింది. చెల్లింపులు చేసే గేమర్ల సంఖ్యలో 17 శాతం వృద్ధి కనిపించింది. 15వందల కోట్ల గేమ్ డౌన్లోడ్లతో భారత గేమింగ్ రంగం అంతర్జాతీయ గేమింగ్ పరిశ్రమలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. -
డిసెంబరులో ఇండియా ఏఐ సదస్సు
నోయిడా: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆన్లైన్ గేమింగ్ విభాగాలు 2026–27 నాటికి భారత స్థూల జాతీయోత్పత్తికి (జీడీపీ) 300 బిలియన్ డాలర్ల వరకు సమకూరుస్తాయని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. 2026–27 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఒక ట్రిలియన్ డాలర్లు ఉండాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఇందులో ఏఐ చాలా ముఖ్యమైన భాగం అని భావిస్తున్నామని, అందుకే ప్రధాని నరేంద్ర మోదీ ’ఇండియా ఏఐ’ కార్యక్రమాన్ని ప్రారంభించారని వివరించారు. ఇండియా ఏఐ 2023 పేరుతో ఈ ఏడాది డిసెంబర్ 10న అంతర్జాతీయ సదస్సును ప్రభుత్వం నిర్వహించనుందని వెల్లడించారు. -
ఆన్లైన్ గేమింగ్‌లపై 28 శాతం జీఎస్టీ
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు బెట్టింగ్‌ల పూర్తి విలువపై 28 శాతం జీఎస్టీని ఈరోజు(అక్టోబర్ 1వ తేదీ) నుంచి వసూలు చేయనున్నాయి. ఈ రంగంలో విదేశాల నుంచి భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు జీఎస్టీ రిజి్రస్టేషన్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫై చేసింది. సెంట్రల్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ చట్టాలలో సవరించిన నిబంధనలకు అక్టోబర్ 1వ తేదీని అపాయింటెడ్ డేట్‌గా ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫై చేసింది. కేంద్ర జీఎస్టీ చట్టంలోని మార్పుల ప్రకారం ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందాలను ఇక నుంచి లాటరీ, బెట్టింగ్, జూదం మాదిరిగా పరిగణిస్తారు. ఆఫ్‌షోర్ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు భారత్‌లో రిజిస్ట్రేషన్ తీసుకోవడంతోపాటు దేశీయ చట్టానికి అనుగుణంగా 28 శాతం పన్ను చెల్లించడం తప్పనిసరి చేసింది. రిజిస్ట్రేషన్, పన్ను చెల్లింపు నిబంధనలను పాటించడంలో విఫలమైతే విదేశాలలో ఉన్న ఆన్లైన్ గేమింగ్ కంపెనీలను నిరోధించేందుకు ఈ సవరణలు వీలు కల్పిస్తాయి. కాగా, ఆర్థిక శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాకు ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ లేఖ రాసింది. 15 రాష్ట్రాలు స్టేట్ జీఎస్టీ చట్టాల్లో మార్పులు ఇంకా చేయలేదని.. ఆయా రాష్ట్రాల ఆటగాళ్ల నుండి పొందిన డిపాజిట్లపై ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు అనుసరించాల్సిన జీఎస్టీ విధానం ఏమిటో తెలపాలని లేఖలో కోరింది. ఈ నోటిఫికేషన్లను పునఃపరిశీలించాలని, జీఎస్టీ స్కీమ్, భారత సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలు తమ సంబంధిత సవరణలను ఆమోదించే వరకు వాటిని నిలిపివేయాలని కేంద్రాన్ని అభ్యర్థించింది. ఈలోగా తాము పేర్కొన్న సమస్యలను అవసరమైన వివరణలతో పరిష్కరించాలని కోరింది. -
‘ఇలా వేధించడం తగదు’.. కేంద్రంపై అశ్నీర్ ఆగ్రహం
ప్రముఖ ఫాంటసీ గేమింగ్ యాప్ ‘క్రిక్‌పే’ ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్ ట్యాక్స్ ఉన్నతాధికారులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బకాయల పేరుతో వ్యాపారస్తుల్ని వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల డైరెక్టరేట్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) విభాగం ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ (ఆర్ఎంజీ) కంపెనీలకు జీఎస్టీ డైరెక్టర్ జనరల్ గట్టి షాకిచ్చింది. రూ. 55,000 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాలంటూ దాదాపు 12 ఆర్ఎంజీ కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారిచేసింది. ఆ నోటీసులపై అశ్నీర్ గ్రోవర్ స్పందించారు. డీజీజీఐ విభాగాన్ని నిర్వహిస్తున్న వారి లక్ష్యం కేవలం వ్యాపారస్తులను వేధించడమే’ అని అన్నారు. షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ ప్రజలు భారీ పన్నులు చెల్లించరని, ప్రభుత్వం సైతం చెల్లించదు..కేవలం వాటిని సేకరించగలదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అలా.. బీజేపీ ఇలా దీనిని 'రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్' (గత లావాదేవీలకు వర్తించే విధంగా) అని పిలుస్తున్నారు. కాంగ్రెస్ వోడాఫోన్ రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ విధించగా, బీజేపీ గేమింగ్ జీఎస్టీ రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్‌ను తీసుకొచ్చింది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వ దృక్పథానికి సహాయం చేయదని, ఈ సమస్యను పరిష్కరించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు. జీఎస్టీ నిర్ణయంపై అసంతృప్తి ఆన్లైన్ గేమింగ్ కంపెనీల టర్నోవర్‌పై 28 శాతం వస్తు సేవల పన్ను విధిస్తూ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జిఎస్టి) కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని గ్రోవర్ తప్పుబట్టారు. ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమపై 28 శాతం జీఎస్టీ విధించడం వల్ల కొత్త గేమ్‌లలో పెట్టుబడి పెట్టే వారి సామర్థ్యాన్ని పరిమితం చేస్తుందని, ట్రాన్సాక్షన్లు, అలాగే వ్యాపార విస్తరణపై ప్రభావం చూపుతుందన్నారు. . అశ్నీర్ గ్రోవర్ ఏం చేస్తున్నారు? భారత్ పే కో-ఫౌండర్‌గా ఆ సంస్థలో విధులు నిర్వహించే సమయంలో అశ్నీర్ గ్రోవర్, ఆయన భార్య మాధురి జైన్ గ్రోవర్లు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అశ్నీర్ను, ఆయన భార్యను భారత్ పే బోర్డ్ యాజమాన్యం ఆ సంస్థ నుంచి తొలగించింది. ఆ తర్వాత ఈ ఏడాది క్రిక్‌పే పేరుతో సొంత ఫాంటసీ గేమింగ్ సంస్థను ప్రారంభించారు. -
ఆ యాడ్‌తో బాద్షాకి చిక్కులు
ముంబై: బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ చిక్కుల్లో ప డ్డారు. ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినందుకు ఆయన ఇల్లు ముట్టడికి కొందరు విఫలయత్నం చేశారు. ఆన్లైన్ జూదాన్ని ప్రోత్సహించేలా షారూక్ వ్యవహరించడం వారికి మింగుడు పడడం లేదు. అన్‌టచ్ ఇండియా ఫౌండేషన్‌కు చెందిన కొందరు బాంద్రాలోని షారూక్ ఇంటి బయట నిరసనలకు దిగడానికి చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. షారూక్ ఇంటికి గట్టి భద్రత ఏర్పాటు చేసి కొందరు యువకుల్ని అదుపులోనికి తీసుకున్నారు. ఏ23 అనే ఆన్లైన్ రమ్మీ పోర్టల్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న షారూక్ ఇటీవల దానికి సంబంధించిన ఒక వాణిజ్యప్రకటన(యాడ్)లో నటించారు. ఆ యాడ్‌లో ‘పదండి కలిసి ఆడదాం’ అని షారూక్ వ్యాఖ్యానిస్తారు. ఈ అడ్వర్టయిజ్‌మెంట్‌పై అన్‌టచ్ యూత్ పౌండేషన్ తీవ్ర స్థాయిలో మండిపడింది. జంగ్లీ రమ్మీ, జూపీ వంటి ఆన్లైన్ గేమింగ్ యాప్స్ యువతని పక్కదారి పట్టిస్తున్నాయని అన్‌టచ్ ఇండియా ఫౌండేషన్ విమర్శించింది. -
లూడో తెచ్చిన ముప్పు: లక్షలు గోవిందా! చివరికి..!
Online Gaming Ludo Bangalore Woman ఆన్లైన్ గేమ్‌కు బానిసైన మహిళ లక్షలు పోగొట్టుకున్న వైనం ఆందోళన రేపింది. ఇటీవలి కాలంలో ఆన్లైన్ గేమింగ్ ఒక వ్యసనంలా మారిపోతోంది. ఈక్రమంలో భారీగా నష్టపోతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా బెంగళూర్‌కు చెందిన ఓ మహిళ ఏకంగా రూ. 4 లక్షలు పోగొట్టుకుంది. అంతేకాదు ఇద్దరు పిల్లల తల్లి అయిన మహిళ కొంత నగదుతో సహా ఇంటి నుంచి పారిపోవడం మరింత సంచలనం రేపింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథన ప్రకారం బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల వివాహిత ఆన్లైన్ గేమింగ్‌కు బానిసైంది. ఈ క్రమంలో లూడో ఆడుతూ రూ.4 లక్షలకు పైగా పోగొట్టు కుంది. అయితే ఆన్‌లైనింగ్ వ్యసనం గత ఏడాదినుంచే ఉంది. అప్పులు చేసి, బంగారం తాకట్టు పెట్టిమరీ ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ ఉండటం అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలో గతంలో రూ. 50వేల పోగొట్టుకుంది. రూ. 1.25 లక్షల విలువైన తన బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టింది. అంతేకాదు,కుటుంబ సభ్యులు భర్తకు చెప్పకుండా బంధువుల వద్ద రూ.1.75 లక్షలు అప్పు తీసుకోవడం గమనార్హం. అయితే విషయం తెలిసిన భర్త ఆమెను మందలించాడు. మళ్లీ అలాంటి పొరపాటు జరగదని భర్తకు హామీ ఇచ్చింది. కానీ ఈ ఏడాది జూలైలో ఆన్లైన్లో లూడో ఆడేందుకు ఆ మహిళ మరోసారి తన బంగారు ఆభరణాలను రూ.1.20 లక్షలకు తాకట్టు పెట్టింది. ఈసారి ఏకంగా నాలుగు లక్షల రూపాయలు స్వాహా అయిపోయాయి. దీంతో ఆమె భర్త జోక్యం చేసుకుని భార్య తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో వారు కూడా గేమ్‌ను కొనసాగించవద్దని మందలించారు. దీంతో ఆ మహిళ ఆగస్టు 8న, ఇంట్లో ఉన్న నగదుతో పాటు ఇద్దరు పిల్లలనూ తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. "నేను క్షమాపణలు కోరుతున్నాను, నేను ఇంట్లో ఉంచిన డబ్బు తీసుకుంటున్నాను, దయచేసి నన్ను క్షమించు" అంటూ ఒక నోట్ కూడా పెట్టి ంది. దీంతో ఇక చేసేదేమీ లేక .భర్త పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారిఆచూకీ కోసం అన్వేషిస్తున్నారు. -
జీఎస్టీ మార్పులకు కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందెం క్లబ్‌లలో బెట్టింగ్‌ల ప్రవేశ స్థాయి పూర్తి ముఖ విలువపై 28 శాతం పన్ను విధించేలా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టాల్లో మార్పులకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపిందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ ), ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) చట్టాల్లో సవరణలకు ఆగస్టు 2వ తేదీన జరిగిన 51వ జీఎస్టీ మండలి భేటీలో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. సంబంధిత చట్ట సవరణలను ఆగస్టు 11న ముగియనున్న ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టవచ్చని ఆ వర్గాలు వెల్లడించాయి. ప్రవేశ స్థాయి పందెం పూర్తి ముఖ విలువపై 28% జీఎస్టీ విధించడం వల్ల ఈ పన్ను రాబడులు పెరుగుతాయి. రిజి్రస్టేషన్, పన్ను చెల్లింపు నిబంధనలను పాటించడంలో విఫలమైతే, విదేశాల్లోని ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ నిరోధించడం కూడా సవరణల్లో భాగంగా ఉన్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అక్టోబర్ నుంచి అమల్లోకి జీఎస్టీ చట్టాలలో సవరించిన నిబంధనలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తాయి. ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ మనీ గేమింగ్లతోపాటు ఆన్లైన్ గేమ్‌లకు చెల్లించడానికి ఉపయోగించే వర్చువల్ డిజిటల్ అసెట్స్ అలాగే ఆన్లైన్ గేమింగ్ విషయంలో సప్లయర్ వంటి పదాలకు తాజా సవరణలలో విస్పష్ట నిర్వచనాలు కూడా ఉండడం గమనార్హం. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ప్రతినిధులతో కూడిన ఆగస్టు 2 మండలి సమావేశం అనంతరం, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సీజీఎస్టీ, ఐజీఎస్టీ సవరణలు ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ నిర్ణయాల విషయంలో రాష్ట్రాలు తమ తమ అసెంబ్లీలలో రాష్ట్ర జీఎస్టీ చట్టానికి సవరణలను ఆమోదిస్తాయి. ప్రస్తుత పన్నుల తీరు ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ, కొన్ని గుర్రపు పందెం క్లబ్‌లు ప్రస్తుతం ప్లాట్‌ఫారమ్ ఫీజు/కమీషన్ (5– 20%) పూర్తి ముఖ విలువలో 18% చొప్పున జీఎస్టీని చెల్లిస్తున్నాయి. అయితే కొన్ని గుర్రపు పందెం క్లబ్‌లు పూర్తి ముఖ విలువపై 28% చెల్లిస్తున్నాయి. బెట్టింగ్, జూదం రూపంలో చర్య తీసుకోగల క్లెయిమ్‌లపై విధిస్తున్న ఈ తరహా 28% లెవీపై ఆయా క్లబ్‌లు న్యాయపోరాటం చేస్తున్నాయి. క్యాసినోలూ ప్రస్తుతం స్థూల గేమింగ్ రెవెన్యూ (జీజీఆర్)పై 28% జీఎస్టీ చెల్లిస్తున్నాయి. ప్రవేశ స్థాయి పందెం పూర్తి ముఖ విలువపై 28% జీఎస్టీ వల్ల ఖజానాకు మరింత మొత్తం సమకూరనుంది. -
ఆన్లైన్ గేమింగ్: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్, క్యాసినోల్లో బెట్టింగ్ ముఖ విలువపై 28 శాతం జీఎస్టీ అమలు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ బుధవారం నిర్ణయించింది. ఢిల్లీ, గోవా, సిక్కిం రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా, ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ.. జీఎస్టీ కౌన్సిల్ ఈ విషయంలో మందుకే వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ప్రస్తుత సమావేశాల్లోనే సెంట్రల్ జీఎస్టీలో సవరణలకు సంబంధించి కేంద్ర సర్కారు బిల్లును ప్రవేశపెట్టనుంది. అనంతరం రాష్ట్రాల అసెంబ్లీలు సవరణలకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. (నితిన్ దేశాయ్ అకాల మరణం: అదే కొంప ముంచింది!) వచ్చే అక్టోబర్ 1 నుంచి చట్ట సవరణలు అమల్లోకి రానున్నాయి. ‘‘ఆడేవారి తరఫున చెల్లించిన మొత్తం ఆధారంగా విలువ నిర్ణయించడం జరుగుతుంది. ముందు ఆటలో గెలిచిన మొత్తాన్ని మళ్లీ పందెంలో పెడితే దాన్ని జీఎస్టీ నుంచి మినహాయిస్తారు. ఆరంభంలో పెట్టే మొత్తంపైనే పడుతుంది’’అని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ వివరించారు. ఇందుకు ఓ ఉదాహరణ కూడా చెప్పారు. ‘‘రూ.1,000 పందెంలో పెడితే, దీనిపై రూ.300 గెలిస్తే.. అనంతరం ఈ రూ.1,300తో మళ్లీ పందెం కాస్తే గెలిచే మొత్తంపై జీఎస్టీ విధించరు’’ అని వివరించారు. ఆన్లైన్ గేమింగ్‌పై జీఎస్టీని అమలు చేసిన 6 నెలల తర్వాత (2024 ఏప్రిల్‌లో) సమీక్షిస్తామని మంత్రి తెలిపారు. ఆఫ్‌షోర్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు జీఎస్టీ వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుందని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా చెప్పారు. నిబంధనలు పాటించని పోర్టళ్లను బ్లాక్ చేస్తామని హెచ్చరించారు. (రూ. 26,399కే యాపిల్ ఐఫోన్14: ఎలా? ) -
ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు.. జీఎస్టీ తగ్గించాలని లేఖ
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ తమపై ఇటీవల విధించిన 28 శాతం జీఎస్టీని తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరింది. అధిక పన్ను భారం చట్టవిరుద్ధమైన గేమింగ్ సంస్థలను పరోక్షంగా ప్రోత్సహించినట్టు అవుతుందని పేర్కొంది. చట్టవిరుద్ధమైన, ఆఫ్‌షోర్ గేమింగ్ సంస్థలకు ఎలాంటి పన్ను భారం ఉండదని, ప్రభుత్వ నిర్ణయం చట్ట పరిధిలో పనిచేసే ఆన్లైన్ గేమింగ్ సంస్థలను రిస్క్‌లోకి నెడుతుందని ఇండియన్ గేమర్స్ యునైటెడ్ ఆందోళన వ్యక్తం చేసింది. టైర్–2, 3 పట్టణాల్లోని ఆన్లైన్ గేమర్స్‌తో కూడిన ఈ అసోసియేషన్ ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ఓ లేఖ రాసింది. గ్యాంబ్లింగ్‌కు, స్కిల్ గేమింగ్‌కు స్పష్టమైన వ్యత్యాసం చూపించాలని సూచించింది. అన్ని రకాల గేమింగ్ సంస్థలను 28 శాతం పన్ను పరిధిలోకి తీసుకొస్తూ ఈ నెల మొదట్లో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గుర్రపు పందేలు, జూదం వంటి అదృష్టాన్ని పరీక్షించుకునే గేమ్‌లు, నైపుణ్యాలతో కూడిన గేమ్‌లను ఒకే గాటన కట్టొద్దంటూ, ఈ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని తిరిగి సమీక్షించాలని అసోసియేషన్ కోరింది. పన్ను పరంగా అనుకూలంగా ఉండేలా పరిశ్రమ పట్ల వ్యవహరించాలని సూచించింది. ఆన్లైన్ స్కిల్ గేమింగ్‌లను యువత తమ గేమింగ్ నైపుణ్యాలతో ఆడుతూ, కొంత ఆదాయాన్ని ఆర్జిస్తోందని వివరిస్తూ.. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నట్టు తెలిపింది. 28 శాతం జీఎస్టీ అనేది ఎదుగుతున్న ఆన్లైన్ స్కిల్ గేమింగ్ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. మరోవైపు బుధవారం సమావేశమయ్యే జీఎస్టీ కౌన్సిల్.. గేమింగ్ పరిశ్రమకు సంబంధించి 28 శాతం జీఎస్టీ అమలు విధి విధానాలను ఖరారు చేయనుంది. -
ఆన్లైన్ గేమింగ్‌లో పెట్టుబడులకు విఘాతం
న్యూఢిల్లీ: రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్‌పై 28 శాతం పన్ను విధించాలన్న జీఎస్టీ మండలి నిర్ణయంతో పెట్టుబడులకు తీవ్ర విఘాతం కలుగుతుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పటివరకు చేసిన 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రైటాఫ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీకి దేశ, విదేశాలకు చెందిన 30 ఇన్వెస్ట్మెంట్ సంస్థలు సంయుక్తంగా లేఖ రాశాయి. అలాగే, వచ్చే 3–4 ఏళ్లలో రాబోయే సుమారు 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులపైనే ప్రభావం పడుతుందని పేర్కొన్నాయి. లేఖ రాసిన ఇన్వెస్టర్లలో పీక్ ఫిఫ్టీన్ క్యాపిటల్, టైగర్ గ్లోబ ల్, డీఎస్టీ గ్లోబల్, ఆల్ఫా వేవ్ గ్లోబల్ మొదలైనవి ఉన్నాయి. జీఎస్టీ మండలి నిర్ణయం తమను షాక్‌కు గురి చేసిందని, ఇలాంటి వాటి వల్ల గేమింగ్‌పై మాత్రమే కాకుండా భారత్‌లో ఇతరత్రా వర్ధమాన రంగాలపైనా ఇన్వెస్టర్ల విశ్వాసం సన్నగిల్లుతుందని అవి తెలిపాయి. -
జీఎస్టీ పెంపు: ఇలా అయితే డిజిటల్ ఎకానమీ ఎలా?
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్‌పై 28 శాతం పన్ను విధించాలన్న జీఎస్టీ మండలి నిర్ణయం.. పరిశ్రమ వృద్ధికి విఘాతం కలిగిస్తుందని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) వ్యాఖ్యానించింది. 2025 నాటికి 1 లక్ష కోట్ల డిజిటల్ ఎకానమీ కావాలన్న భారత్ ఆకాంక్షలకు ఎదురుదెబ్బలాంటిదని పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల పరిశ్రమపై పన్ను భారం 1,000 శాతం మేర పెరుగుతుందని ఐఏఎంఏఐ తెలిపింది. (పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్) ఫలితంగా 2.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులున్న దేశీ ఆన్లైన్ గేమింగ్ స్టార్టప్ వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. కొత్తగా రాబోయే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పూర్తిగా నిలిచి పోయే అవకాశం ఉందని వివరించింది. చట్టబద్ధమైన ఆన్లైన్ గేమింగ్ రంగంపై .. గ్యాంబ్లింగ్ కార్యకలాపాకు సమాన స్థాయిలో పన్ను విధించడం దేశీ పరిశ్రమను దెబ్బతీస్తుందని ఐఏఎంఏఐ పేర్కొంది. కాగా బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సంబంధిత కంపెనీ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా డెల్టా కార్ప్ ఎన్నడూ లేనంతగా నష్టాలను ఎదుర్కొంది. -
కేంద్రంపై విమర్శలు.. రాజకీయాల్లోకి అష్నీర్ గ్రోవర్?
ఫిన్‌టెక్ దిగ్గజం భారత్ పే మాజీ ఫౌండర్ అష్నీర్ గ్రోవర్ రాజకీయాల్లోకి రానున్నారా? లేదంటే రావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తున్నాయి ఇటీవల కాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలు. కేంద్రం ఆన్లైన్ గేమ్స్‌పై 28 శాతం జీఎస్టీని విధించింది. ఈ నిర్ణయాన్ని అష్నీర్ గ్రోవర్ వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ తీరుతో దేశంలో గేమింగ్ ఇండస్ట్రీ కుప్పకూలే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో తమ వాణిని వినిపించేందుకు టెక్నాలజీ స్టార్టప్ ఫౌండర్లు రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉందని ట్వీట్లో పేర్కొన్నారు. RIP - Real money gaming industry in India. If the govt is thinking people will put in ₹100 to play on ₹72 pot entry (28% Gross GST); and if they win ₹54 (after platform fees)- they will pay 30% TDS on that - for which they will get free swimming pool in their living room come… — Ashneer Grover (@Ashneer_Grover) July 11, 2023 గ్రోవర్ మాత్రమే కాదు ఇండియా గేమింగ్ ఫెడరేషన్తో పాటు ఈ-గేమింగ్ ఫెడరేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ (FIFS), ఆన్లైన్ స్కిల్ గేమ్‌లపై జీఎస్టీని 18 శాతం నుండి 28 శాతానికి పెంచడంపై కౌన్సిల్ నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్నాయి. నేనే రాజకీయ నాయకుడిని అయితే అష్నీర్ రాజకీయ రంగ ప్రవేశంపై గతంలోనూ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై కేంద్రం వసూలు చేసే టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) విధానాన్ని వ్యతిరేకించారు. అందులో లోపాల్ని సవరించాలని అన్నారు. అదే సమయంలో తాను రాజకీయ నాయకుడిని అయితే, దేశంలో ఆదాయపు పన్ను రేటును తగ్గించేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరూ 10 నుంచి 15 శాతం ట్యాక్స్ కట్టేలా నిర్ధేశిస్తా. తద్వారా ఇప్పుడు ఎక్కువ పన్నులు కట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే పన్ను తక్కువగా ఎగవేతకు ప్రయత్నించరు. ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని అన్నారు. తాజాగా, మరోమారు పాలిటిక్స్‌పై హాట్ కామెంట్స్ చేయడంపై అష్నీర్ గ్రోవర్ పాలిటిక్స్‌లోకి అడుగు పెడతారేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి👉 ‘విలాసాల రుచి మరిగి’..అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్‌కు మరో ఎదురు దెబ్బ! -
ఆన్లైన్ గేమింగ్‌పై పన్నులు.. ఖరారైతే మరిన్ని పెట్టుబడులు
సియోల్: ఆన్లైన్ గేమింగ్‌పై పన్నులకు సంబంధించిన విధానాలపై జీఎస్టీ కౌన్సిల్ కసరత్తు చేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇవి ఖరారైతే గేమింగ్ విభాగంలోకి గణనీయంగా పెట్టుబడులు రాగలవని ఆమె వివరించారు. దక్షిణ కొరియాలోని సియోల్‌లో ప్రవాస భారతీయుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఇదీ చదవండి: భారత్ ‘గ్రీన్’ పరిశ్రమకు రాయితీ రుణాలు ట్యాక్సేషన్, నియంత్రణ సహా ఆన్లైన్ గేమింగ్‌కు సంబంధించిన వివిధ అంశాలపై జీఎస్టీ మండలి మంత్రుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని ఆమె చెప్పారు. కేపీఎంజీ నివేదిక ప్రకారం 2021లో రూ. 13,600 కోట్లుగా ఉన్న ఆన్లైన్ గేమింగ్ రంగం 2024–25 నాటికి రూ. 29,000 కోట్లకు చేరనుంది. ఆన్లైన్ గేములపై ట్యాక్సేషన్ అంశం రెండేళ్లుగా నలుగుతోంది. ఇతరత్రా బెట్టింగ్ గేమ్‌లతో పోలిస్తే నైపుణ్యాలు అవసరమయ్యే ఆన్లైన్ గేమ్‌ల విషయంలో పన్ను రేటు తక్కువగా ఉండాలన్న డిమాండ్లు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మే నెలాఖరులో లేదా జూన్‌లో జరిగే జీఎస్టీ తదుపరి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోవచ్చు. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల రికార్డు -
బెట్టింగ్ గేమ్‌లపై నిషేధం
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ రంగ నియంత్రణకు సంబంధించి కేంద్రం గురువారం నిబంధనలను ప్రకటించింది. సిసలైన డబ్బులు పెట్టి ఆడేవి, బెట్టింగ్ చేసే గేమ్‌లను నిషేధించింది. అలాగే, ఆన్లైన్ గేమింగ్ రంగం స్వీయ నియంత్రణ విధానాన్ని పాటించాలని సూచించింది. ఈ దిశగా దేశీయంగా ఉపయోగించే గేమ్‌లను ఆమోదించేందుకు తొలుత మూడు స్వీయ నియంత్రణ సంస్థలను (ఎస్ఆర్వో) నోటిఫై చేయనుంది. 2021 ఐటీ చట్టాలకు సవరణగా ఈ నిబంధనలను చేర్చారు. సిసలైన డబ్బుతో పందేలు కాయనివి, వినియోగదారులకు హాని కలిగించే కంటెంట్ ఏదీ ఉండనివి, పిల్లలకు వ్యసనంగా మారని గేమ్స్‌కు అనుమతి ఉంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ‘ఆన్లైన్ గేమింగ్ వృద్ధికి భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయి. అది గణనీయంగా విస్తరించేందుకు ఈ నిబంధనలు తోడ్పడగలవు‘ అని మంత్రి చెప్పారు. కొత్త నిబంధనలు నవకల్పనలకు ఊతమివ్వగలవని, ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందించగలదని పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. గ్యాంబ్లింగ్ ప్లాట్‌ఫాంలను ఏరివేసి, అంతర్జాతీయంగా పరిశ్రమ పోటీపడేలా ప్రోత్సహించగలవని అభిప్రాయపడ్డాయి. నిబంధనల్లో మరిన్ని ముఖ్య అంశాలు.. ► ఆన్లైన్ గేమ్స్‌ను నియంత్రించే ఎస్ఆర్వోల్లో పరిశ్రమ ప్రతినిధులు, గేమర్లు, ఇతరత్రా సంబంధిత వర్గాలు ఉంటాయి. నిబంధనల ప్రకారం ఎస్ఆర్వోల్లో ఒక విద్యావేత్త, సైకాలజీ నిపుణులు, బాలల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న వ్యక్తి లేదా అధికారి ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా నడుచుకోకపోతే ఎస్ఆర్వోలను డీనోటిఫై చేస్తారు. ► గేమింగ్ వ్యసనంగా మారకుండా, ఆర్థికంగా నష్టపోకుండా, మోసాల బారిన పడకుండా యూజర్లను కాపాడేందుకు తగు వ్యవస్థను ఎస్ఆర్వోలు రూపొందించాలి. ఒక గేమింగ్ సెషన్లో సముచిత సమయం దాటితే పదే పదే హెచ్చరిక మెసేజీలు కూడా పంపించే విధంగా అది ఉండాలి. -
గవర్నర్లకు నోరు తప్ప చెవుల్లేవు : స్టాలిన్
చెన్నై: గవర్నర్ల వ్యవహార శైలిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని రాష్ట్రాల గవర్నర్లకి మాట్లాడడానికి నోరు ఉందే తప్ప వినడానికి చెవుల్లేవని వ్యంగ్యస్త్రాలు విసిరారు. అందుకే గవర్నర్లందరూ ఎక్కువగా మాట్లాడుతూ తక్కువగా వింటున్నారని వ్యాఖ్యానించారు. ఆన్లైన్లో జూదం నిరోధక బిల్లుని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వెనక్కి తిప్పి పంపిన నేపథ్యంలో స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉంగలిల్ ఒరువన్ అనే కార్యక్రమంలో గురువారం పాల్గొన్న స్టాలిన్ ప్రజలు వేసే ప్రశ్నలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమాధానాలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాల్లో గవర్నర్లు జోక్యం చేసుకోకూడదని ఇటీవల సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలకు గవర్నర్లు కట్టుబడి ఉన్నారా? అని ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రశ్నకు స్టాలిన్ స్పందిస్తూ కొందరు గవర్నర్ల వ్యవహార శైలి చూస్తుంటే వారికి నోరు ఉందే తప్ప చెవులు లేవని అనిపిస్తోందని అన్నారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో మనీశ్ సిసోడియా అరెస్ట్‌ను ఆయన ప్రస్తావిస్తూ ప్రతిపక్ష పార్టీలను బీజేపీ బహిరంగంగానే ఎలా హెచ్చరిస్తుందో సిసోడియా అరెస్ట్ నిలువెత్తు నిదర్శనమని అన్నారు. రాజకీయ కారణాల కోసం దర్యాప్తు సంస్థల్ని బీజేపీ వాడుకుంటోందని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై ఎన్నికల్లో గెలవడానికి బదులుగా, దర్యాప్తు సంస్థల్ని ప్రయోగించి విజయం సాధించాలని చూడడమేంటని ప్రధాని మోదీకి లేఖ రాసినట్టుగా స్టాలిన్ వెల్లడించారు.