Online Gaming Ludo Bangalore Woman ఆన్‌లైన్ గేమ్‌కు బానిసైన మహిళ లక్షలు పోగొట్టుకున్న వైనం ఆందోళన రేపింది. ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ గేమింగ్ ఒక వ్యసనంలా మారిపోతోంది. ఈక్రమంలో భారీగా నష్టపోతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా బెంగళూర్‌కు చెందిన ఓ మహిళ ఏకంగా రూ. 4 లక్షలు పోగొట్టుకుంది. అంతేకాదు ఇద్దరు పిల్లల తల్లి అయిన మహిళ కొంత నగదుతో సహా ఇంటి నుంచి పారిపోవడం మరింత సంచలనం రేపింది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథన ప్రకారం బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల వివాహిత ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసైంది. ఈ క్రమంలో లూడో ఆడుతూ రూ.4 లక్షలకు పైగా పోగొట్టు కుంది. అయితే ఆన్‌లైనింగ్ వ్యసనం గత ఏడాదినుంచే ఉంది. అప్పులు చేసి, బంగారం తాకట్టు పెట్టిమరీ ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుతూ ఉండటం అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలో గతంలో రూ. 50వేల పోగొట్టుకుంది. రూ. 1.25 లక్షల విలువైన తన బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టింది. అంతేకాదు,కుటుంబ సభ్యులు భర్తకు చెప్పకుండా బంధువుల వద్ద రూ.1.75 లక్షలు అప్పు తీసుకోవడం గమనార్హం.
అయితే విషయం తెలిసిన భర్త ఆమెను మందలించాడు. మళ్లీ అలాంటి పొరపాటు జరగదని భర్తకు హామీ ఇచ్చింది. కానీ ఈ ఏడాది జూలైలో ఆన్‌లైన్‌లో లూడో ఆడేందుకు ఆ మహిళ మరోసారి తన బంగారు ఆభరణాలను రూ.1.20 లక్షలకు తాకట్టు పెట్టింది. ఈసారి ఏకంగా నాలుగు లక్షల రూపాయలు స్వాహా అయిపోయాయి. దీంతో ఆమె భర్త జోక్యం చేసుకుని భార్య తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో వారు కూడా గేమ్‌ను కొనసాగించవద్దని మందలించారు. దీంతో ఆ మహిళ ఆగస్టు 8న, ఇంట్లో ఉన్న నగదుతో పాటు ఇద్దరు పిల్లలనూ తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. "నేను క్షమాపణలు కోరుతున్నాను, నేను ఇంట్లో ఉంచిన డబ్బు తీసుకుంటున్నాను, దయచేసి నన్ను క్షమించు" అంటూ ఒక నోట్ కూడా పెట్టి ంది. దీంతో ఇక చేసేదేమీ లేక .భర్త పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారిఆచూకీ కోసం అన్వేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment