న్యూఢిల్లీ: ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోల్లో బెట్టింగ్ ముఖ విలువపై 28 శాతం జీఎస్‌టీ అమలు చేయాలని జీఎస్‌టీ కౌన్సిల్ బుధవారం నిర్ణయించింది. ఢిల్లీ, గోవా, సిక్కిం రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా, ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ.. జీఎస్‌టీ కౌన్సిల్ ఈ విషయంలో మందుకే వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ప్రస్తుత సమావేశాల్లోనే సెంట్రల్ జీఎస్‌టీలో సవరణలకు సంబంధించి కేంద్ర సర్కారు బిల్లును ప్రవేశపెట్టనుంది. అనంతరం రాష్ట్రాల అసెంబ్లీలు సవరణలకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. (నితిన్ దేశాయ్ అకాల మరణం: అదే కొంప ముంచింది!)
వచ్చే అక్టోబర్ 1 నుంచి చట్ట సవరణలు అమల్లోకి రానున్నాయి. ‘‘ఆడేవారి తరఫున చెల్లించిన మొత్తం ఆధారంగా విలువ నిర్ణయించడం జరుగుతుంది. ముందు ఆటలో గెలిచిన మొత్తాన్ని మళ్లీ పందెంలో పెడితే దాన్ని జీఎస్‌టీ నుంచి మినహాయిస్తారు. ఆరంభంలో పెట్టే మొత్తంపైనే పడుతుంది’’అని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ వివరించారు.
ఇందుకు ఓ ఉదాహరణ కూడా చెప్పారు. ‘‘రూ.1,000 పందెంలో పెడితే, దీనిపై రూ.300 గెలిస్తే.. అనంతరం ఈ రూ.1,300తో మళ్లీ పందెం కాస్తే గెలిచే మొత్తంపై జీఎస్‌టీ విధించరు’’ అని వివరించారు. ఆన్‌లైన్ గేమింగ్‌పై జీఎస్‌టీని అమలు చేసిన 6 నెలల తర్వాత (2024 ఏప్రిల్‌లో) సమీక్షిస్తామని మంత్రి తెలిపారు. ఆఫ్‌షోర్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు జీఎస్‌టీ వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుందని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా చెప్పారు. నిబంధనలు పాటించని పోర్టళ్లను బ్లాక్ చేస్తామని హెచ్చరించారు. (రూ. 26,399కే యాపిల్ ఐఫోన్14: ఎలా? )
Comments
Please login to add a commentAdd a comment