భారతీయ ఈస్పోర్ట్స్ రంగంలో ఔత్సాహిక ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి క్రాఫ్టన్(Krafton) ఇండియా ఈస్పోర్ట్స్(Esports) ‘రైజింగ్ స్టార్’ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక ఈస్పోర్ట్స్ అథ్లెట్లను గుర్తించడం, శిక్షణ ఇవ్వడం, వారికి సమగ్ర అభివృద్ధి అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవాలని కంపెనీ తెలిపింది.
రైజింగ్ స్టార్ ప్రోగ్రామ్‌లో పాల్గొనేవారికి సమగ్ర అభివృద్ధి అనుభవాన్ని అందించనున్నారు. గేమింగ్ నైపుణ్యాలను పెంచడంతోపాటు కంటెంట్ సృష్టి, మానసిక శ్రేయస్సు, సమతుల్య జీవనశైలి నిర్వహణపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారికి పరిశ్రమకు చెందిన కొంతమంది టాప్ ఎక్స్‌పర్ట్స్ నుంచి సలహాలు, సూచనలు అందిస్తారు. వారి సామర్థ్యాలను మెరుగుపరచడానికి, ఈస్పోర్ట్స్ లో దీర్ఘకాలిక విజయాల కోసం బలమైన పునాదిని ఏర్పరుచుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి: గగనతలంలోకి 16.13 కోట్ల మంది
రైజింగ్ స్టార్ ప్రోగ్రామ్‌కు అర్హత సాధించడానికి దరఖాస్తుదారులు యూట్యూబ్, ఫేస్‌బుక్ లేదా ఇతర స్ట్రీమింగ్ సర్వీసెస్ వంటి ప్లాట్‌ఫామ్‌ల్లో కనీసం 1,000 మంది ఫాలోవర్లు లేదా సబ్‌స్క్రైబర్లను కలిగి ఉండాలి. బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ)కు సంబంధించిన కంటెంట్‌ను క్రమం తప్పకుండా తయారు చేస్తుండాలి. అభ్యర్థుల వయసు కనీసం 16 ఏళ్లు ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment