గగనతలంలోకి 16.13 కోట్ల మంది | India domestic air traffic experienced surge in 2024 record high of 16.13 crore passengers | Sakshi
Sakshi News home page

గగనతలంలోకి 16.13 కోట్ల మంది

Published Thu, Jan 23 2025 10:38 AM | Last Updated on Thu, Jan 23 2025 12:32 PM

India domestic air traffic experienced surge in 2024 record high of 16.13 crore passengers

భారతదేశంలో దేశీయ విమాన ట్రాఫిక్(domestic air traffic) 2024లో గణనీయంగా పెరిగింది. ఏడాదిలో 16.13 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించి రికార్డు నెలకొల్పారు. ఇది ఏడాది ప్రాతిపదికన 6 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఇలా విమాన ప్రయాణికులు అధికమవడం వేగంగా విస్తరిస్తున్న ఏవియేషన్ మార్కెట్‌ను ప్రతిబింబిస్తుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DCGC) వెల్లడించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

2024 డిసెంబర్‌లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 1.49 కోట్లకు చేరుకుంది. ఇది 2023 డిసెంబర్‌తో పోలిస్తే 8.19% ఎక్కువ. ఇండిగో 64.4 శాతం వాటాతో మార్కెట్‌లో ఆధిపత్యం కొనసాగిస్తుండగా, ఎయిరిండియా 26.4 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచింది. అకాసా ఎయిర్, స్పైస్ జెట్ వరుసగా 4.6 శాతం, 3.3 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇండిగో అత్యధికంగా 73.4 శాతం ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్(OTP)తో అగ్రస్థానంలో నిలవగా, ఎయిరిండియా 67.6 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. అయితే, విమానాల రద్దు, జాప్యం కారణంగా డిసెంబరులో మొత్తం ఓటీపీ దెబ్బతింది.

మొత్తం విమానాల రద్దు రేటు 1.07%గా ఉంది. ఇది 67,622 మంది ప్రయాణీకులపై ప్రభావం చూపింది. ఈ రద్దులకు పరిహారం, సౌకర్యాల కోసం విమానయాన సంస్థలు రూ.1.26 కోట్లు ఖర్చు చేశాయి. విమానాల ఆలస్యం 2,79,985 మంది ప్రయాణీకులపై ప్రభావం చూపింది. విమానయాన సంస్థలు వీరి సౌకర్యాల ప్రయత్నాల కోసం రూ.3.78 కోట్లు ఖర్చు చేశాయి. 2,147 మంది ప్రయాణీకులకు బోర్డింగ్ నిరాకరించారు. అందుకోసం విమానయాన సంస్థలు రూ.1.76 కోట్లు పరిహారం చెల్లించాయి.

ఇదీ చదవండి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా కమ్యూనికేషన్స్‌, హడ్కో ఫలితాలు

కొవిడ్-19 మహమ్మారి ప్రభావం నుంచి విమానయాన రంగం క్రమంగా కోలుకుంది. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి విమానయాన సంస్థలు విమాన సంఖ్యలు, నెట్‌వర్క్‌లను విస్తరిస్తున్నాయి. విమాన ప్రయాణ డిమాండ్‌ను పెంచడంలో భారత ఆర్థిక వృద్ధి కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత విమానయాన రంగం మరింత వృద్ధి చెందుతుందని చెబుతున్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో ఈ రంగం ఒకటని అభిప్రాయపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement