
న్యూఢిల్లీ: నైపుణ్యాల ఆధారిత ఆన్‌లైన్ గేమింగ్ సంస్థ జుపీ తాజాగా 30 మిలియన్ డాలర్లు సమీకరించింది. 500 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో మ్యాట్రిక్స్ పార్ట్‌నర్స్ ఇండియా, ఓరియోస్ వెంచర్ పార్ట్‌నర్స్, అమెరికాకు చెందిన వెస్ట్‌క్యాప్ గ్రూప్ తదితర సంస్థలు ఇన్వెస్ట్ చేసినట్లు సంస్థ వివరించింది. ఈ నిధులను కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ఉపయోగించనున్నట్లు తెలిపింది. 100 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో ఆరు నెలల క్రితమే నిధులు సమీకరించగా ప్రస్తుతం ఇది అయిదు రెట్లు పెరగడం గమనార్హం. మొత్తం మీద ఇప్పటిదాకా 49 మిలియన్ డాలర్లు అందుకున్నట్లు జుపీ తెలిపింది. ప్రస్తుతం 1 కోటి మంది పైగా యూజర్లు ఉన్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు దిల్‌షేర్ సింగ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment