ఊహించని లాభాలను ఆర్జించిన డ్రీమ్‌-11, ఎంతంటే..? | Dream11 Clocks Rs 180 Crore Profit In FY20 | Sakshi
Sakshi News home page

Dream11: ఊహించని లాభాలను ఆర్జించిన డ్రీమ్‌-11, ఎంతంటే..?

Published Tue, Sep 21 2021 7:41 PM | Last Updated on Tue, Sep 21 2021 9:16 PM

Dream11 Clocks Rs 180 Crore Profit In FY20 - Sakshi

ముంబై:  ప్రముఖ వెబ్ ఆధారిత ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్-11 లాభాలను పొందింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.180 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. భారత్‌లో డ్రీమ్‌-11 ఫాంటసీ గేమింగ్‌ విభాగంలో యునికార్న్‌ సంస్థగా నిలిచింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.87 కోట్ల నష్టాలను చవిచూసింది. డ్రీమ్‌-11 నిర్వహిస్తున్న స్పోర్ట్టా టెక్నాలజీస్‌ 2020-21  ఆర్థిక సంవత్సరంలో 2.5 రెట్లు గణనీయ వృద్ధిని నమోదుచేసింది. 2019లో డ్రీమ్‌-11 ఆదాయం సుమారు రూ. 775.5 కోట్ల నుంచి 2020లో రూ. 2,070 కోట్ల వరకు పెరిగింది. ఈ రేంజ్‌లో కంపెనీ ఆదాయ అభివృద్దికి వినూత్న మార్కెటింగ్ వ్యూహాలు కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. 
చదవండి: బ్యాంకులకు భారీ షాక్‌ ? అప్పులు చెల్లించలేని స్థితికి చేరిన మరో సంస్థ !

ప్రముఖ ప్రైవేట్‌ కేర్‌ రిటైలర్‌ నైకా కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.62 కోట్ల ఆదాయాన్ని గడించిన స్టార్టప్‌గా నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో డ్రీమ్‌ స్పోర్ట్ 400 మిలియన్‌ డాలర్లను సేకరించి, కంపెనీ మార్కెట్‌ విలువ సుమారు 5 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. డ్రీమ్‌ స్పోర్ట్స్‌  అడ్వర్‌టైజింగ్‌పై దృష్టి సారిస్తూ సుమారు ఈ ఏడాదిలో సుమారు రూ.1,328 కోట్లను ఖర్చు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.785 కోట్లను ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. డ్రీమ్‌-11ను 2008లో జైన్, భవిత్ శేత్‌తో కలిసి ఏర్పాటుచేశారు. డ్రీమ్ 11 సుమారు 9 కోట్లపైగా కస్టమర్లను కలిగి ఉంది. ఫాంటసీ క్రికెట్, సాకర్, కబడ్డీ, హాకీలపై ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌గా నిలిచింది. డ్రీమ్ 11 ఫాంటసీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఫార్మాట్ జూలైలో 'గేమ్ ఆఫ్ స్కిల్' అని సుప్రీంకోర్టు పేర్కొంది.
చదవండి: బిలియనీర్ల కొంపముంచిన చైనా సంక్షోభం.. ! వందల కోట్లు ఆవిరి..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement