Dream11
-
డ్రీమ్ 11లో రూ.1.5 కోట్లు గెలుచుకున్న ఎస్ఐ సస్పెన్షన్.. ఎందుకంటే..?
ముంబయి: డ్రీమ్ 11లో రూ.1.5 కోట్ల రూపాయలు గెలుచుకున్న ఓ ఎస్ఐకి అధికారులు షాక్ ఇచ్చారు. పోలీసు విభాగం ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ సదరు ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేశారు. సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన అధికారి ఆన్లైన్ గేమింగ్‌లో పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. మహారాష్ట్ర పింప్రి చించ్వాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ సోమనాథ్ ఆన్లైన్ గేమింగ్‌లో పాల్గొన్నారు. ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా ఆయన తనకున్న జ్ఞానంతో టీంను ఎంచుకుని డ్రీమ్ 11లో పాల్గొన్నారు. అదృష్టం కలిసివచ్చి రూ.1.5 గెలుచుకున్నారు. దీంతో ఆయన తన కుటుంబానికి మిఠాయిలు తినిపిస్తూ ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. ఈ విషయం అధికారులు దృష్టికి వెళ్లడంతో విషయం పెద్దదైంది. ఆన్లైన్ గేమింగ్‌లో పాల్గొని పోలీసు శాఖ పరువు తీస్తున్నారంటూ ఉన్నతాధికారులు ఎస్ఐ సోమనాథ్పై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. ఈ వ్యవహారాన్ని స్థానిక డీసీపీకి అప్పగించారు. గత మూడు నెలలుగా ఆన్లైన్ బెట్టింగ్‌లో ఎస్ఐ సోమనాథ్ పాల్గొంటున్నారని నిర్దారించారు. ఈ వ్యవహారంలో సోమనాథ్పై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో రూ.1.5 గెలుచుకున్న ఆనందం ఆవిరైపోయింది. ఇదీ చదవండి: బీజేపీ కీలక నిర్ణయం.. గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి నియామకం -
జీఎస్టీ షోకాజ్ నోటీసులపై బొంబాయి హైకోర్టుకు డ్రీమ్ 11
న్యూఢిల్లీ: ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్ డ్రీమ్11 తన ప్లాట్‌ఫారమ్‌పై పెట్టిన పందాలపై రెట్రాస్పెక్టివ్ (గత లావాదేవీలకు వర్తించే విధంగా)గా 28 శాతం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధించడాన్ని సవాలు చేసింది. ఈ మేరకు జారీ అయిన షోకాజ్ నోటీసులపై బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 216.94 కోట్లు, 2018–19కిగాను రూ. 1,005.77 కోట్ల పన్ను డిమాండ్ ఉందని పిటిషన్లో డ్రీమ్11 పేర్కొంది. ‘‘అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చిన పలు తీర్పుల ప్రకారం.. ఇలాంటి షోకాజ్ నోటీసు జారీ తగదు. పిటిషనర్ (డీ11) అందించిన ఆన్లైన్ ఫాంటసీ స్పోర్ట్స్ గేమింగ్ ప్రధానంగా నైపుణ్యానికి సంబంధించినది. జూదం లేదా బెట్టింగ్‌కు సంబంధించినది కాదు’’ అని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా పన్ను డిమాండ్ నోటీసు రూ.40 వేల కోట్లని, రూ. 25 వేల కోట్లని మీడియాలో భిన్న కథనాలు రావడం గమనార్హం. గేమింగ్ రంగంపై రెవెన్యూశాఖ దృష్టి! పన్ను వసూళ్లకు సంబంధించి రెవెన్యూ వ్యవస్థ ప్రస్తుతం గేమింగ్ రంగంపై దృష్టి సారించినట్లు కనబడుతోంది. ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందాలపై నైపుణ్యం లేదా సంబంధిత అంశాలతో సంబంధం లేకుండా 28 శాతం పన్ను విధించడం జరుగుతుందని జీఎస్టీ మండలి ఇటీవల ఇచ్చిన వివరణ ఈ పరిణామానికి నేపథ్యం. రూ. 16,000 కోట్లకు పైగా జీఎస్టీ చెల్లింపుల్లో లోటుపై కాసినో ఆపరేటర్ డెల్టా కార్ప్, దాని అనుబంధ సంస్థలకు జీఎస్టీ అధికారులు గత వారం నోటీసులు జారీ చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో రూ. 21,000 కోట్ల జీఎస్టీ రికవరీ కోసం ఆన్లైన్ గేమింగ్ కంపెనీ గేమ్స్క్రాఫ్ట్కు ఇదే విధమైన షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై ఆ సంస్థ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. దీనిని రెవెన్యూశాఖ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అక్టోబర్ 10వ తేదీన ఈ కేసు విచారణకు లిస్టయ్యింది. -
టీమిండియా వరల్డ్‌కప్ జెర్సీలో మార్పులు.. తేడా గమనించారా..?
భారత క్రికెట్ జట్టు ఇటీవలే అన్ని ఫార్మాట్లలో జెర్సీలను మార్చిన విషయం తెలిసిందే. కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అడిడాస్ వచ్చాక భారత పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టుకు కూడా మూడు ఫార్మాట్లలో వేర్వేరు జెర్సీలను రూపొందించింది. టీ20ల్లో కాలర్ లేకుండా డార్క్ బ్లూ కలర్ జెర్సీ, వన్డేల్లో కాలర్‌తో లైట్ బ్లూ కలర్ జెర్సీ, టెస్ట్‌ల్లో వైట్ కలర్ జెర్సీలను అడిడాస్ ప్రవేశపెట్టింది. జెర్సీలపై కుడివైపు తమ (అడిడాస్) లోగోను, ఎడమవైపు టీమ్ లోగో, దానిపై మూడు నక్షత్రాలు, మధ్యలో లీడ్ స్పాన్సర్ డ్రీమ్ 11 పేరు, దాని కింద కాస్త పెద్ద అక్షరాలతో ఇండియా అని ఉంటుంది. జెర్సీపై భుజాల భాగంలో మూడు తెలుపు రంగు అడ్డ గీతలు ఉంటాయి. Indian team jersey for World Cup 2023. pic.twitter.com/q1EYsZebEK — Johns. (@CricCrazyJohns) September 20, 2023 కాగా, వరల్డ్‌కప్ నేపథ్యంలో అడిడాస్ కంపెనీ జెర్సీలో స్వల్ప మార్పులు చేసింది. భుజాలపై ఉన్న మూడు అడ్డ గీతలపై తెలుపు రంగు స్థానంలో తివర్ణ పతాకంలోని మూడు రంగులను (కాషాయం, తెలుపు, ఆకుపచ్చ) ముద్రించింది. అలాగే టీమ్ లోగోపై ఉన్న మూడు నక్షత్రాలను రెండుగా కుదించింది. రెండు నక్షత్రాలు భారత్ రెండు వన్డే వరల్డ్‌కప్‌లు (1983, 2011) గెలిచిన దానికి ప్రతీక అని పేర్కొంది. టీమిండియా కొత్త జెర్సీపై భారతీయత ఉట్టిపడటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తివర్ణంతో కూడిన జెర్సీతో టీమిండియా వరల్డ్‌కప్ గెలవడం ఖాయమని కామెంట్లు చేస్తున్నారు. ఆటగాళ్లు కొత్త జెర్సీ ధరించి రూపొందించిన వీడియో అద్భుతమని అంటున్నారు. పాత జెర్సీతో పోలిస్తే, ఇది చాలా కలర్ఫుల్గా ఉందని అంటున్నారు. -
దేశం కంటే వాళ్లే ఎక్కువైపోయారా? ఈసారి వరల్డ్‌కప్ గెలిచేది..
BCCI Unveils Team India's New ODI Jersey: టీమిండియా కొత్త జెర్సీ డిజైనింగ్‌పై అభిమానులు మండిపడుతున్నారు. దేశం కంటే ప్రధాన స్పాన్సరే ఎక్కువైపోయిందా అంటూ బీసీసీఐపై విరుచుకుపడుతున్నారు. కాగా దేశంలోనే అతిపెద్ద ఫాంటసీ స్పోర్ట్స్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్11 భారత క్రికెట్ నియంత్రణ మండలితో జతకట్టిన విషయం తెలిసిందే. విండీస్ సిరీస్‌తో మొదలు టీమిండియా కిట్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు మూడేళ్ల పాటు బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత జట్టుతో తమ ప్రయాణం మొదలుపెట్టింది. జూలై 12న మొదలైన టెస్టు సిరీస్ సందర్భంగా భారత ఆటగాళ్లు తొలిసారి డ్రీమ్11 లోగోతో ఉన్న జెర్సీలు ధరించారు. తెల్లని రంగు టీషర్టుపై రెడ్ కలర్లో ఉన్న డ్రీమ్11 లోగో, భుజాలపై నీలి రంగు గీతలతో టెస్టు జెర్సీని రూపొందించారు. ఇది ఏమంత బాగోలేదంటూ అప్పట్లో ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. తాజాగా వన్డే జెర్సీలో ఆటగాళ్లు ఫొటోలకు పోజులిచ్చిన వీడియోను బీసీసీఐ షేర్ చేయగా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఫైర్ అవుతున్నారు బ్లూ, ఆరెంజ్ కలర్స్ మేళవింపుతో రూపొందించిన ఈ జెర్సీపై INDIA కంటే DREAM11 లోగో పెద్దగా కన్పించడమే ఇందుకు కారణం. ప్రపంచంలోని సంపన్న బోర్డు దేశం పేరు కంటే.. ప్రధాన స్పాన్సర్కే ఎక్కువ విలువ ఇస్తున్నట్లు ఉందని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ఈసారి వరల్డ్‌కప్ గెలిచేది టీమిండియా కాదు.. డ్రీమ్11 అన్నట్లుగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. అయితే, మరికొంత మంది మాత్రం.. దీనిని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని.. డబ్బులు పెడుతున్నారు కాబట్టి స్పాన్సర్లు తమకు వీలైనంత ఎక్కువ లబ్ది పొందాలని చూస్తారని పేర్కొంటున్నారు. కాగా టెస్టు సిరీస్‌ను 1-0తో గెలిచిన భారత జట్టు జూలై 27 నుంచి వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, సంజూ సామ్సన్, ఇషాన్ కిషన్, శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, చహల్, కుల్దీప్, జైదేవ్ ఉనాద్కట్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్. చదవండి: ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. ఇంత మొండితనం పనికిరాదు! Test Cricket ✅ On to the ODIs 😎📸#TeamIndia | #WIvIND pic.twitter.com/2jcx0s4Pfw — BCCI (@BCCI) July 26, 2023 Logos should be kept shorter than 'India' in my opinion. Just like Byju's last time, Dream 11 taking tees grace away this time. Though I understand as a major sponsor, they may want their logo to be prominently displayed on the jersey to gain maximum visibility and exposure. pic.twitter.com/14twe2JvCF — Ranny Cricson 🏏 (@13Ranny_tweets) July 26, 2023 According to the Richest Board: DREAM 11 is our Country and INDIA is the main sponsor 👍. pic.twitter.com/xqrIFMqsDu — 𝘚𝘢𝘪𝘬𝘪𝘳𝘢𝘯 (@xSAIKIRAN68) July 26, 2023 -
Ind Vs WI: ఛీ.. మరీ ఘోరంగా ఉంది.. నాకైతే!
Ind Vs WI Test Series- New Test Jersey: దాదాపు నెలరోజుల విరామం తర్వాత టీమిండియా మళ్లీ మైదానంలో దిగనుంది. బుధవారం నుంచి వెస్టిండీస్‌తో మొదలుకానున్న టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సైకిల్లో భాగంగా రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ విండీస్‌తో ఆడనుంది. ఇదిలా ఉంటే.. టీమిండియా ప్రధాన స్పాన్సర్‌గా డ్రీమ్11 ఇటీవలే బీసీసీఐతో జట్టుకట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విండీస్‌తో సిరీస్ నేపథ్యంలో భారత ఆటగాళ్లు డ్రీమ్11 లోగోతో కూడిన జెర్సీలు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. తెలుపు రంగు టీషర్ట్‌పై ఎరుపు రంగులో ఉన్న డ్రీమ్11 లోగో, భుజాలపై నీలి రంగు గీతలతో టెస్టు జెర్సీ కొత్తగా కనిపిస్తోంది. అయితే, చాలా మంది టీమిండియా అభిమానులకు కొత్త జెర్సీలు నచ్చలేదు. క్రికెటర్ల ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రమంలో మిశ్రమ స్పందన వస్తోంది. ఛీ.. మరీ ఇంత ఘోరంగా ఉందేంటి? కొంతమంది కొత్త జెర్సీ బాగానే ఉందని పేర్కొంటుండగా.. మరికొంత మంది మాత్రం.. ‘‘ఛీ మరీ ఇంత ఘోరంగా ఉందేంటి? నాకైతే వాంతికొచ్చేలా ఉంది. డ్రీమ్11 లోగో మరీ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పాత జెర్సీలే చూడటానికి బాగుండేవి’’ అని ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. జూలై 12న తొలి టెస్టుతో టీమిండియా- వెస్టిండీస్ మధ్య వరుస సిరీస్‌లకు తెరలేవనుంది. ఇక ఆగష్టు 13న జరిగే ఆఖరి టీ20తో భారత జట్టు వెస్టిండీస్ పర్యటన ముగియనుంది. ఇదిలా ఉంటే.. టీమిండియా ఆఖరిసారిగా డబ్ల్యూటీసీ ఫైనల్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో తలపడింది. ఇంగ్లండ్‌లో జరిగిన ఈ ఈవెంట్లో 209 పరుగుల భారీ తేడాతో ఓడి అపఖ్యాతి మూటగట్టుకుంది. ఈ క్రమంలో తాజా డబ్ల్యూటీసీ సైకిల్ ఆరంభ సిరీస్‌లో సత్తా చాటి తిరిగి గాడిలో పడాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో డొమినికాలో జరుగనున్న తొలి టెస్టు కోసం అన్ని రకాలుగా సిద్ధమైంది. కాగా డ్రీమ్11 మూడేళ్ల పాటు బీసీసీఐ ప్రధాన స్పాన్సర్‌గా కొనసాగనున్న విషయం తెలిసిందే. చదవండి: బాగా సన్నబడ్డ రోహిత్.. వడపావ్ ముద్రను చెరిపివేసుకున్న టీమిండియా కెప్టెన్ Team India in the headshot session with the new jersey. pic.twitter.com/4l13eieL6R — Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2023 -
67 వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి! టీమిండియాతో ‘బంధం’: భావోద్వేగ ట్వీట్
Team India sponsorship Who Is Harsh Jain: టీమిండియా కొత్త స్పాన్సర్‌గా డ్రీమ్11ను ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. దేశంలోనే అతిపెద్ద ఫాంటసీ స్పోర్ట్స్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను తమ భాగస్వామిగా చేసుకున్నట్లు శనివారం వెల్లడించింది. మూడేళ్ల పాటు భారత ఆటగాళ్లు తమ జెర్సీలపై డ్రీమ్11 లోగోతో బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. నిజానికి క్రికెట్ ప్రేమికులకు డ్రీమ్11 గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్నగా మొదలై.. 15 ఏళ్ల కాలంలో ఎన్నో కష్టనష్టాలకోర్చి నేడు భారత జట్టు ప్రధాన స్పాన్సర్‌గా ఎదిగింది ఈ గేమింగ్ ప్లామ్ఫామ్. ఇందులో ఈ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ హర్ష్ జైన్‌ది కీలక పాత్ర. 150 సార్లు తిరస్కరణ ముంబైలో జన్మించిన హర్ష్ జైన్ అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించాడు. తన కాలేజీ స్నేహితుడు భవిత్ సేత్తో కలిసి డ్రీమ్11ను ఏర్పాటు చేయాలని భావించాడు. అయితే వీరికి అడుగడుగునా అవాంతరాలే ఎదురయ్యాయి. నిధుల సమీకరణ కోసం ప్రయత్నించగా ఏకంగా 150 సార్లు ‘నో’ అనే సమాధానమే వచ్చింది. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా హర్ష్, భవిత్ సవాళ్లను అధిగమించి 2008లో డ్రీమ్11ను ఏర్పాటు చేశారు. క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్ వంటి ఫాంటసీ గేమ్‌లు ఆడుకునేందుకు వీలుగా ఉన్న గేమింగ్ ప్లాట్‌ఫామ్‌కు దాదాపు 150 మిలియన్ మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ప్రస్తుతం డ్రీమ్11 విలువ దాదాపు 67 వేల కోట్లు ఉంటుందని అంచనా. భావోద్వేగ ట్వీట్‌తో ఇదిలా ఉంటే.. బీసీసీఐతో మరోసారి జట్టుకట్టడం పట్ల హర్ష్ జైన్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘డ్రీమ్11 ఇండియా. గత 15 ఏళ్ల కాలంలో మేము ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం. అయితే, ఈసారి భారత క్రికెట్ జట్టు జెర్సీపై మా లోగో చూడబోతున్నాం. వ్యక్తిగతంగా నాకు అత్యంత గర్వకారణమైన విషయం ఇది. మా ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అని హర్ష్ జైన్ భావోద్వేగ ట్వీట్ చేశాడు. క్రికెట్ ప్రేమికుడైన తన కల ఇలా నెరవేరినందుకు హర్షం వ్యక్తం చేశాడు. ప్రపంచంలోని సంపన్న బోర్డుతో ఐపీఎల్-2020 సందర్భంగా ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐతో తొలిసారి జట్టుకట్టింది డ్రీమ్11. ఆ సీజన్లో టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఈసారి ఏకంగా జెర్సీ స్పాన్సర్‌గా లీగ్ స్పాన్సర్ అవతారమెత్తింది. ఇక వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జూలై 12 నుంచి ఆరంభం కానున్న టెస్టు సిరీస్‌లో డ్రీమ్11 లోగోలతో కూడిన జెర్సీలను భారత ఆటగాళ్లు ధరించనున్నారు. చదవండి: రవీంద్ర జడేజాలా అతడు కూడా త్రీడీ క్రికెటర్.. డేంజరస్ హిట్టర్! కాబట్టి.. సచిన్, గంగూలీ, వీరూకు కలిసి రాలేదు! కానీ ధోని రూటే సపరేటు కదా! DREAM11 INDIA. In the last 15 years of running @Dream11 we've had many highs and lows, but seeing THIS on our Indian Cricket team jersey will be the PROUDEST moment for me personally! 🇮🇳🇮🇳🇮🇳 Thank you everyone for all your ❤️ and support always! 🙏🏼https://t.co/Ft8Qh9mA0d — Harsh Jain (@harshjain85) July 1, 2023 -
Ind Vs WI: టీమిండియా కొత్త స్పాన్సర్ ఇదే: బీసీసీఐ కీలక ప్రకటన
Team India New Lead Sponsor: భారత క్రికెట్ జట్టుకు కొత్త స్పాన్సర్ వచ్చింది. దేశంలోనే అతిపెద్ద ఫాంటసీ స్పోర్ట్స్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్ 11 ఇకపై టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి శనివారం అధికారికంగా ప్రకటించింది. మూడేళ్ల పాటు డ్రీమ్11 భారత జట్టు స్పాన్సర్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపింది. అదే విధంగా.. జూలై 12 నుంచి ఆరంభం కానున్న వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా ఆటగాళ్లు జెర్సీలపై మరోసారి డ్రీమ్ 11 లోగోలతో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించింది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిన్ 2023-25 సైకిల్లో భాగంగా విండీస్‌తో తొలి టెస్టుతో డ్రీమ్11 ప్రయాణం ప్రారంభమవుతుందని తెలిపింది. కంగ్రాట్స్ డ్రీమ్11 ఈ విషయం గురించి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ మాట్లాడుతూ.. ‘‘మరోసారి మాతో ప్రయాణం సాగించనున్న డ్రీమ్11కు అభినందనలు. బీసీసీఐ అధికారిక స్పాన్సర్ నుంచి ప్రధాన స్పాన్సర్‌గా ఎదగడం అభినందనీయం. బీసీసీఐ- డ్రీమ్11 మధ్య బంధం మరింత బలపడింది. సంతోషంగా ఉంది ఈ ఏడాది ఐసీసీ వరల్డ్‌కప్ నిర్వహించనున్న తరుణంలో ఈ ఒప్పందం జరగడం సంతోషకరం’’ అని హర్షం వ్యక్తం చేశాడు. ఇక డ్రీమ్ స్పోర్ట్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ హర్ష్ జైన్.. బీసీసీఐ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించనుండటం గర్వంగా ఉందని తెలిపాడు. భారత క్రీడా రంగానికి తమ వంతు సేవ చేయడంలో మరో ముందడుగు పడిందని వ్యాఖ్యానించాడు. కాగా అంతకుముందు ఎడ్టెక్ సంస్థ బైజూస్ భారత జట్టు జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2020 టైటిల్ స్పాన్సర్‌గా డ్రీమ్11.. బీసీసీఐతో తొలిసారి జట్టుకట్టింది. చదవండి: ఎందుకిలా చేశావు ధోని భయ్యా! మిస్టర్ కూల్ ఆన్సర్‌తో దిమ్మతిరిగిపోయింది! -
టీమిండియా కొత్త జెర్సీ స్పాన్సర్ ఎవరంటే..?
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు జెర్సీ ప్రధాన స్పాన్సర్‌గా ఫాంటసీ స్పోర్ట్స్ లీగ్ కంపెనీ ‘డ్రీమ్11’ ఎంపికవడం దాదాపు ఖాయమైంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే ఎంత మొత్తానికి అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటి వరకు టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కంపెనీ ‘బైజూస్’ ఉంది. గత ఏప్రిల్‌తో బైజూస్ ఒప్పందం ముగిసింది. దాంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్ల కోసం బిడ్లను పిలిచింది. గతంలో ఐపీఎల్ టోర్నీ ప్రధాన స్పాన్సర్‌గా కూడా డ్రీమ్11 వ్యవహరించింది. అయితే బీసీసీఐతో కొత్త ఒప్పందం ప్రకారం... ఇప్పటివరకు బైజూస్ చెల్లించిన మొత్తం (ఒక్కో మ్యాచ్‌కు)కంటే డ్రీమ్11 తక్కువగా చెల్లించనున్నట్లు సమాచారం. లాంఛనాలు పూర్తి చేసిన తర్వాత దీనిపై బోర్డు అధికారిక ప్రకటన చేయనుంది. -
నాడు 150 సార్లు తిరస్కరించారు.. నేడు రూ. 65వేల కోట్లకు అధిపతి!
చిన్నప్పుడు చందమామ కథల్లో విక్రమార్కుని గురించి చదువుతుంటే కొంత ఆశ్చర్యం కలిగేది, ఎందుకంటే బేతాళున్ని తీసుకురావడానికి విక్రమార్కుడు మళ్ళీ మళ్ళీ చెట్టు దగ్గరికి వెల్తూనే ఉంటాడు. అయితే చివరికి అనుకున్నది సాధిస్తాడు. సరిగ్గా ఈ కథను పోలిన జీవితాన్ని హర్ష్ జైన్ అనుభవించాడు. 1986లో ముంబైలో జన్మించిన హర్ష్ జైన్ ప్రాథమిక విద్యను గ్రీన్లాస్ హైస్కూల్లో, ఆ తరువాత ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చేయడానికి ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి వెళ్ళాడు. చదువుకునే రోజుల్లోనే ఉపెన్ క్రికెట్ క్లబ్, ఇంట్రామ్యూరల్ ఫుట్‌బాల్ వంటి వాటిలో పాల్గొన్నాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కొంతమంది డ్రీమ్11 యాప్ ఉపయోగించి క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్ వంటి ఫాంటసీ ఆటలను ఆడుతుంటారు. 2019 ఏప్రిల్‌లో డ్రీమ్11 "యునికార్న్ క్లబ్" లోకి ప్రవేశించిన మొదటి ఇండియన్ గేమింగ్ కంపెనీగా అవతరించింది. అతి తక్కువ కాలంలోనే గొప్ప స్థాయికి చేరుకున్న డ్రీమ్11 వెనుక చాలా పెద్ద కథ ఉంది. (ఇదీ చదవండి: రీల్స్ చెయ్.. లక్ష పట్టేయ్! తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్..) నిజానికి IPL మొదటిసారి ప్రారంభమైనప్పుడు, హర్ష్ జైన్ అతని కాలేజీ ఫ్రెండ్ భవిత్ డ్రీమ్11 ప్రారంభించాలనే ఆలోచనను కలిగి ఉన్నట్లు, నిధుల కోసం రెండు సంవత్సరాలు సుమారు 150 మంది వెంచర్ క్యాపిటలిస్ట్‌లను సంప్రదించామని, అయితే తన ఆలోచనలను వీరందరూ తిరస్కరించారని హర్ష్ తెలిపారు. డ్రీమ్11 ప్రారంభ రోజులలో ఇద్దరూ కష్టాలను ఎదుర్కొన్నారు, కానీ చివరికి విజయం సాధించారు. 2013లో హర్ష్ జైన్ డెంటిస్ట్ అయిన రచనా షాను వివాహం చేసుకున్నాడు, వీరికి క్రిష్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం వీరు దక్షిణ ముంబైలోని పెద్దార్ రోడ్లో రూ. 72 కోట్ల విలువైన లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్లో ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా 2010 జులైలో ముంబైలో రెడ్ డిజిటల్ అనే సోషల్ మీడియా ఏజెన్సీ స్థాపించారు. ఈ సంస్థను 2013లో ముంబైలోని మార్కెటింగ్ ఏజెన్సీ గోజూప్ కొనుగోలు చేసింది. (ఇదీ చదవండి: మహిళల కోసం ఫైర్ బోల్ట్ నయా స్మార్ట్‌వాచ్ - తక్కువ ధర & ఎక్కువ ఫీచర్స్) 2017లో హర్ష్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ అధ్యక్షుడయ్యాడు. నేడు డ్రీమ్11 ఏకంగా 8 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 65,000 కోట్లకంటే ఎక్కువ. ఈ ప్లాట్ఫామ్లో సుమారు 150 మిలియన్స్ యాక్టివేట్ యూజర్స్ ఉన్నారు. ప్రస్తుతం భారతదేశంలోని అత్యంత ధనవంతులైన యువ బిలియనీర్లలో హర్ష్ జైన్ ఒకరుగా ఉన్నారు. -
హాలిడేస్‌లో వర్క్ చేయమంటున్నారా..? ఇలా చేస్తే బాస్‌కు భారీ జరిమానా!
మీరు ఎంతో ఇష్టపడి ఓ జాబ్ చేస్తున్నారు. అలా అని హాలిడేస్‌లో కుటుంబ సభ్యులతో గడిపే సమయంలో ఆఫీస్‌లో ఆ వర్క్ ఉంది.. ఈ వర్క్ ఉంది అని కొలీగ్స్ నుంచి లేదంటే బాస్ నుంచి పొద్దస్తమానం ఫోన్స్, ఈమెయిల్స్, ఫోన్ నోటిఫికేషన్లు వస్తుంటే చిరాకుగా ఉంటుంది కదా. ఇదిగో ఇకపై ఉద్యోగుల్ని ఇలాంటి ఇబ్బందులు పడకుండా.. తోటి సహచర ఉద్యోగులు ఇబ్బంది పెట్టకుండా ఉండేలా సంస్థలు కొత్త కొత్త పాలసీలను అమలు చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇంతకీ ఆ పాలసీ ఏంటని అనుకుంటున్నారా? సెలవుల్లో ఉన్న ఉద్యోగికి.. తోటి సహచర ఉద్యోగులు ఆఫీస్ వర్క్ విషయంలో ఇబ్బంది పెట్టకూడదు. అలా ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకునేందుకు పాలసీలపై కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ డ్రీమ్ 11 కొత్త పాలసీని తన సంస్థ ఉద్యోగులకు అమలు చేసింది. ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే?.. ఆఫీస్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి లీవ్ పెట్టి ఇంట్లో ఉన్నాడు. ఆ సమయంలో ఆఫీస్ నుంచి అతని కొలీగ్స్ కానీ, బాస్‌లు కానీ ఎవరైనా సరే ఆఫీస్ వర్క్ అని ఇబ్బంది పెట్టకూడదు. ఒక వేళ ఇబ్బంది పెడితే డిజిగ్నేషన్‌తో సంబంధం లేకుండా బాస్‌తో సహా అందరికి లక్షరూపాయిలు జరిమానా విధిస్తున్నాం’ అంటూ కొత్త పాలసీ గురించి లింక్డిన్లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా డ్రీమ్ 11 కంపెనీ ఫౌండర్ హర్ష్ జైన్, భవిత్ శేట్లు మాట్లాడుతూ..లీవ్‌లో ఉన్న ఉద్యోగికి వారం రోజుల పాటు ఆఫీస్‌తో సంబంధం ఉండకూడదు. మెయిల్స్, మెసేజెస్, వాట్సాప్ గ్రూప్ మెసేజెస్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అసలు ఇంట్లో ఉంటే ఆఫీస్ వర్క్ అనే మాటే ఊసెత్తకూడదు. ఇలా కొత్త పాలసీని అమలు చేయడం వల్ల ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. విశ్రాంతి తీసుకోవచ్చు. తద్వారా మానసిక స్థితి, జీవన ప్రమాణాల నాణ్యత, వర్క్ ప్రొడక్టివిటీ పెరుగుతుందని అర్ధం చేసుకున్నాం. కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది. -
డ్రీమ్-11కు షాకిచ్చిన క్యాబ్ డ్రైవర్...!
కొద్ది రోజుల క్రితం టీమిండియా జెర్సీ స్పాన్సర్ మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎమ్‌పీఎల్) కంపెనీకు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చిన విషయం తెలిసిందే. కర్ణాటకలో ఎమ్‌పీఎల్‌ను నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిలిచిపోయిన డ్రీమ్-11 సేవలు..! గత కొద్ది రోజల నుంచి కర్ణాటక ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్, గ్యాబ్లింగ్, బెట్టింగ్ యాప్స్‌పై కర్ణాటక ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విరుచుకపడింది. ప్రముఖ ఆన్లైన్ ఫాంటసీ గేమింగ్ యాప్ ఎమ్‌పీఎల్ సేవలను అక్టోబరు 5న కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. అయితే ఈ సమయంలో మరో దిగ్గజ ఫాంటసీ గేమింగ్ యాప్ డ్రీమ్-11పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగా తాజాగా బెంగుళూరులో 42 ఏళ్ల క్యాబ్ డ్రైవర్ డ్రీమ్-11పై పోలీసులో స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చట్టాల ప్రకారం డ్రీమ్-11 నియమాలను ఉల్లంఘిస్తోందని సంస్థ యాజమాన్యంపై ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో కర్ణాటకలో డ్రీమ్-11 సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ కంపెనీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. చదవండి: ఒక్కసారి ఛార్జ్‌తో 1360 కిలోమీటర్ల ప్రయాణం..! స్పందించిన డ్రీమ్-11 బెంగుళూరులో డ్రీమ్-11పై కేసు నమోదుకావడంతో యాజమాన్యం చట్టపరమైన నివారణ చర్యలను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర చట్టాలకు కట్టుబడే డ్రీమ్-11 సేవలను అందిస్తున్నామని కంపెనీ వెల్లడించింది. గతంలో కూడా డ్రీమ్-11 అనేక చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంది. గత ఏడాది భారత్‌లో యూనికార్న్ క్లబ్లో చేరిన గేమింగ్ స్టార్టప్‌గా డ్రీమ్-11 అవతరించింది. చదవండి: ఆకాశమే హద్దుగా డీమార్ట్ దూకుడు...! -
ఊహించని లాభాలను ఆర్జించిన డ్రీమ్-11, ఎంతంటే..?
ముంబై: ప్రముఖ వెబ్ ఆధారిత ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్-11 లాభాలను పొందింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.180 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. భారత్‌లో డ్రీమ్-11 ఫాంటసీ గేమింగ్ విభాగంలో యునికార్న్ సంస్థగా నిలిచింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.87 కోట్ల నష్టాలను చవిచూసింది. డ్రీమ్-11 నిర్వహిస్తున్న స్పోర్ట్టా టెక్నాలజీస్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2.5 రెట్లు గణనీయ వృద్ధిని నమోదుచేసింది. 2019లో డ్రీమ్-11 ఆదాయం సుమారు రూ. 775.5 కోట్ల నుంచి 2020లో రూ. 2,070 కోట్ల వరకు పెరిగింది. ఈ రేంజ్లో కంపెనీ ఆదాయ అభివృద్దికి వినూత్న మార్కెటింగ్ వ్యూహాలు కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: బ్యాంకులకు భారీ షాక్ ? అప్పులు చెల్లించలేని స్థితికి చేరిన మరో సంస్థ ! ప్రముఖ ప్రైవేట్ కేర్ రిటైలర్ నైకా కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.62 కోట్ల ఆదాయాన్ని గడించిన స్టార్టప్‌గా నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో డ్రీమ్ స్పోర్ట్ 400 మిలియన్ డాలర్లను సేకరించి, కంపెనీ మార్కెట్ విలువ సుమారు 5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. డ్రీమ్ స్పోర్ట్స్ అడ్వర్టైజింగ్పై దృష్టి సారిస్తూ సుమారు ఈ ఏడాదిలో సుమారు రూ.1,328 కోట్లను ఖర్చు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.785 కోట్లను ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. డ్రీమ్-11ను 2008లో జైన్, భవిత్ శేత్‌తో కలిసి ఏర్పాటుచేశారు. డ్రీమ్ 11 సుమారు 9 కోట్లపైగా కస్టమర్లను కలిగి ఉంది. ఫాంటసీ క్రికెట్, సాకర్, కబడ్డీ, హాకీలపై ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌గా నిలిచింది. డ్రీమ్ 11 ఫాంటసీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఫార్మాట్ జూలైలో 'గేమ్ ఆఫ్ స్కిల్' అని సుప్రీంకోర్టు పేర్కొంది. చదవండి: బిలియనీర్ల కొంపముంచిన చైనా సంక్షోభం.. ! వందల కోట్లు ఆవిరి..! -
'రోహిత్ ఇది నాది.. వెళ్లి సొంత బ్యాట్ తెచ్చుకో'
దుబాయ్ : రోహిత్ శర్మ అంటేనే హిట్టింగ్‌కు మారుపేరు.. అందుకే అతన్ని ముద్దుగా హిట్‌మ్యాన్ అని పిలుచుకుంటారు. అంతర్జాతీయ క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన రోహిత్ శర్మకు సొంత బ్యాట్ కూడా లేదంట. అదేంటి.. రోహిత్ శర్మ ఐపీఎల్ 13వ సీజన్ కోసం దుబాయ్‌లో ఉన్నాడు కదా.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ వద్ద సొంత బ్యాట్ లేకపోవడమేంటని ఆశ్చర్యపోతున్నారా.. అసలు విషయం ఏంటంటే.. ఐపీఎల్ 2020కి సంబంధించి డ్రీమ్ 11 సంస్థ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ స్పాన్సర్‌గా వివో తప్పుకున్న నేపథ్యంలో ఏడాది కాలానికి గానూ రూ.250 కోట్లతో డ్రీమ్ లెవెన్ కంపెనీ ఒప్పందం చేసుకుంది.(చదవండి : స్టోక్స్ ఆడతాడో... లేదో...!) ఈ సందర్భంగా ఐపీఎల్ 13వ సీజన్‌కు సంబంధించి ఆటగాళ్లతో ప్రమోషనల్ వీడియోలు చేస్తున్న డ్రీమ్ 11 సంస్థ తాజాగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రమోషనల్ వీడియో ఒకటి విడుదల చేసింది. ఆ వీడియోలో రోహిత్ గల్లీ క్రికెట్ ఆడుతుంటాడు. చేతిలో బ్యాట్ పట్టుకొని హిట్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్న రోహిత్‌ను ఒక వ్యక్తి వచ్చి ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు.. దానికి ఓపెనింగ్ చేస్తున్నా అంటూ హిట్‌మ్యాన్ సమాధానమిస్తాడు. ఎంతైనా తాను ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌ను కదా అంటూ నవ్వుతూ పేర్కొంటాడు. దీనికి అవతలి వ్యక్తి నీ చేతిలో ఉన్న బ్యాట్ ఎవరిది అని అడుగుతాడు.. దానికి రోహిత్ తటపటాయిస్తూ.. బ్యాట్ నీదేనా అని అడుగుతాడు. దీంతో ఆ వ్యక్తి రోహిత్ చేతిలో ఉన్న బ్యాట్ లాక్కుంటూ.. అవును బ్యాట్ నాదే.. వెళ్లి నీ సొంత బ్యాట్ తెచ్చుకో.. అప్పటివరకు ఫీల్డింగ్ చేయ్ అంటూ పక్కకు నెట్టేస్తాడు. దాంతో రోహిత్ బిత్తరచూపులు చూస్తుండగా వీడియో ముగుస్తుంది. (చదవండి : షార్జా స్టేడియాన్ని చుట్టేసిన దాదా) దీనిపై ముంబై ఇండియన్స్ సహచరుడు , బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వీడియో ట్విటిర్‌లో షేర్ చేస్తూ కామెంట్ చేశాడు. రోహిత్ బాయ్.. అది మన క్రికెట్ కాదు.. గల్లీ క్రికెట్. నీ సొంత బ్యాట్ తెచ్చుకొని బరిలోకి దిగు.. అంటూ కామెంట్ జత చేశాడు. బుమ్రా షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కాగా సెప్టెంబర్ 19న మొదలుకానున్న ఐపీఎల్ 13వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. -
‘డ్రీమ్ 11’ ఒక్క 2020కే...
న్యూఢిల్లీ: రూ. 222 కోట్లకు ఐపీఎల్ –2020 టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులు దక్కించుకున్న ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ ‘డ్రీమ్ ఎలెవన్’ జోరుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అడ్డుకట్ట వేసింది. ఈ ఏడాదిలాగే 2021, 2022 ఐపీఎల్‌లకు కూడా ప్రధాన స్పాన్సర్‌గా కొనసాగుతామనే ప్రతిపాదనను బీసీసీఐ తిరస్కరించింది. వారితో ఒప్పందం ఈ ఒక్క ఏడాదికే ఖరారైందని స్పష్టం చేసింది. తర్వాతి రెండేళ్లకు రూ. 240 కోట్ల చొప్పున చెల్లిస్తామని, తమకే హక్కులు ఇవ్వాలంటూ ‘డ్రీమ్ 11’ బోర్డుకు ఆఫర్ ఇచ్చింది. అయితే ఇది తమకు ఆమోదయోగ్యం కాదంటూ బోర్డు నో చెప్పేసింది. అదనపు రెండేళ్లు ఒప్పందం విషయంలో డ్రీమ్ 11కు, బీసీసీఐకి మధ్య చర్చలు జరిగాయని... తమకు ఇవ్వచూపిన మొత్తాన్ని పెంచాలంటూ బోర్డు కోరడంతో ఏకాభిప్రాయం కుదర్లేదని తెలిసింది. ‘ఐపీఎల్–13 కోసం డ్రీమ్ 11 ఎక్కువ మొత్తానికి కోట్ చేసింది కాబట్టి వారికి హక్కులు ఇచ్చాం. తర్వాతి రెండేళ్లకు రూ. 240 కోట్లకే మేం ఎందుకు ఇస్తాం. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత రాబోయే రోజుల్లో పరిస్థితులు కచ్చితంగా మెరుగు పడతాయి. అయినా ‘వివో’తో మా ఒప్పందం పూర్తిగా రద్దు కాలేదు. ఈ ఏడాది విరామం మాత్రమే ఇచ్చామంతే. రూ. 440 కోట్లు ఇచ్చేవారు ఉండగా, రూ. 240 కోట్లకు హక్కులు అందజేస్తామా’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈలో ఐపీఎల్ జరుగుతుంది. మాకు చాలా బాధ కలిగింది: సీఏఐటీ ఒక వైపు చైనా కంపెనీలతో సంబంధాలు తెంచుకోవాలంటూ, మరో వైపు ‘డ్రీమ్ 11’తో బీసీసీఐ ఒప్పందం చేసుకోవడాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్ (సీఏఐటీ) ప్రశ్నించింది. చైనా పెట్టుబడులు ఉన్న కంపెనీకే ఐపీఎల్ స్పాన్సర్షిప్ హక్కులు ఇవ్వడం తమను బాధించిందని ఈ సమాఖ్య అభిప్రాయ పడింది. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి సీఏఐటీ లేఖ రాసింది. ‘డ్రీమ్ 11లో చైనాకు చెందిన టెన్సెంట్ గ్లోబల్ కంపెనీ ప్రధాన వాటాదారుగా ఉంది. చైనాను తీవ్రంగా వ్యతిరేకించే భారత అభిమానుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఇలా దొడ్డి దారిన హక్కులు కేటాయించడం సరైంది కాదు. ఇది భారత ప్రయోజనాలను పణంగా పెట్టడమే’ అని సీఏఐటీ తమ లేఖలో పేర్కొంది. -
'డ్రీమ్' ధనాధన్
కరోనా కష్టకాలంలో కూడా భారత క్రికెట్ గల్లా పెట్టెలో కాసులకు కొదవ లేకపోయింది. వినోదానికి చిరునామాగా మారిన ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ ద్వారా ఒక్క సీజన్‌కే రూ. 222 కోట్లు బీసీసీఐకి లభించనున్నాయి. ఇప్పటికే తప్పుకున్న ‘వివో’తో పోలిస్తే ఇది తక్కువగా కనిపిస్తున్నా... ఇతర మార్గాల ద్వారా తాము ఆశించిన మొత్తాన్ని దాదాపుగా అందుకునేందుకు బీసీసీఐ ప్రణాళిక రూపొందించింది. ముంబై: ప్రముఖ ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ ఫామ్ ‘డ్రీమ్ 11’ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) –2020 టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులు సొంతం చేసుకుంది. ఈ ఏడాది కోసం డ్రీమ్ రూ. 222 కోట్లు చెల్లించనుంది. స్పాన్సర్షిప్ కోసం వేసిన బిడ్లను మంగళవారం తెరవగా...అందరికంటే ఎక్కువగా బిడ్ వేసిన డ్రీమ్ 11కు ఈ అవకాశం దక్కింది. రెండో స్థానంలో బైజూస్ (రూ. 201 కోట్లు), అన్ అకాడమీ (రూ. 170 కోట్లు) నిలిచాయి. వచ్చే ఏడాది స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు ‘వివో’ తిరిగి రాకపోతే తర్వాత రెండేళ్లు కూడా డ్రీమ్ ఎలెవన్‌కు స్పాన్సర్షిప్ హక్కులు ఇవ్వనుంది. ఇందు కోసం రూ. 240 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ‘వివో’ ఏడాదికి రూ. 440 కోట్లు చెల్లించింది. దాంతో పోలిస్తే ఇది సగమే (49.5 శాతం తక్కువ). అయితే ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద సంస్థలే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో ఇది ఏ రకంగా చూసినా బోర్డుకు లాభదాయకమే. పైగా ఈ సారి అసోసియేట్ స్పాన్సర్ల సంఖ్యను మూడునుంచి ఐదుకు పెంచిన బోర్డు...చెరో రూ. 40 కోట్ల చొప్పున అదనంగా మరో రూ. 80 కోట్లను తమ ఖాతాలో వేసుకోనుంది. అంటే ఐపీఎల్–13 సీజన్‌నుంచి బోర్డుకు స్పాన్సర్ల ద్వారానే రూ. 302 కోట్లు రానున్నాయి. ఇక్కడా ‘చైనా’ ఉంది! భారత్–చైనా మధ్య సరిహద్దు వివాదం కారణంగానే ఐపీఎల్ స్పాన్సర్‌షిప్‌నుంచి చైనా కంపెనీ ‘వివో’ అర్ధాంతరంగా తప్పుకుంది. ఇప్పుడు వచ్చి న డ్రీమ్11లో కూడా చైనా సంస్థ ‘టెన్సెంట్’ పెట్టుబడులు ఉన్నాయి. అయితే దీనిని బీసీసీఐ సమర్థించుకుంది. ‘ఇది ముమ్మాటికీ భారత కంపెనీనే. దీనిని ప్రారంభించినవారితో పాటు అందులో పని చేస్తున్న ఉద్యోగులు భారతీయులే. టెన్సెంట్ వాటా 10 శాతంకంటే కూడా తక్కువ. కాబట్టి దానిని పట్టించుకోనవసరం లేదు’ అని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ స్పష్టం చేశారు. ‘డ్రీమ్ 11’ ఆటలతో జత కట్టడం ఇది మొదటిసారి కాదు. ఐసీసీ అధికారిక ఫాంటసీ క్రికెట్ ప్లాట్‌ఫామ్‌గా ఉండటంతో పాటు కరీబియన్ లీగ్, బిగ్ బాష్, సూపర్ లీగ్ తదితర పోటీలకు స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఐపీఎల్‌తో కూడా అసోసియేట్ స్పాన్సర్‌గా ఉంటూ ఇప్పుడు టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను దక్కించుకుంది. అయితే ప్రపంచంలో అత్యుత్తమ క్రీడా వినోదంగా గుర్తింపు తెచ్చుకున్న ఐపీఎల్‌కు ఒక ఫాంటసీ లీగ్ స్పాన్సర్‌గా వ్యవహరించడమే ఆశ్చర్యం కాగా... దాని మాటున భారీ బెట్టింగ్‌కు ఇది అవకాశం కల్పిస్తోంది. ఎందుకంటే కొన్నాళ్ల క్రితం శ్రీలంకలో మ్యాచ్ జరుగుతుందంటూ పంజాబ్‌లో మ్యాచ్‌లు నిర్వహించి ఆన్లైన్లో బెట్టింగ్‌లు జరిపిన వివాదంలో డ్రీమ్ 11 పేరు కూడా ఉంది. దీనిపై ప్రస్తుతం బీసీసీఐ అవినీతి వ్యతిరేక విభాగం విచారణ కూడా జరుగుతోంది. ఇలాంటి స్థితిలో బోర్డు దానికి స్పాన్సర్షిప్ అప్పజెప్పడం విషాదం. 2013 ఐపీఎల్ సమయంలో వచ్చిన బెట్టింగ్ వివాదాన్ని బీసీసీఐ మరచిపోయినట్లుంది! ‘కలల’ ఆటలు... డ్రీమ్ 11, మొబైల్ ప్రీమియర్ లీగ్, మై 11 సర్కిల్, బల్లేబాజీ, మై టీమ్ 11, స్కిల్ ఫర్ ట్యూన్... పేరు ఏదైతేనేం... అన్నీ ఊరించి ఊబిలోకి దింపే తరహా ఫాంటసీ స్పోర్ట్స్ లీగ్‌లే! భారత్‌లో ఒక్కసారిగా దూసుకొచ్చిన ఈ కలల క్రీడలకు ధోని, కోహ్లి, రోహిత్, యువరాజ్ అందరూ బ్రాండ్ అంబాసిడర్లే. వీటిలో ఒకదానికి ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ప్రచారకర్త. మొబైల్లో యాప్‌ను డౌన్లోడ్ చేయడం మొదలు ఇది వ్యసనంగా మారే వరకు అన్ని కంపెనీలది దాదాపు ఒకే శైలి. సరిగ్గా చెప్పాలంటే ‘భాగ్యలక్ష్మి బంపర్ డ్రా’కు ఇది ఆధునిక మొబైల్ వెర్షన్ మాత్రమే! ముందుగా అవి ఉచితంగా ఆడే అవకాశం కల్పిస్తాయి. ఆ తర్వాత కొంత డబ్బు చెల్లించి సభ్యులుగా మారితే ఎక్కువగా ఆడే అవకాశం ఉందంటూ ఆఫర్లు... ఆపై ప్రతీ ఆట (మ్యాచ్)కు కనీస మొత్తం చెల్లించిన తర్వాతే అందులో భాగమయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. క్రికెట్ లేదా మరే క్రీడపైనైనా తనకు ఉన్న కొద్దిపాటి పరిజ్ఞానంతోనే డబ్బులు సంపాదించుకోవచ్చనే ఆశతో ఎంతో మంది దీనికి అలవాటు పడిపోతున్నారు. తమను తాము సదరు క్రీడలో పెద్ద అనుభవజ్ఞులైన విశ్లేషకులుగా భావించి వేసుకుంటున్న అంచనాలతో లెక్క తప్పడం, ఆపై పెద్ద మొత్తంలో నష్టపోవడం తరచుగా జరిగిపోతున్నాయి. కానీ లీగ్ నిర్వాహకులకు మాత్రం సర్వీస్ ఫీజు పేరుతో కాసుల పంట పండుతోంది. లీగ్‌లో ఎవరూ గెలిచినా, ఓడినా వారి ఆదాయం అమాంతం పెరిగిపోతోంది. ఈ ఫాంటసీ లీగ్‌ల వ్యవహారమంతా పక్కా జూదం అంటూ ఇందులో భారీగా నష్టపోయినవారు గతంలో కోర్టుకెక్కారు. అయితే ‘ఇందులో ఆడాలంటే తెలివితేటలు, ఆటలపై పరిజ్ఞానం కూడా అవసరం. కాబట్టి పూర్తిగా జూదంగా పరిగణించలేం’ అంటూ కోర్టు డ్రీమ్ 11కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే చట్టంలోని కొన్ని లోపాలను తమకు అనుకూలంగా మార్చుకొని ఈ సంస్థలు తమ వ్యవహారాలు నడిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పు చెప్పినా... తెలంగాణ రాష్ట్రంలో ఫాంటసీ లీగ్‌కు అనుమతి లేదు. తెలంగాణతో పాటు ఒడిషా, అసోంలలో ఈ లీగ్‌లు ఆడటం చట్టవిరుద్ధం. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి డ్రీమ్ 11 విలువ 2.25 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 17 వేల కోట్లు) కావచ్చని వ్యాపార వర్గాల అంచనా. దీన్ని బట్టి చూస్తే మిగిలిన రాష్ట్రాల్లో ఇది ఎంతగా విస్తరించిందో అర్థమవుతుంది. -
ఐపీఎల్ కొత్త స్పాన్సర్ డ్రీమ్ 11
-
ఐపీఎల్ కొత్త స్పాన్సర్ డ్రీమ్ 11
ముంబై : ఐపీఎల్ 13వ సీజన్‌కు సంబంధించి స్పాన్సర్షిప్ హక్కుల నుంచి వివో తప్పుకున్నప్పటి నుంచి తరువాతి స్పాన్సర్ ఎవరా అన్న విషయంపై ఉత్కంఠ వీడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్‌కు సంబంధించి స్పాన్సర్షిప్ హక్కులను 250 కోట్ల రూపాయలకు డ్రీమ్ 11 కంపెనీ దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే డ్రీమ్ 11తో పాటు అన్ అకాడమీ(రూ. 210 కోట్లు), టాటాసన్స్ (రూ. 180 కోట్లు), బైజూస్ (రూ. 125 కోట్ల)తో బిడ్ వేసి పోటీ పడగా.. 250 కోట్ల రూపాయలతో డ్రీమ్11 ఐపీఎల్ 2020కి సంబంధించి స్పాన్సర్షిప్ హక్కులను పొందింది. అయితే ఈ విషయాన్ని బీసీసీఐ ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటించనుంది. చదవండి : ‘సచిన్‌లానే.. ధోనికి వీడ్కోలు ఉంటుంది’ 2018-22 ఏళ్ల మధ్య ఐదేళ్ల కాలానికి గానూ వివో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే గల్వాన్ ఘర్షణ అనంతరం చైనాకు చెందిన వస్తువులను బహిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం తెలపడంతో చైనాకు చెందిన వివో ఐపీఎల్ స్పాన్సర్షిప్ నుంచి స్వచ్ఛందంగా వైదొలిగింది. దీంతో ఐపీఎల్ 2020కి సంబంధించి కొత్త స్పాన్సర్ ఎవరు వస్తారు అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. స్పాన్సర్షిప్ హక్కుల కోసం రిలయన్స్ జియో, బైజూస్, టాటాసన్స్, అన్ అకాడమీ, డ్రీమ్ 11 వంటి పెద్ద సంస్థలు పోటీ పడ్డాయి. చివరకు 250 కోట్ల రూపాయలతో డ్రీమ్11 మూడు నెలల కాలానికి గానూ ఐపీఎల్ 2020 స్పాన్సర్షిప్ హక్కులను పొందింది. కాగా ఇదే డ్రీమ్ 11కు గతంలో 2018లో టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. కాగా దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 13వ సీజన్ షురూ కానుంది.