Team India New Lead Sponsor: భారత క్రికెట్ జట్టుకు కొత్త స్పాన్సర్ వచ్చింది. దేశంలోనే అతిపెద్ద ఫాంటసీ స్పోర్ట్స్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్ 11 ఇకపై టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి శనివారం అధికారికంగా ప్రకటించింది. మూడేళ్ల పాటు డ్రీమ్11 భారత జట్టు స్పాన్సర్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపింది.
అదే విధంగా.. జూలై 12 నుంచి ఆరంభం కానున్న వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా ఆటగాళ్లు జెర్సీలపై మరోసారి డ్రీమ్ 11 లోగోలతో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించింది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిన్ 2023-25 సైకిల్‌లో భాగంగా విండీస్‌తో తొలి టెస్టుతో డ్రీమ్11 ప్రయాణం ప్రారంభమవుతుందని తెలిపింది.
కంగ్రాట్స్ డ్రీమ్11
ఈ విషయం గురించి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ మాట్లాడుతూ.. ‘‘మరోసారి మాతో ప్రయాణం సాగించనున్న డ్రీమ్11కు అభినందనలు. బీసీసీఐ అధికారిక స్పాన్సర్ నుంచి ప్రధాన స్పాన్సర్‌గా ఎదగడం అభినందనీయం. బీసీసీఐ- డ్రీమ్11 మధ్య బంధం మరింత బలపడింది.
సంతోషంగా ఉంది
ఈ ఏడాది ఐసీసీ వరల్డ్‌కప్ నిర్వహించనున్న తరుణంలో ఈ ఒప్పందం జరగడం సంతోషకరం’’ అని హర్షం వ్యక్తం చేశాడు. ఇక డ్రీమ్ స్పోర్ట్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ హర్ష్ జైన్.. బీసీసీఐ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించనుండటం గర్వంగా ఉందని తెలిపాడు.
భారత క్రీడా రంగానికి తమ వంతు సేవ చేయడంలో మరో ముందడుగు పడిందని వ్యాఖ్యానించాడు. కాగా అంతకుముందు ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ భారత జట్టు జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2020 టైటిల్ స్పాన్సర్‌గా డ్రీమ్11.. బీసీసీఐతో తొలిసారి జట్టుకట్టింది.
చదవండి: ఎందుకిలా చేశావు ధోని భయ్యా! మిస్టర్ కూల్ ఆన్సర్‌తో దిమ్మతిరిగిపోయింది!
Comments
Please login to add a commentAdd a comment