డ్రీమ్‌-11కు షాకిచ్చిన క్యాబ్‌ డ్రైవర్‌...! | Dream11 Suspends Operations In Karnataka After Complaint Cab Driver | Sakshi
Sakshi News home page

Dream11: డ్రీమ్‌-11కు షాకిచ్చిన క్యాబ్‌ డ్రైవర్‌...!

Published Mon, Oct 11 2021 5:46 PM | Last Updated on Mon, Oct 11 2021 6:21 PM

Dream11 Suspends Operations In Karnataka After Complaint Cab Driver - Sakshi

కొద్ది రోజుల క్రితం టీమిండియా జెర్సీ స్పాన్సర్‌ మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఎమ్‌పీఎల్‌) కంపెనీకు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చిన విషయం తెలిసిందే.  కర్ణాటకలో ఎమ్‌పీఎల్‌ను నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

నిలిచిపోయిన డ్రీమ్‌-11 సేవలు..! 
గత కొద్ది రోజల నుంచి కర్ణాటక ప్రభుత్వం ఆన్‌లైన్‌ గేమింగ్‌, గ్యాబ్లింగ్‌, బెట్టింగ్‌ యాప్స్‌పై కర్ణాటక ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విరుచుకపడింది. ప్రముఖ ఆన్‌లైన్‌ ఫాంటసీ గేమింగ్‌ యాప్‌ ఎమ్‌పీఎల్‌ సేవలను అక్టోబరు 5న కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. అయితే ఈ సమయంలో మరో దిగ్గజ ఫాంటసీ గేమింగ్‌ యాప్‌ డ్రీమ్‌-11పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగా తాజాగా  బెంగుళూరులో 42 ఏళ్ల క్యాబ్‌ డ్రైవర్‌ డ్రీమ్‌-11పై పోలీసులో స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చట్టాల ప్రకారం డ్రీమ్-11 నియమాలను ఉల్లంఘిస్తోందని సంస్థ యాజమాన్యంపై ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో కర్ణాటకలో డ్రీమ్‌-11 సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ కంపెనీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. 
చదవండి: ఒక్కసారి ఛార్జ్‌తో 1360 కిలోమీటర్ల ప్రయాణం..!

స్పందించిన డ్రీమ్‌-11
బెంగుళూరులో  డ్రీమ్‌-11పై కేసు నమోదుకావడంతో యాజమాన్యం చట్టపరమైన నివారణ చర్యలను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర చట్టాలకు కట్టుబడే డ్రీమ్‌-11 సేవలను అందిస్తున్నామని కంపెనీ వెల్లడించింది. గతంలో కూడా డ్రీమ్‌-11 అనేక చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంది. గత ఏడాది భారత్‌లో యూనికార్న్‌ క్లబ్‌లో చేరిన గేమింగ్‌ స్టార్టప్‌గా డ్రీమ్‌-11 అవతరించింది. 
చదవండి: ఆకాశమే హద్దుగా డీమార్ట్‌ దూకుడు...!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement