దర్శన్‌కు రాచమర్యాదలు.. ఏడుగురు జైలు అధికారుల సస్పెండ్‌ | 7 Prison Officials Suspended Over VIP Treatment For Actor Darshan In Jail | Sakshi
Sakshi News home page

దర్శన్‌కు రాచమర్యాదలు.. ఏడుగురు జైలు అధికారుల సస్పెండ్‌

Published Mon, Aug 26 2024 2:52 PM | Last Updated on Mon, Aug 26 2024 4:04 PM

7 Prison Officials Suspended Over VIP Treatment For Actor Darshan In Jail

బెంగళూరు:  కన్నడ నటుడు దర్శన్‌కు బెంగళూరు జైలులో అధికారులు ప్రత్యేక సదుపాయాలు కల్పించారనే వార్తలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. అభిమాని హత్య కేసులో దర్శన్‌ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. 

అయితే విచారణ ఖైదీగా ఉన్న దర్శన్ ‌రాజభోగాలు అనుభవిస్తున్నట్టుగా ఆరోపణలు తాజాగా వెల్లువెత్తాయి. జైలు లోపల దర్శన్ ఓ కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతూ పక్కనే ఉన్న కొందరితో ముచ్చిటిస్తున్న ఫొటో  బయటకు వచ్చింది. ఈ ఫోటోలు, వీడియోలో తాజాగా వైరల్‌గా మారడంతో జైల్లో దర్శన్‌కు వీఐపీ ట్రీట్‌మెంట్‌ లభిస్తోందనే వివాదం రాజుకుంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో కర్ణాటక ప్రభుత్వం స్పందించింది.

దర్శన్‌కు రాచమర్యాదలు చేసిన ఏడుగురు జైలు అధికారులపై వేటు పడింది. అధికారులను సస్పెండ్​ చేసి ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు కర్ణాటక హోం శాఖ మంత్రి జీ పరమేశ్వర తెలిపారు. దర్శన్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించిందెవరు.. అధికారులు ఏం చేస్తున్నారనే కోణంలో విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.

దర్శన్‌ ఫోటో, వీడియో విషయంపై డీజీపీతో చర్చించినట్లు తెలిపారు. ప్రాథమిక విచారణ ద్వారా ఈ వ్యవహారంలో ఏడుగురు జైలు అధికారుల ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. జైల్లోని సీసీ కెమెరాలు, విచారణ తర్వాతే ఈ వ్యవహారంలో ఏడుగురు జైలు అధికారులను సస్పెండ్‌ చేసినట్లు పేర్కొన్నారు. 

సెలబ్రిటీలైనా సరే ఇలాంటి చర్యలు ఎప్పటికీ సహించబోమని స్పష్టం చేశారు. అయితే జైలులో దర్శన్‌కు ఎలాంటి రాచమర్యాదలు జరగలేదని.. ఫోటో, వీడియో ఎలా బయటకొచ్చిందో విచారణలో తేలుతుంది.  ఖైదీలకు వీఐపీ ట్రీట్మెంట్ అందించే వీలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దర్శన్‌ ఎపిసోడ్‌పై లోతుగా విచారణ చేపట్టిననట్లు పేర్కొన్నారు.

కన్నడ నటుడు దర్శన్ కు జైల్లో వీఐపీ ట్రీట్ మెంట్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement