Bengaluru jail
-
దర్శన్‌కు రాచమర్యాదలు.. ఏడుగురు జైలు అధికారుల సస్పెండ్
బెంగళూరు: కన్నడ నటుడు దర్శన్‌కు బెంగళూరు జైలులో అధికారులు ప్రత్యేక సదుపాయాలు కల్పించారనే వార్తలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. అభిమాని హత్య కేసులో దర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే విచారణ ఖైదీగా ఉన్న దర్శన్ రాజభోగాలు అనుభవిస్తున్నట్టుగా ఆరోపణలు తాజాగా వెల్లువెత్తాయి. జైలు లోపల దర్శన్ ఓ కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతూ పక్కనే ఉన్న కొందరితో ముచ్చిటిస్తున్న ఫొటో బయటకు వచ్చింది. ఈ ఫోటోలు, వీడియోలో తాజాగా వైరల్‌గా మారడంతో జైల్లో దర్శన్‌కు వీఐపీ ట్రీట్మెంట్ లభిస్తోందనే వివాదం రాజుకుంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో కర్ణాటక ప్రభుత్వం స్పందించింది.దర్శన్‌కు రాచమర్యాదలు చేసిన ఏడుగురు జైలు అధికారులపై వేటు పడింది. అధికారులను సస్పెండ్ చేసి ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు కర్ణాటక హోం శాఖ మంత్రి జీ పరమేశ్వర తెలిపారు. దర్శన్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించిందెవరు.. అధికారులు ఏం చేస్తున్నారనే కోణంలో విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.దర్శన్ ఫోటో, వీడియో విషయంపై డీజీపీతో చర్చించినట్లు తెలిపారు. ప్రాథమిక విచారణ ద్వారా ఈ వ్యవహారంలో ఏడుగురు జైలు అధికారుల ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. జైల్లోని సీసీ కెమెరాలు, విచారణ తర్వాతే ఈ వ్యవహారంలో ఏడుగురు జైలు అధికారులను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. సెలబ్రిటీలైనా సరే ఇలాంటి చర్యలు ఎప్పటికీ సహించబోమని స్పష్టం చేశారు. అయితే జైలులో దర్శన్‌కు ఎలాంటి రాచమర్యాదలు జరగలేదని.. ఫోటో, వీడియో ఎలా బయటకొచ్చిందో విచారణలో తేలుతుంది. ఖైదీలకు వీఐపీ ట్రీట్మెంట్ అందించే వీలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దర్శన్ ఎపిసోడ్‌పై లోతుగా విచారణ చేపట్టిననట్లు పేర్కొన్నారు. -
పెరోల్‌పై విడుదలైన శశికళ
-
శశికళ జైలు నుంచి బయటకు వచ్చిందా?
బెంగళూరు: నల్లరంగు కుర్తా వేసుకొని చేతిలో బ్యాగు పట్టుకొని శశికళ జైలులోకి దర్జాగా వస్తున్న సీసీటీవీ కెమెరా దృశ్యాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అక్రమాస్తుల కేసులో జయలలిత నెచ్చెలి అయిన శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహారం సెంట్రల్ జైల్లో శశికళ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, రూ. రెండు కోట్ల మేర లంచాలు ముట్టజెప్పి జైలులో శశికళ రాజభోగాలు అనుభవిస్తున్నారని, వీఐపీ తరహాలో జైలులో ఆమెకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారని జైళ్లశాఖ డీఐజీ డీ రూప ఆరోపించిన సంగతి తెలిసిందే. తన ఆరోపణలను సాక్ష్యంగా జైలు ప్రవేశద్వారంలోని సీసీటీవీ కెమెరాలో నమోదైన దృశ్యాలను ఏసీబీకి సమర్పించారు. సాధారణ దుస్తుల్లో శశికళ జైలు లోపలికి దర్జాగా వస్తున్న దృశ్యాలను ఈ వీడియోలో చూడొచ్చు. ఆమెకు రక్షణగా ఇద్దరు పురుష గార్డులు కూడా ఉన్నారు. శశికళ జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నారని ఆరోపించిన డీ రూపను కర్ణాటక ప్రభుత్వం బదిలీచేసిన సంగతి తెలిసిందే. జైళ్ల శాఖ నుంచి ఆమెను తప్పించి బెంగళూరు నగరంలో ట్రాఫిక్ బాధ్యతలను అప్పగించింది. జైలులో శశికళకు రాజభోగాల వ్యవహారంపై ప్రస్తుతం ఏసీబీ దర్యాప్తు జరుపుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే సీసీటీవీ కెమెరా దృశ్యాలను డీ రూప సమర్పించారు. -
సిస్టర్’ శశికళ
► చిన్నమ్మకు అవే మర్యాదలు ► సమాచార హక్కు చట్టంతో బట్టబయలు ► సామాజిక కార్యకర్త నరసింహమూర్తి సుప్రీం కోర్టులో పిటిషన్ తమిళనాడు ప్రజలకు ఒకప్పుడు శశికళగా తెలుసు. జయలలిత కన్నుమూసిన తరువాత చిన్నమ్మగా పరిచయం. బెంగళూరు జైలు కెళ్లిన నాటి నుంచి ఖైదీ శశికళగా నాలుగేళ్లపాటూ స్థిరమైన నామధేయం. మరి ఈ సిస్టర్ శశికళ ఎవరబ్బా అనుకుంటున్నారా. ఆమె మరెవరో కాదు బెంగళూరు జైలు అధికారుల చేత సిస్టర్ అంటూ ఎంతో గౌరవంగా పిలిపించుకునే మన శశికళే. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ప్రజల చిన్నమ్మ కర్ణాటక పౌరుల (జైలు అధికారులు)కు సోదరి అయ్యారు. సాధారణ ఖైదీ శశికళ అసాధారణ ఖైదీగా సేవలు అందుకోవడంతోపాటు జైలు అధికారులు, సిబ్బందితో సిస్టర్ అని పిలిపించుకునే స్థాయికి ఎదిగారని బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త నరసింహమూర్తి ఈ వివరాలను బైటపెట్టారు. అన్నాడీఎంకే (అమ్మ) ప్రధాన కార్యదర్శి శశికళ జైలు జీవితం గురించి సమాచార హక్కు చట్టం ద్వారా ఆయన సేకరించిన వివరాలను తమిళ సాయంకాల దినపత్రిక ‘తమిళ్ మురసు’ సోమవారం ప్రచురించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.సాధారణ ఖైదీగా జీవనం గడపాల్సిన శశికళ జైలు నిబంధనలకు ఏ మాత్రం లోబడకుండా వ్యవహరిస్తున్నట్లు తాను సమాచారం సేకరించానని ఆయన తెలిపారు. ప్రత్యేక దుస్తులు, ఐదు గదుల్లో ప్రత్యేక వసతులు, ప్రత్యేక వంటగది, పనివారలు, బయట నుంచి మందులు, కాళ్లు, చేతులు మసాజ్ చేసేందుకు పనివారు.. ఇలా అనేక సౌకర్యాలు పొందుతున్నట్లు కర్ణాటక జైళ్లశాఖ మాజీ డీఐజీ రూప లిఖితపూర్వక ఫిర్యాదుచేసిన సంగతిని ఆయన గుర్తుచేశారు. జైళ్లశాఖ ఉన్నతాధికారులకు శశికళ రూ.2 కోట్లు ముడుపులు చెల్లించి ఆ సౌకర్యాలు పొందుతున్నట్లుగా డీఐజీ చేసిన ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం రిటైర్డు ఐఏఎస్ వినయ్‌కుమార్ విచారణ జరుపుతున్నా శశికళ దర్జా జీవితాన్ని కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. జైలు నిబంధనల ప్రకారం శిక్ష అనుభవిస్తున్న ఖైదీ నెలకు రెండుసార్లు మాత్రమే ములాఖత్ కింద తనకోసం వచ్చేవారితో మాట్లాడవచ్చునని ఆయన అన్నారు. అయితే గత నెల 1, 5, 6, 11, 28, 31 ఇలా ఆరుసార్లు శశికళ తనవారిని కలుసుకున్నారని చెప్పారు. అలాగే ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఖైదీలను కలుసుకోవాల్సి ఉంది. అయితే శశికళను కలుసుకున్న వారు సాయంత్రం 6 గంటలు దాటినా ఆమెతోనే ఉన్నారు. గతనెల 11వ తేదీన షకీలా, వివేక్, కీర్తన, జయ, వెట్రివేల్, తమిళ్‌సెల్వన్, నాగరాజ్ మొత్తం ఏడుగురు శశికళతో మాట్లాడారని, వారిలో నలుగురు బంధువులమని పేర్కొనగా, మిగిలిన ముగ్గురు ఏమీ స్పష్టం చేయకుండానే కలుసుకోవడం గమనార్హమని ఆయన తెలిపారు. అలాగే జూలై 5వ తేదీన డాక్టర్ వెంకటేష్, టీటీవీ దినకరన్, పళనివేల్, ఎమ్మెల్యే కేవీ రామలింగం, తమిళ్‌మగన్ హుస్సేన్, వెట్రివేల్ తదితరులు సందర్శకుల సమయం దాటిపోయిన తరువాత కూడా గంటల తరబడి శశికళతో కూర్చుని మాట్లాడుకున్నారని చెప్పారు. నెలకు ఇద్దరు చొప్పున శశికళ జైలుకెళ్లిన ఈ ఏడు నెలల్లో 14 మందికి గానూ 52 మందితో ఆమె ములాఖత్ అయ్యారని ఆయన చెప్పారు. గత నెల 28వ తేదీన ఒక ఖైదీ తండ్రి చనిపోగా ఈవిషయాన్ని చెప్పేందుకు ఖైదీ భార్య, మరో మహిళ ఉదయం 8 గంటలకు రాగా సాయంత్రం 5 గంటలకు వరకు జైలు అధికారులు అనుమతించలేదని ఆయన తెలిపారు. అంతేగాక అనేక హామీ పత్రాలు, తనిఖీలు జరిగిన తరువాతనే వారిని ఆనుమతించారని తెలిపారు. ధనవంతులకు అనేక వెసులుబాట్లు, పేదలకు కఠిన నిబంధనలా అని నరసింహమూర్తి ప్రశ్నించారు. తన కోసం వచ్చే సందర్శకులతో గంటల తరబడి మాట్లాడుతూ జైలులో ఆమె దర్బార్ నిర్వహిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. సాధారణ ఖైదీగా ఉన్న శశికళను సిస్టర్ అని మర్యాదగా సంబోధిస్తూ సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు సమాచార హక్కు చట్టం కింద సేకరించిన వివరాలను సాక్ష్యాధారాలతో సుప్రీం కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు ఆయన తెలిపారు. -
జైలు నిబంధనలకు విరుద్ధంగా శశికళ..
► నెలరోజుల్లో 28 మంది సందర్శకులు ► తెలుగుదేశం ఎమ్మెల్సీ మాగుంట మంతనాలు ► నిబంధనల అతిక్రమణతో దండన తప్పదంటున్న విశ్లేషకులు సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్షను అనుభవిస్తున్న శశికళ బెంగళూరు జైలులోనూ బిజీ బిజీగా గడుపుతున్నారు. జైలు నిబంధనలను తోసిరాజని నెలరోజుల్లో 31 మందితో చిన్నమ్మ మంతనాలు సాగించడం వివాదాస్పదమైంది. ఆస్తుల కేసులో దోషిగా నాలుగేళ్లపాటు ఆమె బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్షను అనుభవించాల్సి ఉంది. శశికళతోపాటు ఇళవరసి, సుధాకరన్ సైతం అదే కేసులో అదే జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అక్కడ ఆమెకు బైట నుంచి క్యారియర్ భోజనం, ఏసీ పడక, టీవీ, వార్తా పత్రికలు తదితర సౌకర్యాలు కల్పించినట్లు సమాచారం. ఆమెకు వీవీఐపీ వసతులు ఏవీ కల్పించలేదని, సాధారణ ఖైదీల నిబంధనలకు లోబడే వసతి కల్పించినట్లు జైలు అధికారులు చెబుతున్నారు. అయితే, జైలు నిబంధనలను శశికళ ధిక్కరించినట్లుగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వ జైళ్లశాఖ నిబంధనల ప్రకారం ఒక ఖైదీ తన న్యాయవాది, బంధువులు, స్నేహితులతో 15 రోజులకు ఒకసారి, కేవలం 15 నిమిషాలు మాత్రమే మాట్లాడవచ్చు. అయితే ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు ఈ 31 రోజుల్లో 28 మందిని శశికళ కలుసుకుని సంభాషించినట్లు జైలు రికార్డులు చెబుతున్నాయి. ఒక్కో సందర్శకునితో 15 నిమిషాలు మాత్రమే మాట్లాడాల్సి ఉండగా 40 నిమిషాలపాటు ఆమె సంభాషించారు. అంతేగాక మిలాఖత్ కోసం జైలు ఆవరణలోని ప్రత్యేక గదిని ఆమె వినియోగించుకున్నారు. నేడో రేపో ముఖ్యమంత్రి అయిపోతానని ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ఆమె జైలు పాలయ్యారు. తమిళనాడులో అన్నాడీఎంకేలోని ఆమె వర్గమే అధికారంలో ఉన్నా ఆ సుఖ సంతోషాలు, భోగభాగ్యాలకు చిన్నమ్మ దూరమయ్యారు. అయినా జైలు నుంచే తమ వారికి ఆదేశాలు పంపిస్తూ పార్టీ, ప్రభుత్వంపై పెత్తనం సాగిస్తున్నారు. పార్టీ, రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్ వద్ద పన్నీర్ వర్గం సవాలు చేయడం, ఆర్కేనగర్లో ఉప ఎన్నికలు ముంచుకురావడం, దినకరన్ గెలిచి తీరాలనే పరిస్థితులు నెలకొనడం తదితర కారణాలు జైల చిన్నమ్మకు కునుకుపట్టకుండా చేస్తున్నాయి. అందుకే తరచూ తన వారిని పిలిపించుకుని మాట్లాడుతున్నారు. చిన్నమ్మతో మాగుంట మంతనాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో ప్రముఖ పారిశ్రామికవేత్తగా వెలుగొందుతున్న తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి గత నెల 1వ తేదీన చిన్నమ్మను జైల్లో కలుసుకుని 20 నిమిషాలపాటూ మంతనాలు జరపడం గమనార్హం. అలాగే, అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ఫిబ్రవరి 20 నుండి మార్చి 8వ తేదీ మధ్యన రెండుసార్లు కలుసుకున్నారు. ఈ రెండుసార్లు సుమారు 45 నిమిషాలపాటూ ఆమెతో మాట్లాడారు. పార్లమెంటు ఉప సభాపతి తంబిదురై, బంధువులు వివేక్, కార్తికేయన్, న్యాయవాదులు శశికలను కలుసుకున్న వారిలో ఉన్నారు. శశికళతోపాటూ అదే సెల్లో ఉన్న ఇళవరసి కేవలం నాలుగుసార్లు మాత్రమే బంధువులను కలుసుకున్నారు. ఇదే కేసులో మరో ఖైదీ సుధాకరన్ ఒకే ఒకసారి బెంగళూరుకు చెందిన తన న్యాయవాదితో మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ విదేశీ మారకద్రవ్యం కేసును ఎదుర్కొంటున్న శశికళపై గత కొంతకాలంగా చెన్నైలోని ఎగ్మూరు కోర్టు విచారణ సాగుతోంది. ఇందులో బాగంగా ఈనెల 10వ తేదీన విచారణ ఉంది. బెంగళూరు కోర్టు నుండి విడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాల్సిందిగా శశికళ తరపు న్యాయవాది కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేయగా మేజిస్ట్రేటు అంగీకరించారు. ఈ మేరకు 10వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శశికళ విచారణను ఎదుర్కొంటున్నారు. దండన తప్పదా జైలు నిబంధనలకు విరుద్ధంగా 31 రోజుల్లో 28 మందితో ములాఖత్ అయినందుకు శశికళకు ప్రత్యేక దండన తప్పదేమోనని అనుకుంటున్నారు. ఉన్నతాధికారుల కళ్లుగప్పి ఈ తప్పిదానికి పాల్పడ్డారా లేక లోపాయికారితనంగా అనుమతి పొందారా అని అనుమానిస్తున్నారు. నిబంధనలను ఆమె అతిక్రమంచినట్లు రుజువైతే తగిన చర్య తప్పదని భావిస్తున్నారు. అయితే శశికళ అంశంపై వివరణ ఇచ్చేందుకు జైలు అధికారులు నిరాకరిస్తున్నారు. -
చిన్నమ్మ కోసం జైలు రూల్స్ బ్రేక్
బెంగళూరు: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడుపుతున్న చిన్నమ్మ శశికళ కోసం జైలు రూల్స్ బ్రేక్ చేస్తున్నారట. బెంగళూరు సెంట్రల్ జైలు నిబంధనలకు వ్యతిరేకంగా రోజుకు ఒక్క విజిటర్ నైనా ఆమె కలవడానికి అనుమతిస్తున్నారని వెల్లడైంది. 31 రోజుల్లో 27 మంది విజిటర్లు ఆమెను కలవడానికి వచ్చినట్టు తెలిసింది. రోజుకు ఓ విజిటర్ అయినా ఆమె దగ్గరకు రావడం బెంగళూరు జైలు మాన్యువల్ ప్రకారం కఠోర ఉల్లంఘన. కానీ ఆ రూల్స్ ను బెంగళూరు జైలు ఉల్లంఘిస్తోంది. మరోవైపు సాధారణ ఖైదీల్లా కాకుండా... శశికళ టీమ్ కు వీవీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నట్టు ఇండియా టుడే తెలిపింది. జైలు మాన్యువల్ ప్రకారం.. ఖైదీలను చూడటానికి విజిటర్లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల ప్రాంతంలోనే రావాలి. కొన్ని సందర్భాల్లో శశికళను, ఆమెతో పాటు శిక్ష అనుభవిస్తున్న మరో ఇద్దరు ఇల్లవరసి, సుధాకరన్ లను చూడటానికి వచ్చే విజిటర్లు సాయంత్రం 5 గంటల తర్వాత కూడా వస్తున్నారని తెలిసింది. జైలులో శిక్ష అనుభవిస్తున్న ప్రముఖులు వారానికోసారి లేదా 15 రోజుల్లో ఓసారి మాత్రమే ఇంటర్వ్యూ ఇవ్వడానికి మాత్రమే అర్హులై ఉంటారు. ఇప్పటివరకు శశికళను, ఇల్లవరసిని కలవడానికి వచ్చిన విజిటర్ల జాబితాను ఇండియా టుడే రాబట్టింది. ఆ జాబితా ప్రకారం 2017 ఫిబ్రవరి 16 నుంచి మార్చి 18 వరకు చెన్నైకు చెందిన అడ్వకేట్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు జైలుకు వచ్చి శశికళను కలిసినట్టు తెలిసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇల్లవరసి, సుధాకరన్ లు ప్రస్తుతం బెంగళూరులోని పరపణ్ణ అగ్రహార జైలు జీవితం అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. -
శశికళ కాదు...కిల్లర్ మల్లిక షిప్ట్..
కోల్ కత్తా : పరప్పణ అగ్రహారా జైలులో అన్నాడీఎంకే సుప్రిం శశికళకు పక్క సెల్లో ఉంటున్న సీరియల్ కిల్లర్ సెనైడ్ మల్లిక అలియాస్ కేడీ కెంపమ్మను వేరే జైలుకు తరలించారు. శశికళతో సన్నిహితంగా ఉంటుందనే నెపంతో ఆమెనే వేరే జైలుకు తరలించినట్టు తెలుస్తోంది. అయితే భద్రతా కారణాల దష్ట్యా ఆమెను పరప్పణ జైలు నుంచి బెలగావిలోని హిందాల్గా జైలుకి తరలించినట్టు పోలీసు అధికారులు పేర్కొన్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు చేసింది. దేశంలోనే తొలి మహిళా సీరియల్ కిల్లర్ మల్లిక. 2008 లో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. సెనైడ్ ను వాడుతూ 1999 నుంచి మొత్తం ఆరుగురు మహిళలను ఆమె హత్య చేసింది. అయితే ముందస్తు ఎలాంటి సమాచారం లేకుండానే ఆమెను వేరే జైలుకు తరలించారు. బ్యాగులన్నీ వెంటనే సర్దుకోవాలని, వేరే జైలుకి తనని మారుస్తున్నట్టు జైలు అధికారులు చెప్పారట. ప్రస్తుతం ఆమెను మరణశిక్ష పడ్డ ఖైదీలు, టెర్రర్ కేసులతో సంబంధం ఉన్న వారిని ఉంచుతున్న హిందాల్గా జైలుకి తరలించారు. శశికళ పక్క సెల్లో ఉంటున్న మల్లిక, ఆమెతో చాలా సన్నిహితంగా ఉంటుందని రిపోర్టు పేర్కొంటున్నాయి. 2014లో బెంగళూరు జైలుకి వెళ్లిన దివంగత ముఖ్యమంత్రి జయలలితకు కెంపమ్మ పెద్ద అభిమాని. అప్పుడు కూడా పలుమార్లు జయలలితను కలిపించాలని కోరిందట. -
నేలపైనే చిన్నమ్మ నిద్ర.. రోజుకు రూ. 50 జీతం