శశికళ కాదు...కిల్లర్ మల్లిక షిప్ట్..
శశికళ కాదు...కిల్లర్ మల్లిక షిప్ట్..
Published Wed, Feb 22 2017 2:11 PM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM
కోల్ కత్తా : పరప్పణ అగ్రహారా జైలులో అన్నాడీఎంకే సుప్రిం శశికళకు పక్క సెల్లో ఉంటున్న సీరియల్ కిల్లర్ సెనైడ్ మల్లిక అలియాస్ కేడీ కెంపమ్మను వేరే జైలుకు తరలించారు. శశికళతో సన్నిహితంగా ఉంటుందనే నెపంతో ఆమెనే వేరే జైలుకు తరలించినట్టు తెలుస్తోంది. అయితే భద్రతా కారణాల దష్ట్యా ఆమెను పరప్పణ జైలు నుంచి బెలగావిలోని హిందాల్గా జైలుకి తరలించినట్టు పోలీసు అధికారులు పేర్కొన్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు చేసింది. దేశంలోనే తొలి మహిళా సీరియల్ కిల్లర్ మల్లిక. 2008 లో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. సెనైడ్ ను వాడుతూ 1999 నుంచి మొత్తం ఆరుగురు మహిళలను ఆమె హత్య చేసింది.
అయితే ముందస్తు ఎలాంటి సమాచారం లేకుండానే ఆమెను వేరే జైలుకు తరలించారు. బ్యాగులన్నీ వెంటనే సర్దుకోవాలని, వేరే జైలుకి తనని మారుస్తున్నట్టు జైలు అధికారులు చెప్పారట. ప్రస్తుతం ఆమెను మరణశిక్ష పడ్డ ఖైదీలు, టెర్రర్ కేసులతో సంబంధం ఉన్న వారిని ఉంచుతున్న హిందాల్గా జైలుకి తరలించారు. శశికళ పక్క సెల్లో ఉంటున్న మల్లిక, ఆమెతో చాలా సన్నిహితంగా ఉంటుందని రిపోర్టు పేర్కొంటున్నాయి. 2014లో బెంగళూరు జైలుకి వెళ్లిన దివంగత ముఖ్యమంత్రి జయలలితకు కెంపమ్మ పెద్ద అభిమాని. అప్పుడు కూడా పలుమార్లు జయలలితను కలిపించాలని కోరిందట.
Advertisement