
బెంగళూరు: కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను జేడీఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. లైంగిక ఆరోపణల నేపథ్యంలోనే పార్టీ ఈ చర్యలు తీసుకుంది. ఇటీవల ఆయనపై లైంగిక ఆరోపణలు రాగా, కన్నడనాట రాజకీయంగా పెను దుమారం రేగింది. మరోవైపు ఈ వ్యవహారంలో ఆయనపై కేసు కూడా నమోదైంది. మంగళవారం జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో జేడీఎస్.. ఎంపీ ప్రజ్వల్‌పై సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు.
ప్రజ్వల్ సస్పెన్షన్ ముందు ఆయన బాబాయ్, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ వివాదం వెనక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హస్తం ఉందని ఆరోపణలు చేశారు. వెంటనే డిప్యూటీ సీఎం పదవి నుంచి డీకే శివకుమర్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. అసభ్యకరమైన వీడియోల్లో ప్రజ్వల్ ముఖం కనిపిస్తోందా? అందులో ఉన్నది అతడేననే ఆధారం ఏంటి?. అయినా సరే తాము నైతికత ఆధారంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఇక.. ప్రజ్వల్‌కు సంబంధించినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోల వ్యవహారంలో దర్యాప్తు కోసం కర్ణాటక ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎంపీ ప్రజ్వల్ భారత్ వదిలి జర్మనీ వెళ్లారు. దీంతో ఈ కేసుపై సిట్ బృందం విచారణ వేగవంతం చేసింది.
లోక్‌సభ ఎన్నికల వేళ రాజకీయంగా ఈ వ్యవహారం దుమారం రేగటంతో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై కోర్ కమిటీ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని సోమవారం జేడీఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment