Karnataka: Collector suspends employee for taking selfie with VIPs - Sakshi
Sakshi News home page

రాజకీయ నేతలతో సెల్ఫీలు.. ఉద్యోగికి కలెక్టర్‌ షాకింగ్‌ ట్విస్ట్‌

Published Tue, Apr 11 2023 9:48 AM | Last Updated on Tue, Apr 11 2023 10:56 AM

Collector Suspends Employee For Taking Selfie At Vips In Karnataka - Sakshi

దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ఎన్నికల విధుల్లో ఉండగా వీఐపీల వద్ద సెల్ఫీ తీసుకున్న ఉద్యోగిపై సస్పెన్షన్‌ వేటుపడింది. వివరాలు.. నెలమంగల తాలూకా సోలూరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో డ్రిల్‌ మాస్టర్‌ అయిన అంజన్‌కుమార్‌ను సోలూరు వద్ద చెక్‌ పోస్టులో తనిఖీ బృందం మేనేజర్‌గా నియమించారు.

మధ్యాహ్నం 2గంటల నుండి రాత్రి 10 గంటల వరకూ డ్యూటీ. ఈ సమయంలో అటుగా వచ్చిన ప్రముఖ రాజకీయ నేతలతో ఆయన సెల్ఫీలు తీసుకుని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీనిపై ఫిర్యాదులు రావడంతో బెంగళూరు గ్రామీణ జిల్లా కలెక్టర్‌ ఆర్‌.లత అతన్ని సస్పెండ్‌ చేశారు.
చదవండి: బ్యూటీషియన్‌కు షాక్.. లక్ష కడితే నెలకు రూ.40 వేల వడ్డీ.. చివరికి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement