Team India sponsorship Who Is Harsh Jain: టీమిండియా కొత్త స్పాన్సర్‌గా డ్రీమ్11ను ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. దేశంలోనే అతిపెద్ద ఫాంటసీ స్పోర్ట్స్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను తమ భాగస్వామిగా చేసుకున్నట్లు శనివారం వెల్లడించింది. మూడేళ్ల పాటు భారత ఆటగాళ్లు తమ జెర్సీలపై డ్రీమ్11 లోగోతో బరిలోకి దిగనున్నట్లు తెలిపింది.
నిజానికి క్రికెట్ ప్రేమికులకు డ్రీమ్11 గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్నగా మొదలై.. 15 ఏళ్ల కాలంలో ఎన్నో కష్టనష్టాలకోర్చి నేడు భారత జట్టు ప్రధాన స్పాన్సర్‌గా ఎదిగింది ఈ గేమింగ్ ప్లామ్‌ఫామ్. ఇందులో ఈ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ హర్ష్ జైన్‌ది కీలక పాత్ర.
150 సార్లు తిరస్కరణ
ముంబైలో జన్మించిన హర్ష్ జైన్ అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించాడు. తన కాలేజీ స్నేహితుడు భవిత్ సేత్‌తో కలిసి డ్రీమ్11ను ఏర్పాటు చేయాలని భావించాడు. అయితే వీరికి అడుగడుగునా అవాంతరాలే ఎదురయ్యాయి. నిధుల సమీకరణ కోసం ప్రయత్నించగా ఏకంగా 150 సార్లు ‘నో’ అనే సమాధానమే వచ్చింది.
కానీ పట్టువదలని విక్రమార్కుడిలా హర్ష్, భవిత్ సవాళ్లను అధిగమించి 2008లో డ్రీమ్11ను ఏర్పాటు చేశారు. క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్ వంటి ఫాంటసీ గేమ్‌లు ఆడుకునేందుకు వీలుగా ఉన్న గేమింగ్ ప్లాట్‌ఫామ్‌కు దాదాపు 150 మిలియన్ మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ప్రస్తుతం డ్రీమ్11 విలువ దాదాపు 67 వేల కోట్లు ఉంటుందని అంచనా.
భావోద్వేగ ట్వీట్‌తో
ఇదిలా ఉంటే.. బీసీసీఐతో మరోసారి జట్టుకట్టడం పట్ల హర్ష్ జైన్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘డ్రీమ్11 ఇండియా. గత 15 ఏళ్ల కాలంలో మేము ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం. అయితే, ఈసారి భారత క్రికెట్ జట్టు జెర్సీపై మా లోగో చూడబోతున్నాం. వ్యక్తిగతంగా నాకు అత్యంత గర్వకారణమైన విషయం ఇది. మా ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అని హర్ష్ జైన్ భావోద్వేగ ట్వీట్ చేశాడు. క్రికెట్ ప్రేమికుడైన తన కల ఇలా నెరవేరినందుకు హర్షం వ్యక్తం చేశాడు.
ప్రపంచంలోని సంపన్న బోర్డుతో
ఐపీఎల్-2020 సందర్భంగా ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐతో తొలిసారి జట్టుకట్టింది డ్రీమ్11. ఆ సీజన్‌లో టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఈసారి ఏకంగా జెర్సీ స్పాన్సర్‌గా లీగ్ స్పాన్సర్ అవతారమెత్తింది. ఇక వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జూలై 12 నుంచి ఆరంభం కానున్న టెస్టు సిరీస్‌లో డ్రీమ్11 లోగోలతో కూడిన జెర్సీలను భారత ఆటగాళ్లు ధరించనున్నారు.
చదవండి: రవీంద్ర జడేజాలా అతడు కూడా త్రీడీ క్రికెటర్.. డేంజరస్ హిట్టర్! కాబట్టి..
సచిన్, గంగూలీ, వీరూకు కలిసి రాలేదు! కానీ ధోని రూటే సపరేటు కదా!
DREAM11 INDIA.
— Harsh Jain (@harshjain85) July 1, 2023
In the last 15 years of running @Dream11 we've had many highs and lows, but seeing THIS on our Indian Cricket team jersey will be the PROUDEST moment for me personally! 🇮🇳🇮🇳🇮🇳
Thank you everyone for all your ❤️ and support always! 🙏🏼https://t.co/Ft8Qh9mA0d
Comments
Please login to add a commentAdd a comment