Harsh
-
ఆప్ X కాంగ్రెస్: మాటల యుద్ధం.. విపక్షాల కూటమిపై అనుమానాలు..?
రాయ్‌పూర్: ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి దారుణంగా ఉందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పాటుపై ప్రణాళికలు జరుగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఆరోపణలు ప్రతిపక్షాల ఐక్యమత్యంపై ప్రశ్నలను మిగిల్చుతున్నాయి. ప్రచార కార్యక్రమంలో మాట్లాడిన కేజ్రీవాల్.. ఢిల్లీలో విద్యా వ్యవస్థ ఎలా ఉండో చూడండని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చెప్పారు. ఢిల్లీ స్కూళ్లలో వసతులు, ఛత్తీస్‌గఢ్ పాఠశాలల్లో పరిస్థితుల గురించి అడిగి తెలుసుకోండని అన్నారు. రాష్ట్రంలో ఆప్‌ను అధికారంలోకి తీసుకువస్తే.. ప్రతి ఇంటికి 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. Why go to Raipur? Performance of our Chattisgarh govt will be compared with the previous Raman Singh govt. Let us choose a sector of your choice and compare the performance of Congress government in Delhi vs your govt here. Ready for a debate? रायपुर की उड़ान भरने से पहले… https://t.co/0wqOaOdOJO — Pawan Khera 🇮🇳 (@Pawankhera) August 19, 2023 ఛత్తీస్‌గఢ్ పాఠశాలల్లో పది తరగతులకు కలిపి ఒక్క టీచర్ ఉన్నారని అన్నారు. స్కూళ్లలో వసతులు దీనస్థితిలో ఉన్నాయని చెప్పారు. విద్యావ్యవస్థను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని అన్నారు. ఆప్ పార్టీ పేరులోనే సామాన్యుడనే అర్థం ఉంటుందని, సామాన్యుల కోసం పుట్టిన పార్టీ అని తెలిపారు. కేజ్రీవాల్ ఆరోపణలను కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా తిప్పికొట్టారు. కేజ్రీవాల్ దేశ రాజధానితో ఛత్తీస్‌గఢ్‌ను ఎందుకు పోల్చుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో గత ప్రభుత్వాల పనితీరుతో ప్రస్తుత కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చూడాలని అన్నారు. ఢిల్లీలో అంతా చక్కగా ఉంటే కేజ్రీవాల్‌కు రాయ్‌పూర్ రావాల్సిన అవసరం ఏంటని దుయ్యబట్టారు. ఇదీ చదవండి: బీజేపీకి ఎదురుదెబ్బ.. సింధియాను వీడి.. కాంగ్రెస్ చేరి.. -
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి స్టార్ ఫ్యాషన్ డిజైనర్‌గా..
ఫ్యాషన్ డిజైనర్‌కు రెండు కళ్లతో పాటు మూడో కన్ను ఉండాలి. ఆ కన్ను చారిత్రక,సాంస్కృతిక వైభవాన్ని చూడగలగాలి. కాలంతో పాటు నడుస్తూనే ముందు కాలాన్ని చూడగలగాలి. జైపూర్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ హర్ష్ అగర్వాల్‌కు ఈ సామర్థ్యం ఉంది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన 27 సంవత్సరాల హర్ష్ అగర్వాల్ ‘హరగో హ్యాండ్ ఎంబ్రాయిడ్ షర్ట్స్’తో అంతర్జాతీయ స్థాయిలో గెలుపు జెండా ఎగరేశాడు.... రెండు సంవత్సరాల క్రితం...ఆరోజు హర్ష్ అగర్వాల్ ఫ్యాషన్ లేబుల్ ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్‌కు నోటిఫికేషన్ల వరద మొదలైంది. పాపులర్ ఇంగ్లిష్ సింగర్ హారీ స్టైల్స్ ‘హరగో హ్యాండ్ ఎంబ్రాయిడ్ షర్ట్స్’ ధరించి ఉన్న ఫొటోలు అవి. జైపూర్ ఫ్యాషన్ బ్రాండ్ అంతర్జాతీయ స్థాయిలో వెలిగిపోతుంది అని చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. ‘ఇలా ఉండాలి. అలా ఉండాలి’ అంటూ చిన్నప్పుడు తన దుస్తులను తానే డిజైన్ చేయించేవాడు హర్ష్. ‘ఎకనామిక్స్ అండ్ బిజినెస్’లో పట్టా పుచ్చుకున్న హర్ష్ వేరే దారిలో ప్రయాణిస్తానని ఊహించలేదు. ‘ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్’ ఇంటర్న్‌షిప్ న్యూయార్క్‌లో చేస్తున్న రోజుల్లో ‘ఫ్యాషన్’ అనే మాట ఎక్కడ వినబడితే తాను అక్కడ ఉండేవాడు. పేరున్న ఫ్యాషన్ డిజైనర్లతో ముచ్చటించేవాడు. ఈ క్రమంలో తనకు సొంతంగా ఏదైనా చేయాలనిపించేది. ఇండియాకు తిరిగివచ్చిన తరువాత...పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు ఎన్నో ప్రాంతాలకు వెళ్లి మన చేనేతకళావైభవాన్ని రెండు కళ్లలో పదిలపరుచుకున్నాడు. వాటి నుంచి స్ఫూర్తి తీసుకొని తల్లి, సోదరితో కలిసి ‘హరగో హ్యాండ్స్’ అనే మెన్స్‌వేర్ లేబుల్‌కు శ్రీకారం చుట్టాడు. ముగ్గురితో మొదలైన ‘హరగో’లో ఇప్పుడు 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ టీమ్‌లో టైలర్లు, జూనియర్ డిజైనర్లు, ప్రొడక్షన్ ఇన్‌చార్జ్‌లు ఉన్నారు. ‘హస్తకళలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలనుకున్నాను. మన దేశానికి తనదైన గొప్ప సాంస్కృతిక, శిల్పకళావైభవం ఉంది. అది చేతివృత్తి కళాకారుల పనిలో ప్రతిఫలిస్తుంది. అలాంటి వారికి సహాయంగా నిలవాలనుకున్నాను’ అంటాడు హర్ష్ అగర్వాల్. ఒక డిజైన్ హిట్ అయిన తరువాత దాని వెంటే పయనించడం అని కాకుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్లపై వర్క్ చేస్తుంటాడు హర్ష్. ప్రతి రోజు ఒక కొత్త శాంపిల్ రూపొందిస్తాడు. 105 పీస్‌లు రెడీ కాగానే ప్రీ–ఆర్డర్స్ కోసం సోషల్ మీడియా పేజీలలో ప్రకటిస్తాడు. కోవిడ్ కల్లోలం సద్దుమణిగిన తరువాత కొత్త కలెక్షన్ కోసం ఇంటర్నేషనల్ బయర్స్ నుంచి ఆర్డర్లు వెల్లువెత్తాయి. లేబుల్ క్లాతింగ్ రిటైలర్లలో మ్యాచెస్ ష్యాషన్–లండన్, సెసెన్స్(మాంట్రియల్), ఎల్ఎమ్డీఎస్–షాంఘై, బాయ్‌హుడ్–కొరియా...మొదలైనవి ఉన్నాయి. ‘హరగో’కు ఇది టిప్పింగ్ పాయింట్‌గా మారింది. బ్రాండ్ అభిమానుల్లో ఇంగ్లాండ్‌కు చెందిన టెలివిజన్ హోస్ట్, ఫ్యాషన్ డిజైనర్ టాన్ ఫ్రాన్స్ ఉన్నాడు. ‘కొన్ని నెలల క్రితం హర్ష్ బ్రాండ్ గురించి విన్నాను. నా నెట్‌ఫ్లిక్స్ షో కోసం అతడు డిజైన్ చేసిన దుస్తులు ధరించాను. కొత్తగా, కంఫర్ట్‌గా అనిపించాయి. డిజైనింగ్‌లో హర్ష్‌కు తనదైన నేర్పు ఉంది’ అంటున్నాడు టాన్ ఫ్రాన్స్. హర్ష్ కొత్త కలెక్షన్ డిజైన్ స్కెచ్‌లతో మొదలు కాదు. నేతకళాకారులతో ముచ్చటించిన తరువాత ఒక ఐడియా వస్తుంది. దాన్ని మెరుగులు దిద్దడంపై దృష్టి పెడతాడు. ‘హర్ష్ వర్క్‌లో క్వాలిటీ మాత్రమే కాదు క్లాసిక్ లుక్ కనిపిస్తుంది’ అంటుంది టెక్స్టైల్ ఇనోవేషన్ ప్రాజెక్ట్ ‘అంబ’ ఫౌండర్ హేమ ష్రాఫ్ పటేల్. -
67 వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి! టీమిండియాతో ‘బంధం’: భావోద్వేగ ట్వీట్
Team India sponsorship Who Is Harsh Jain: టీమిండియా కొత్త స్పాన్సర్‌గా డ్రీమ్11ను ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. దేశంలోనే అతిపెద్ద ఫాంటసీ స్పోర్ట్స్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను తమ భాగస్వామిగా చేసుకున్నట్లు శనివారం వెల్లడించింది. మూడేళ్ల పాటు భారత ఆటగాళ్లు తమ జెర్సీలపై డ్రీమ్11 లోగోతో బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. నిజానికి క్రికెట్ ప్రేమికులకు డ్రీమ్11 గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్నగా మొదలై.. 15 ఏళ్ల కాలంలో ఎన్నో కష్టనష్టాలకోర్చి నేడు భారత జట్టు ప్రధాన స్పాన్సర్‌గా ఎదిగింది ఈ గేమింగ్ ప్లామ్ఫామ్. ఇందులో ఈ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ హర్ష్ జైన్‌ది కీలక పాత్ర. 150 సార్లు తిరస్కరణ ముంబైలో జన్మించిన హర్ష్ జైన్ అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించాడు. తన కాలేజీ స్నేహితుడు భవిత్ సేత్తో కలిసి డ్రీమ్11ను ఏర్పాటు చేయాలని భావించాడు. అయితే వీరికి అడుగడుగునా అవాంతరాలే ఎదురయ్యాయి. నిధుల సమీకరణ కోసం ప్రయత్నించగా ఏకంగా 150 సార్లు ‘నో’ అనే సమాధానమే వచ్చింది. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా హర్ష్, భవిత్ సవాళ్లను అధిగమించి 2008లో డ్రీమ్11ను ఏర్పాటు చేశారు. క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్ వంటి ఫాంటసీ గేమ్‌లు ఆడుకునేందుకు వీలుగా ఉన్న గేమింగ్ ప్లాట్‌ఫామ్‌కు దాదాపు 150 మిలియన్ మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ప్రస్తుతం డ్రీమ్11 విలువ దాదాపు 67 వేల కోట్లు ఉంటుందని అంచనా. భావోద్వేగ ట్వీట్‌తో ఇదిలా ఉంటే.. బీసీసీఐతో మరోసారి జట్టుకట్టడం పట్ల హర్ష్ జైన్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘డ్రీమ్11 ఇండియా. గత 15 ఏళ్ల కాలంలో మేము ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం. అయితే, ఈసారి భారత క్రికెట్ జట్టు జెర్సీపై మా లోగో చూడబోతున్నాం. వ్యక్తిగతంగా నాకు అత్యంత గర్వకారణమైన విషయం ఇది. మా ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అని హర్ష్ జైన్ భావోద్వేగ ట్వీట్ చేశాడు. క్రికెట్ ప్రేమికుడైన తన కల ఇలా నెరవేరినందుకు హర్షం వ్యక్తం చేశాడు. ప్రపంచంలోని సంపన్న బోర్డుతో ఐపీఎల్-2020 సందర్భంగా ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐతో తొలిసారి జట్టుకట్టింది డ్రీమ్11. ఆ సీజన్లో టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఈసారి ఏకంగా జెర్సీ స్పాన్సర్‌గా లీగ్ స్పాన్సర్ అవతారమెత్తింది. ఇక వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జూలై 12 నుంచి ఆరంభం కానున్న టెస్టు సిరీస్‌లో డ్రీమ్11 లోగోలతో కూడిన జెర్సీలను భారత ఆటగాళ్లు ధరించనున్నారు. చదవండి: రవీంద్ర జడేజాలా అతడు కూడా త్రీడీ క్రికెటర్.. డేంజరస్ హిట్టర్! కాబట్టి.. సచిన్, గంగూలీ, వీరూకు కలిసి రాలేదు! కానీ ధోని రూటే సపరేటు కదా! DREAM11 INDIA. In the last 15 years of running @Dream11 we've had many highs and lows, but seeing THIS on our Indian Cricket team jersey will be the PROUDEST moment for me personally! 🇮🇳🇮🇳🇮🇳 Thank you everyone for all your ❤️ and support always! 🙏🏼https://t.co/Ft8Qh9mA0d — Harsh Jain (@harshjain85) July 1, 2023 -
నాడు 150 సార్లు తిరస్కరించారు.. నేడు రూ. 65వేల కోట్లకు అధిపతి!
చిన్నప్పుడు చందమామ కథల్లో విక్రమార్కుని గురించి చదువుతుంటే కొంత ఆశ్చర్యం కలిగేది, ఎందుకంటే బేతాళున్ని తీసుకురావడానికి విక్రమార్కుడు మళ్ళీ మళ్ళీ చెట్టు దగ్గరికి వెల్తూనే ఉంటాడు. అయితే చివరికి అనుకున్నది సాధిస్తాడు. సరిగ్గా ఈ కథను పోలిన జీవితాన్ని హర్ష్ జైన్ అనుభవించాడు. 1986లో ముంబైలో జన్మించిన హర్ష్ జైన్ ప్రాథమిక విద్యను గ్రీన్లాస్ హైస్కూల్లో, ఆ తరువాత ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చేయడానికి ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి వెళ్ళాడు. చదువుకునే రోజుల్లోనే ఉపెన్ క్రికెట్ క్లబ్, ఇంట్రామ్యూరల్ ఫుట్‌బాల్ వంటి వాటిలో పాల్గొన్నాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కొంతమంది డ్రీమ్11 యాప్ ఉపయోగించి క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ, బాస్కెట్‌బాల్ వంటి ఫాంటసీ ఆటలను ఆడుతుంటారు. 2019 ఏప్రిల్‌లో డ్రీమ్11 "యునికార్న్ క్లబ్" లోకి ప్రవేశించిన మొదటి ఇండియన్ గేమింగ్ కంపెనీగా అవతరించింది. అతి తక్కువ కాలంలోనే గొప్ప స్థాయికి చేరుకున్న డ్రీమ్11 వెనుక చాలా పెద్ద కథ ఉంది. (ఇదీ చదవండి: రీల్స్ చెయ్.. లక్ష పట్టేయ్! తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్..) నిజానికి IPL మొదటిసారి ప్రారంభమైనప్పుడు, హర్ష్ జైన్ అతని కాలేజీ ఫ్రెండ్ భవిత్ డ్రీమ్11 ప్రారంభించాలనే ఆలోచనను కలిగి ఉన్నట్లు, నిధుల కోసం రెండు సంవత్సరాలు సుమారు 150 మంది వెంచర్ క్యాపిటలిస్ట్‌లను సంప్రదించామని, అయితే తన ఆలోచనలను వీరందరూ తిరస్కరించారని హర్ష్ తెలిపారు. డ్రీమ్11 ప్రారంభ రోజులలో ఇద్దరూ కష్టాలను ఎదుర్కొన్నారు, కానీ చివరికి విజయం సాధించారు. 2013లో హర్ష్ జైన్ డెంటిస్ట్ అయిన రచనా షాను వివాహం చేసుకున్నాడు, వీరికి క్రిష్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం వీరు దక్షిణ ముంబైలోని పెద్దార్ రోడ్లో రూ. 72 కోట్ల విలువైన లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్మెంట్లో ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా 2010 జులైలో ముంబైలో రెడ్ డిజిటల్ అనే సోషల్ మీడియా ఏజెన్సీ స్థాపించారు. ఈ సంస్థను 2013లో ముంబైలోని మార్కెటింగ్ ఏజెన్సీ గోజూప్ కొనుగోలు చేసింది. (ఇదీ చదవండి: మహిళల కోసం ఫైర్ బోల్ట్ నయా స్మార్ట్‌వాచ్ - తక్కువ ధర & ఎక్కువ ఫీచర్స్) 2017లో హర్ష్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ అధ్యక్షుడయ్యాడు. నేడు డ్రీమ్11 ఏకంగా 8 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 65,000 కోట్లకంటే ఎక్కువ. ఈ ప్లాట్ఫామ్లో సుమారు 150 మిలియన్స్ యాక్టివేట్ యూజర్స్ ఉన్నారు. ప్రస్తుతం భారతదేశంలోని అత్యంత ధనవంతులైన యువ బిలియనీర్లలో హర్ష్ జైన్ ఒకరుగా ఉన్నారు. -
విడుదలకు సిద్దమైన ‘సెహరి`
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా జ్ఞానసాగర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సెహరి’. వర్గో పిక్చర్స్ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి, ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ 60 లక్షల వీక్షణలు పొందగా, పాటలు యూట్యూబ్‌లో రికార్ట్ సృష్టించాయి. ముఖ్యంగా ‘ఇది చాలా బాగుందిలే’సాంగ్‌కి 80 లక్షలకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతూ..ఈ చిత్రంపై అంచనాలను పెంచింది. ఈ సందర్భంగా నిర్మాత అద్వయ జిష్ణు రెడ్డి మాట్లాడుతూ - `సెహరి టీజర్ మరియు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హీరో హర్ష్ కనుమిల్లి నటన చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. అంతే కాకుండా ఎక్కడ కూడా మొదటి సారిగా నటించినట్టుగా కాక ఎంతో అనుభవంతో నటిస్తున్నట్టుగా చాలా అధ్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఉన్నత నిర్మాణ విలువలతో నిర్మించబడిన ‘సెహరి’సినిమా కుటుంబ సమేతంగా వెళ్ళి హాయిగా నవ్వుకుని ఆనందించదగ్గ సినిమా అవుతుంది’అని చిత్ర విజయం పట్ల నిర్మాత ఆద్వయ జిష్ణు రెడ్డి దీమా వ్యక్తం చేశారు.దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక మాట్లాడుతూ -‘ఈ చిత్రంలోని కధ మరియు పాత్రలు అన్నీ యువత మరియు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాం’అన్నారు. -
ఎస్ఐ చెబితే పంపాలా?.. కానిస్టేబుల్ దురుసు ప్రవర్తన
సాక్షి, సిరిసిల్ల (కరీంనగర్): వేములవాడ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేసే మహేందర్ మంత్రి కేటీఆర్ పర్యటన బందోబస్తులో భాగంగా సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రి వద్ద విధులకు వచ్చారు. మంత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో సమావేశం జరుగుతుండగా ముస్తాబాద్ జెడ్పీటీసీ శరత్‌రావు కారులో ఆ సమావేశానికి వచ్చారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఆస్పత్రికి వెళ్లడానికి వీలులేదని తెలిపారు. తాను ప్రజాప్రతినిధినని సమావేశానికి వెళ్లాల్సిన అవసరం ఉందని అక్కడే విధుల్లో ఉన్న సిరిసిల్ల టౌన్ ఎస్ఐ అపూర్వరెడ్డికి జెడ్పీటీసీ తెలిపారు. వెంటనే కారును లోనికి పంపించాలని ఎస్ఐ తెలుపగా నేను మీరు చెబితే వినాల్సిన అవసరం లేదని వాగ్వాదానికి దిగాడు. అంతేకాకుండా కోవిడ్ నిబంధనలను బేఖాతర్ చేస్తున్నారు కాస్త మాస్కు ధరించడని చెబితే నా ఇష్టం అనే రీతిలో మాటలు వదిలిపెట్టారు. అక్కడనున్న స్థానికులు మిగతా పోలీసులు కలుగచేసుకుని కానిస్టేబుల్ విధానం సరికాదని తెలిపి గొడవ సద్దుమణిగేలా చేసి ప్రజాప్రతినిధిని సమావేశానికి అనుమతించారు. -
ఈ చాక్లెట్లో షుగర్ ఉందా, 200 మంది డాక్టర్లతో చర్చలు చివరికి ఇలా
స్వీట్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు! ముంబై కుర్రాడు హర్ష్ కేడియకు ఇంకాస్త ఎక్కువ ఇష్టం. అయితే ఆ అమితమైన ఇష్టానికి డయాబెటిస్ బ్రేక్ వేసింది. పన్నెండేళ్ల వయసులో హర్ష్ డయాబెటిస్ బారిన పడ్డాడు. ఇక అప్పటి నుంచి జీవనశైలి, అలవాట్లను పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. పార్టీలకు... చెక్.. స్వీట్లకు... కట్ పార్టీలకు... చెక్..స్వీట్లకు.... కట్... ఇలా రకరకాల చెక్‌లతో జీవితం దుర్భరప్రాయంగా అనిపించింది. ఖైదీ జీవితానికి తన జీవితానికి తేడా ఏమిటి! అని కూడా అనిపించింది. నోరు కట్టేసుకోకుండా రుచి మొగ్గలను మళ్లీ హుషారెత్తించడానికి ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ‘అసలు ఈ డయాబెటిస్ ఏమిటి?’ అని దాని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడానికి భారీ కసరత్తే చేశాడు. చాక్లెట్లో షుగర్ ఎంత ఉందో తెలుసుకునేందుకు రెండు వందల మందికి పైగా వైద్యులను కలిసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. టీవీల్లో టూత్ పేస్ట్ యాడ్ లా.. ఈ చాక్లెట్ లో షుగర్ ఉందా అని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ‘ఏ డయాబెటిక్ చెఫ్’ మార్కెట్టులో ‘షుగర్–ఫ్రీ’ పేరుతో అందుబాటులో ఉన్న చాలా చాక్లెట్లలో ఎంతో కొంత షుగర్ కూడా ఉన్నట్లు తెలుసుకోగలిగాడు. ఈ నేపథ్యంలోనే ‘డయాబెటిక్ ఫ్రెండ్లీ చాక్లెట్’ అనే ఐడియా మదిలో మెరిసింది.పేరుకి ‘షుగర్–ఫ్రీ’ అని కాకుండా 100 శాతం షుగర్–ఫ్రీ చాక్లెట్ తయారీ కోసం ఆలోచించాడు. ఎన్నో పుస్తకాలు తిరగేశాడు. అంతర్జాల సమాచార సముద్రంలో దూకాడు. డాక్టర్లు, న్యూట్రీషనిస్ట్లు, ఫుడ్సైంటిస్టులను కలిశాడు. తన నుంచి ఒక చెఫ్ బయటికి వచ్చాడు. ప్రయోగాల్లోనే కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఎకనామిక్స్‌లో పట్టా పుచ్చుకున్న హర్ష్ రకరకాల కంపెనీలలో పనిచేసి బిజినెస్ స్కిల్స్‌ను ఒంటబట్టించుకున్నాడు. తాను చేసిన పరిశోధన, వ్యాపార నైపుణ్యాలు, తల్లిదండ్రుల ఆశీస్సులు...అలా ముంబై కేంద్రంగా ‘ఏ డయాబెటిక్ చెఫ్’ అనే కంపెనీ మొదలుపెట్టాడు. ‘ఈ వయసులో ఇదొక దుస్సాహాసం’ అన్నవారు కూడా లేకపోలేదు. ‘సాహాసానికి వయసుతో పనేమిటి’ అని వెన్నుతట్టిన వారు కూడా లేకపోలేదు. ‘యంగ్ ట్రెండ్‌సెట్టర్’ టాప్ క్వాలిటీ ఇన్‌గ్రేడియంట్స్‌తో, రుచితో రాజీ పడకుండా, అయిదు రకాల ఫ్లేవర్లతో తయారుచేసిన ‘ఏ డయాబెటిక్’ చెఫ్ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి టాక్ వచ్చింది. 24 సంవత్సరాల హర్ష్ చిన్న వయసులోనే ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అండర్ 30–ఫోర్బ్స్ ‘యంగ్ ట్రెండ్‌సెట్టర్’ జాబితాలో చోటు సంపాదించాడు. మోటివేషనల్ స్పీకర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్న హర్ష్ కెడియ పేద డయాబెటిక్ పేషెంట్లకు ఆర్థిక సహాయం చేస్తున్నాడు. భవిష్యత్‌లో మరిన్ని సేవాకార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాడు. మోటివేషనల్ స్పీకర్‌గా హర్ష్ కెడియ పుస్తకాలు చదువుతాడు. తన భావాలను కాగితాలపై పెడతాడు. రచన అతనికేమీ కొత్తకాదు.‘డయాబెటిస్ సమస్య నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా సాధించిన విజయం వరకు తన అనుభవాలకు పుస్తకరూపం ఇస్తే బాగుంటుంది కదా!’ అనేవాళ్లతో మనం కూడా గొంతు కలుపుదాం. ఒక ప్రాడక్ట్‌కు మార్కెట్లో మంచి టాక్ రావాలంటే...అది పేరుతోనే మొదలవుతుంది. ‘ఏ డయాబెటిక్ చెఫ్’ అనే పేరుతో తొలి అడుగులోనే మార్కులు కొట్టేసిన హర్ష్ కేడియ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా యువతకు స్ఫూర్తిని ఇస్తున్నాడు. మోటివేషనల్ స్పీకర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. పేదరోగులకు సహాయం చేస్తూ మంచిమనసును చాటుకుంటున్నాడు. -
తిరిగివ్వొద్దు... పదిమందికి సాయపడండి!
ముంబైకి చెందిన హీనా మాండవియ కొడుకు హర్ష్‌కు ఐదేళ్లు ఉన్నప్పుడు భర్త కారు యాక్సిడెంట్లో మరణించారు. దీంతో కుటుంబ భారం హీనా మీద పడింది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతోన్న హీనా కొంతమంది దాతల సాయానికి తోడు రెక్కల కష్టంతో కుటుంబాన్ని లాక్కొచ్చింది. ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్నాక తనను ఆదుకున్న దాతలకు డబ్బు తిరిగివ్వబోతే..‘‘డబ్బులు వద్దమ్మా.. ఆపదలో ఉన్న ఓ పదిమందిని ఆదుకోండి! అని చెప్పడంతో హీనా, హర్ష్‌లు ఇద్దరూ కలిసి వేలమంది నిరుపేదల ఆకలి తీరుస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారు. గుజరాత్‌లోని జామ్ నగర్‌కు చెందిన హీనా... భర్త చనిపోయాక, హర్ష్‌కు మంచి విద్యను అందించేందుకు ముంబైకు మారారు. జీవిక కోసం హీనా టిఫిన్లు తయారు చేసి ఇస్తే.. హర్ష్ ఇంటింటికి తిరిగి వాటిని విక్రయించేవాడు. వీరి టిఫిన్లు శుచిగా రుచిగా ఉండడం తో కస్టమర్ల సంఖ్య రోజురోజుకి పెరిగింది. తల్లీ కొడుకులు పడుతున్న కష్టాన్ని గమనించిన ఒక కస్టమర్ అప్పట్లో కొంత సాయం చేశారు. ఆ డబ్బుతో ‘హర్ష్ థాలి అండ్ పరాటా’ పేరుతో ముంబైలో ఒక టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించారు. మొదట్లో హీనా ఒక్కతే టిఫిన్ సెంటర్‌ను చూసుకునేది. హర్ష్ డిగ్రీ పూరై్తన తరువాత వ్యాపారాన్ని విస్తరించాడు. ఆన్లైన్ బిజినెస్ బాగా జరగడంతో వారి ఆర్థిక ఇబ్బందులు కూడా కాస్త సర్దుకున్నాయి. లాక్డౌన్ కాలంలో... గతేడాది లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది ఆకలితో అలమటించారు. ఇది చూసిన ఓ కస్టమర్ వందమందికి భోజనం పెట్టగలరా? అని అడగడంతో తల్లీకొడుకులు వెంటనే ఒప్పుకుని వందమందికి ఉచితంగా ఆహారం అందిం చారు. ఈ ప్రేరణతో హర్ష్ అదేరోజు సాయంత్రం ‘ఉచితంగా భోజనం సరఫరా చేస్తాం’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కొంతమంది దాతలు సాయం చేయడానికి ముందుకు రావడంతో వీరు రోజూ 100 నుంచి 150 మంది ఆకలి తీర్చేవారు. అప్పటినుంచి ఇప్పటివరకూ తల్లీకొడుకులు నిరుపేదల ఆకలి తీరుస్తున్నారు. ‘‘స్థోమత లేకపోయినప్పటికి అమ్మ నన్ను మంచి స్కూల్లో చదివించాలనుకుంది. మా పరిస్థితిని అర్థం చేసుకున్న స్కూల్ డైరెక్టర్ మొత్తం ఫీజును మాఫీ చేశారు. చదువుకుంటూనే అమ్మకు టిఫిన్ల తయారీలో సాయపడేవాడిని. డిగ్రీ అయ్యాక నేను టì ఫిన్ సెంటర్ బాధ్యత తీసుకుని ఆన్లైన్లో వ్యాపారాన్ని విస్తరించడంతో మా ఆదాయం మూడు రెట్లు పెరిగింది. ఆర్థికపరిస్థితులు మెరుగు పడడంతో నా చిన్నప్పటి స్కూలు డైరెక్టర్ ఇంటికి వెళ్లి ఆయన చేసిన సాయానికి కృతజ్ఞతగా కొంత డబ్బు ఇవ్వబోతే.. అతను ‘‘నాకు ఇప్పుడు ఆ డబ్బు తిరిగి ఇవ్వనక్కరలేదు. అయితే నాలా మీరు మరికొంత మందికి సాయం చేయండి’’ అని చెప్పారు. అప్పటి నుంచి అవకాశం కోసం ఎదురు చూసిన మేము గతేడాది లాక్డౌన్ కాలంలో వంద ధాబాలలో ఫుడ్ తయారు చేయించి అడిగిన వారందరికీ ఆకలి తీర్చేవాళ్లం. ప్రస్తుతం కూడా పరిస్థితులు అప్పటిలానే ఉన్నాయి. అందుకే ఇప్పుడు కూడా నిరుపేదల ఆకలి తీరుస్తున్నాం’’ అని హర్ష్ చెప్పాడు. -
ప్రతీ జన్మలో నువ్వే భర్తగా రావాలి..
‘నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా. నువ్వులేని జీవితాన్ని అస్సలు ఊహించలేను కూడా. నా ప్రతీ ఆలోచనలో.. ప్రతీ క్షణంలో నువ్వే. నాకంటే నువ్వే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావని తెలుసు. చిన్న పిల్లలా నన్ను గారాబం చేస్తావు. నా ప్రతీ కోరికను నెరవేరుస్తావు. నేను మొండిగా ప్రవర్తించినపుడు నచ్చజెప్పుతావు. కేవలం ఏడు జన్మలకే కాదు... ప్రతీ జన్మలోనూ నువ్వే నా భర్తగా రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా’ అంటూ బాలీవుడ్ కామెడీ క్వీన్ భారతీ సింగ్ తన భర్త హర్ష్ లింబాచియాపై ఉన్న ప్రేమచాటుకున్నారు. తమ రెండో వివాహ వార్షికోత్సవం సందర్భంగా మెహందీ, సంగీత్, పెళ్లినాటి వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. తనపై ఎంతగానో ప్రేమ కురిపిస్తున్నందుకు భర్తకు ధన్యవాదాలు తెలిపారు. తన భర్తే తన సోల్‌మేట్, బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో బీ- టౌన్ సెలబ్రిటీలు సహా అభిమానుల నుంచి భారతీ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక హర్ష్ కూడా ఓ ఫన్నీ ఫొటోను షేర్ చేసి.. ‘రెండేళ్లుగా ఇలాగే ఉంది. అయినా నాకు నచ్చుతుంది’అంటూ క్యాప్షన్ జతచేశాడు. కాగా హిందీ టెలివిజన్ చరిత్రలో భారతీ సింగ్ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. టాప్ కమెడియన్‌గా, యాంకర్‌గా పేరు తెచ్చుకున్న భారతీ.. 2017 డిసెంబరు 3న అత్యంత సన్నిహితుల సమక్షంలో తన చిరకాల స్నేహితుడు హర్ష్ లంబాచియాను పెళ్లాడారు. ప్రతీ కార్యక్రమంలో తన భర్తతో కలిసి సందడి చేసే భారతీ.. వీలు చిక్కినప్పుడల్లా తమ బంధం గురించి సెటైర్లు వేస్తూనే భర్త పట్ల ఉన్న ప్రేమను చాటుకుంటారు. ప్రస్తుతం ఈ జంట ఓ ప్రముఖ చానెల్లో ప్రసారమవుతున్న రియాలిటీ షోలో పాల్గొంటున్నారు. View this post on Instagram Happy anniversary my soulmate @haarshlimbachiyaa30 ❤️ thankyou so much for everything 😍👍🏻 harsh main tumhare bina aapni life ka AK pal bhi nahi soch sakti 😘main tumse bahut payar karti hoon,aur mujh Se jayada tum mujh Se payar karte ho😍Chote baby ko kaise rakhte hai vaise tumne Mujhe rakha hai aur humesha meri har jid maani hai ❤️main god se yahi kahugi 7 janam nahi har janam maie tum hi mere husband bano 🙏🏽🙏🏽😇😇😘😘❤️❤️#love#haven#babu#soulmate #lifepartner #hubby#2 anniversary #mybestfriend ❤️❤️❤️❤️ A post shared by Bharti Singh (@bharti.laughterqueen) on Dec 2, 2019 at 2:30pm PST -
చాలా సంతోషంగా ఉంది
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలుగా ఎన్నికై శాసనసభకు రావడం చాలా సంతోషంగా ఉందని తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అన్నారు. ప్రజలు తమపై నమ్మకాన్ని ఉంచి నియోజకవర్గ ప్రతినిధులుగా అసెంబ్లీకి పంపారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని చెప్పారు. తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన హర్షవర్ధన్‌రెడ్డి(కొల్లాపూర్), హరిప్రియానాయక్(ఇల్లెందు), పైలట్ రోహిత్‌రెడ్డి(తాండూరు) గురువారం అసెంబ్లీలో మీడియాతో మాట్లాడుతూ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. పెండింగ్ సమస్యలపై పోరాడుతా.. ప్రజలు నాకిచ్చిన అరుదైన అవకాశం ఇది. కొల్లాపూర్ ప్రజలు నాపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు. నియోజకవర్గంలో 20 సంవత్సరాలకుపైగా కొన్ని సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు శాసనసభ్యునిగా పోరాటం చేస్తాను. కొల్లాపూర్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను.’ – హర్షవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే, కొల్లాపూర్ నమ్మకాన్ని వమ్ము చేయను ‘ఈ రోజు కోసం పదేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా. ఆ రోజు వచ్చింది. తాండూరు నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తా. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న నియోజకవర్గాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తా.’ – రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్యే, తాండూరు పోడు సమస్య పరిష్కారానికి కృషి చాలా సంతోషంగా ఉంది. ఇల్లెందు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు. మా నియోజకవర్గంలో పోడుభూముల సమస్య ఉంది. దీన్ని పరిష్కరించేందుకు ఎమ్మెల్యేగా కృషి చేస్తా. బయ్యారం స్టీలు ప్లాంటు ఏర్పాటుతోపాటు స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళతా. – హరిప్రియ, ఎమ్మెల్యే, ఇల్లెందు -
‘మీటూ’ నేపథ్యంలో...
హర్ష్, తులికా సింగ్, హిమాయత్, మధు నారాయణన్ ముఖ్య తారలుగా దీపక్ బల్దేవ్ ఠాకూర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లాస్ట్ సీన్’. జి.పి.ఏ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీ ప్రకాష్ ఠాకూర్ సమర్పణలో రూపొందుతోంది. భారతి సిమెంట్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) ఆర్.రాఘవ ప్రతాప్ ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. దీపక్ బల్దేవ్ ఠాకూర్ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన ‘మీటూ’ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జవహర్ రెడ్డి, ఎడిటర్ నాగిరెడ్డి మా చిత్రానికి పని చేస్తుండటం గర్వంగా భావిస్తున్నాం. మేజర్ షెడ్యూల్ ఊటీలో చేశాం. 80 శాతం చిత్రీకరణ పూర్తయింది’’ అన్నారు. ‘‘బహుముఖ ప్రతిభాశాలి అయిన దీపక్ బలదేవ్ తెరకెక్కిస్తోన్న ‘లాస్ట్ సీన్’ ఫస్ట్ లుక్ నా చేతుల మీదుగా విడుదల కావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ఘన విజయం సాధించి, చిత్రబృందానికి మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు ఆర్. రాఘవ ప్రతాప్. ‘‘మహా నగరం వెళ్లి దర్జాగా బతకాలనుకునే ఓ పల్లెటూరి అమ్మాయికి ఎదురైన ఆసక్తికర సంఘటనలతో రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయమవుతుండడం గర్వంగా ఉంది’’ అని తులికా సింగ్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనిల్–సంజీవ్. -
ఎవరి మీద ముసుగు?
రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘ముసుగు’. త్రినాథ్ పంపన, మనోజ్ కృష్ణ, హర్ష, జెస్సీ ముఖ్యతారలుగా శ్రీకర్‌బాబు దర్శకత్వంలో దగ్గుబాటి వరుణ్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ‘‘ఈ నెలాఖరులోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత తెలిపారు. ‘‘త్వరలో పాటలను విడుదల చేయనున్నాం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి పాటలు: ‘గంగోత్రి’ విశ్వనాథ్, సంగీతం: నవనీత్ చారి, సీఎన్ ఆదిత్య, స్క్రీన్‌ప్లే: దివాకర్‌బాబు, కెమెరా: శ్రీకర్‌బాబు. -
టెన్నిస్ విజేతలు అనికేత్, హర్ష
తెలంగాణ స్కూల్ అండర్-17 టోర్నీ ఎల్బీ స్టేడియుం: తెలంగాణ స్కూల్ గేమ్స్ అండర్-17 టెన్నిస్ టోర్నమెంట్లో బాలుర సింగిల్స్ టైటిల్‌ను వెంకట్ అనికేత్(హైదరాబాద్) కైవసం చేసుకున్నాడు. బాలికల ట్రోఫీని హర్ష సారుు (రంగారెడ్డి జిల్లా) గెలుచుకుంది. హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ సవూఖ్య ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియుంలోని టెన్నిస్ కోర్టులో జరిగిన బాలుర టైటిల్ పోరులో వెంకట్ అనికేత్ 7-4తో సారుు కార్తీక్‌రెడ్డి (హైదరాబాద్)పై విజయుం సాధించాడు. బాలికల తుదిపోరులో హర్ష సారుు 7-4తో శ్రావ్య శివాని (రంగారెడ్డి జిల్లా)పై గెలిచింది.