Harsh Kanumilli's Sehari Movie Will Released Soon - Sakshi
Sakshi News home page

Sehari : విడుద‌ల‌కు సిద్ద‌మైన ‘సెహ‌రి`

Published Tue, Nov 30 2021 4:16 PM | Last Updated on Tue, Nov 30 2021 4:47 PM

Sehari Movie Will Release Soon - Sakshi

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా జ్ఞానసాగర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘సెహరి’. వర్గో పిక్చర్స్‌ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి, ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన  టీజ‌ర్ 60 లక్షల వీక్షణలు పొందగా, పాటలు యూట్యూబ్‌లో రికార్ట్‌ సృష్టించాయి. ముఖ్యంగా ‘ఇది చాలా బాగుందిలే’సాంగ్‌కి 80 లక్షలకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతూ..ఈ చిత్రంపై అంచనాలను పెంచింది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత అద్వయ జిష్ణు రెడ్డి మాట్లాడుతూ - `సెహ‌రి టీజర్ మరియు పాటల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.  ముఖ్యంగా హీరో హర్ష్ కనుమిల్లి నటన చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది. అంతే కాకుండా ఎక్కడ కూడా మొదటి సారిగా నటించినట్టుగా కాక ఎంతో అనుభవంతో నటిస్తున్నట్టుగా చాలా అధ్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఉన్నత నిర్మాణ విలువలతో నిర్మించబడిన ‘సెహరి’సినిమా కుటుంబ సమేతంగా వెళ్ళి హాయిగా నవ్వుకుని ఆనందించదగ్గ సినిమా అవుతుంది’అని చిత్ర విజయం పట్ల నిర్మాత ఆద్వయ జిష్ణు రెడ్డి దీమా వ్యక్తం చేశారు.దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక మాట్లాడుతూ -‘ఈ చిత్రంలోని కధ మరియు పాత్రలు అన్నీ యువత మరియు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాం’అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement