Sehari: Hero Harsh Kanumilli Emotional Words About Bala krishna Deets Inside - Sakshi
Sakshi News home page

Sehari: కొన్ని సినిమాలకు ఆడిషన్స్‌కు వెళ్లినా సెలక్ట్‌ కాలేదు

Published Wed, Feb 9 2022 7:53 AM | Last Updated on Wed, Feb 9 2022 1:30 PM

Sehari Hero Harsh Kanumilli Thanks Balakrishna - Sakshi

‘‘లాక్‌డౌన్‌ సమయంలో మా ‘సెహరి’ పోస్టర్‌ని హీరో బాలకృష్ణగారు విడుదల చేశారు.. దాంతో మా సినిమా స్థాయి పెరిగింది. ఇందుకు ఆయనకు థ్యాంక్స్‌’’ అని హీరో హర్ష్‌ కనుమిల్లి అన్నారు. జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి జంటగా రూపొందిన చిత్రం ‘సెహరి’. వర్గో పిక్చర్స్‌ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో హర్ష్‌ కనుమిల్లి మాట్లాడుతూ– ‘‘నేను కొన్ని షార్ట్‌ ఫిలింస్‌ చేశాను. కొన్ని సినిమాలకు ఆడిషన్స్‌కి వెళ్లినా సెలక్ట్‌ కాలేదు. ‘నిన్ను నువ్వే ప్రూవ్‌ చేసుకోవాలి’’ అని నా స్నేహితులు చెప్పిన మాటలతో కసి పెరిగి, హీరోగా ‘సెహరి’ చేశాను. ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమా ఇది. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘సెహరి’లో నేను నటుడిగా కొత్త తరహాలో కనిపిస్తాను. ఇకపైనా మంచి పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తాను’’ అన్నారు సంగీత దర్శకుడు కోటి.

సెహరి ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ సెలబ్రేషన్స్‌ ఫోటోల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

‘‘నా లైఫ్‌లో ‘సెహరి’ మర్చిపోలేనిది. బ్రదర్‌ అనిల్‌గారి వల్లే ఈ సినిమా చేశాను’’ అన్నారు జ్ఞానసాగర్‌ ద్వారక. ‘‘రెండు లాక్‌డౌన్‌లు తట్టుకుని ఈ స్థాయికి వచ్చాం.. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరించాలి’’ అన్నారు అద్వయ జిష్ణు రెడ్డి. కెమెరామేన్‌ అరవింద్‌ విశ్వనాథ్, సంగీత దర్శకుడు ప్రశాంత్‌ విహారి, సిమ్రాన్‌ చౌదరి, ఎడిటర్‌ రవితేజ గిరిజాల, నటీనటులు అక్షిత, అనీష, బాలకృష్ణ మాట్లాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement