
ఎవరి మీద ముసుగు?
రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘ముసుగు’. త్రినాథ్ పంపన, మనోజ్ కృష్ణ, హర్ష, జెస్సీ ముఖ్యతారలుగా శ్రీకర్‌బాబు దర్శకత్వంలో దగ్గుబాటి వరుణ్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ‘‘ఈ నెలాఖరులోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత తెలిపారు. ‘‘త్వరలో పాటలను విడుదల చేయనున్నాం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి పాటలు: ‘గంగోత్రి’ విశ్వనాథ్, సంగీతం: నవనీత్ చారి, సీఎన్ ఆదిత్య, స్క్రీన్‌ప్లే: దివాకర్‌బాబు, కెమెరా: శ్రీకర్‌బాబు.