ఆప్ X కాంగ్రెస్: మాటల యుద్ధం.. విపక్షాల కూటమిపై అనుమానాలు..? | AAP Congress Exchange Of Harsh Words | Sakshi
Sakshi News home page

ఆప్ X కాంగ్రెస్: మాటల యుద్ధం.. విపక్షాల కూటమిపై అనుమానాలు..?

Aug 19 2023 8:44 PM | Updated on Aug 19 2023 9:32 PM

AAP Congress Exchange Of Harsh Words  - Sakshi

రాయ్‌పూర్‌: ఆప్‌ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితి దారుణంగా ఉందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏర్పాటుపై ప్రణాళికలు జరుగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఆరోపణలు ప్రతిపక్షాల ఐక్యమత్యంపై ప్రశ్నలను మిగిల్చుతున్నాయి. 

ప్రచార కార్యక్రమంలో మాట్లాడిన కేజ్రీవాల్.. ఢిల్లీలో విద్యా వ్యవస్థ ఎలా ఉండో చూడండని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చెప్పారు. ఢిల్లీ స్కూళ్లలో వసతులు, ఛత్తీస్‌గఢ్‌ పాఠశాలల్లో  పరిస్థితుల గురించి అడిగి తెలుసుకోండని అన్నారు. రాష్ట్రంలో ఆప్‌ను అధికారంలోకి తీసుకువస్తే.. ప్రతి ఇంటికి 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. 

ఛత్తీస్‌గఢ్‌ పాఠశాలల్లో పది తరగతులకు కలిపి ఒక్క టీచర్ ఉన్నారని అన్నారు. స్కూళ్లలో వసతులు దీనస్థితిలో ఉన్నాయని చెప్పారు. విద్యావ్యవస్థను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని అన్నారు. ఆప్‌ పార్టీ పేరులోనే సామాన్యుడనే అర్థం ఉంటుందని, సామాన్యుల కోసం పుట్టిన పార్టీ అని తెలిపారు.           

కేజ్రీవాల్ ఆరోపణలను కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా తిప్పికొట్టారు. కేజ్రీవాల్ దేశ రాజధానితో ఛత్తీస్‌గఢ్‌ను ఎందుకు పోల్చుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో గత ప్రభుత్వాల పనితీరుతో ప్రస్తుత కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చూడాలని అన్నారు. ఢిల్లీలో అంతా చక్కగా ఉంటే కేజ్రీవాల్‌కు రాయ్‌పూర్ రావాల్సిన అవసరం ఏంటని దుయ్యబట్టారు.  

ఇదీ చదవండి: బీజేపీకి ఎదురుదెబ్బ.. సింధియాను వీడి.. కాంగ్రెస్‌ చేరి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement