Jesse
-
బిగ్‌బాస్ 5: ర్యాంప్ వాక్‌తో ఈలలేయించిన జెస్సీ
Model Jaswanth Padala In Bigg Boss 5: పలు యాడ్స్‌లో నటించిన మోడల్ జశ్వంత్ పడాల(జెస్సీ) పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ స్టైలిష్ లుక్స్‌తో హౌస్‌లో అడుగు పెట్టిన అతడు బిగ్‌బాస్ షో ద్వారా చాలా తొందరగానే ప్రేక్షకులకు అందులోనూ అమ్మాయిలకు కనెక్ట్ అవుతాడని చెప్పవచ్చు. మోడలింగ్ రంగంలో పలు అవార్డులు అందుకున్న ఇతడు ఎంత మంచివాడవురా సినిమాతో నటనారంగంలోకి కూడా ప్రవేశించాడు. బిగ్‌బాస్ ఐదో సీజన్లో ఎనిమిదో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన జెస్సీ.. సింగిల్ చిన్నోడే లవ్వులో పడ్డాడనే పాటతో ఎంట్రీ ఇచ్చాడు. మరి ఈ హౌస్‌లో అతడు నిజంగానే లవ్‌లో పడతాడా? అన్నది వేచి చూడాల్సిందే! -
యువ రక్తం అమ్మే కొత్త స్టార్టప్...
వయసు మీదపడ్డ తరువాత వచ్చే అనేక సమస్యలకు యువ రక్తం చెక్ పెడుతుందా? అవునంటున్నారు జెస్సీ కార్మాజిన్. అనడం మాత్రమే కాదు. అంబ్రోసియా మెడికల్ పేరుతో ఈ స్టాన్‌ఫర్డ్ వైద్యుడు ఓ కంపెనీ కూడా మొదలుపెట్టేవాడు. యువ దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ముసలివాళ్లకు ఎక్కించడం ఈ కంపెనీ పని. ఆశ్చర్యంగా ఉన్నా... ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. గత ఏడాది అంబ్రోసియా మెడికల్ కొంతమంది కార్యకర్తల సాయంతో ఓ అధ్యయనాన్ని నిర్వహించింది. పూర్తి వివరాలేమిటన్నది కంపెనీ చెప్పకపోయినా.. మంచి ఫలితాలే వచ్చాయని అంటోంది. తాము ఇప్పటికే దాదాపు 150 మందికి యువ రక్తం అందించామని కార్మాజిన్ తెలిపారు. రక్తం ఇచ్చిన వారి వయసు 18 – 25 మధ్య వయస్కులని... అందుకున్న వారు 35 నుంచి 92 మధ్య వయసు వారని వివరించారు. యువరక్తం అందుకున్న వయోవృద్ధుల్లో జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు నిద్ర, కండరాలశక్తి కూడా మెరుగుపడినట్లు గుర్తించామని వివరించారు. ఎలుకలపై గతంలో జరిగిన పరిశోధన కూడా యువరక్తం ఎక్కించుకోవడం ద్వారా ఆయుష్షు పెరుగుతుందని రుజువు చేసిందని చెప్పారు. అయితే కేవలం యువ రక్తం వల్లే ఈ ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతున్నాయా? లేక ఇతర కారణాలేవైనా ఉన్నాయా? అన్నది నిర్ధారించుకోవాలని కార్మిజిన్ వివరించారు. -
తమ్ముడిలాంటి వాడివని చెప్పేస్తా!
సీన్ మాది – టైటిల్ మీది ఈతరం ప్రేమకథలను అందంగా తెరకెక్కించగలడన్న పేరున్న స్టార్ డైరెక్టర్ తీసిన సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. హీరో, హీరోయిన్లకు టాలీవుడ్లో హాట్ కపుల్ అన్న పేరుంది. ఈ సన్నివేశాలున్న ఆ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం? కార్తీక్ జెస్సీని చూడడం అదే మొదటిసారి. కార్తీక్ ఫ్యామిలీ జెస్సీ వాళ్ల ఇంట్లోకి అద్దెకు దిగిన రోజది. ఆమెను చూడడమే ఎవరో ‘స్టాప్’ అంటే ఆగిపోయినట్టు చూస్తూ ఉండిపోయాడు. బయటకెళ్లేప్పుడు, ఇంట్లోకి వచ్చేప్పుడు, వీధిలో నిలబడి, జెస్సీ ఆఫీసుకు వెళ్లే టైమ్‌లో రోడ్‌పై బండి మీద కూర్చొని.. ఎక్కడెక్కడ జెస్సీ కనబడే అవకాశం ఉందో అన్ని చోట్లా ఆమెను చూడడం కోసం తిరగడమే పనిగా పెట్టుకున్నాడు కార్తీక్. సడెన్‌గా ఒకరోజు. కార్తీక్ ఇంట్లో జెస్సీ. అతడి చెల్లెలు అనుతో మాట్లాడుతూ కనిపించింది. క్యాజువల్‌గా వెళ్లి వాళ్ల ముందు నిల్చున్నాడు. అను అతడ్ని జెస్సీకి పరిచయం చేసింది. ‘‘హేయ్! రా! దిస్ ఈజ్ జెస్సీ. జెస్సీ.. మా అన్నయ్య. మీరిద్దరూ ఇంతవరకు మీట్ అవ్వలేదు కదా!’’ జెస్సీకి కార్తీక్‌ను పరిచయం చేస్తూ అడిగింది అను. ‘‘హాయ్! కార్తీక్!’’ తనను తాను పరిచయం చేసుకున్నాడు కార్తీక్. జెస్సీని పలకరించిన ఆనందం అతడి కళ్లల్లో చూడొచ్చు. ‘‘తెలుసు! మీ ఇంట్లో అందరూ అన్నిటికీ పిలుస్తూనే ఉంటారు కదా రోజంతా.. కార్తీక్.. కార్తీక్.. కార్తీక్.. పైకి వినిపిస్తుంది.’’ నవ్వుతూ జెస్సీ.‘‘సో అంటే.. నేను ఇంట్లో పని పాట లేకుండా కూర్చున్నానని మీకూ తెలిసిపోయిందంటారా?!’’ అడిగాడు కార్తీక్. జెస్సీతో మాట్లాడుతున్న ఆనందం అతడిలో ఏమాత్రం తగ్గలేదు. ‘‘నేను అలా అన్లా!’’ సర్దిచెప్పుతూ జెస్సీ. ‘‘మీరు మలయాళి కదా! తెలుగు బాగానే మాట్లాడుతున్నారు?’’ కార్తీక్. ‘‘అవును. కానీ మలయాళం కన్నా తెలుగు బాగా వచ్చు నాకు’’‘‘అవునా! ఎప్పట్నుంచి ఉంటున్నారిక్కడ?’’‘‘పుట్టినప్పట్నుంచీ..’’వారి మాటలలా సాగిపోతూనే ఉన్నాయి. కార్తీక్ అడిగేవన్నీ జెస్సీ చెప్తూ పోతోంది. వీరిద్దరి మాటల మధ్య అను ఒక మూడో మనిషి మాత్రమే! ఆ మూడో మనిషి మాట కూడా కార్తీక్‌కు డిస్టర్బెన్స్‌గా కనిపిస్తోంది. అంతలా జెస్సీకి దగ్గరవ్వాలన్నంత కోరిక పుట్టింది అతడికి. వీరి మాటల మధ్యలో కల్పించుకొని కావాలనే, అను.. ‘‘కార్తీక్! ఇంక బయలుదేరతావా!’’ అని మెల్లిగానే అడిగింది. కార్తీక్‌కు అక్కణ్నుంచి వెళ్లిపోవాలన్న ఆలోచనే లేదు. కానీ తప్పదు. వెళ్లిపోయాడు. మధ్యలో జెస్సీ, అను మాట్లాడుకుంటున్నప్పుడల్లా రూమ్‌లోకి ఏదో పనున్నట్లు వస్తూ, జెస్సీని చూస్తూ పోతున్నాడు కార్తీక్. అప్పటికే జెస్సీకి కార్తీక్ పడిపోయాడు. కార్తీక్‌కు ఇప్పుడు కెరీర్ గోల్ ఎంత ముఖ్యమో, జెస్సీ కూడా అంతే! జెస్సీ ఎక్కడ పనిచేస్తుందో కనుక్కున్నాడు. ఆమెను చూడడం కోసం చుట్టుపక్కలే తిరుగుతున్నాడు. అలా తిరుగుతుండగానే ఒకసారి ఆమె ఆఫీస్‌కు పక్కన్నే ఉన్న ఫుడ్‌కోర్ట్‌లో కార్తీక్ కనిపించాడు. ‘ఇతనేంటి ఇక్కడ?’ అని చూస్తూ, అతడికి దగ్గరగా కదిలింది. ‘‘హాయ్!’’ అన్నాడు కార్తీక్. ‘‘హలో!’’ అంది జెస్సీ.ఫుడ్ ఆర్డర్ చేసేందుకు క్యూలో నిలబడింది జెస్సీ. ఆమెకు పక్కనే వెళ్లి నిల్చున్నాడు కార్తీక్.అతణ్ని కొద్దిసేపు అలాగే చూస్తూ.. ‘‘నువ్ నన్ను.. ఫాలో చేయట్లేదు కదా?’’ అడిగింది జెస్సీ. దానికి నవ్వుతూ.. ‘‘హూ.. మీరు నన్ను ఫాలో చేయట్లేదు కదా?’’ అన్నాడు కార్తీక్. ‘‘హ్మ్.. మా ఆఫీస్ ఇక్కడే ఉంది. ఐ వర్క్ హియర్!’’ ‘‘కబాబ్స్ కూడా ఇక్కడే ఉంటుంది. అందుకే వచ్చా. నాకు బాగా ఇష్టం.’’ కార్తీక్ నవ్వుతూ చెప్పాడు. ఇద్దరూ నవ్వుకున్నారు. నవ్వుతూనే ఇంకొన్ని మాటలు పంచుకున్నారు. ‘బై’ చెప్పి ఫ్రెండ్స్‌తో వెళ్లిపోయింది జెస్సీ. కార్తీక్ జెస్సీకి పూర్తిగా పడిపోయాడు. మరో రోజు. జెస్సీ రెడీ అయి ఆఫీస్‌కు వెళుతోంది. ఆమె కోసమే కింద తనింట్లో ఎదురుచూస్తూ నిల్చున్న కార్తీక్ కూడా ఆమెను చూడ్డమే వెంట నడిచాడు.‘‘హాయ్! ఆఫీస్‌కా?’’ అడిగాడు.‘‘కాదు. క్రికెట్ ఆడటానికి! వస్తావా?’’ విసురుకుంటూ సమాధానమిచ్చింది జెస్సీ.కార్తీక్ ఏం మాట్లాడలేదు. జెస్సీ సమాధానం అలా ఉంది.ఏదో అనాలనుకుంటున్నాడు. అనలేకపోతున్నాడు. నడుస్తున్నాడు. జెస్సీని చూస్తున్నాడు. జెస్సీ మాత్రం తమను ఎవరన్నా చూస్తున్నారా అన్న భయంతో వెనక్కి తిరిగి తిరిగి చూస్తోంది. అది గమనించిన కార్తీక్, అడిగేశాడు వెంటనే.. ‘‘ఏంటలా వెనక్కి తిరిగి చూస్తున్నారు?’’ అని.‘‘నీతో మాట్లాడడం మా నాన్న చూస్తే చంపేస్తారు.’’ జెస్సీ మాటలకు కార్తీక్ ఏం మాట్లాడలేదు. ‘‘నీ వయసెంత?’’ జెస్సీనే మళ్లీ.‘‘ట్వంటీ టూ..’’‘‘నాకు ట్వంటీ ఫోర్. పర్లేదు.. నాన్నడిగితే నాకు తమ్ముడి లాంటివాడివని చెప్పేస్తా!’’ అంది. కార్తీక్ కాసేపు అక్కడే నిలబడిపోయాడు. మళ్లీ తేరుకొని, ‘‘ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఇక నుంచి నాకు సిస్టర్సే! ఒక్క నువ్వు తప్ప’’ అన్నాడు. ‘‘ఎందుకలా?’’ అడిగింది.‘‘బికాజ్ ఆమ్ ఇన్ లవ్ విత్ యూ జెస్సీ.’ -
ఎవరి మీద ముసుగు?
రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘ముసుగు’. త్రినాథ్ పంపన, మనోజ్ కృష్ణ, హర్ష, జెస్సీ ముఖ్యతారలుగా శ్రీకర్‌బాబు దర్శకత్వంలో దగ్గుబాటి వరుణ్ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ‘‘ఈ నెలాఖరులోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత తెలిపారు. ‘‘త్వరలో పాటలను విడుదల చేయనున్నాం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి పాటలు: ‘గంగోత్రి’ విశ్వనాథ్, సంగీతం: నవనీత్ చారి, సీఎన్ ఆదిత్య, స్క్రీన్‌ప్లే: దివాకర్‌బాబు, కెమెరా: శ్రీకర్‌బాబు. -
హల్చల్ చేస్తున్న తాత ఫోటోలు
బీజింగ్: ఆ తాత జీవితమంతా పంట పొలాల మధ్య పల్లెటూర్లో గడిచిపోయింది. ఎప్పుడూ సూటు ధరించింది లేదు. ఈ నేపథ్యంలో వృద్ధాప్యంలో ఉన్న తన తాతకు తాను చేసే పనిని తెలపాలనుకున్నాడు ఫోటోగ్రాఫర్ మనవడు. అనుకున్నదే తడవుగా తాతను తీసుకొని వెళ్లి ఫోటో షూట్ జరిపాడు. ఎప్పుడూ అలవాటు లేకపోయినా తాత కూడా పెద్ద మోడల్లా మనవడి కెమెరాకు ఫోజులిచ్చాడు. అంతే ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆ తాత ఇప్పుడు స్టైల్ ఐకాన్‌గా మారాడు. వివరాల్లోకి వెళ్తే... చైనాలో జెస్సి అనే యువకుడికి తాత బింకాయ్ అంటే వల్లమాలిన ప్రేమ. జెస్సీచిన్నతనంలో తాతతోనే ఎక్కువగా గడిపాడు. అయితే వృత్తిరిత్యా ఫోటోగ్రాఫర్ అయిన జెస్సీ.. జియామెన్‌లో ఫోటోగ్రఫి స్టూడియో నడుపుతున్నాడు. తాతకు తన మనవడు ఏం పనిచేస్తున్నది సరిగా తెలియదు.. కానీ ఏదో ఫోటోలు తీస్తుంటాడు అని మాత్రమే తెలుసు. దీంతో తాతకు తాను బ్రతకడానికి చేస్తున్న పనిని స్పష్టంగా తెలపాలనుకున్న జెస్సీ.. తాతతో ఫోటోషూట్ చేశాడు. మోడ్రన్ డ్రెస్సులో వివిధ భంగిమల్లో తాత ఇచ్చిన ఫోజులు ఇప్పుడు ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. దీనిపై జెస్సీ మాట్లాడుతూ.. ' చిన్నతనంలో తాతగారు నా కోసం ఎంతో చేశారు. ఆయన చెప్పే కథలు వింటూ పెరిగాను. 85 సంవత్సరాల వయస్సులో ఉన్న ఆయన్ను సంతోషంగా ఉంచాలనుకుంటున్నాను' అని తెలిపాడు. -
ఐ లవ్యూ జెస్సీ!
సినిమా వెనుక స్టోరీ - 19 మనం ఎవర్ని లవ్ చేయాలో ముందే డిసైడ్ చేసుకోగలమా? పోనీ, ప్రేమను వెతుక్కుంటూ వెళ్లగలమా? ప్రేమ... దానికదే జరగాలి. ఏదో మాయ చేసినట్టు ఉండాలి. తలకిందులు చేసెయ్యాలి. ఎప్పుడూ మనతో పాటే ఉండాలి. అదే నిజమైన ప్రేమ. ప్రపంచంలో ఎంతోమంది అమ్మాయిలున్నా... నేను జెస్సీనే ఎందుకు లవ్ చేశాను? జెస్సీ... చాలా అందంగా ఉంటుంది. క్లాసీ... బాగా చదువుకుంది... తనకొక స్టయిల్ ఉంది అండ్ సెక్సీ టూ. కార్తీక్ మనసు నిండా నిండిపోయింది జెస్సీ. కార్తీక్ తెలుగబ్బాయి. జెస్సీ మలయాళీ అమ్మాయి. ఈ ‘క్రాస్ బోర్డర్ లవ్ స్టోరీ’ని నేరేట్ చేస్తున్నాడు గౌతమ్ మీనన్. మహేశ్‌బాబు చాలా శ్రద్ధగా వింటున్నాడు. ఏదో ట్రాన్స్‌లోకి వెళ్లిపోయినట్టుగా సీన్స్, షాట్స్, ఆర్ఆర్ బిట్స్... అన్నీ చెప్పేసుకుంటూ పోతున్నాడు గౌతమ్. కథ ఇంత బాగా చెబుతున్నాడంటే, రేపు స్క్రీన్‌పై ఇంకెంత బాగా చూపిస్తాడో మహేశ్‌కి అర్థమవుతోంది. అక్క మంజుల తీసుకొచ్చిందీ ప్రపోజల్. కథ నచ్చింది. కానీ చేయలేడు. చేయకూడదు కూడా. మహేశ్‌కున్న ఇమేజ్‌కి ఇలాంటి సాఫ్ట్ లవ్‌స్టోరీ ఎలా సెట్ అవుతుంది? ‘‘గౌతమ్‌జీ... మనమో మంచి యాక్షన్ సినిమా చేద్దాం. మీరెప్పుడంటే అప్పుడు నేను రెడీ’’ చెప్పాడు మహేశ్ నవ్వుతూ. దట్స్ ఇట్. అక్కడితో ఆ కథ ఎండ్. గౌతమ్ మీనన్ ఇలా అనుకున్నాడంటే... అలా సినిమా మొదలెట్టేస్తాడు. మహేశ్ వద్దనుకున్న కథతో తమిళంలో శింబు, త్రిషతో ‘విన్నై తాండి వరువాయా’ మొదలెట్టేశాడు. ఇక్కడేమో మంజులను ఆ కథ హాంట్ చేస్తూ ఉంది. తెలుగులో ఇలాంటి ప్యూర్ అండ్ పొయిటిక్ లవ్స్టోరీలొచ్చి చాలా ఏళ్లయిపోయింది. ఇప్పుడు చేస్తే ఆడియన్స్ కచ్చితంగా కనెక్టవుతారు. మంజుల మళ్లీ కలిసింది గౌతమ్‌ని. ‘‘దీన్ని సైమల్టేనియస్‌గా తెలుగులో కూడా చేద్దాం’’ మంజుల ప్రపోజల్. ‘‘నాకేం ఇబ్బంది లేదు. మరి హీరో?’’ అడిగాడు గౌతమ్. మంజులకు నాగచైతన్య గుర్తొచ్చాడు. అప్పుడే ‘జోష్’తో లాంచ్ అయ్యాడు. క్యూట్ బాయ్. గౌతమ్‌ని తీసుకుని నాగార్జునను, నాగచైతన్యను కలిసింది. కథ వినగానే నాగ్, చైతన్య ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. ప్రాజెక్ట్ సెట్. ఇక మిగిలింది జెస్సీ కేరెక్టర్. తమిళంలో చేస్తున్న త్రిషను ఇక్కడ కంటిన్యూ చేయలేరు. ఎవరైనా బాలీవుడ్ హీరోయిన్ని పెడదామా? రకరకాల ట్రయల్స్. నాగచైతన్య కొత్తవాడు కాబట్టి కొత్తమ్మాయి అయితేనే బాగుంటుందని ఫైనల్ డెసిషన్. ఎక్కడున్నావమ్మా జెస్సీ? చెన్నై - స్టెల్లా మేరీస్ కాలేజ్‌లోకి ఓసారి కెమెరాను జూమ్ చేయండి. అదిగో వస్తోంది. క్లోజప్ వేయండి. ఎస్... తను సమంత... సమంత రూత్ ప్రభు. ఆమెతో పాటు కూర్చొని షుగర్‌లెస్ కాఫీ తాగినా తియ్యగానే ఉంటుంది. చుక్కల్లో జాబిలిలా మెరిసిపోతూ ఉంటుంది. ఆ మెరుపే ఆమెను మోడల్ని చేసింది. సమంతది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. బీకామ్ ఫినిష్ చేసి ఎంబీయే కోసం ఆస్ట్రేలియా వెళ్లే ప్రయత్నంలో ఉంది. ఫ్రెండ్స్‌తో కలిసి ఓ బర్త్‌డే పార్టీకెళ్లింది. అక్కడికొచ్చిన ఓ ప్రెస్ ఫొటోగ్రాఫర్ ఆమె ఫొటోలు తీసి పేపర్లో పబ్లిష్ చేశాడు. కట్ చేస్తే - ‘నాయుడు హాల్’ అనే ఫేమస్ క్లాత్స్టోర్ట్స్కి మోడలింగ్ చాన్స్. రూ.1500 రెమ్యునరేషన్. ఫస్ట్ మోడలింగ్ సూపర్‌హిట్. సమంతకు ఫుల్ క్రేజ్. చిక్ షాంపూ... ఇవా పౌడర్... ఇలా 100 వరకూ యాడ్ ఆఫర్స్. ఇదో సరదాలా ఉందామెకు. ఆ ఫ్రాగ్రెన్స్ అక్కడితో ఆగిపోదు కదా. రవివర్మన్ అనే కెమెరామ్యాన్‌కి సమంత ‘లైక్ ఎట్ ఫస్ట్ సైట్’. ఇక్కడ మళ్లీ కట్ చేయాలి. ఎందుకంటే - సమంత ఇప్పుడు సినిమా హీరోయిన్. ‘మాస్కోవిన్ కావేరీ’ అనే మూవీ. 2007 ఆగస్టులో షూటింగ్ స్టార్ట్. సమంతకు టైం బాలేదో, ప్రొడ్యూసర్‌కి పర్సు బాలేదో... సినిమా షూటింగ్ నత్తనడక నడుస్తోంది. కానీ సమంత ఫ్రాగ్రెన్స్ మళ్లీ పనిచేసింది. ఇంకో ఆఫర్. అధర్వ హీరోగా ‘బాణా కాత్తాడి’. ఈసారి కూడా సమంతకు టైమ్ బ్యాడేనా? ఇదీ నత్తనడకే. మళ్లీ కట్ చేస్తే... గౌతమ్ మీనన్ తెలుగు సినిమా కోసం హీరోయిన్ను వెతుకుతున్నాడని సమంతకు తెలిసి, ఫొటోలు పంపించింది. ఈ వంకతోనైనా తన ఫేవరేట్ డెరైక్టర్‌ను ఒక్కసారి కలిసేయొచ్చు. ఆడిషన్స్‌కి రమ్మని కాల్. భయపడింది. వెళ్లలేదు. సెకెండ్ టైమ్ కాల్. సిగ్గుపడింది. వెళ్లలేదు. థర్డ్ టైమ్ కాల్. ఇబ్బంది పడింది. వెళ్లక తప్పలేదు. ఎదురుగా గౌతమ్. మాట్లాడకుండా కూర్చుంది. ‘‘ఒక సీన్ చెబుతాను. యాక్ట్ చేసి చూపించు. కాఫీ షాపులో కార్తీక్ ఎదురుగా కూర్చుని నువ్వు మాట్లాడాలి’’ అంటూ తెలుగులో ఏవో డైలాగ్స్ చెప్పారు గౌతమ్. సమంతలో కంగారు. నాన్న తెలుగువాడే కానీ, పుట్టి పెరిగింది అంతా చెన్నైలో కావడంతో తమిళం, ఇంగ్లిషు తప్ప ఇంకేమీ రావు. బెరుకు బెరుగ్గానే సీన్ చేసి చూపించింది. గౌతమ్ ఫేస్‌లో ఎలాంటి రెస్పాన్సూ లేదు. తన పని అవుట్. అయినా హోప్ పెట్టుకుని రాలేదుగా. గౌతమ్‌ను చూడాలనుకుంది. చూసేసింది. ఇంటికి వెళ్తూ సమంత మైండ్ నిండా ఇవే ఆలోచనలు. అక్కడితో ఆ ఎపిసోడ్ మర్చిపోయింది. కానీ గౌతమ్ మర్చిపోలేదు. సమంతలో ఆయనకు జెస్సీనే కనిపిస్తోంది. ఆ బెరుకుతనం... ఆ ముగ్ధమోహనత్వం... ఆ మలయాళీ ఫేస్ కట్. మూడ్రోజుల తర్వాత సమంతకు ఫోన్. ‘యూ ఆర్ సెలెక్టెడ్’ అని. అప్పుడు చూడాలి సమంతను. చెన్నై సముద్రం కూడా ఆమె సంతోషం ముందు చిన్నబోయినట్టే అనిపించింది. కార్తీక్‌కి డెరైక్టర్ కావాలనేది డ్రీమ్. ఎవరైనా డెరైక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్ కావాలి. తమిళంలో ఆ డెరైక్టర్ క్యారెక్టర్ కేయస్ రవికుమార్ చేస్తున్నాడు. తెలుగులో కూడా ఎవరైనా పాపులర్ డెరైక్టర్ కావాలి. పూరీ జగన్నాథ్‌ను మించిన బెస్ట్ ఆప్షన్ లేదనిపించింది మంజులకు. నిజానికి పూరి స్క్రీన్ మీద కనబడ్డానికి పెద్ద ఇంట్రస్ట్ చూపడు. అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేస్తున్నప్పుడు హిందీ ‘శివ’లో స్టూడెంట్ గ్యాంగ్‌లో చేశాడు. ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’లో ఓ సీన్లో కనిపించాడు. అంతకు మించి ఏ సినిమాలో కనబడలేదు. కానీ గౌతమ్ స్టోరీ చెప్పగానే ఇంప్రెస్ అయిపోయాడు. వెంటనే గ్రీన్ సిగ్నల్. షూటింగంటే... బోలెడంత హడావిడీ, హంగామా. అరుపులూ కేకలు. కానీ గౌతమ్ మాత్రం చాలా సెలైంట్‌గా షూట్ చేసేస్తున్నాడు. అన్నీ తక్కువ తక్కువ డైలాగులు. సమంతను చీరలు కట్టుకోమన్నారు. ఆమెకేమో చీర అలవాటు లేదు. ఇబ్బంది పడిపోయింది. నాగచైతన్యతో లిప్‌లాక్ సీన్. సమంత కంగారుపడిపోయింది. కానీ గౌతమ్ ఆ షాట్‌ని చాలా ఈస్తటిక్గా తీశాడు. అలెప్పీ, చెన్నై, మాల్టా, కేరళ, తిరుచ్చి, తంజావూర్, న్యూయార్క్, రోమ్... ఇలాంటి చోట్ల బ్యూటిఫుల్ లొకేషన్స్‌ని కెమెరాలో క్యాప్చర్ చేశారు. గౌతమ్‌కో అలవాటు ఉంది. క్లైమాక్స్ ముందు రాసుకోడు. ఎయిటీ పర్సంట్ వరకూ స్క్రిప్టు రెడీ చేసుకుని షూటింగ్‌కి వెళ్లిపోతాడు. షూటింగ్ మధ్యలో క్లైమాక్స్ రాసుకుంటాడు. దీనికేమో శాడ్ ఎండింగ్ అనుకున్నాడు. మంజుల మాత్రం హ్యాపీ ఎండింగ్ కావాలని పట్టుబట్టింది. ఓకే. తమిళ్‌కి శాడ్. తెలుగుకి హ్యాపీ. కార్తీక్ సినిమా డెరైక్ట్ చేస్తాడు. ఆ సినిమాకి హీరో హీరోయిన్లు కావాలి కదా. గౌతమ్ ఇక్కడో చిన్న తమాషా చేశాడు. తమిళ వెర్షన్లో నాగచైతన్య, సమంతలతో ఆ గెస్ట్ రోల్స్ చేయించాడు. తెలుగులో శింబు, త్రిషతో యాక్ట్ చేయించాడు. తెలుగులో ‘జెస్సీ’ అని టైటిల్ పెడితే బాగుంటుంది కానీ, లవ్‌స్టోరీ అనే ఫీల్ రాదు. ఏదైనా పొయిటిక్ టైటిల్ పెట్టాలి. ఏదైనా మంచి పాటలోని పల్లవి పెడితే? ‘ఒక్కడు’లో ‘నువ్వేం మాయ చేసావో కానీ..’ అంటూ ఓ పాట ఉంది. ‘ఏ మాయ చేసావె’ టైటిల్ డన్. టోటల్ బడ్జెట్... పన్నెండున్నర కోట్లు. గౌతమ్‌కి 3 కోట్లు... రెహమాన్‌కి 2 కోట్లు... రీ-రికార్డింగ్‌కి 50 లక్షలు. నాగచైతన్యకు శాటిలైట్ రైట్స్... ఇవీ రెమ్యునరేషన్స్. 2010 వేలెంటైన్స్ డే వెళ్లిపోయిన 12 రోజుల తర్వాత ‘ఏ మాయ చేసావె’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సిల్వర్‌స్క్రీన్‌పై ఓ రొమాంటిక్ పొయిట్రీ చదువుతున్న ఫీలింగ్. రీ-రికార్డింగ్, విజువల్స్ అయితే ఎక్స్ట్రార్డినరీ. నాగచైతన్య - సమంత పెయిర్‌కి డిస్టింక్షన్ మార్క్స. ఏఎన్నార్, నాగార్జునలాగా నాగచైతన్య రొమాంటిసిజమ్లో ట్రేడ్‌మార్క్ చూపించాడు. సమంత అయితే అప్పుడే వికసించిన రోజాపువ్వులా ఫ్రెష్‌గా అనిపించింది. ముఖ్యంగా ఆమె వాయిస్. డబ్బింగ్ చెప్పిన చిన్మయిదే ఆ క్రెడిట్. ఒక్క హిట్‌తో సమంత కెరీర్ రూపురేఖలే మారిపోయాయి. గౌతమ్ ఈ సినిమాతో ఒక స్టెప్ ఎదిగాడు. పెద్దపెద్దవాళ్లు కూడా అప్రిషియేట్ చేశారు. సత్యన్ అందిక్కాడ్ లాంటి టాప్ మలయాళీ డెరైక్టర్, ఇప్పటివరకూ కేరళను ఇంతందంగా ఎవరూ చూపించలేదని మెచ్చుకున్నాడు. ఈ విషయంలో కెమెరామన్ మనోజ్ పరమహంసదే క్రెడిట్. అతనికిదే ఫస్ట్ సినిమా. ఇంతకీ ఈ మనోజ్ పరమహంస ఎవరో తెలుసా? ఎస్వీ కృష్ణారెడ్డి హీరోగా ‘పగడాల పడవ’ అనే సినిమా డెరైక్ట్ చేసిన యు.వి.బాబు కొడుకు. గౌతమ్ మీనన్ జీవితానుభవాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. ఓ రకంగా ఇది ఆయన సెమీ-బయోగ్రాఫికల్ ఫిల్మ్. అందుకే దీనికి సీక్వెల్ చేస్తానని ఎప్పటినుంచో చెబుతున్నాడు. మరి ఈసారి ఏ మాయ చేస్తాడో చూద్దాం!! వెరీ ఇంట్రస్టింగ్... * ఇందులో సమంత అన్నయ్యగా సుధీర్‌బాబు నటించారు. ఆ తర్వాత ఆయన ‘ఎస్ఎంఎస్’తో హీరోగా పరిచయమయ్యారు. * నాగచైతన్య తండ్రిగా కనబడింది ఈ చిత్ర నిర్మాత సంజయ్ స్వరూప్. మంజుల హజ్బెండ్. - పులగం చిన్నారాయణ