హల్చల్ చేస్తున్న తాత ఫోటోలు | Touching tribute to 'hipster' grandpa goes viral | Sakshi
Sakshi News home page

హల్చల్ చేస్తున్న తాత ఫోటోలు

Published Wed, Jan 27 2016 1:02 PM | Last Updated on Sun, Sep 3 2017 4:25 PM

హల్చల్ చేస్తున్న తాత ఫోటోలు

హల్చల్ చేస్తున్న తాత ఫోటోలు

బీజింగ్: ఆ తాత జీవితమంతా పంట పొలాల మధ్య పల్లెటూర్లో గడిచిపోయింది. ఎప్పుడూ సూటు ధరించింది లేదు. ఈ నేపథ్యంలో వృద్ధాప్యంలో ఉన్న తన తాతకు తాను చేసే పనిని తెలపాలనుకున్నాడు ఫోటోగ్రాఫర్ మనవడు. అనుకున్నదే తడవుగా తాతను తీసుకొని వెళ్లి ఫోటో షూట్ జరిపాడు. ఎప్పుడూ అలవాటు లేకపోయినా తాత కూడా పెద్ద మోడల్లా మనవడి కెమెరాకు ఫోజులిచ్చాడు. అంతే ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆ తాత ఇప్పుడు స్టైల్ ఐకాన్గా మారాడు.

వివరాల్లోకి వెళ్తే... చైనాలో జెస్సి అనే యువకుడికి తాత బింకాయ్ అంటే వల్లమాలిన ప్రేమ. జెస్సీచిన్నతనంలో తాతతోనే ఎక్కువగా గడిపాడు. అయితే వృత్తిరిత్యా ఫోటోగ్రాఫర్ అయిన జెస్సీ.. జియామెన్లో ఫోటోగ్రఫి స్టూడియో నడుపుతున్నాడు. తాతకు తన మనవడు ఏం పనిచేస్తున్నది సరిగా తెలియదు.. కానీ ఏదో ఫోటోలు తీస్తుంటాడు అని మాత్రమే తెలుసు.  దీంతో తాతకు తాను బ్రతకడానికి చేస్తున్న పనిని స్పష్టంగా తెలపాలనుకున్న జెస్సీ.. తాతతో ఫోటోషూట్ చేశాడు.

మోడ్రన్ డ్రెస్సులో వివిధ భంగిమల్లో తాత ఇచ్చిన ఫోజులు ఇప్పుడు ఆన్లైన్లో వైరల్గా మారాయి. దీనిపై జెస్సీ మాట్లాడుతూ.. ' చిన్నతనంలో తాతగారు నా కోసం ఎంతో చేశారు. ఆయన చెప్పే కథలు వింటూ పెరిగాను. 85 సంవత్సరాల వయస్సులో ఉన్న ఆయన్ను సంతోషంగా ఉంచాలనుకుంటున్నాను' అని తెలిపాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement