Want Dream11 To Win This CWC; Fans' Disappointment On India's New ODI Jersey - Sakshi
Sakshi News home page

Ind vs WI: దేశం కంటే వాళ్లే ఎక్కువైపోయారా? అప్పుడలా.. ఇప్పుడిలా! ఈసారి వరల్డ్‌కప్‌ గెలిచేది..

Published Wed, Jul 26 2023 5:53 PM | Last Updated on Wed, Jul 26 2023 6:22 PM

Want Dream11 To Win This CWC Fans Disappointment On India New ODI Jersey - Sakshi

BCCI Unveils Team India's New ODI Jersey: టీమిండియా కొత్త జెర్సీ డిజైనింగ్‌పై అభిమానులు మండిపడుతున్నారు. దేశం కంటే ప్రధాన స్పాన్సరే ఎక్కువైపోయిందా అంటూ బీసీసీఐపై విరుచుకుపడుతున్నారు. కాగా దేశంలోనే అతిపెద్ద ఫాంటసీ స్పోర్ట్స్‌ గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ డ్రీమ్‌11 భారత క్రికెట్‌ నియంత్రణ మండలితో జతకట్టిన విషయం తెలిసిందే.

విండీస్‌ సిరీస్‌తో మొదలు
టీమిండియా కిట్‌ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు మూడేళ్ల పాటు బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా భారత జట్టుతో తమ ప్రయాణం మొదలుపెట్టింది. జూలై 12న మొదలైన టెస్టు సిరీస్‌ సందర్భంగా భారత ఆటగాళ్లు తొలిసారి డ్రీమ్‌11 లోగోతో ఉన్న జెర్సీలు ధరించారు.

తెల్లని రంగు టీషర్టుపై రెడ్‌ కలర్‌లో ఉన్న డ్రీమ్‌11 లోగో, భుజాలపై నీలి రంగు గీతలతో టెస్టు జెర్సీని రూపొందించారు. ఇది ఏమంత బాగోలేదంటూ అప్పట్లో ఫ్యాన్స్‌ ఫైర్‌ అయ్యారు. తాజాగా వన్డే జెర్సీలో ఆటగాళ్లు ఫొటోలకు పోజులిచ్చిన వీడియోను బీసీసీఐ షేర్‌ చేయగా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

అందుకే ఫైర్‌ అవుతున్నారు
బ్లూ, ఆరెంజ్‌ కలర్స్‌ మేళవింపుతో రూపొందించిన ఈ జెర్సీపై INDIA కంటే DREAM11 లోగో పెద్దగా కన్పించడమే ఇందుకు కారణం. ప్రపంచంలోని సంపన్న బోర్డు దేశం పేరు కంటే.. ప్రధాన స్పాన్సర్‌కే ఎక్కువ విలువ ఇస్తున్నట్లు ఉందని నెట్టింట ట్రోల్‌ చేస్తున్నారు. ఈసారి వరల్డ్‌కప్‌ గెలిచేది టీమిండియా కాదు.. డ్రీమ్11 అన్నట్లుగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

అయితే, మరికొంత మంది మాత్రం.. దీనిని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని.. డబ్బులు పెడుతున్నారు కాబట్టి స్పాన్సర్లు తమకు వీలైనంత ఎక్కువ లబ్ది పొందాలని చూస్తారని పేర్కొంటున్నారు. కాగా టెస్టు సిరీస్‌ను 1-0తో గెలిచిన భారత జట్టు జూలై 27 నుంచి వన్డే సిరీస్‌కు సిద్ధమవుతోంది.

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్, రుతురాజ్‌ గైక్వాడ్, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్,   సంజూ సామ్సన్, ఇషాన్‌ కిషన్, శార్దుల్‌ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్, చహల్, కుల్దీప్, జైదేవ్‌ ఉనాద్కట్, సిరాజ్, ఉమ్రాన్‌ మాలిక్, ముకేశ్‌ కుమార్‌.

చదవండి: ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన.. ఇంత మొండితనం పనికిరాదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement