West Indies vs India, 1st ODI: వెస్టిండీస్‌తో తొలి వన్డేలో టీమిండియా క్రికెటర్ సంజూ శాంసన్‌కు చోటు ఖాయమేనని అభిమానులు భావించారు. వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ కంటే సీనియర్ అయిన ఈ కేరళ బ్యాటర్‌కే ఛాన్స్ ఇస్తారనుకున్నారు. అయితే, లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌తో ముందుకు వెళ్లాలనుకున్న మేనేజ్‌మెంట్ శుబ్‌మన్ గిల్‌తో పాటు ఇషాన్ కిషన్‌కు ఓపెనర్‌గా ఛాన్స్ ఇచ్చింది.
సంజూకు మరోసారి మొండిచేయి..
దీంతో వికెట్ కీపర్‌గా అవకాశం కోల్పోయినా టాపార్డర్‌లో సంజూకు చోటు దక్కుతుందనుకుంటే.. సూర్యకుమార్ యాదవ్ ఆ ఛాన్స్ కొట్టేశాడు. అతడు వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో సంజూ శాంసన్‌కు మరోసారి మొండిచేయే ఎదురైంది. ఈ నేపథ్యంలో ఈ కేరళ బ్యాటర్ అభిమానులు కెప్టెన్ రోహిత్ శర్మపై ధ్వజమెత్తారు. ముంబై ఆటగాళ్ల కోసం సంజూను బలి చేస్తున్నాడంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.
సూర్య జెర్సీ మారింది!
ఇదిలా ఉంటే.. బార్బడోస్ వన్డేలో సూర్యకుమార్ యాదవ్ సంజూ శాంసన్ జెర్సీ ధరించి బరిలోకి దిగడం విశేషం. తనకు సంబంధించిన లార్జ్ సైజ్ జెర్సీ అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్ అయిన సూర్యకు తన రెగ్యులర్ ఫిట్ మీడియం జెర్సీ కాకుండా లార్జ్ సైజ్ జెర్సీ ధరించడం అలవాటు.
అందుకే సంజూ జెర్సీతో
అయితే, మ్యాచ్ ఆరంభ సమయానికి మేనేజ్‌మెంట్ మీడియం సైజ్ జెర్సీ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త కిట్ కోసం సూర్య రిక్వెస్ట్ చేయగా.. అందుకు బీసీసీఐ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కానీ, అప్పటికపుడు ఇది అందుబాటులోకి వచ్చే ఛాన్స్ లేకపోవడంతో సూర్య.. సంజూ జెర్సీ ధరించినట్లు సమాచారం.
విఫలమైన స్కై
కాగా అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం.. ఆటగాళ్లు తాము ధరించిన జెర్సీలపై పేర్లను అంటించుకునే వీలులేదు. కాబట్టి సూర్యకుమార్.. 9తో ఉన్న సంజూ జెర్సీని వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సంజూ ఫ్యాన్స్ కొందరు.. ‘‘జట్టులో చోటు కొట్టేశావు.. ఆఖరికి జెర్సీ కూడానా? సూర్య’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఆట విషయానికొస్తే.. తొలి వన్డేలో సూర్య విఫలమయ్యాడు. కేవలం 19 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా విండీస్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది 1-0తో ఆధిక్యంలో ఉంది.
చదవండి: పాకిస్తాన్ అరుదైన ఘనత.. ప్రపంచంలోనే తొలి జట్టుగా! టీమిండియాకు కూడా
Comments
Please login to add a commentAdd a comment