రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి
Ind Vs WI Test Series- New Test Jersey: దాదాపు నెలరోజుల విరామం తర్వాత టీమిండియా మళ్లీ మైదానంలో దిగనుంది. బుధవారం నుంచి వెస్టిండీస్‌తో మొదలుకానున్న టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌లో భాగంగా రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ విండీస్‌తో ఆడనుంది. ఇదిలా ఉంటే.. టీమిండియా ప్రధాన స్పాన్సర్‌గా డ్రీమ్11 ఇటీవలే బీసీసీఐతో జట్టుకట్టిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో విండీస్‌తో సిరీస్ నేపథ్యంలో భారత ఆటగాళ్లు డ్రీమ్11 లోగోతో కూడిన జెర్సీలు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. తెలుపు రంగు టీషర్ట్‌పై ఎరుపు రంగులో ఉన్న డ్రీమ్11 లోగో, భుజాలపై నీలి రంగు గీతలతో టెస్టు జెర్సీ కొత్తగా కనిపిస్తోంది. అయితే, చాలా మంది టీమిండియా అభిమానులకు కొత్త జెర్సీలు నచ్చలేదు. క్రికెటర్ల ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రమంలో మిశ్రమ స్పందన వస్తోంది.
ఛీ.. మరీ ఇంత ఘోరంగా ఉందేంటి?
కొంతమంది కొత్త జెర్సీ బాగానే ఉందని పేర్కొంటుండగా.. మరికొంత మంది మాత్రం.. ‘‘ఛీ మరీ ఇంత ఘోరంగా ఉందేంటి? నాకైతే వాంతికొచ్చేలా ఉంది. డ్రీమ్11 లోగో మరీ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పాత జెర్సీలే చూడటానికి బాగుండేవి’’ అని ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. జూలై 12న తొలి టెస్టుతో టీమిండియా- వెస్టిండీస్ మధ్య వరుస సిరీస్‌లకు తెరలేవనుంది.
ఇక ఆగష్టు 13న జరిగే ఆఖరి టీ20తో భారత జట్టు వెస్టిండీస్ పర్యటన ముగియనుంది. ఇదిలా ఉంటే.. టీమిండియా ఆఖరిసారిగా డబ్ల్యూటీసీ ఫైనల్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో తలపడింది. ఇంగ్లండ్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో 209 పరుగుల భారీ తేడాతో ఓడి అపఖ్యాతి మూటగట్టుకుంది. ఈ క్రమంలో తాజా డబ్ల్యూటీసీ సైకిల్ ఆరంభ సిరీస్‌లో సత్తా చాటి తిరిగి గాడిలో పడాలని పట్టుదలగా ఉంది.
ఈ క్రమంలో డొమినికాలో జరుగనున్న తొలి టెస్టు కోసం అన్ని రకాలుగా సిద్ధమైంది. కాగా డ్రీమ్11 మూడేళ్ల పాటు బీసీసీఐ ప్రధాన స్పాన్సర్‌గా కొనసాగనున్న విషయం తెలిసిందే.
చదవండి: బాగా సన్నబడ్డ రోహిత్.. వడపావ్ ముద్రను చెరిపివేసుకున్న టీమిండియా కెప్టెన్
Team India in the headshot session with the new jersey. pic.twitter.com/4l13eieL6R
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2023
Comments
Please login to add a commentAdd a comment