GST Council meet: ఎరువులపై జీఎస్‌టీ తగ్గించేనా? | GST Council likely to deliberate on online gaming tax, Par panel recommendation on fertiliser | Sakshi
Sakshi News home page

GST Council meet: ఎరువులపై జీఎస్‌టీ తగ్గించేనా?

Published Sat, Jun 22 2024 6:05 AM | Last Updated on Sat, Jun 22 2024 6:05 AM

GST Council likely to deliberate on online gaming tax, Par panel recommendation on fertiliser

నేడే జీఎస్‌టీ కౌన్సిల్‌ కీలక భేటీ

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల తర్వాత జీఎస్‌టీ కౌన్సిల్‌ తొలిసారి భేటీ అవుతోంది. ఎరువులపై సబ్సిడీ రేటు తగ్గించాలంటూ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చేసిన సూచనతోపాటు, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై పన్ను అంశాలు శనివారం నాటి సమావేశంలో చర్చకు రానున్నాయి. 53వ జీఎస్‌టీ కౌన్సిల్‌ భేటీకి కేంద్ర ఆరి్థక మంత్రి అధ్యక్షత వహిస్తుండగా, రాష్ట్రాల ఆరి్థక మంత్రులు సైతం పాల్గొననున్నారు.

 జీఎస్‌టీలో ప్రస్తుతమున్న వివిధ రకాల రేట్లను కుదించాలన్న డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉండగా, దీనిపై ఏర్పాటైన మంత్రుల బృందం ఇప్పటి వరకు సాధించిన పురోగతి సైతం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎరువులపై జీఎస్‌టీలో 5 శాతం రేటు అమలవుతోంది. ఎరువుల తయారీలోకి వినియోగించే సల్ఫూరిక్‌ యాసిడ్, అమ్మోనియాపై 18 శాతం రేటు అమల్లో ఉంది. 

ఎరువుల తయారీలోకి వినియోగించే ముడి సరుకులతోపాటు పంట పోషక ఉత్పత్తులపైనా రేటు తగ్గించాలని ఈ రంగానికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సిఫారసు చేసింది. ఎరువులపై రేట్ల తగ్గింపు ప్రతిపాదనను జీఎస్‌టీ కౌన్సిల్‌ 45వ, 47వ సమావేశాల అజెండాల్లో చోటు కలి్పంచినప్పటికీ.. ఈ దిశగా మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చివరిగా జీఎస్‌టీ కౌన్సిల్‌ 52వ సమావేశం గతేడాది అక్టోబర్‌ 7న జరగడం గమనార్హం. ఆన్‌లైన్‌ గేమింగ్, పందేల మొత్తంపై 28 శాతం జీఎస్‌టీ రేటు 2023 అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వచి్చంది. ఆరు నెలల తర్వాత దీనిపై సమీక్ష చేపడతామని అప్పట్లోనే మండలి ప్రకటించింది. దీంతో ఇది చర్చకు వస్తుందని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement