subsidy on fertilizers
-
GST Council meet: ఎరువులపై జీఎస్టీ తగ్గించేనా?
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల తర్వాత జీఎస్టీ కౌన్సిల్ తొలిసారి భేటీ అవుతోంది. ఎరువులపై సబ్సిడీ రేటు తగ్గించాలంటూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సూచనతోపాటు, ఆన్లైన్ గేమింగ్‌పై పన్ను అంశాలు శనివారం నాటి సమావేశంలో చర్చకు రానున్నాయి. 53వ జీఎస్టీ కౌన్సిల్ భేటీకి కేంద్ర ఆరి్థక మంత్రి అధ్యక్షత వహిస్తుండగా, రాష్ట్రాల ఆరి్థక మంత్రులు సైతం పాల్గొననున్నారు. జీఎస్టీలో ప్రస్తుతమున్న వివిధ రకాల రేట్లను కుదించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉండగా, దీనిపై ఏర్పాటైన మంత్రుల బృందం ఇప్పటి వరకు సాధించిన పురోగతి సైతం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎరువులపై జీఎస్టీలో 5 శాతం రేటు అమలవుతోంది. ఎరువుల తయారీలోకి వినియోగించే సల్ఫూరిక్ యాసిడ్, అమ్మోనియాపై 18 శాతం రేటు అమల్లో ఉంది. ఎరువుల తయారీలోకి వినియోగించే ముడి సరుకులతోపాటు పంట పోషక ఉత్పత్తులపైనా రేటు తగ్గించాలని ఈ రంగానికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. ఎరువులపై రేట్ల తగ్గింపు ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ 45వ, 47వ సమావేశాల అజెండాల్లో చోటు కలి్పంచినప్పటికీ.. ఈ దిశగా మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చివరిగా జీఎస్టీ కౌన్సిల్ 52వ సమావేశం గతేడాది అక్టోబర్ 7న జరగడం గమనార్హం. ఆన్లైన్ గేమింగ్, పందేల మొత్తంపై 28 శాతం జీఎస్టీ రేటు 2023 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచి్చంది. ఆరు నెలల తర్వాత దీనిపై సమీక్ష చేపడతామని అప్పట్లోనే మండలి ప్రకటించింది. దీంతో ఇది చర్చకు వస్తుందని భావిస్తున్నారు. -
రైతు ఆత్మహత్యలు ఆపేందుకు పాదయాత్ర
జస్టిస్ చంద్రకుమార్ హైదరాబాద్: రైతు ఆత్మహత్యలు ఆపేందుకు ఆగస్టు 2న పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలం గాణ సామాజిక జేఏసీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ తెలిపారు. రంగాపూర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు 18 కిలోమీటర్లు ఈ యాత్ర సాగుతుందని చెప్పారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పాదయాత్ర పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వం నేరుగా రైతుల నుంచే పంటను కొను గోలు చేయాలని, విత్తనాలు, ఎరువులపై సబ్సిడీ ఇవ్వాలని జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా రంగాపూర్‌లో ఇటీవలే ఆదర్శ రైతుగా అవార్డు తీసుకున్న యువ రైతు పెండ్యాల మోహ నాచారి దంపతులు వ్యవసా యంలో నష్టం వచ్చి ఆత్మ హత్య చేసుకున్నారని చెప్పా రు. ఆత్మహత్యలు ఆపేందుకే అక్కడి నుంచే పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ యాత్రలో కుల, రైతు, వృత్తి సంఘాల ప్రతినిధులు సుమారు 500 మంది వరకు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు దేశగాని సాంబశివగౌడ్, రామనర్సయ్య, మోహన్‌రాజ్, సోగర బేగమ్, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.