రైతు ఆత్మహత్యలు ఆపేందుకు పాదయాత్ర
జస్టిస్ చంద్రకుమార్
హైదరాబాద్: రైతు ఆత్మహత్యలు ఆపేందుకు ఆగస్టు 2న పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలం గాణ సామాజిక జేఏసీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ తెలిపారు. రంగాపూర్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు 18 కిలోమీటర్లు ఈ యాత్ర సాగుతుందని చెప్పారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పాదయాత్ర పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రభుత్వం నేరుగా రైతుల నుంచే పంటను కొను గోలు చేయాలని, విత్తనాలు, ఎరువులపై సబ్సిడీ ఇవ్వాలని జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా రంగాపూర్‌లో ఇటీవలే ఆదర్శ రైతుగా అవార్డు తీసుకున్న యువ రైతు పెండ్యాల మోహ నాచారి దంపతులు వ్యవసా యంలో నష్టం వచ్చి ఆత్మ హత్య చేసుకున్నారని చెప్పా రు. ఆత్మహత్యలు ఆపేందుకే అక్కడి నుంచే పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ యాత్రలో కుల, రైతు, వృత్తి సంఘాల ప్రతినిధులు సుమారు 500 మంది వరకు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు దేశగాని సాంబశివగౌడ్, రామనర్సయ్య, మోహన్‌రాజ్, సోగర బేగమ్, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.