ఫిన్‌టెక్ దిగ్గజం భారత్ పే మాజీ ఫౌండర్ అష్నీర్ గ్రోవర్ రాజకీయాల్లోకి రానున్నారా? లేదంటే రావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తున్నాయి ఇటీవల కాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలు.
కేంద్రం ఆన్‌లైన్ గేమ్స్‌పై 28 శాతం జీఎస్టీని విధించింది. ఈ నిర్ణయాన్ని అష్నీర్ గ్రోవర్ వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ తీరుతో దేశంలో గేమింగ్ ఇండస్ట్రీ కుప్పకూలే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో తమ వాణిని వినిపించేందుకు టెక్నాలజీ స్టార్టప్ ఫౌండర్లు రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉందని ట్వీట్‌లో పేర్కొన్నారు.
RIP - Real money gaming industry in India. If the govt is thinking people will put in ₹100 to play on ₹72 pot entry (28% Gross GST); and if they win ₹54 (after platform fees)- they will pay 30% TDS on that - for which they will get free swimming pool in their living room come…
— Ashneer Grover (@Ashneer_Grover) July 11, 2023
గ్రోవర్ మాత్రమే కాదు ఇండియా గేమింగ్ ఫెడరేషన్‌తో పాటు ఈ-గేమింగ్ ఫెడరేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ (FIFS), ఆన్‌లైన్ స్కిల్ గేమ్‌లపై జీఎస్టీని 18 శాతం నుండి 28 శాతానికి పెంచడంపై కౌన్సిల్ నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్నాయి.
నేనే రాజకీయ నాయకుడిని అయితే
అష్నీర్ రాజకీయ రంగ ప్రవేశంపై గతంలోనూ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై కేంద్రం వసూలు చేసే టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) విధానాన్ని వ్యతిరేకించారు. అందులో లోపాల్ని సవరించాలని అన్నారు. అదే సమయంలో తాను రాజకీయ నాయకుడిని అయితే, దేశంలో ఆదాయపు పన్ను రేటును తగ్గించేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.
ప్రతి ఒక్కరూ 10 నుంచి 15 శాతం ట్యాక్స్ కట్టేలా నిర్ధేశిస్తా. తద్వారా ఇప్పుడు ఎక్కువ పన్నులు కట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే పన్ను తక్కువగా ఎగవేతకు ప్రయత్నించరు. ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని అన్నారు. తాజాగా, మరోమారు పాలిటిక్స్‌పై హాట్ కామెంట్స్ చేయడంపై అష్నీర్ గ్రోవర్ పాలిటిక్స్‌లోకి అడుగు పెడతారేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి👉 ‘విలాసాల రుచి మరిగి’..అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్‌కు మరో ఎదురు దెబ్బ!
Comments
Please login to add a commentAdd a comment