
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం పన్ను విధించాలన్న జీఎస్‌టీ మండలి నిర్ణయం.. పరిశ్రమ వృద్ధికి విఘాతం కలిగిస్తుందని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) వ్యాఖ్యానించింది. 2025 నాటికి 1 లక్ష కోట్ల డిజిటల్ ఎకానమీ కావాలన్న భారత్ ఆకాంక్షలకు ఎదురుదెబ్బలాంటిదని పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల పరిశ్రమపై పన్ను భారం 1,000 శాతం మేర పెరుగుతుందని ఐఏఎంఏఐ తెలిపింది. (పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్)
ఫలితంగా 2.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులున్న దేశీ ఆన్‌లైన్ గేమింగ్ స్టార్టప్ వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. కొత్తగా రాబోయే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పూర్తిగా నిలిచి పోయే అవకాశం ఉందని వివరించింది. చట్టబద్ధమైన ఆన్‌లైన్ గేమింగ్ రంగంపై .. గ్యాంబ్లింగ్ కార్యకలాపాకు సమాన స్థాయిలో పన్ను విధించడం దేశీ పరిశ్రమను దెబ్బతీస్తుందని ఐఏఎంఏఐ పేర్కొంది.
కాగా బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సంబంధిత కంపెనీ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా డెల్టా కార్ప్ ఎన్నడూ లేనంతగా నష్టాలను ఎదుర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment