![India AI Conference in December 2023 - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/14/india-ai.jpg.webp?itok=5AD7dN73)
నోయిడా: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆన్‌లైన్ గేమింగ్ విభాగాలు 2026–27 నాటికి భారత స్థూల జాతీయోత్పత్తికి (జీడీపీ) 300 బిలియన్ డాలర్ల వరకు సమకూరుస్తాయని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. 2026–27 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఒక ట్రిలియన్ డాలర్లు ఉండాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.
ఇందులో ఏఐ చాలా ముఖ్యమైన భాగం అని భావిస్తున్నామని, అందుకే ప్రధాని నరేంద్ర మోదీ ’ఇండియా ఏఐ’ కార్యక్రమాన్ని ప్రారంభించారని వివరించారు. ఇండియా ఏఐ 2023 పేరుతో ఈ ఏడాది డిసెంబర్ 10న అంతర్జాతీయ సదస్సును ప్రభుత్వం నిర్వహించనుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment