సియోల్: ఆన్‌లైన్ గేమింగ్‌పై పన్నులకు సంబంధించిన విధానాలపై జీఎస్‌టీ కౌన్సిల్ కసరత్తు చేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇవి ఖరారైతే గేమింగ్ విభాగంలోకి గణనీయంగా పెట్టుబడులు రాగలవని ఆమె వివరించారు. దక్షిణ కొరియాలోని సియోల్‌లో ప్రవాస భారతీయుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు.
ఇదీ చదవండి: భారత్ ‘గ్రీన్’ పరిశ్రమకు రాయితీ రుణాలు
ట్యాక్సేషన్, నియంత్రణ సహా ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించిన వివిధ అంశాలపై జీఎస్‌టీ మండలి మంత్రుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని ఆమె చెప్పారు. కేపీఎంజీ నివేదిక ప్రకారం 2021లో రూ. 13,600 కోట్లుగా ఉన్న ఆన్‌లైన్ గేమింగ్ రంగం 2024–25 నాటికి రూ. 29,000 కోట్లకు చేరనుంది.
ఆన్‌లైన్ గేములపై ట్యాక్సేషన్ అంశం రెండేళ్లుగా నలుగుతోంది. ఇతరత్రా బెట్టింగ్ గేమ్‌లతో పోలిస్తే నైపుణ్యాలు అవసరమయ్యే ఆన్‌లైన్ గేమ్‌ల విషయంలో పన్ను రేటు తక్కువగా ఉండాలన్న డిమాండ్లు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మే నెలాఖరులో లేదా జూన్‌లో జరిగే జీఎస్‌టీ తదుపరి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోవచ్చు.
ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల రికార్డు
Comments
Please login to add a commentAdd a comment