Tax policy
-
ఆన్లైన్ గేమింగ్‌పై పన్నులు.. ఖరారైతే మరిన్ని పెట్టుబడులు
సియోల్: ఆన్లైన్ గేమింగ్‌పై పన్నులకు సంబంధించిన విధానాలపై జీఎస్టీ కౌన్సిల్ కసరత్తు చేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇవి ఖరారైతే గేమింగ్ విభాగంలోకి గణనీయంగా పెట్టుబడులు రాగలవని ఆమె వివరించారు. దక్షిణ కొరియాలోని సియోల్‌లో ప్రవాస భారతీయుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఇదీ చదవండి: భారత్ ‘గ్రీన్’ పరిశ్రమకు రాయితీ రుణాలు ట్యాక్సేషన్, నియంత్రణ సహా ఆన్లైన్ గేమింగ్‌కు సంబంధించిన వివిధ అంశాలపై జీఎస్టీ మండలి మంత్రుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని ఆమె చెప్పారు. కేపీఎంజీ నివేదిక ప్రకారం 2021లో రూ. 13,600 కోట్లుగా ఉన్న ఆన్లైన్ గేమింగ్ రంగం 2024–25 నాటికి రూ. 29,000 కోట్లకు చేరనుంది. ఆన్లైన్ గేములపై ట్యాక్సేషన్ అంశం రెండేళ్లుగా నలుగుతోంది. ఇతరత్రా బెట్టింగ్ గేమ్‌లతో పోలిస్తే నైపుణ్యాలు అవసరమయ్యే ఆన్లైన్ గేమ్‌ల విషయంలో పన్ను రేటు తక్కువగా ఉండాలన్న డిమాండ్లు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మే నెలాఖరులో లేదా జూన్‌లో జరిగే జీఎస్టీ తదుపరి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోవచ్చు. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల రికార్డు -
మీ ‘పన్ను’ దారేది?
ఆదాయపన్ను రేట్లు తగ్గుతాయని ఆశగా ఎదురు చూసిన వారిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నూతన పన్ను రేట్లతో అయోమయంలో పడేశారు. ప్రస్తుత పన్ను విధానం లేదా నూతన పన్ను విధానంలో తమకు అనుకూలమైన విధానంలోనే రిటర్నులు దాఖలు చేసుకోవచ్చని ప్రకటించారు. రూ.15 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి ఆదాయపన్నును కొంత మేరకు తగ్గిస్తూ నూతన పన్ను రేట్లను మంత్రి ప్రతిపాదించారు. అంటే ప్రస్తుతమున్న విధానంలోనే కొనసాగడం లేదా నూతన విధానానికి మారడం పన్ను చెల్లింపుదారుల అభీష్టంపైనే ఆధారపడి ఉంటుంది. మరి నూతన పన్ను విధానానికి మారిపోవాలా..? లేక ఇప్పుడున్న విధానంలోనే కొనసాగాలా..? అని ప్రశ్నిస్తే.. అది ఒక్కో వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. తమ ఆదాయాన్ని బట్టి దీనిపై నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. పాత, కొత్త విధానంలో పన్ను భారంపై అవగాహన కల్పించే ప్రాఫిట్ కథనం ఇది. రూ.15 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తి నూతన పన్ను విధానంలో రూ.78,000ను ఆదా చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. ఇది నిజమే. కానీ, ఎవరికి ఈ ప్రయోజనం నిజంగా అంటే.. ఎటువంటి మినహాయింపులను క్లెయిమ్ చేసుకోని వారికే నూతన పన్ను విధానంతో ప్రయోజనమని క్లుప్తంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆదాయపన్ను విధానంలో ఎన్నో మినహాయింపులు(ఎగ్జంప్షన్), తగ్గింపులు(డిడక్షన్) ఉన్నాయి. అయితే, కొందరు కొన్ని రకాల మినహాయింపులనే వినియోగించుకుంటుంటే, కొందరు అయితే అస్సలు ఏ ప్రయోజనాన్ని కూడా వాడుకోకుండా రిటర్నులు ఫైల్ చేస్తున్నారు. ఇలా ఏ డిడక్షన్, ఎగ్జంప్షన్ వినియోగించుకోని వారికి నూతన పన్ను రేట్లు ప్రయోజనకరం. అలాగే, తీసివేతలు, మినహాయింపుల గందరగోళాన్ని అర్థం చేసుకోలేని వారు నూతన విధానానికి మారిపోవచ్చు. లేదు, చట్ట పరిధిలో అన్ని మినహాయింపులు, తగ్గింపులను ఉపయోగించుకుంటానంటే ప్రస్తుత విధానంలోనే ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. ‘‘ఇదొక మంచి నిర్ణయం. తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఇచ్చినట్టయింది’’ అని ట్యాక్స్‌స్పానర్ సహ వ్యవస్థాపకుడు సుధీర్ కౌశిక్ పేర్కొన్నారు. ‘‘హౌస్ రెంట్ అలవెన్స్, సెక్షన్ 80సీ కింద మినహాయింపులు పొందుతున్న వారికి నూతన పన్ను విధానానికి మారిపోవడం ప్రయోజనకరం కాదు’’ అని అశోక్ మహేశ్వరి అండ్ అసోసియేట్స్ ట్యాక్స్ లీడర్ అమిత్ మహేశ్వరి తెలిపారు. చాప్టర్ 6ఏ పరిధిలోని సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ, సెక్షన్ 80సీసీడీ మినహాయింపులు రూ.2,50,000ను పూర్తిగా వినియోగించుకున్నట్టు అయితే రూ.7,50,000 వరకు ఆదాయం ఉన్న వారూ ప్రస్తుత విధానంలో పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే, రుణంపై ఇంటిని కొనుగోలు చేసిన వారు చాప్టర్ 6ఏకు అదనంగా సెక్షన్ 24 కింద ఇంటి రుణానికి చేసే వడ్డీ చెల్లింపులు రూ.2,00,000పై, స్టాండర్డ్ డిడక్షన్ 50,000ను కూడా వినియోగించుకుంటే అప్పుడు మొత్తం రూ.10,00,000 ఆదాయం ఉన్నప్పటికీ చెల్లించాల్సిన పన్ను బాధ్యత సున్నాయే అవుతుంది. ఇక సెక్షన్ 80టీటీఏ కింద డిపాజిట్లపై వడ్డీ రూ.10,000 వరకు మినహాయింపు కూడా ఉంది. నూతన పన్ను విధానానికి మారితే జీవిత బీమా, వైద్య బీమా ప్రీమియం, ఇంటి రుణానికి చేసే వడ్డీ చెల్లింపులతోపాటు ఎల్‌టీఏ తరహా మినహాయింపులను కోల్పోవాల్సి వస్తుంది. నూతన విధానంలోనూ ఎన్పీఎస్(రిటైర్మెంట్ సాధనం) పై పన్ను ఆదా చేసుకునే ఒక అవకాశాన్ని కొనసాగించారు. అది వ్యక్తిగతంగా ఎన్‌పీఎస్‌లో చేసే పెట్టుబడులు కాకుండా.. ఉద్యోగుల తరఫున కంపెనీలు ఎన్పీఎస్కు జమ చేసే చందాలకు సెక్షన్ 80సీసీడీ (2) కింద పన్ను ఆదా ప్రయోజనం వర్తిస్తుంది. మూలవేతనం, కరువు భత్యం (డీఏ)పై వార్షికంగా 10% ఎన్పీఎస్ చందాలపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు వార్షిక మూలవేతనం, కరువు భత్యం రూ.5 లక్షలు ఉందనుకుంటే ఇందులో 10% రూ.50,000పై పన్ను చెల్లించక్కర్లేదు. ఎన్పీఎస్ అయినా లేదా ఈపీఎఫ్ అయినా ఉద్యోగ సంస్థ చేసే చందా లకు ఇదే వర్తిస్తుంది. ఒకవేళ ఒక ఉద్యోగి తరఫున సంస్థ వార్షికంగా రూ.7.5 లక్షలకు మించి జమ చేస్తే అప్పుడు పన్ను పడుతుంది. ఒక్కసారి మారిపోతే..? ప్రస్తుత విధానంలో కొనసాగొచ్చు లేదా నూతన విధానానికి మారిపోవచ్చన్న వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే, ఈ రెండింటిలో ఏదో ఒకదానిని ఎంపిక చేసుకునే వెసులుబాటు ఏటేటా ఉంటుందా..? లేక ఒక్కసారి నూతన విధానానికి మారిపోతే అందులోనే మరుసటి ఏడాది నుంచి రిటర్నులు దాఖలు చేయాలా..? అన్న సందేహం రావచ్చు. ఏ విధానంలో రిటర్నులు దాఖలు చేయవచ్చన్నది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ‘‘వ్యక్తులు లేదా హిందూ అవిభాజ్య కుటుంబం ఎటువంటి వ్యాపార ఆదాయం లేకపోతే, గడిచిన ప్రతీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయంపై రిటర్నులు ఏ విధానంలో దాఖలు చేయాలన్నది ఎంచుకునే ఆప్షన్ ఉంటుంది. ఇతర కేసుల్లో అయితే, ఒక్కసారి నూతన విధానానికి మారిపోతే ఆ తర్వాత నుంచి అదే విధానంలో కొనసాగాల్సి ఉంటుంది’’ అని బడ్జెట్ మెమొరాండం స్పష్టం చేస్తోంది. ‘‘ప్రతీ ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు ఏ పన్ను విధానాన్ని అయినా ఎంచుకోవచ్చు. పన్ను మినహాయింపులు, తగ్గింపులతో రిటర్నులు దాఖలు చేయవచ్చు లేదా నూతన విధానంలో తక్కువ పన్ను రేట్ల ప్రకారం రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని షరతులు ఉన్నాయి. ఎటువంటి వ్యాపార ఆదాయం లేని వారు నూతన పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. ఒకవేళ వ్యాపార ఆదాయం ఉన్న వారు మినహాయింపులు, తగ్గింపులను వినియోగించుకుని ప్రస్తుత విధానంలో పన్ను రిటర్నులు దాఖలు చేసినట్టయితే అప్పుడు పాత విధానంలోనే కొనసాగినట్టవుతుంది. తర్వాతి సంవత్సరాల్లోనూ నూతన విధానానికి మారే అవకాశం ఉండదు’’ అని ట్యాక్స్‌మన్ డాట్ కామ్ డీజీఎం వాధ్వా తెలిపారు. వ్యాపార ఆదాయం లేని పన్ను చెల్లింపుదారుడు ప్రస్తుత విధానం లేక నూతన ప్రతిపాదిత విధానాన్ని ఎంచుకోవచ్చు. అయితే, వ్యాపార ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారునికి ఈ రెండింటిలో ఎందులో కొనసాగాలన్న ఆప్షన్ ఒక్కసారి మాత్రమే ఉంటుంది. ఏ విధానంలో ఎంత భారం రూ.7.5 లక్షల ఆదాయం ఉన్న వారు ► స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000, సెక్షన్ 80సీ సాధనాల్లో రూ.1,50,000 పెట్టుబడులతోపాటు ఎన్‌పీఎస్‌లో అదనంగా రూ.50,000 ను ఇన్వెస్ట్ చేయడం ద్వారా మొత్తం రూ.2,50,000 ఆదాయంపై మినహాయింపులు పొందొచ్చు. ఎన్పీఎస్ లేకపోతే సెక్షన్ 80డీ కింద తన కుటుంబానికి, తల్లిదండ్రులకు చెల్లిస్తున్న వైద్య బీమా ప్రీమియంను మినహాయింపుగా చూపించుకున్నా సరిపోతుంది. మొత్తం ఆదాయం రూ.7,50,000 నుంచి మినహాయింపులు రూ.2.5 లక్షలను తీసివేయగా మిగిలిన పన్ను వర్తించే ఆదాయం రూ.5,00,000 అవుతుంది. పన్ను వర్తించే ఆదాయం మినహాయింపుల తర్వాత రూ.5లక్షలు దాటనందున సెక్షన్ 87ఏ కింద పన్ను చెల్లించకుండా రిబేటు పొందొచ్చు. ► కొత్త విధానంలో ఈ మినహాయింపులు లేవుకనుక.. మొదటి రూ.2,50,001 –5,00,000పై 5% కింద రూ.12,500, తర్వాతి రూ.2.5 లక్షలపై 10% పన్ను రేటు ప్రకారం రూ.25,000.. మొత్తం రూ.37,500 పన్ను చెల్లించాలి. ► ఒకవేళ పాత విధానంలోనే కొనసాగుతూ కొన్ని మినహాయింపులనే క్లెయిమ్ చేసుకునేట్టు అయితే.. ఉదాహరణకు ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయని వారు, సెక్షన్ 80సీ కింద రూ.150,000, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000, సెక్షన్ 80డీ కింద వైద్య బీమా ప్రీమియంను మినహాయింపులుగా చూపించుకోవచ్చు. అలా రూ.2,00,000ను మినహాయింపుగా చూపించుకున్నారనుకుంటే.. మిగిలిన రూ.50,000పై ప్రస్తుత విధానంలో 20 శాతం పన్ను రేటు ప్రకారం రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రస్తుత విధానమే బెస్ట్. ► ఒకవేళ సెక్షన్ 80సీ కింద కేవలం రూ.1,00,000 మాత్రమే వినియోగించుకుని, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000ను కూడా క్లెయిమ్ చేసుకుంటే అప్పుడు పన్ను చెల్లించాల్సిన ఆదాయం రూ.1,00,000 అవుతుంది. దీనిపై 20% అంటే రూ.20,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ ప్రయోజనమే. ► సెక్షన్ 80సీ కింద రూ.50,000 వరకూ పెట్టుబడులు ఉంటే, దీనికి స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 కలుపుకోవచ్చు. వైద్య బీమా ప్రీమియం రూ.12,000 వరకు చెల్లిస్తున్న వారు చాలా మందే ఉంటారు. ఈ విధంగా చూస్తే కనీస మినహాయింపులు రూ.1,00,000–1,50,000 వరకు ఎక్కువ మందికి ఉంటుంటాయి. వీరికి ప్రస్తుత విధానమే లాభకరం. రూ.10 లక్షల ఆదాయం విషయంలో... ► వీరు కూడా స్టాండర్డ్ డిడక్షన్, సెక్షన్ 80సీ, 80సీసీడీ కింద పూర్తిగా రూ.3,00,000ను వినియోగించుకుంటే అప్పుడు రూ.2,00,000 మొత్తంపై ప్రస్తుత విధానంలో 20 శాతం కింద రూ.40,000 పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ గృహ రుణం తీసుకుని వడ్డీ చెల్లిస్తుంటే ఆ విధంగా మరో రూ.2,00,000పైనా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. దీంతో నికరంగా చెల్లించాల్సిన పన్ను సున్నాయే అవుతుంది. ఇప్పటి వరకు ఇల్లు సమకూర్చుకోని వారు రుణంపై ఇంటిని తీసుకోవడం ద్వారా ఈ ఆదాయ వర్గాల వారు ఏటా రూ.40,000 వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. ► అదే నూతన విధానంలో రూ.2,50,001–5,00,000పై 5 శాతం కింద రూ.12,500, 5,00,001–7,50,000 ఆదాయంపై 10 శాతం ప్రకారం రూ.25,000వేలు, తర్వాత రూ.2,50,000పై 15 శాతం పన్ను రేటు ప్రకారం రూ.37,500 మొత్తం రూ.75,000 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ► ప్రస్తుత విధానంలో కనీసం సెక్షన్ 80సీ, 80సీసీడీ, 80డీ, స్టాండర్డ్ డిడక్షన్లు వినియోగించుకున్నా నూతన విధానంతో పోలిస్తే తక్కువ పన్ను చెల్లిస్తే చాలు. ► ప్రస్తుత విధానంలో ఏ మినహాయింపులను క్లెయిమ్ చేసుకోని వారు, అదే సమయంలో సెక్షన్ 80సీలో కేవలం రూ.లక్ష వరకు ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే అప్పుడు వీరు రూ.4,00,000పై ప్రస్తుత విధానంలోనే 20 శాతం పన్ను రేటుపై రూ.80,000 చెల్లించాల్సి వస్తుంది. కనుక వీరికి కొత్త విధానం బెటర్. ► ఒకవేళ ఇంటి రుణం లేని వారికి హెచ్ఆర్ఏ మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. కనుక దాన్ని పరిగణనలోకి తీసుకుని చూడాలి. హెచ్ఆర్ఏ క్లెయిమ్‌కు మూడు విధానాలున్నాయి. వేతనంలో భాగంగా ఉద్యోగి పొందుతున్న వాస్తవ హెచ్ఆర్ఏ మొత్తం.. లేదా మెట్రోల్లో నివసించే వారి మూల వేతనంలో 50%, అదే నాన్ మెట్రో ప్రాంతాల్లోని వారి మూల వేతనంలో 40%.. లేదా మీరు వార్షికంగా చెల్లించిన అద్దె నుంచి మీ వార్షిక వేతనంలో 10 శాతాన్ని తీసివేయగా మిగిలిన మొత్తం. ఈ మూడింటింలో ఏది తక్కువ అయితే ఆ మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ► 10 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారు తమ పెట్టుబడులను అన్నింటినీ లిస్ట్ చేసుకుని, మినహాయింపులను పరిగణనలోకి తీసుకుని అప్పుడు ఏ విధానంలో రిటర్నులు దాఖలు చేయాలన్నది నిర్ణయించుకోవచ్చు. -
అన్నీ మంచి శకునాలే..!
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆందోళనకరంగా మారిన రెండు కీలక అంశాలకు సంబంధించి గతవారంలో ఒకేసారి సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా–చైనా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదరడం, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చేందుకు మార్గం సుగమం కావడం వంటి అనుకూల అంశాలతో గత వారాంతాన దేశీ స్టాక్ సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. అమెరికా దిగుమతి చేసుకుంటున్న చైనా ఉత్పత్తుల విషయంలో తొలి దశ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు చైనా శుక్రవారం ప్రకటించింది. వాణిజ్య, ఆర్థిక అంశాల పరంగా మొదటి దశ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు ప్రకటించింది. ఈ సానుకూల అంశం నేపథ్యంలో దేశీ మార్కెట్ మరింత ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా విశ్లేషించారు. ట్రేడ్ డీల్ ఒక కొలిక్కి రావడం, బ్రిటన్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకోవడం వంటి మార్కెట్ ప్రభావిత అంశాలు బుల్స్‌కు అనుకూలంగా ఉన్నాయని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ తెలిపారు. నిఫ్టీకి 12,200 – 12,250 స్థాయిలో ప్రధాన నిరోధం ఎదురుకావచ్చని అంచనా వేశారు. ఇక తాజా పరిణామాలు మార్కెట్‌కు సానుకూలంగా ఉన్నందున ర్యాలీకి ఆస్కారం ఉందని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈవారంలోనే.. పరోక్ష పన్నుల విధానంలో ఆదాయాన్ని పెంచేందుకు ఈవారంలోనే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ సమావేశం కానుంది. బుధవారం జరిగే 38వ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వాల నష్టపరిహారం అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇదే విధంగా మినహాయింపు అంశాలపై సమీక్ష, రేట్లలో మార్పులు ఉండేందుకు ఆస్కారం ఉందని ప్రభుత్వ ఉన్నత అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. వీటికి ప్రభావితం అయ్యే రంగాలపై మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. ఆర్బీఐ మినిట్స్ వెల్లడి..: ఈ నెల మొదటి వారంలో జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమావేశ మినిట్స్‌ను ఆర్బీఐ బుధవారం విడుదల చేయనుంది. ఇక నవంబర్ నెల టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సోమవారం వెల్లడికానుంది. -
ప్రజలు కట్టే పన్నులకు జవాబుదారీతనం ప్రధానం
చంద్రగిరి రూరల్ (చిత్తూరు జిల్లా): దేశాభివృద్ధిలో ఎకానమీ, ఫైనాన్స్, రెవెన్యూ అంశాలు కీలకమని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని తిరుచానూరులో ఉన్న ఓ హోటల్ల్లో జాతీయ ట్యాక్స్ సదస్సు జరిగింది. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి తొలిరోజు జస్టిస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కట్టే పన్నులకు జవాబుదారీతనం ఉండటం ప్రధానం అన్నారు. ట్యాక్స్ బెనిఫిట్స్‌పై అధ్యయనం నిరంతర ప్రక్రియ అని, అవగాహన కల్పనలో ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ ప్రముఖ పాత్ర పోషించడం అభినందనీయమని చెప్పారు. పన్నుల వల్ల సామాజికాభివృద్ధి, సామాజిక న్యాయం అందుతాయని చెప్పారు. పన్నుల పాలసీపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలన్నారు. పన్నుల మినహాయింపు కూడా దేశాభివృద్ధిలో భాగమేనని చెప్పారు. పన్నుల చెల్లింపులో ఉన్న సాధక బాధకాలను పారదర్శకతతో చర్చించి కేంద్రానికి సమర్పించగలిగితే నూతన విధానాలకు అవకాశం కలుగుతుందన్నారు. నూతన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి అవగాహన సదస్సులు అమరావతిలో చేపట్టాలని, ఇలాంటి వాటి వల్ల న్యాయవాదులకు, ఆడిటర్లకు ఎంతో ఉపయోగమన్నారు. ఈ సూచనపై ఏపీ ఫెడరేషన్ స్పందించి.. త్వరలో అమరావతిలో సదస్సు నిర్వహణకు అంగీకారం తెలిపింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గంగారావు, జస్టిస్ సీతారామమూర్తి, జస్టిస్ దుర్గా ప్రసాదరావు, జస్టిస్ విజయలక్ష్మి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఆలిండియా ట్యాక్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ ష్రాఫ్, జనరల్ సెక్రటరీ ఆనంద్ పాసారి, సౌత్‌జోన్ చైర్మన్ సీతాపతిరావు, సెక్రటరి సంజీవరావు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, కృష్ణ మోహన్‌తో పాటు జిల్లాలోని పలువురు ఆడిటర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. సక్రమంగా పన్నులు చెల్లించేందుకు ప్రాక్టీషనర్లు వారధిగా పనిచేయాలి ప్రభుత్వానికి సక్రమంగా పన్నులు చెల్లించేందుకు ప్రాక్టీషనర్లు వారధిగా పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి నారాయణ స్వామి అన్నారు. జాతీయ ట్యాక్స్ సదస్సుకు ఆయన సాయత్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పన్నుల సేకరణలో ప్రాక్టీషనర్ల కృషి అభినందనీయమని, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే శాఖలు సీఎం తనకు అప్పగించడం సంతోషమన్నారు. అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. పరోక్ష పన్నుల వసూల్లో జీఎస్టీ కీలకపాత్ర అని, చిన్న, సన్నకారు వ్యాపారస్థులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే వారికి బ్యాంకు రుణాలు మరింత సులభతరం అవుతుందన్నారు. అనంతరం 40 ఏళ్లకు పైగా సేవలందించిన ట్యాక్స్ ప్రాక్టీషనర్లు మహబూబ్ బాషా, నాగభూషణం, మోహన్ రాజు గుప్తా, ఫాల్గుణ కుమార్, రాజారెడ్డి, రామకృష్ణలను ఆయన ఘనంగా సత్కరించారు. సదస్సులో ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ సావనీర్‌ను తిరుపతి కేంద్రంగా నిర్వహించినందుకు లోగోను ఆవిష్కరించారు. -
భారత్‌పై ట్రంప్ అసహనం.. మోదీపై సెటైర్లు
వాషింగ్టన్: హార్లీ–డేవిడ్సన్ బైక్‌లపై దిగుమతి సుంకం విషయంలో భారత్ తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. అమెరికా దిగుమతి చేసుకుంటున్న వేల కొద్ది భారత మోటర్ సైకిళ్లపైనా దిగుమతి సుంకాన్ని భారీగా పెంచేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. స్టీల్ పరిశ్రమపై కాంగ్రెస్ సభ్యుల బృందంతో సమావేశం సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో హార్లీ డేవిడ్సన్ బైకులపై దిగుమతి సుంకాన్ని భారత్ 75 నుంచి 50 శాతానికి తగ్గించింది. అయితే ఇది ఏమాత్రం సరిపోదని.. భారత్ నుంచి వస్తున్న మోటర్ సైకిళ్లపై అమెరికా పన్ను వసూలు చేయటం లేదన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. ఇదే విధానాన్ని భారత్ కొనసాగించాలన్నారు. ‘చాలా దేశాల్లో మన వస్తువులు తయారవుతున్నాయి. అందుకోసం వారికి భారీగానే చెల్లింపులు చేస్తున్నాం. అలాంటిది.. మన దగ్గర తయారైన హార్లీ డేవిడ్సన్ మోటర్ సైకిల్ వారి వద్దకెళ్లినా భారీగా పన్నులు చెల్లించాల్సి వస్తోంది’ అని ట్రంప్ పేర్కొన్నారు. ‘రెసిప్రోకల్ ట్యాక్స్’... మోదీపై సెటైర్ ఇటీవల మోదీతో జరిగిన సంభాషణను పరోక్షంగా గుర్తుచేస్తూ.. ‘ఇండియా నుంచి ఓ గ్రేట్ జెంటిల్మన్ ఫోన్ చేసి మోటర్ సైకిళ్లపై గతంలో ఉన్న 100 శాతం పన్నును మొదట 75 శాతానికి ప్రస్తుతం 50 శాతానికి తగ్గించామని చెప్పారు’ అని తెలిపారు. భారత్ నుంచి వస్తున్న మోటర్ సైకిళ్లపై తాము ఏమాత్రం పన్ను వసూలు చేయటం లేదని చెబుతూ.. అమెరికాతో ‘రెసిప్రోకల్ ట్యాక్స్’ (పరస్పర సమానమైన పన్ను) విధానాన్ని అమలుచేయని దేశాలతో కఠినంగా వ్యవహరించాలన్నారు. ‘ఇలాంటి కేసుల్లో మనం రెసిప్రోకల్ ట్యాక్స్‌ను అమలుచేయాల్సిందే. నేను భారత్‌ను తప్పుబట్టడం లేదు. ఆయా దేశాలు ఈ ట్యాక్స్ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాయనిపిస్తోంది’ అని ట్రంప్ పేర్కొన్నారు. రెసిప్రోకల్ ట్యాక్స్‌ను అమలుచేయాలని ట్రంప్ మొదటినుంచీ వాదిస్తున్నారు. కాగా, తన వేతనంలోని నాలుగో వంతును (2017లో తీసుకున్న వేతనంలో) రవాణాశాఖ మౌలికవసతులను మెరుగుపరుచుకునేందుకు విరాళంగా ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీనికి సంబంధించి లక్ష డాలర్ల చెక్కును అందజేశారు. ఏడాదికి ట్రంప్ వేతనం 4 లక్షల డాలర్లు (రూ.2.56కోట్లు). ఆ పోర్న్‌స్టార్‌కు 1.3లక్షల డాలర్లు ఇచ్చా! ట్రంప్‌తో శారీరక సంబంధం ఉన్నట్లు ప్రకటించిన పోర్న్‌స్టార్ స్టెఫానీ క్లిఫార్డ్‌కు 1.3 లక్షల డాలర్ల (రూ. 83.5లక్షలు) చెల్లించినట్లు ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది మైకెల్ కోహెన్ న్యూయార్క్ టైమ్స్‌కు వెల్లడించారు. తన సొంత డబ్బును క్లిఫార్డ్‌కు ఇచ్చానని.. ఇంతవరకు ట్రంప్‌గానీ, ఆయన ప్రచార విభాగం గానీ.. ఈ డబ్బును తిరిగి ఇవ్వలేదన్నారు. పోర్న్‌స్టార్ దీనిపై మాట్లాడకుండా ఉండేందుకు నవంబర్ 2016 ఎన్నికలకు ముందు ఈ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసినట్లు పేర్కొన్నారు. -
మొబైల్స్‌పై వ్యాట్ 5 శాతానికి తగ్గింపు
వ్యాట్ చట్టంలో సవరణ.. ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: మొబైల్ ఫోన్ల కొనుగోళ్లపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. ప్రస్తుతం 14.5 శాతం ఉన్న వ్యాట్‌ను 5 శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం వ్యాట్ చట్టంలో సవరణ చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ ఇస్తూ గురువారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నం.186) జారీ చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో మొబైల్‌పై 5 శాతమే పన్ను విధిస్తుండగా, తెలంగాణలో మాత్రం 14.5 శాతం వసూలు చేస్తున్నారని, దీంతో మొబైల్ తయారీ కంపెనీలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావడం లేదని ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి. 2015 సెప్టెంబర్‌లో ఇండియన్ సెల్యులర్ అసోసియేషన్ అధ్యక్షుడు పంకజ్ మొహిండ్రూ సీఎం కేసీఆర్‌ను, అప్పటి వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలసి వ్యాట్‌ను తగ్గించాలని కోరారు. ఈ మేరకు సీఎంవో పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకుని దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న పన్ను విధానాన్ని పరిశీలించింది. అన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల మీదా 5 శాతం పన్నే విధిస్తున్నందున మొబైల్ మీద కూడా అదే పన్ను విధానాన్ని అమలు చేయాలని అధికారులు సూచించారు. దీంతో చట్టంలో సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏడాదికో తీరు? 2014 మే 17న రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న సమయంలో అప్పటి వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హీరాలాల్ సమారియా అభ్యంతరాల మేరకు 5 శాతం పన్ను విధించేందుకు అనుమతిస్తూ వివరణ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 సెప్టెంబర్ 20న ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన మెమోను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో మొబైల్‌పై 14.5 శాతం పన్ను విధానం కొనసాగుతోంది. -
అధిక పన్నులు విధించం
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ పీఎస్‌యూ బ్యాంకుల్లో వాటా52 శాతానికి తగ్గిస్తాం భూసేకరణ చట్టంలో సవరణలు శీతాకాల సమావేశాల్లో బీమా ఎఫ్‌డీఐల బిల్లుకు మోక్షం న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదార్లకు ఆమోదయోగ్యమైన, హేతుబద్ధమైన పన్ను పాలసీని అమలు చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీనిచ్చారు. భారత్‌ను అత్యంత చౌక తయారీ ఉత్పత్తులకు గమ్యస్థానంగా మార్చాలంటే భారీస్థాయిలో పన్నుల విధింపు ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. ఆదివారమిక్కడ ఇండియా గ్లోబల్ ఫోరం సమావేశంలో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ‘మన ఆర్థిక వృద్ధి రేటు ఘోరంగా పడిపోయింది. కీలకమైన తయారీ రంగం కూడా దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. అందుకే మేం దీనిపై దృష్టి కేంద్రీకరించాం. భారత్‌ను తయారీకి గమ్యంగా చేయడమే మా లక్ష్యం’ అని జైట్లీ వ్యాఖ్యానించారు. విశ్వాసం పెంచుతాం... భారత ఆర్థిక వ్యవస్థపై ఇన్వెస్టర్లకు విశ్వాసాన్ని పెంచడమే తమ ప్రధానోద్దేశమని చెప్పారు. ప్రతిపక్షాలు మద్దతివ్వకపోయినా... భూసేకరణ చట్టంలో సవరణలను చేసి తీరుతామని ఆయన స్పష్టంచేశారు. దేశంలో స్మార్ట్ సిటీల నిర్మాణం సజావుగా జరగాలంటే ముందుగా భూసేకరణ చట్టాల్లోని కొన్ని అసంబద్ధ నిబంధనలను తొలగించాల్సి ఉంటుందని జైట్లీ చెప్పారు. బీమా బిల్లు ఆమోదంపై ఆశాభావం... మరోపక్క, రానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రతిపాదిత బీమా చట్టాల సవరణ బిల్లుకు ఆమోదముద్రపడేలా చూస్తామని జైట్లీ తెలిపారు. బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)ను ఇప్పుడున్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడమే ఈ బిల్లు ఉద్దేశం. ఈ ప్రతిపాదనకు మోదీ సర్కారు ఇప్పటికే ఓకే చెప్పింది. పార్లమెంటులో ఆమోదముద్రపడితే చట్టబద్ధత వస్తుంది. పీఎస్‌యూ బ్యాంకుల్లో వాటా 52%కి... ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) బ్యాంకులు రూ. 3 లక్షల కోట్లమేర మూలధనం సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని జైట్లీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలను 52 శాతానికి తగ్గించుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుత చట్టాల ప్రకారం పీఎస్‌యూ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 51 శాతం కంటే తగ్గించుకోవడానికి వీల్లేదు. ప్రస్తుతం వివిధ పీఎస్‌యూ బ్యాంకుల్లో ప్రభుత్వానికి 56.26 శాతం(బ్యాంక్ ఆఫ్ బరోడా)లను నుంచి 88.63 శాతం(సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) స్థాయిలో వాటాలు ఉన్నాయి. -
దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలయ్యేనా ?
ఢిల్లీలో నేడు 14వ ఆర్థిక సంఘంతో ఆర్థికమంత్రుల భేటీ హక్కు కోల్పోతామంటున్న రాష్ట్రాలు హైదరాబాద్:దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను ల విధానం తీసుకొచ్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక కసరత్తు కొలిక్కి రావడం లేదు. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రాలు విడివిడిగా అమలు చేస్తున్న సర్వీస్టాక్స్, సేల్స్టాక్స్లను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి కేంద్రం ద్వారానే ‘సరుకు, సేవా పన్ను (జీఎస్టీ)’ను దేశవ్యాప్తం గా అన్ని రాష్ట్రాల్లో వర్తింపజేయాలని మోడీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ జీఎస్టీ విధానాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలే వ్యతిరేకించినందున ప్రస్తుతం అన్ని రాష్ట్రాలను నయానో, భయానో ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. మోడీ హయాంలో గత జూలై 3న, ఆగస్టు 20న అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రులతో కేంద్రం సమావేశమైంది. మూడోవిడతగా బుధవారం నాడు 14వ ఆర్థిక సంఘం ద్వారా ఢిల్లీలో ఆర్థికమంత్రుల సాధికారిక కమిటీ సమావేశమవుతోంది. సమావేశంలో జీఎస్టీపై కీలక నిర్ణ యం తీసుకోవాలన్న యోచనలో కేంద్రం ఉంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ హీరాలాల్ సమారియా ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రాల వ్యతిరేకతకు కారణం ఇదే.. అమ్మకం పన్నుల విధింపు అధికారం రాజ్యాం గం ద్వారా రాష్ట్రాలకు సంక్రమించింది. దీని ప్రకారం వస్తు తయారీ మొదలు వినియోగదారుడికి చేరే వరకు అమ్మకం పన్నులు ఆయా రాష్ట్రాలే నిర్ణయించి విధిస్తాయి. ప్రస్తుతం అమలులో ఉన్న సీఎస్టీ (కేంద్ర అమ్మకపు పన్ను) 2004 వరకు 4 శాతం ఉండేది. దీనిలో వాటా మాత్రమే కేంద్రానికి దక్కేది. 2005లో వ్యాట్ (విలువ ఆధారిత పన్ను)ను కేంద్రం తీసుకొచ్చిన తర్వాత సీఎస్టీ 2 శాతానికి పడిపోయింది. అదే సమయంలో వ్యాట్ ద్వారా కేంద్రానికి ఆదాయం సమకూరింది. వ్యాట్ వల్ల కోల్పోయిన నష్టాన్ని పూడుస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చిన హామీ నెరవేరలేదు. యూపీఏ అధికారంలో ఉన్న పదేళ్లలో జీఎస్టీని తీసుకురావాలని చేసిన ప్రయత్నాలు రాష్ట్రాల సహాయ నిరాకరణ వల్ల అమలు కాలేదు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయంలో రాష్ట్రాలను ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులు ఇవ్వడానికి ముందుకొస్తోంది. జీఎస్టీ వల్ల ఏం జరగబోతుంది..? ► సేవా రంగంలో పన్నులు వేసే అధికారం రా ష్ట్రాలకు సంక్రమిస్తుంది. వాణిజ్య, వ్యాపార పన్నుల అధికారం కేంద్రం చేతిలోకి వె ళ్తుంది. ► దేశమంతా ఒకే పన్నుల విధానం అమలు. ► రాష్ట్రాల మధ్య పన్నుల రేట్లలో ఉన్న తేడాలు తొలగిపోతాయి. ► దేశమంతా సింగిల్మార్కెట్గా మారుతుంది. ► విదేశీ మార్కెట్లో దేశానికి ప్రాధాన్యం పెరుగుతుంది. ► వ్యాట్ వల్ల ధరలు దేశవ్యాప్తంగా ఏకీకృతమయినట్టే పన్నుల విధానంలో గణనీయమైన మార్పు వస్తుంది. ► అదే సమయంలో ఒకే వ్యాపారి/ ఉత్పత్తిదారుడుపై కేంద్రం, రాష్ట్రం పెత్తనం(డ్యుయల్ కంట్రోల్) ఉంటుంది. ► చట్టాన్ని అమలుపై కేంద్ర, రాష్ట్ర పన్నుల శాఖల మధ్య వివాదాలు ఏర్పడే ఆస్కారం. ► జీఎస్టీ అమలైతే రాష్ట్రాల పన్నుల విధానంలో సమూల మార్పులకు అవకాశం, వాణిజ్య పన్నుల శాఖలు నిర్వీర్యం. ► రాష్ట్రాల్లోని వాణిజ్య పన్నుల శాఖల్లోని ఉద్యోగుల హోదాల్లో మార్పులకు అవకాశం. జీఎస్టీ పరిహారానికి రాజ్యాంగబద్ధత కల్పించాలి: యనమల వస్తు అమ్మకం పన్ను (జీఎస్టీ) అమలు చేయ డంలో అభ్యంతరం లేదని, అయితే వ్యాట్‌కు బ దులు జీఎస్టీని అమల్లోకి తేవడం ద్వారా రాష్ట్రానికి వచ్చే పన్నుల్లో తగ్గుదలను కేంద్ర ప్రభుత్వం పరిహారంగా చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరనుంది. జీఎస్టీ అమలుపై కేంద్ర సాధికారిక కమిటీ బుధవారం ఢిల్లీల్లో నిర్వహించే సమావేశానికి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు హాజరు కానున్నారు. జీఎస్టీ రాజ్యాంగబద్ధత కల్పించాలని మంత్రి యనమల సాధికారిక కమిటీకి స్పష్టం చేయనున్నారు. జీఎస్టీ అమలైతే... గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ) పేరుతో ఏకీకృత పన్నుల విధానం అమలైతే దేశంలో అన్నిరాష్ట్రాల్లో ఒకే పన్నుల విధానం అమలులోకి వస్తుంది. రాష్ట్రాలు సొంతగా పన్నులు విధించే హక్కును కోల్పోతాయి. దీంతో సేవాపన్నుల విధానాన్ని కేంద్రం రాష్ట్రాలకు దఖలు పరిచేందుకు సిద్ధమైంది. గుజరాత్ రాష్ట్ర ఆర్థికమంత్రి గత నెల 20న జరిగిన ఆర్థిక మంత్రుల సమావేశంలో జీఎస్టీ విధానంపై పెదవి విరిచారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన గుజరాత్‌పై కేంద్రం పన్నుల పెత్తనాన్ని తీసుకోవడాన్ని ఆయన వ్యతిరేకించినట్టు తెలిసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు గతంలో వ్యాట్‌నే వ్యతిరేకించాయి. ఇప్పుడు ఈ కొత్త విధానం ద్వారా తమ హక్కులను కేంద్రం హరిస్తోందన్న అనుమానాలను వ్యక్తం చేశాయి. జీఎస్టీ అమలైతే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఏంటనే అనుమానాన్ని సగం రాష్ట్రాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో తమకు రాజకీయ హామీలు కాకుండా చట్టపరమైన హామీ కావాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. -
డీజిల్‌పై ఒకే పన్ను విధానం!
రాష్ట్రాలతో సంప్రదింపులకు సిద్ధమైన కేంద్రం న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాల్లోనూ డీజిల్ ధర ఒకే స్థాయిలో ఉండేలా చూసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. డీజిల్‌పై ఒకే పన్ను విధానం అమలు చేసే యత్నాల్లో భాగంగా రాష్ర్ట ప్రభుత్వాలతో సంప్రదింపులకు సిద్ధమైంది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో స్థానిక పన్నులను అధికంగా విధిస్తుండటం వల్ల ఆయా ప్రాంతాల్లో డీజిల్ రేటు అధికంగా ఉంటోంది. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 57.84గా ఉంటే.. మహారాష్ర్టలోని ముంబైలో మాత్రం ఇది రూ. 66.01గా ఉంది. స్థానికంగా విధిస్తున్న పన్నుల(సేల్స్‌ట్యాక్స్ లేదా వ్యాట్‌తో పాటు ఆక్ట్రాయ్, ఎంట్రీ టాక్స్ వంటి ఇతర పన్నులు)తో కలిపి ఒక్కో రాష్ర్టంలో ఒక్కో రేటు ఉంటోంది. ఇలాంటి విధానానికి స్వస్తి పలికి దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్ను విధానాన్ని అమలు చేయాలని ప్రధాని మోడీ భావిస్తున్నారు. ఇందులో భాగంగా డీజిల్‌పై స్థానికంగా అధిక పన్నులు వసూలు చేస్తున్న 12 రాష్ట్రాలను ప్రత్యేక భేటీకి ఆహ్వానిస్తూ కేంద్రం లేఖ రాసింది. ఈ నెలాఖరున 6 రాష్ట్రాలతో(అస్సాం, బీహార్, హర్యానా, కర్ణాటక, ఉత్తరాఖండ్, కేరళ), వచ్చే నెల 5, 6 తేదీల్లో మరో 6 రాష్ట్రాలతో(మహారాష్ర్ట, ఎంపీ, రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, యూపీ) చర్చలు జరపాలని నిర్ణయిం చింది. వినియోగదారులకు అనుకూల విధానాలను పాటించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిపింది.