న్యూఢిల్లీ: ఆన్‌లైన్ గేమింగ్‌లో ప్రారంభ పందేలపై 28% జీఎస్‌టీ విధింపునకు సంబంధించి విలువ ఆధారిత నిబంధనలు ప్రభావవంతంగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ‘‘ఇందుకు సంబంధించి వివరణ జారీ అయింది. 28% పన్ను రేటు అమలవుతుంది. ఇది ఎవరికి వర్తిస్తుంది, ఎవరిపై భారం పడుతుందన్నది వివరంగా పేర్కొనడం జరిగింది. విలువకు సంబంధించి నిబంధనలు విజయాలను మినహాయిస్తున్నాయి. కనుక దీనిపై ఎలాంటి గందరగోళం ఉండదని భావిస్తున్నాను’’అని మంత్రి వివరించారు.
దీని ప్రకారం.. ఆన్‌లైన్ గేమింగ్‌లో గెలుచు కున్న నగదుతో తిరిగి బెట్టింగ్‌లు వేసినప్పుడు వా టిపై 28% జీఎస్‌టీ అమలు కాదు. స్పష్టంగా చెప్పాలంటే మొదటిసారి బెట్టింగ్‌కు పెట్టే మొత్తంపై 28% జీఎస్‌టీ చెల్లించాలి. దానిపై గెలుచుకున్న మొత్తాన్ని తిరిగి వెచ్చించినప్పుడు జీఎస్‌టీ పడదు. లోక్ సభలో జీఎస్‌టీ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సీతారామన్ మాట్లాడారు.
అప్పిలేట్ ట్రిబ్యునల్ ప్రెసిడెంట్, సభ్యుల వయో పరిమితిని ఈ బిల్లులో సవరించారు. ఇందుకు సంబంధించి ఆర్థిక మంత్రి ఓ ఉదాహరణను కూడా వినిపించారు. ‘‘ఒక వ్యక్తి రూ.1,000 బెట్ చేసి, దానిపై రూ.300 గెలుచుకుని.. ఆ తర్వాత రూ.1,300తో మరోసారి గెలుచుకునే మొత్తంపై జీఎస్‌టీ పడదు’’అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment