Satyanadella
-
Microsoft: త్వరలో మైక్రోసాఫ్ట్ ఐడీసీ సంచలన ప్రాజెక్ట్‌లు..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు సేవలందించే కంపెనీలు చాలా ఉన్నాయి. కానీ వాటిలో ప్రాంతీయంగా స్థానిక భాషలో సేవలందించే కంపెనీలు కొన్నే ఉంటాయి. అందులో భాగంగా ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ దేశంలో ప్రతిఒక్కరికి సాఫ్ట్వేర్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని హైదరాబాద్‌లో ఇండియన్ డెవలప్మెంట్ సెంటర్(ఐడీసీ)ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కంపెనీ ఐడీసీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని క్యాంపస్‌లో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ రాజీవ్‌కుమార్ కేక్ కట్‌చేసి మాట్లాడారు. ‘భారతదేశంలో ప్రాంతీయ భాషల్లో సాఫ్ట్వేర్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని మైక్రోసాఫ్ట్ 1998లో ఇండియా డెవలప్మెంట్ సెంటర్(ఐడీసీ)ను ప్రారంభించింది. హైదరాబాద్‌లోని ఐడీసీ సెంటర్ రెడ్‌మండ్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయం తర్వాత రెండో అతిపెద్ద రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రంగా ఉంది. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, నోయిడా బ్రాంచిల్లో కంపెనీ ఐడీసీ ద్వారా సేవలందిస్తోంది. ఇందులో నిపుణులైన ఇంజినీర్లు, డిజైనర్లు, పరిశోధకులు పనిచేస్తున్నారు. వినియోగదారుల అనుభవాలను పరిగణనలోకి తీసుకుని సాఫ్ట్వేర్ ఉత్పత్తులు రూపొందిస్తున్నారు. దేశంలోని విభిన్న సంప్రదాయాలు, భాషలు ఉండడంతో అందరూ ఇంగ్లిష్ వినియోగించడం కష్టం అవుతోంది. దాంతో ఎన్నో ఉపయోగకరమైన సాఫ్ట్వేర్ ఉత్పత్తులు అందరికీ చేరువకావడంలేదు. అయితే స్థానికంగా దేశంలోని అందరికీ అలాంటి సాఫ్ట్వేర్ సేవలు అందుబాటులో ఉండాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. అందులో భాగంగానే ఐడీసీను ప్రారంభించాం. ఇప్పటికీ 25 ఏళ్ల నుంచి సేవలందిస్తున్నాం. కంపెనీ ఇటీవల ‘మైక్రోసాఫ్ట్ 365’ అనే యాప్‌ను ప్రారంభించింది. అందులో ఏదైనా ఇమేజ్ రూపంలో ఉన్న టెక్ట్స్‌ను ఫొటో తీస్తే అది పూర్తిగా టెక్ట్స్ ఫార్మాట్లో మారిపోయి మనం ఎంపిక చేసిన భాషలోకి ట్రాన్స్‌లేట్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతిఒక్కరూ వారి ప్రాంతీయ భాషలో సమాచారాన్ని తెలుసుకునే వీలుంది. ఇండస్ట్రీలో కొన్ని కంపెనీలు ఇలాంటి సేవలు అందిస్తున్నా.. సైబర్ దాడుల నేపథ్యంలో ఎన్ని కంపెనీలు వినియోగదారుల డేటాకు సెక్యూరిటీ కల్పిస్తాయో ప్రశ్నార్థకమే. కానీ మైక్రోసాఫ్ట్ వినియోగదారుల డేటా ప్రైవసీకి ప్రాధాన్యం ఇస్తోంది. ఇలాంటి యాప్‌ల వల్ల చదువురాని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు కూడా ఎంతో సమాచారం తెలుసుకోవచ్చు’ అని చెప్పారు. ప్రతిష్టాత్మక ఐడీసీ ప్రాజెక్ట్‌లపై ఆయన స్పందిస్తూ ‘జుగల్బంది అనే కోపైలట్ టూల్ ద్వారా ఇంగ్లిష్‌ను ప్రాంతీయ భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేసి వాయిస్రూపంలో అందించేలా మైక్రోసాఫ్ట్ సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతి రైతుకు అది ఎంతో ఉపయోగపడుతుంది. అందులో ప్రభుత్వ పథకాలు, అర్హతలు, ప్రయోజనాలకు సంబంధించిన సమాచారాన్ని మనకు కావాల్సిన భాషలో పొందవచ్చు. దాంతో చదువురానివారికి సైతం పథకాలపై అవగాహన అందించేలా కంపెనీ కృషి చేస్తోంది. ప్రస్తుతం తెలుగుతో సహా దేశంలోని 10 భాషల్లో దీన్ని అభివృద్ధి చేశాం. త్వరలో 22 ప్రాంతీయ భాషలకు విస్తరిస్తాం. ఈ టూల్కోసం మైక్రోసాఫ్ట్ అజూర్ ఓపెన్‌ఏఐను వినియోగిస్తున్నాం. త్వరలో ‘భాషిణి’ అనే చాట్‌బాట్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నాం. దీని ద్వారా నేరుగా మనకు తెలిసిన భాషలో సందేహాలు అడిగితే జనరేటివ్ ఏఐ సహాయంతో అందుకు అనువుగా సమాధానాలు చెబుతుంది’ అని రాజీవ్‌కుమార్ వివరించారు. కంపెనీ ఉద్యోగుల కృషితోనే ఇదంతా సాధ్యమవుతోందని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: తెలంగాణను దాటేసిన ఏపీ..! మైక్రోసాఫ్ట్ ఐడీసీ మైక్రోసాఫ్ట్ 365తోపాటు జుగల్బందీ, అజూర్ స్పెషలైజ్డ్ ఏఐ సూపర్‌కంప్యూటర్‌ను ఆవిష్కరించింది. విండోస్ 11లో వాయిస్ యాక్సెస్ ఫీచర్‌ను డెవలప్ చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. -
సాక్ష్యం చెప్పేందుకే.. కోర్టు మెట్లెక్కిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కోర్టు మెట్లెక్కనున్నారు. ఆన్లైన్ సెర్చ్, వ్యాపార ప్రకటనలలో గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తుందంటూ దాఖలైన పిటిషన్‌పై అమెరికా న్యాయ శాఖ విచారణ చేపట్టనుంది. ఇందులో భాగంగా నిజానిజాలు వెల్లడించేందుకు సత్య నాదెళ్ల (సెప్టెంబర్ 2న)కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వ, ప్రభుత్వ నియంత్రణ సంస్థలు గూగుల్ అనైతిక వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుందంటూ ఆరోపిస్తున్నాయి. గూగుల్ సెర్చ్ ఇంజిన్ యాప్‌ను తమ టాప్‌లో ఆయా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుంది. ఆ ఒప్పందం మేరకు, యాపిల్, టెలికం దిగ్గజం ఎటీ అండ్ టీ (AT&T) సంస్థలకు ఏడాదికి 10 బిలియన్ డాలర్లు చెల్లించినట్లు అనుమానం వ్యక్తం చేస్తుంది. గూగుల్ విడుదల చేసే యాప్ టాప్‌లో ఉండడం వల్ల యూజర్ల వినియోగం పెరిగి..వాటి ద్వారా ఆదాయం గడించిందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యానాదెళ్లతో పాటు అయితే, గూగుల్‌పై వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు అమెరికా న్యాయ శాఖ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యానాదెళ్లతో పాటు టాప్ ఎగ్జిక్యూటీవ్‌ల నుంచి సాక్ష్యాల్ని సేకరించేందుకు సిద్ధమైంది. అదే సమయంలో మైక్రోసాఫ్ట్‌కు చెందిన సెర్చ్ ఇంజిన్ ఎడ్జ్, బింగ్ బ్రౌజర్ల విస్తరణ, గూగుల్ ఆధిపత్యం వల్ల ఎదురవుతున్న అడ్డంకులు గురించి అడగనుంది. రద్దయిన మైక్రోసాఫ్ట్ - యాపిల్ ఒప్పందం బింగ్ సెర్చ్ యాప్‌లో యాపిల్ యాప్స్ డిస్ప్లే అయ్యేలా మైక్రోసాఫ్ట్- యాపిల్ మధ్య ఒప్పందం జరిగింది. కానీ ఆ డీల్ ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో అమెరికా న్యాయ శాఖ మైక్రోసాఫ్ట్ బిజినెస్ డెవెలప్మెంట్ ఎగ్జిక్యూటీవ్ జాన్తన్ టింటర్ను ప్రశ్నించింది. ఈ సందర్భంగా యూజర్లు డీఫాల్ట్‌గా మరో సెర్చ్ ఇంజిన్‌ను (బింగ్) వినియోగించేందుకు వీలు లేకుండా గూగుల్ చేసిందన్న విషయాన్ని వెల్లడించారు. పరిమితులు విధించింది ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు లైసెన్స్ ఇవ్వాలంటే మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డ్యుయో స్మార్ట్‌ఫోన్ గూగుల్ సెర్చ్‌ను ఉపయోగించాల్సి ఉందని, కానీ తన సొంత యాప్స్‌లలో బింగ్‌ను ఉపయోగించకుండా పరిమితులు విధించిందని టింటర్ కోర్టుకు తెలిపారు. చదవండి👉‘AI’ వల్ల ఉద్యోగాలు ఉంటాయా? ఊడతాయా?.. సత్య నాదెళ్ల ఏమన్నారంటే? -
‘అదే నన్ను సాధారణ ఉద్యోగి నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవోని చేసింది’
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌కు నాయకత్వం వహిస్తానని ఊహించలేదని అన్నారు. 1992లో మైక్రోసాఫ్ట్‌లో యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా అడుగుపెట్టిన తాను కంపెనీ సీఈవో అవుతానన్న ఆలోచన కూడా లేదంటూ లింక్డిన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్కీ నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘1992లో 22 ఏళ్ల వయసులో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగంలో చేరాక, ఈ ప్రపంచంలోనే గొప్ప ఉద్యోగం చేస్తున్నానని అనుకునేవాణ్ని. నేను చేస్తున్న పని గొప్పదనే భావనతో ఉండేవాణ్ని. మరో చోటికి వెళ్లి ఉద్యోగం చేయాలనే ఆలోచన నాకు ఉండేది కాదు’ అని అన్నారు. చేస్తున్న ఉద్యోగంలో ఎదుగుదల లేదని, వేరే ఆఫీస్‌లో చేరదాం అనే ఆలోచనతో కాకుండా.. ప్రస్తుతం ఆఫీస్‌లో మీరు చేస్తున్న పాత్రని విజయవంతంగా పోషించండి. మైక్రోసాఫ్ట్‌లో నేను నేర్చుకున్న పాఠం ఇదే. మీరు బాగా పనిచేసేందుకు మరో ఉద్యోగం కోసం ఎదురుచూడొద్దు. మొత్తం 30 ఏళ్ల మైక్రోసాఫ్ట్ కెరియర్లో నేను చేస్తున్న ఉద్యోగం గురించి ఎప్పుడూ ఆలోచించిన సందర్భం లేదు. నేను అక్కడ చేస్తున్న ఉద్యోగం చాలా ముఖ్యమైన విషయంగా భావించినట్లు వివరించారు. మీ ప్రస్తుత ఉద్యోగాన్ని మీ కెరీర్ లక్ష్యాలను చేరుకోవడానికి అడ్డంకిగా భావించడానికి బదులుగా ఆసక్తిని, అంకితభావాన్ని, నేర్చుకోవడాన్ని ఓ అవకాశంగా భావించాలి. ఈ మనస్తత్వాన్ని అవలంబించడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాల్ని అంటే ప్రమోషన్లు లేదా శాలరీల పెంపును వేగంగా పొందగలుగుతారని అన్నారు. చేస్తున్న పని వల్ల ఎదుగుదల ఉండడం లేదని అనిపిస్తే మీరు ఎప్పటికీ ఎదగలేరని సూచించారు. ఇప్పటికీ చాలా మంది కెరీర్‌కు సంబంధించి మంచి సలహా ఇవ్వమని అడుగుతుంటారు. వారికి నేను చెప్పేదొక్కటే.. మీరు బాగా పనిచేసేందుకు మరో ఉద్యోగం కోసం ఎదురుచూడొద్దని చెబుతాను. నేను సీఈవో అయ్యే ముందు రోజు వరకు నాకు అలాంటి ఆలోచనేలేదు అని లింక్డిన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్కీ నిర్వహించిన ఇంటర్వ్యూలో సత్యనాదెళ్ల తన మనసులో మాటని బయటపెట్టారు. చదవండి👉 కోడింగ్ రానక్కర్లేదు.. మైక్రోసాఫ్ట్ మరో సంచలనం! -
వ్యక్తిగత గోప్యత మన హక్కు: నాదెళ్ల
సియాటెల్: ప్రపంచమంతా కంప్యూటర్‌మయం అయిపోయిందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత గోప్యత, మానవ విలువలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడే నైతిక విలువలు, మౌలిక సూత్రాలను కలుపుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. మైక్రోసాఫ్ట్ బిల్డ్ 2018 కాన్ఫరెన్స్ ప్రసంగంలో.. భారత్ సహా వివిధ దేశాలకు చెందిన వేలమంది సాఫ్ట్వేర్ డెవలపర్లనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘వ్యక్తిగత గోప్యత మానవ హక్కు. మైక్రోసాఫ్ట్‌లో మనమంతా ఈ హక్కులను కాపాడాలనే మూల సూత్రానికే కట్టుబడి పనిచేస్తున్నాం. మనం డేటా వినియోగించినపుడు అది వినియోగదారుడికి మేలు చేస్తుందనే భరోసాను మనం కల్పించగలగాలి. వ్యక్తిగత వివరాలన్నీ తన నియంత్రణలో ఉన్నట్లు యూజర్‌కు భరోసా కల్పించాలి. కంప్యూటర్లు ఏం చేయగలవు? ఏం చేయాలి? అనే దాన్ని మనకు మనం ప్రశ్నించుకోవాలి.అదే నైతిక కృత్రిమ మేధ’ అని అన్నారు. -
ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలపై భారతీయ బావుటా..
సత్యనాదెళ్ల(47): 2014 ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియమితులయ్యారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఎంటర్ప్రైజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్థాయి నుంచి క్రమంగా ఎదుగుతూ సీఈవో స్థాయికి వ చ్చారు. రాజీవ్ సూరి (47): 1995లో నోకియాలో ప్రస్థానాన్ని ప్రారంభించిన సూరి.. 2014, మే నెలలో కంపెనీ హెడ్‌గా నియమితులయ్యారు. సంజయ్ మెహ్రోత్రా (56): శాన్డిస్క్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఈయన కంపెనీ ప్రెసిడెంట్, సీఈవోగా 2011 జనవరిలో భాద్యతలు చేపట్టారు. శంతను నారాయణ్ (52): 1998 నుంచి అడోబ్ సిస్టమ్స్‌లో వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన శంతను... 2007 నాటికి కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు. ఇంద్రనూయి (59): ఈమె 2006 నుంచి పెప్సికో చైర్పర్సన్, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 1994లో పెప్సికోలో చేరిన ఈమె 2001లో కంపెనీ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. లక్ష్మీ మిట్టల్ (64): ప్రస్తుతం ఈయన ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు తయారీ కంపెనీ అయిన అర్సెలర్ మిట్టల్ చైర్మన్, సీఈవోగా ఉన్నారు. ఇవాన్ మెనెంజిస్ (56): మల్టీ నేషనల్ ఆల్కహాల్ బేవరేజ్ కంపెనీ డియాజియో సీఈవోగా ఉన్నారు. 1997లో డియాజియోలో కెరీర్ ప్రారం భించి.. 2013 జూలైలో కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు. రాకేశ్ కపూర్ (57): డెటాల్ వంటి ఉత్పత్తుల్ని తయారు చేసే మల్టీ నేషనల్ కన్సూమర్ గూడ్స్ తయారీ కంపెనీ, రెకిట్ బెన్కిసర్ సీఈవోగా ఉన్నారు. ఈయన నెస్లే, పెప్సికో వంటి పలు కంపెనీల్లో పనిచేశారు. అజయ్ బంగా (55): ప్రస్తుతం మాస్టర్ కార్డ్ ప్రెసిడెంట్, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 2010 జూలై నుంచి కంపెనీ సీఈవోగా ఉన్నారు. పియూష్ గుప్తా (55): డీబీఎస్ గ్రూప్ సీఈవోగా ఉన్నారు. మేనేజ్మెంట్ ట్రైనీగాఈయన కెరీర్ సిటీ బ్యాంక్ ఇండియాలో ప్రారంభమైంది. సంజయ్ ఝా (52): ప్రస్తుతం ఈయన గ్లోబల్ ఫౌండరీస్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. గతంలో మోటరోలా సీఈవోగా కూడా పనిచేశారు. ఫ్రాన్సిస్కో డిసౌజ (46): 2003లో సీఓఓ హోదాలో కాగ్నిజెంట్‌లో చేరిన ఈయన 2007లో కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు.