ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలపై భారతీయ బావుటా.. | Legends of the corporate world on the Indian | Sakshi
Sakshi News home page

ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలపై భారతీయ బావుటా..

Published Wed, Aug 12 2015 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM

ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలపై భారతీయ బావుటా..

ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలపై భారతీయ బావుటా..

సత్యనాదెళ్ల(47):  2014 ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియమితులయ్యారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఎంటర్‌ప్రైజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్థాయి నుంచి క్రమంగా ఎదుగుతూ సీఈవో స్థాయికి వ చ్చారు.

రాజీవ్ సూరి (47): 1995లో నోకియాలో ప్రస్థానాన్ని ప్రారంభించిన సూరి.. 2014, మే నెలలో కంపెనీ హెడ్‌గా నియమితులయ్యారు.
 
సంజయ్ మెహ్రోత్రా (56): శాన్‌డిస్క్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఈయన కంపెనీ ప్రెసిడెంట్, సీఈవోగా 2011 జనవరిలో భాద్యతలు చేపట్టారు.

శంతను నారాయణ్ (52): 1998 నుంచి అడోబ్ సిస్టమ్స్‌లో వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన శంతను... 2007 నాటికి కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు.
 
ఇంద్రనూయి (59): ఈమె 2006 నుంచి పెప్సికో చైర్‌పర్సన్, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 1994లో పెప్సికోలో చేరిన ఈమె 2001లో కంపెనీ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.
 
లక్ష్మీ మిట్టల్ (64): ప్రస్తుతం ఈయన ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు తయారీ కంపెనీ అయిన అర్సెలర్ మిట్టల్ చైర్మన్, సీఈవోగా ఉన్నారు.

ఇవాన్ మెనెంజిస్ (56): మల్టీ నేషనల్ ఆల్కహాల్ బేవరేజ్ కంపెనీ డియాజియో సీఈవోగా ఉన్నారు. 1997లో డియాజియోలో కెరీర్ ప్రారం భించి.. 2013 జూలైలో కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు.
 
రాకేశ్ కపూర్ (57): డెటాల్ వంటి ఉత్పత్తుల్ని తయారు చేసే మల్టీ నేషనల్ కన్సూమర్ గూడ్స్ తయారీ కంపెనీ, రెకిట్ బెన్కిసర్ సీఈవోగా ఉన్నారు. ఈయన నెస్లే, పెప్సికో వంటి పలు కంపెనీల్లో పనిచేశారు.
 
అజయ్ బంగా (55): ప్రస్తుతం మాస్టర్ కార్డ్ ప్రెసిడెంట్, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 2010 జూలై నుంచి కంపెనీ సీఈవోగా ఉన్నారు.

పియూష్ గుప్తా (55):  డీబీఎస్ గ్రూప్ సీఈవోగా ఉన్నారు. మేనేజ్‌మెంట్ ట్రైనీగాఈయన కెరీర్ సిటీ బ్యాంక్ ఇండియాలో ప్రారంభమైంది.
 
సంజయ్ ఝా (52): ప్రస్తుతం ఈయన గ్లోబల్ ఫౌండరీస్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. గతంలో మోటరోలా సీఈవోగా కూడా పనిచేశారు.
 
ఫ్రాన్సిస్కో డిసౌజ (46): 2003లో సీఓఓ హోదాలో కాగ్నిజెంట్‌లో చేరిన ఈయన 2007లో కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement