Rajeev Suri
-
ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాలపై భారతీయ బావుటా..
సత్యనాదెళ్ల(47): 2014 ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ సీఈవోగా నియమితులయ్యారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఎంటర్ప్రైజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్థాయి నుంచి క్రమంగా ఎదుగుతూ సీఈవో స్థాయికి వ చ్చారు. రాజీవ్ సూరి (47): 1995లో నోకియాలో ప్రస్థానాన్ని ప్రారంభించిన సూరి.. 2014, మే నెలలో కంపెనీ హెడ్‌గా నియమితులయ్యారు. సంజయ్ మెహ్రోత్రా (56): శాన్డిస్క్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఈయన కంపెనీ ప్రెసిడెంట్, సీఈవోగా 2011 జనవరిలో భాద్యతలు చేపట్టారు. శంతను నారాయణ్ (52): 1998 నుంచి అడోబ్ సిస్టమ్స్‌లో వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన శంతను... 2007 నాటికి కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు. ఇంద్రనూయి (59): ఈమె 2006 నుంచి పెప్సికో చైర్పర్సన్, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 1994లో పెప్సికోలో చేరిన ఈమె 2001లో కంపెనీ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. లక్ష్మీ మిట్టల్ (64): ప్రస్తుతం ఈయన ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు తయారీ కంపెనీ అయిన అర్సెలర్ మిట్టల్ చైర్మన్, సీఈవోగా ఉన్నారు. ఇవాన్ మెనెంజిస్ (56): మల్టీ నేషనల్ ఆల్కహాల్ బేవరేజ్ కంపెనీ డియాజియో సీఈవోగా ఉన్నారు. 1997లో డియాజియోలో కెరీర్ ప్రారం భించి.. 2013 జూలైలో కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు. రాకేశ్ కపూర్ (57): డెటాల్ వంటి ఉత్పత్తుల్ని తయారు చేసే మల్టీ నేషనల్ కన్సూమర్ గూడ్స్ తయారీ కంపెనీ, రెకిట్ బెన్కిసర్ సీఈవోగా ఉన్నారు. ఈయన నెస్లే, పెప్సికో వంటి పలు కంపెనీల్లో పనిచేశారు. అజయ్ బంగా (55): ప్రస్తుతం మాస్టర్ కార్డ్ ప్రెసిడెంట్, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 2010 జూలై నుంచి కంపెనీ సీఈవోగా ఉన్నారు. పియూష్ గుప్తా (55): డీబీఎస్ గ్రూప్ సీఈవోగా ఉన్నారు. మేనేజ్మెంట్ ట్రైనీగాఈయన కెరీర్ సిటీ బ్యాంక్ ఇండియాలో ప్రారంభమైంది. సంజయ్ ఝా (52): ప్రస్తుతం ఈయన గ్లోబల్ ఫౌండరీస్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. గతంలో మోటరోలా సీఈవోగా కూడా పనిచేశారు. ఫ్రాన్సిస్కో డిసౌజ (46): 2003లో సీఓఓ హోదాలో కాగ్నిజెంట్‌లో చేరిన ఈయన 2007లో కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు. -
నోకియా పగ్గాలు మనోడికే
ప్రజలను టెలికమ్యూనికేషన్స్ ద్వారా అనుసంధానం చేయడంలో నోకియాకున్న అపార అనుభవంతో ఇప్పుడున్న మూడు వ్యాపార విభాగాల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. నోకియా బృందంతో పూర్తిగా మమేకమై... కంపెనీ భవిష్యత్తులో అత్యున్నత శిఖరాలను అందుకోవడానికి నా సాయశక్తులా కృషిచేస్తా. కంపెనీలో అత్యంత నైపుణ్యంగల విభాగాధిపతులు ఉన్నారు. కొత్త ప్రణాళికలను మరింత వేగంగా, సమర్థవంతంగా అమలు చేయడానికి కలసికట్టుగా అడుగులేస్తాం. - రాజీవ్ సూరి, నోకియా సీఈఓ ప్రపంచ కార్పొరేట్ రంగంలో భారతీయుల సత్తా మరోమారు మార్మోగింది. ఫిన్లాండ్ మొబైల్స్ తయారీ దిగ్గజం నోకియా పగ్గాలను భారత్‌కు చెందిన రాజీవ్ సూరి అందుకున్నారు. ఇప్పటికే నోకియా హ్యాండ్సెట్ బిజినెస్‌ను మైక్రోసాఫ్ట్ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. అటు మైక్రోసాఫ్ట్‌కు కూడా భారతీయుడే, అందునా తెలుగువ్యక్తి సత్య నాదెళ్ల సీఈఓగా సారథ్యం వహిస్తుండగా.. ఇప్పుడు నోకియా పీఠ ంపై కూడా మనోడే కొలువుదీరడం విశేషం. న్యూఢిల్లీ: నోకియా... అంతర్జాతీయంగా మొబైల్ ఫోన్‌కు పర్యాయపదంగా నిలిచిన పేరు ఇది. అలాంటి పేరొందిన కంపెనీకి ఇప్పుడు భారత్‌కు చెందిన రాజీవ్ సూరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ)గా ఎంపికయ్యారు. మైక్రోసాఫ్ట్‌కు నోకియా మొబైల్ ఫోన్స్ వ్యాపారాన్ని విక్రయించిన తర్వాత ఆ కంపెనీకి పూర్తిస్థాయి సారథిగా భవిష్యత్తు వృద్ధి పథానికి సూరి దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పుడు నోకియా చీఫ్‌గా వ్యవహరిస్తున్న స్టీఫెన్ ఎలాప్ స్థానాన్ని 46 ఏళ్ల సూరి భర్తీచేయనున్నారు. నోకియా నెట్వర్క్ పరికరాల యూనిట్... సొల్యూషన్స్ అండ్ నెట్వర్క్స్(ఎన్ఎస్ఎన్)కు ప్రస్తుతం హెడ్‌గా ఉన్న రాజీవ్ సూరి.. మే 1 నుంచి ప్రెసిడెంట్, సీఈఓగా కొత్త బాధ్యతలను చేపట్టనున్నారని నోకియా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. 7.2 బిలియన్ డాలర్ల మొత్తానికి నోకియా హ్యాండ్సెట్ బిజినెస్‌ను మైక్రోసాఫ్ట్ దక్కించుకున్న నేపథ్యంలో కంపెనీ ఇక ప్రధానంగా వైర్లెస్ నెట్వర్క్ పరికరాల వ్యాపారంలో ఎరిక్సన్, చైనా దిగ్గజం హువాయ్ వంటి హేమాహేమీలతో పోటీపడేందుకు సిద్ధపడుతోంది. ఈ నేపథ్యంలో ఇదే రంగంలో అపార అనుభవం ఉన్న సూరిని ఏరికోరి నోకియా తమ సారథిగా ఎంచుకోవడం గమనార్హం. ప్రస్తుం నోకియా తాత్కలిక సీఈఓగా పనిచేస్తున్న రిస్టో సిలాస్మా... మే 1 నుంచి చైర్మన్‌గా వ్యవహరించనున్నారని కంపెనీ పేర్కొంది. ‘ఇక నుంచి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్న నోకియాను ముందుండి నడిపించే సరైన వ్యక్తి రాజీవ్ అని కంపెనీ బోర్డు పూర్తి నమ్మకంతో ఉంది. వ్యూహాత్మకంగా, వినూత్న ఆలోచనలతో ఇప్పటికే తన సత్తాను సూరి నిరూపించుకున్నారు. భవిష్యత్తులో కంపెనీ పనితీరును మెరుగుపరచడంలో సమర్థంగా వ్యవహరించగరని భావిస్తున్నా’ అని సిలాస్మా వ్యాఖ్యానించారు. ఎన్ఎస్ఎన్ను లాభాల్లోకి తెచ్చిన ఘనత... 1967లో భారత్‌లో జన్మించిన సూరికి నోకియాతో దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం ఉంది. 1995లో ఎన్ఎస్ఎన్ ఇండియాలో సిస్టమ్ మార్కెటింగ్ మేనేజర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించారు. పదేళ్ల కాలంలోనే నోకియా నెట్వర్క్స్ ఆసియా పసిఫిక్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. తదనంతరం 2009 అక్టోబర్ 1న ఏకంగా ఎన్ఎస్ఎన్కు సీఈఓ పగ్గాలను చేజిక్కించుకోవడం గమనార్హం. ఈ ప్రస్థానంలో ఆయన నష్టాల్లో ఉన్న ఎన్ఎస్ఎన్ను తిరిగి లాభాల్లోకి(టర్న్అరౌండ్) తీసుకురావడంలో తనదైన పాత్ర పోషించారు. ప్రధానంగా నష్టాలు తెచ్చిపెడుతున్న విభాగాలను మూసేయడం, ఇతరత్రా వ్యయ నియంత్రణ చర్యలతోపాటు వ్యూహాత్మక కొనుగోళ్లు, విలీనాల ద్వారా కంపెనీని ముందుండి నడిపించారు. నాలుగేళ్లుగా ఎన్ఎస్ఎన్ సారథ్యం వహిస్తున్న సూరి.. ఎట్టకేలకు టాప్ పోస్ట్‌ను చేజిక్కించుకోగలిగారు. గాడిలోపెట్టడమే ప్రధాన సవాలు.... ప్రత్యర్థి కంపెనీల నుంచి తీవ్ర పోటీ ఇతరత్రా ఇబ్బందుల కారణంగా నోకియా తన కీలక మొబైల్ హ్యాండ్సెట్ విభాగాన్ని మైక్రోసాఫ్ట్‌కు విక్రయించాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు నోకియా వద్ద 3 ప్రధాన విభాగాలు మిగిలాయి. ఇందులో పెద్దది నెట్వర్క్స్ విభాగం. ఈ ఏడాది కంపెనీ తొలి త్రైమాసిక నిర్వహణ లాభాల్లో 71 శాతం దీనినుంచే లభించడం గమనార్హం. ఇక మ్యాప్స్ బిజినెస్, పేటెంట్ల లెసైన్సింగ్ను నియంత్రించే యూనిట్లు కూడా ఇప్పుడు నోకియా వద్ద మిగిలాయి. మొబైల్స్ వ్యాపారం విక్రయం తర్వాత తాము నెట్వర్క్, నేవిగేషన్, పేటెంట్స్ యూనిట్లపైనే ఇక పూర్తిస్థాయిలో దృష్టిపెట్టనున్నట్లు కూడా ఇదివరకే పేర్కొంది. కాగా, ఫ్రాన్స్‌కు చెందిన వైర్లెస్ ఎక్విప్మెంట్ యూనిట్ ఆల్కాటెల్-లూసెంట్‌ను నోకియా కొనుగోలు చేయనుందనే వార్తలు గతేడాదే వచ్చాయి. నెట్వర్క్ వ్యాపారంలో విశేష అనుభవం ఉన్న సూరికి మళ్లీ నోకియాకు పూర్వవైభవాన్ని తీసుకురావడమే ఇప్పుడు అతిపెద్దసవాలని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 50 శాతం వాటాతో దూసుకెళ్లిన నోకియా ఆతర్వాత టాప్-5 జాబితా నుంచి వైదొలగడం తెలిసిందే. ఏకంగా 5 బిలియన్ యూరోలకుపైగా నష్టాలు పేరుకుపోవడంతో ఈ వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్‌కు విక్రయించేసింది. ఈ ఒప్పందం గత శుక్రవారమే పూర్తయింది కూడా. భారతీయులకు అంతర్జాతీయ అందలం... ఇప్పటికే పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు భారతీయులు సారథ్యం వహిస్తూ.. దేశానికి వన్నె తీసుకొచ్చారు. ఇప్పుడు సూరి కూడా ఈ జాబితాలో మన ఖ్యాతిని మరింత ఇనుమడింపజేశారు. పెప్సీకో చైర్మన్ ఇంద్రా నూయి, రెకిట్ బెంకిసర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాకేశ్ కపూర్; మాస్టర్ కార్డ్ ప్రెసిడెంట్, సీఈఓ అజయ్ బంగా, డాయిష్ బ్యాంక్ సీఈఓ అన్షు జైన్ తదితరులు టాప్ పొజిషన్లలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మైక్రోసాఫ్ట్‌కు ఏకంగా తెలుగు వ్యక్తి అయిన సత్య నాదెళ్ల సీఈఓ కావడంద్వారా ప్రపంచం మొత్తాన్ని భారత్‌వైపు చూసేలా చేశారు. నోకియా సీఈఓగా సూరి మరోసారి తన ప్రతిభ ద్వారా భారతీయుల్లో ఆనందాన్ని నింపారు. రాజీవ్ సంగతిదీ... 1967లో భారత్‌లో జన్మించారు. తల్లిదండ్రులు యశ్పాల్ సూరి, ఆశా సూరి. దాదాపు ఆయన ఎక్కువకాలం కువైట్‌లోనే నివాసం ఉన్నారు. భారత్, కువైట్ సహా ఫిన్లాండ్, యూకే, నైజీరియా, సింగపూర్ ఇలా ఏడు దేశాల్లో ఆయన ప్రస్థానం కొనసాగింది. మంగళూరు యూనివర్సిటీ నుంచి 1989లో ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్‌లో ఇంజనీరింగ్ గ్యాడ్యుయేషన్ను పూర్తిచేశారు. తదనంతరం కాల్కామ్ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగంలో చేరి వృత్తిపరమైన జీవితాన్ని ప్రారంభించారు. ఇతర టాప్ ఎగ్జిక్యూటివ్‌ల మాదిరిగా ఆయనకు ఎంబీఏ/పీజీ ఇతరత్రా మేనేజ్మెంట్ ఇతరత్రా ఉన్నత డిగ్రీలేవీ లేకపోవడం గమనార్హం. 1995లో ఎన్ఎస్ఎన్ ఇండియాలో సిస్టమ్స్ మార్కెటింగ్ మేనేజర్‌గా నోకియాలోకి అడుగుపెట్టారు. {పస్తుతం ఎన్ఎస్ఎన్(గతంలో నోకియా సీమెన్స్ నెట్వర్క్) సీఈఓగా ఉంటూ నోకియాకు పూర్తిస్థాయి సీఈఓగా నియమితులయ్యారు. ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టిపెట్టే రాజీవ్... ఖాళీ సమయాల్లో జిమ్‌లో గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అంతేకాదు ఆయన సంగీత ప్రియుడు కూడా. ఆతర్వాత ఐసీఎల్ ఇండియా, నైజీరియాలోని చర్చ్‌గేట్ గ్రూప్‌లలో ఐదేళ్లు పనిచేశారు. రాజీవ్‌కు భార్య(నైనా-వ్యాపారవేత్త), ఇద్దరు కుమారులు(అంకిత్, అనీష్) ఉన్నారు. నోకియా పుట్టినిల్లయిన ఫిన్లాండ్లోని రెండో పెద్ద నగరం ఎస్పూలో ఆయన ప్రస్తుతం నివసిస్తున్నారు. పిల్లలిద్దరూ విదేశాల్లోనే చదువుతుండగా... తల్లిదండ్రులు భారత్‌లోనే ఉంటున్నారు. -
నోకియా సీఈవోగా రాజీవ్ సూరి!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వ్యాపార రంగంలో మరో భారతీయుడు సత్తా చూపాడు. ఫిన్ లాండ్ కు చెందిన టెలికమ్యూనికేషన్ విడి భాగాల తయారీ సంస్థ నోకియా అధ్యక్షుడు, సీఈవోగా రాజీవ్‌సూరి నియమితులయ్యారు. స్టిఫెన్ ఎలోప్ స్థానంలో రాజీవ్ సూరిని నియమించారు. మంగళూరు యూనివర్సిటీలో సూరి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1995లో నోకియా సంస్థకు రాజీవ్‌సూరి సేవలందిస్తున్నారు. అతి చిన్న వయస్సులోనే అంతర్జాతీయ కంపెనీకి సీఈవో అయిన ఘనతను సూరి సొంతం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితమే 7.2 బిలియన్ డాలర్ల వ్యయంతో నోకియాను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. నోకియా కంపెనీ అభివృద్ధి పథంలోకి నడిపిస్తారనే విశ్వాసంతో రాజీవ్ సూరిని ఎంపిక చేశామని కంపెనీ నిర్వాహకులు వెల్లడించారు. మే 1 తేది నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఇటీవలే మైక్రోసాఫ్ట్ కంపెనీకి మరో భారతీయుడు సత్యానాదెళ్ల సీఈవో బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
నోకియా కొత్త సీఈఓ రాజీవ్‌సూరి?
న్యూఢిల్లీ: నోకియా కొత్త సీఈఓగా భారత్‌కు చెందిన రాజీవ్ సూరి (46) నియమితులయ్యే అవకాశముంది. ప్రస్తుతం కంపెనీ టెలికం పరికరాల వ్యాపారానికి సారథిగా ఉన్న ఆయనను ఈ నెల 29న కొత్త సీఈఓగా ప్రకటించవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. నెట్వర్క్ ఎక్విప్మెంట్ బిజినెస్‌కు సంబంధించిన నూతన వ్యూహాన్ని కూడా నోకియా అదేరోజు వెల్లడించవచ్చని తెలుస్తోంది. ఇక మైక్రోసాఫ్ట్ కనుసన్నల్లో... హ్యాండ్సెట్ల వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్‌కు విక్రయించే కార్యక్రమాన్ని నోకియా శుక్రవారం పూర్తి చేసింది. పన్ను చెల్లింపుల వ్యవహారంలో వివాదం నెలకొన్న చెన్నై ప్లాంటు మాత్రం నోకియా ఆధీనంలోనే ఉంటుంది. నోకియా తమ హ్యాండ్సెట్ల వ్యాపారాన్ని 720 కోట్ల డాలర్లకు అమ్మేందుకు గత సెప్టెంబర్‌లో మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి విదితమే. ఒప్పందం పూర్తికావడంలో నెలరోజుల జాప్యం కావడంతో ఈ మొత్తం కూడా స్వల్పంగా పెరగనుంది. ఒప్పందం కార్యరూపం దాల్చడంపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. చెన్నై ప్లాంటులో మైక్రోసాఫ్ట్‌కు హ్యాండ్సెట్స్.. నోకియా ఆధీనంలోనే కొనసాగనున్న చెన్నై ప్లాంటులో హ్యాండ్సెట్లను తయారు చేసి మైక్రోసాఫ్ట్‌కు సరఫరా చేసేందుకు ఓ ఒప్పందం కుదిరింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న నోకియా హ్యాండ్సెట్లపై వారంటీ బాధ్యతను ఇకనుంచి మైక్రోసాఫ్ట్ తీసుకుంటుంది. ప్రస్తుతం ఐదు వేల కోట్ల డాలర్లుగా (రూ. 3 లక్షల కోట్లు) ఉన్న చౌక సెల్ఫోన్ల మార్కెట్‌పై మైక్రోసాఫ్ట్ ఇక దృష్టి సారించనుంది. తద్వారా నోకియాకు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. శామ్సంగ్, ఆపిల్లతో పోటీని తట్టుకోలేకపోవడంతో నోకియా మార్కెట్ వాటా గణనీయంగా తగ్గిపోవడం తెలిసిందే. మొబైల్స్‌కు నోకియా బ్రాండ్‌ను పదేళ్లపాటు కొనసాగిస్తామని, నోకియా బ్రాండ్ స్మార్ట్ డివైస్ల మార్కెటింగ్‌కు పరిమితకాల ఒప్పందం కుదుర్చుకున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. ‘నోకియాకు మంచి బ్రాండ్‌నేమ్ ఉంది. అనేక మోడళ్లను తయారు చేస్తోంది. ఈ అవకాశాన్ని మైక్రోసాఫ్ట్ వినియోగించుకుంటుంది. ఆశా మోడల్స్, స్మార్ట్ఫోన్ల ఉత్పత్తినీ మైక్రోసాఫ్ట్ కొనసాగించే అవకాశముంది’ అని రీసెర్చ్ సంస్థ ఐడీసీ సీనియర్ అనలిస్ట్ మానసి యాదవ్ చెప్పారు. -
నోకియా సీఈవోగా భారతీయుడు?
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల బాటలో ఇంకో అంతర్జాతీయ దిగ్గజానికి మరో భారతీయుడు సారథ్యం వహించబోతున్నారు. రాజీవ్ సూరి.. మొబైల్ ఫోన్స్ దిగ్గజం నోకియా కార్పొరేషన్‌కి గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) హోదాను దక్కించుకోనున్నారు. ఈ నెలాఖరులో లేదా ఏప్రిల్ నియామకం ఖరారుకు సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు ఫిన్లాండ్ మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి. సూరి ప్రస్తుతం నోకియా టెలికం పరికరాల వ్యాపార విభాగం హెడ్‌గా ఉన్నారు. వచ్చే నెలలోగా నోకియా హ్యాండ్ సెట్ వ్యాపార కొనుగోలు ప్రక్రియను మైక్రోసాఫ్ట్ పూర్తి చేసే నాటికి సూరి నియామకం గురించి నిర్ణయం రాగలదని అంచనా. నాదెళ్ల చదివిన మంగళూరు యూనివర్సిటీలోనే రాజీవ్ సూరి ఇంజనీరింగ్ చదివారు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్స్ పట్టా అందుకున్నారు. సూరిని నోకియా సీఈవోగా నియమించిన పక్షంలో.. ఆయన అంతర్జాతీయ దిగ్గజాలకు సారథ్యం వహిస్తున్న భారతీయుల సరసన నిలుస్తారు. ప్రస్తుతం పెప్సికో చైర్మన్‌గా ఇంద్రా నూయి, రెకిట్ బెన్కిసర్ సీఈవోగా రాకేశ్ కపూర్, మాస్టర్‌కార్డ్ సీఈవోగా అజయ్ బంగా, డాయిష్ బ్యాంక్ హెడ్‌గా అన్షు జైన్ ఉన్నారు. గత నెలలోనే సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు, సీఈవోగా సూరి నియామకం విషయంపై స్పందించడానికి నోకియా నిరాకరించింది. మైక్రోసాఫ్ట్ గనుక హ్యాండ్ సెట్ వ్యాపార విభాగం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తే.. నోకియా వద్ద ఇక టెలికం పరికరాలు, లొకేషన్ బేస్డ్ సేవలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వ్యాపార విభాగాలు మాత్రమే మిగులుతాయి. 23 ఏళ్లకు పైగా అనుభవం... ప్రస్తుతం నోకియా హెడ్‌క్వార్టర్స్ ఫిన్లాండ్లోని ఎస్పూలో నివసించే రాజీవ్ సూరికి అంతర్జాతీయంగా 23 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన 1995లో నోకియాలో చేరారు. మధ్యప్రాచ్యం, ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాల్లో నోకియా కార్యకలాపాలకు సంబంధించి విలీనాలు..కొనుగోళ్లు, ప్రోడక్ట్ మార్కెటింగ్, సేల్స్ తదితర విభాగాల్లో పనిచేశారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో నోకియా సొల్యూషన్స్ అండ్ నెట్వర్క్స్ (ఎన్ఎస్ఎన్) కార్యకలాపాలకు సారథ్యం వహించారు. సంస్థని పునర్వ్యవస్థీకరించి, మళ్లీ లాభాల బాటలోకి తెచ్చారు. గతేడాదే ఎన్ఎస్ఎన్లో జర్మనీ ఇంజనీరింగ్ సంస్థ సీమెన్స్‌కి ఉన్న 50 శాతం వాటాను 2.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు నోకియా ఒప్పందం కుదుర్చుకుంది.