నోకియా సీఈవోగా రాజీవ్ సూరి! | Rajeev Suri to head Nokia | Sakshi
Sakshi News home page

నోకియా సీఈవోగా రాజీవ్ సూరి!

Published Tue, Apr 29 2014 2:06 PM | Last Updated on Sat, Sep 2 2017 6:42 AM

నోకియా సీఈవోగా రాజీవ్ సూరి!

నోకియా సీఈవోగా రాజీవ్ సూరి!

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వ్యాపార రంగంలో మరో భారతీయుడు సత్తా చూపాడు. ఫిన్ లాండ్ కు చెందిన టెలికమ్యూనికేషన్ విడి భాగాల తయారీ సంస్థ నోకియా అధ్యక్షుడు, సీఈవోగా రాజీవ్‌సూరి నియమితులయ్యారు. స్టిఫెన్ ఎలోప్ స్థానంలో రాజీవ్ సూరిని నియమించారు.
 
మంగళూరు యూనివర్సిటీలో  సూరి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1995లో నోకియా సంస్థకు రాజీవ్‌సూరి సేవలందిస్తున్నారు. అతి చిన్న వయస్సులోనే అంతర్జాతీయ కంపెనీకి సీఈవో అయిన ఘనతను సూరి సొంతం చేసుకున్నారు.
 
కొద్ది రోజుల క్రితమే 7.2 బిలియన్ డాలర్ల వ్యయంతో నోకియాను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. నోకియా కంపెనీ అభివృద్ధి పథంలోకి నడిపిస్తారనే విశ్వాసంతో రాజీవ్ సూరిని ఎంపిక చేశామని కంపెనీ నిర్వాహకులు వెల్లడించారు.
 
మే 1 తేది నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఇటీవలే మైక్రోసాఫ్ట్‌ కంపెనీకి మరో భారతీయుడు సత్యానాదెళ్ల సీఈవో బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement