వాషింగ్టన్: ప్రముఖుల ఫొటోలు, వీడియోలను దురి్వనియోగం చేస్తూ కృత్రిమ మేథ(ఏఐ)తో సృష్టిస్తున్న డీప్ ఫేక్ నకిలీ ఫొటోలు, వీడియోల ధోరణి అత్యంత భయంకరమైనదని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. ప్రఖ్యాత పాప్ గాయని టైలర్ స్విఫ్ట్ నకిలీ అసభ్య ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
దీనిపై ఒక ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల ఆవేదన వెలిబుచ్చారు. ‘‘ప్రముఖుల డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోల సృష్టి, వ్యాప్తికి అడ్డుకట్ట పడాల్సిందే. ప్రభుత్వాల, సోషల్‌మీడియా సంస్థల తక్షణ స్పందన అవసరం. సురక్షితమైన, వాస్తవిక సమాచారం మాత్రమే ఆన్‌లైన్‌లో లభించేలా సాంకేతికతను, రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రభుత్వాలు నిబంధనలను సవరించి కట్టుదిట్టంచేయాలి. ఇది మనందరి బాధ్యత’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment