![World becoming a computer, privacy is a human right - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/8/MICROSOFT.jpg.webp?itok=yN-bzMmn)
సియాటెల్: ప్రపంచమంతా కంప్యూటర్‌మయం అయిపోయిందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత గోప్యత, మానవ విలువలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడే నైతిక విలువలు, మౌలిక సూత్రాలను కలుపుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. మైక్రోసాఫ్ట్ బిల్డ్ 2018 కాన్ఫరెన్స్ ప్రసంగంలో.. భారత్ సహా వివిధ దేశాలకు చెందిన వేలమంది సాఫ్ట్‌వేర్ డెవలపర్లనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘వ్యక్తిగత గోప్యత మానవ హక్కు. మైక్రోసాఫ్ట్‌లో మనమంతా ఈ హక్కులను కాపాడాలనే మూల సూత్రానికే కట్టుబడి పనిచేస్తున్నాం. మనం డేటా వినియోగించినపుడు అది వినియోగదారుడికి మేలు చేస్తుందనే భరోసాను మనం కల్పించగలగాలి. వ్యక్తిగత వివరాలన్నీ తన నియంత్రణలో ఉన్నట్లు యూజర్‌కు భరోసా కల్పించాలి. కంప్యూటర్లు ఏం చేయగలవు? ఏం చేయాలి? అనే దాన్ని మనకు మనం ప్రశ్నించుకోవాలి.అదే నైతిక కృత్రిమ మేధ’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment